Pandiyarajan
-
విజయ్‌సేతుపతి, టీఆర్‌ల చిత్రం కవన్
కాదలుమ్ కడందుపోగుమ్, సేతుపతి, ధర్మదురై, రెక్క అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి తాజాగా కవన్ అంటూ రానున్నారు. ఇందులో ఆయనతో పాటు సీనియర్ నటుడు టి.రాజేందర్ నటించడం విశేషం. మడోనా సెబాస్టియన్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో విక్రాంత్, పాండియరాజన్, నాజర్, బోస్‌వెంకట్, జగన్ నటిస్తున్నారు. హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు అయన్, మాట్రాన్, అనేగన్ తదితర చిత్రాలను తెరకెక్కించిన కేవీ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఫిలింస్ పతాకంపై కల్పాత్తి అఘోరం, గణేశ్, సురేశ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు.10 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పారు.ఇటీవలే విజయ్‌సేతుపతి, టీ.రాజేందర్, మడోనా సెబాస్టియన్‌లపై ఒక పాటను చిత్రీకరించినట్లు తెలిపారు. టీ.రాజేందర్, హిప్ హాప్ ఆది, నటి మడోనా సెబాస్టియన్ పాడిన నూతన సంవత్సరాది పాట చిత్రంలో హైలెట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. -
హాస్య భరితంగా ఆయ్‌వుకూడం
హర్రర్ చిత్రాల ట్రెండ్ సాగుతున్న ఈ పరిస్థితుల్లో హాస్యపు జల్లులు కురిపించడానికి సిద్ధం అవుతోంది ఆయ్‌వుకూడం. సీనియర్ నటుడు పాండియరాజన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రానికి మాంగాడు అమ్మన్ మూవీస్ పతాకంపై గణపతి నిర్మించారు. నవ జంట గణపతి, సత్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రీతి, సుందర్, ప్రభురాజ్, రియాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన అన్భరసన్ చిత్ర వివరాలను తెలుపుతూ నటుడు పాండియరాజన్ ప్రముఖ శాస్తవేత్తగా నటించారన్నారు. ఆయన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడి మెదడుకు ఫైటర్‌కు ఆయన మెదడును రోగికి మార్చడంతో సంభవించే సంఘటనలను హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చూసిన నిర్మాత అరివళగన్ వెంటనే విడుదల హక్కులను కొనుగోలు చేసి తన పీకేఏ ఫిలింస్ సంస్థ ద్వారా తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల్లో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాలు బాగుందంటూ ప్రశంసించి యూ సర్టిఫికెట్‌ను ఇచ్చారని వెల్లడించారు. రమేష్ కృష్ణ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ చాయాగ్రహణం అందించారు.