హాస్య భరితంగా ఆయ్‌వుకూడం | Ayvukoodam comedy movie | Sakshi
Sakshi News home page

హాస్య భరితంగా ఆయ్‌వుకూడం

Published Fri, Jun 12 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

హాస్య భరితంగా  ఆయ్‌వుకూడం

హాస్య భరితంగా ఆయ్‌వుకూడం

హర్రర్ చిత్రాల ట్రెండ్ సాగుతున్న ఈ పరిస్థితుల్లో హాస్యపు జల్లులు కురిపించడానికి సిద్ధం అవుతోంది ఆయ్‌వుకూడం. సీనియర్ నటుడు పాండియరాజన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రానికి మాంగాడు అమ్మన్ మూవీస్ పతాకంపై గణపతి నిర్మించారు. నవ జంట గణపతి, సత్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రీతి, సుందర్, ప్రభురాజ్, రియాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన అన్భరసన్ చిత్ర వివరాలను తెలుపుతూ నటుడు పాండియరాజన్ ప్రముఖ శాస్తవేత్తగా నటించారన్నారు.
 
 ఆయన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడి మెదడుకు ఫైటర్‌కు ఆయన మెదడును రోగికి మార్చడంతో సంభవించే సంఘటనలను హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చూసిన నిర్మాత అరివళగన్ వెంటనే విడుదల హక్కులను కొనుగోలు చేసి తన పీకేఏ ఫిలింస్ సంస్థ ద్వారా తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల్లో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాలు బాగుందంటూ ప్రశంసించి యూ సర్టిఫికెట్‌ను ఇచ్చారని వెల్లడించారు. రమేష్ కృష్ణ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ చాయాగ్రహణం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement