విజయ్‌సేతుపతి, టీఆర్‌ల చిత్రం కవన్ | Vijay Sethupathi's film with KV Anand titled Kavan | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతి, టీఆర్‌ల చిత్రం కవన్

Published Fri, Oct 21 2016 2:59 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

విజయ్‌సేతుపతి, టీఆర్‌ల చిత్రం కవన్

విజయ్‌సేతుపతి, టీఆర్‌ల చిత్రం కవన్

కాదలుమ్ కడందుపోగుమ్, సేతుపతి, ధర్మదురై, రెక్క అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి తాజాగా కవన్ అంటూ రానున్నారు. ఇందులో ఆయనతో పాటు సీనియర్ నటుడు టి.రాజేందర్ నటించడం విశేషం. మడోనా సెబాస్టియన్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో విక్రాంత్, పాండియరాజన్, నాజర్, బోస్‌వెంకట్, జగన్ నటిస్తున్నారు.
 
  హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు అయన్, మాట్రాన్, అనేగన్ తదితర చిత్రాలను తెరకెక్కించిన కేవీ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఫిలింస్ పతాకంపై కల్పాత్తి అఘోరం, గణేశ్, సురేశ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు.10 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పారు.ఇటీవలే విజయ్‌సేతుపతి, టీ.రాజేందర్, మడోనా సెబాస్టియన్‌లపై ఒక పాటను చిత్రీకరించినట్లు తెలిపారు. టీ.రాజేందర్, హిప్ హాప్ ఆది, నటి మడోనా సెబాస్టియన్ పాడిన నూతన సంవత్సరాది పాట చిత్రంలో హైలెట్‌గా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement