సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు జిల్లాలకు సంబంధించి జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 8కి లెక్కింపు మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలోను, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలోను లెక్కిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
► ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపొందారు. 1537 ఓట్ల మెజార్టీతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు.
కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏసీ కాలేజీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలవగా..అయిదుగురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల కౌంటింగ్‌కు 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు, ప్రాధాన్యత ఓటును బట్టే అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉన్నాయి. 13575 ఓట్లకు గాను 12554 ఓట్లు పోలయ్యాయి. 92.95 శాతం పోలింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment