గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్‌లో హైడ్రామా | Telangana Graduate MLC Results 2024 June 06 Updates | Sakshi
Sakshi News home page

Graduate MLC Results 2024 LIVE: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్‌లో హైడ్రామా

Published Thu, Jun 6 2024 4:19 PM | Last Updated on Thu, Jun 6 2024 9:50 PM

Telangana Graduate MLC Results 2024  June 06 Updates

నల్లగొండ, సాక్షి: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

  • 18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్(మల్లన్న)
  • మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)
  • 122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)
  • బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లు
  • బీజేపీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డికి  43313 ఓట్లు
  • స్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు
  • గెలుపు కోటా 155095 గా నిర్ణయం
  • మొత్తం చెల్లిన ఓట్లు 310189
  • చెల్లని ఓట్లు 25824
  • మొత్తం పోలైన ఓట్లు 336013
  • చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపుకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32282
  • బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50847
  • మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం
  • 100 నుంచి 500 ఓట్ల ఎలిమినేషన్ చేయడానికి సుమారు 4 గంటల సమయం: అధికారులు

 

  • నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీగల్ టీం
  • కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే ఆర్వో ఆదేశాలు జారీ చేయాలని కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డి
  • ముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణ
  • తమకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూపిస్తున్నారని ఆగ్రహం

నల్లగొండ

  • ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
  • 18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవిన్(మల్లన్న)
  • మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)
  • 122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)
  • బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లు
  • బీజేపీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డికి  43313 ఓట్లు
  • స్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు

 

  • కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్ ను కలవనున్న బీ ఆర్ ఎస్ నేతలు.
  • నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ఆపాలని, అక్కడ జరుగుతున్న కౌంటింగ్ లో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు.
  • కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సక్రమంగా చేయటం లేదని ఫిర్యాదు చేయనున్న ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి, ఇతర బీ ఆర్ ఎస్ నేతలు

 

నల్లగొండ 

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. 

  • ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి గోల్ మాల్ జరిగింది
  • మూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారు
  • మేం అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదు
  • మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదు
  • ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తాం
  • ఎన్నికల సంఘం స్పందించాలి
  • రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం
  • అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉంది
  • తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలి

 

నల్లగొండ జిల్లా

  • ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం
  • నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తై మూడు గంటలు
  • అయినా ఫలితాలు వెల్లడించని అధికారులు


👉ముగిసి‌‌న నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

అధికారికంగా వెలువడాల్సిన ఫలితాలు 

 

👉నాల్గో రౌండ్‌లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను తేల్చనున్న అధికారులు

ఇప్పటి వరకు ఎవరికీ యాభై శాతం ఓట్లు రాకపోవడంతో కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం


👉మూడో రౌండ్‌ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. అయితే.. 

మూడో రౌండ్‌లో 4,207 ఓట్ల ఆధిక్యం రాగా, ఓవరాల్‌గా 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మరో 48013 ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. 

లీడ్‌ జాబితా.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..

  • చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234

  • రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356

  • ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516

  • అశోక్ (స్వతంత్ర) 27,493

18,878 ఓట్ల ఆధిక్యం లో తీన్మార్ మల్లన్న

చెల్లిన ఓట్లు 2,64,216

చెల్లని ఓట్లు: 23,784

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement