
బీజింగ్: చైనాని వణికిస్తున్న మిస్టరీ వ్యాధి కరొనా వైరస్ ఆ దేశంలో ఉన్న భారతీయ టీచర్‌కి సోకిందన్న అనుమానాలు అందరినీ ఠారెత్తించాయి. చైనాలో షెన్‌జెన్‌లోని స్కూలులో టీచర్‌గా పని చేస్తున్న ప్రీతి మహేశ్వరి (45)కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భర్త ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తొలుత వైద్యులు ఆమెకు ప్రమాదకరమైన కరొనా వైరస్ సోకిందని అనుమానించారు. కానీ పరీక్షల్లో ఆమెకి స్ట్రెప్టోకోకల్ ఇన్‌ఫెక‌్షన్ సోకిందని తేలింది. చైనా నుంచి ప్రమాదకరమైన వైరస్
ప్రస్తుతం ఆమెను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స నిర్వహిస్తున్నట్టు టీచర్ భర్త ఆష్మాన్ ఖోవల్ తెలిపారు. న్యుమోనియా తరహా లక్షణాలు ఉండే ఈ కొత్త వైరస్ గత కొద్ది రోజులుగా దేశాన్ని వణికిస్తోంది. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించడానికి చైనా తీవ్రంగా కృషి చేస్తోంది. భారత పర్యాటకులకు చైనా వెళ్లవద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: కరొనో వైరస్ కలకలం)
Comments
Please login to add a commentAdd a comment