లోక్‌సభ ఓటింగ్ సరళిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కిషన్‌రెడ్డి సమీక్ష గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహక భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తక్కువలో తక్కువ పది సీట్లు గెలుస్తామని, ఓటర్ల నుంచి అంచనాలకు మించి స్పందన వ్యక్తమైనందున 12 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదనే ధీమా రాష్ట్ర బీజేపీలో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ ‘వేవ్’ స్పష్టంగా కనిపించిందని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. నాలుగు సిట్టింగ్ ఎంపీ సీట్లతోపాటు విజయావ కాశాలు అంతగా లేదని మొదట్లో భావించిన సీట్లలోనూ బీజేపీ సత్తా చాటుతుందని పేర్కొ న్నారు.
నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి వంటి సీట్లు కూడా వస్తాయని, ఎన్నడూ ఊహించనంత స్థాయిలో ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సందర్భంగా ప్రజలు బీజేపీని, మోదీని చూశారని, అభ్యర్థులు ఎవరనేది కూడా చూడలేదన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్యనేతలతో నిర్వహించిన సమా వేశంలో ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ భేటీలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చ
పార్టీ కార్యాలయంలో నల్లగొండ–వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న జరగనున్న ఉపఎన్నికపై సన్నాహక సమావే శం జరిగింది. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇన్‌చార్జీలను నియమించుకుని, అన్ని మండలాల్లో పార్టీ నాయకులు పర్యటించేలా కార్యాచరణను సి ద్ధం చేశారు. ఈ ఎన్నిక కోసం ఎన్.రామచంద్రరా వును ఇన్‌చార్జీగా నియమించారు. పార్టీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బరిలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన కసరత్తు అంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment