Riaz
-
కశ్మీర్లో లష్కరే కీలక కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా కీలక కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్ హతమయ్యాడు. కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరించే ఇతడి మృతి దక్షిణ కశ్మీర్లో లష్కరేకు కోలుకోలేని దెబ్బగా భద్రతా దళాలు పేర్కొన్నాయి. సోమవారం కార్డన్ సెర్చ్ సందర్భంగా ఉగ్రవాదులు దాగున్న ఇంటికి నిప్పంటుకుంది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒకరిని లష్కరే తోయిబా కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్గా, మరొకరిని రయీస్ దార్గా గుర్తించారు. 2015 నుంచి లష్కరేలో పనిచేస్తున్న సత్తార్‌కు గ్రెనేడ్ దాడులు, లక్షిత హత్యలు వంటి 20కి పైగా ఉగ్ర ఘటనలతో సంబంధముంది. కొన్నేళ్లుగా బలగాల కళ్లుగప్పి తిరుగుతున్న సత్తార్ పై రూ.10 లక్షలు, రయీస్‌పై రూ.5 లక్షల రివార్డున్నట్టు కశ్మీర్ ఐజీపీ వీకే బిర్ధి చెప్పారు. -
ఎన్నికల ప్రచారంలో రింగ్ రియాజ్
-
జనసేన మహిళా నేతపై దాడి
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్‌ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. -
పాక్ జట్టులో మూడు మార్పులు
కరాచీ: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పాకిస్తాన్ బౌలింగ్ దళంలో ప్రపంచకప్ కోసం మార్పులు జరిగాయి. అనుభవజ్ఞులైన లెఫ్టార్మ్ పేసర్లు మొహమ్మద్ ఆమిర్, వహాబ్ రియాజ్‌లను మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసింది. నిజానికి వీళ్లిద్దరితో పాటు బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ పాక్ ప్రతిపాదిత ప్రపంచకప్ జట్టులో లేడు. కానీ పరుగుల కట్టడి కోసం సెలక్టర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వుంచారు. ముందనుకున్న ప్రపంచకప్ జట్టులో ఉన్న ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్, లెఫ్టార్మ్ పేసర్ జునైద్ ఖాన్, ఓపెనర్ ఆబిద్ అలీలను తప్పించి ఆమిర్, రియాజ్, ఆసిఫ్ అలీలకు స్థానం కల్పించారు. జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్, హారిస్ సొహైల్, ఆసిఫ్ అలీ, షోయబ్ మాలిక్, హఫీజ్, ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, వహాబ్ రియాజ్, ఆమిర్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, హస్నయిన్. ఆసిఫ్ అలీ ఇంట విషాదం పాకిస్తాన్ ప్రాథమిక ప్రపంచకప్ జట్టులో లేకపోయినా... తాజాగా ఖరారు చేసిన జట్టులో చోటు దక్కించుకున్న బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీకి ఆనందం కంటే విషాదమే మిగిలింది. తన గారాల తనయ, రెండేళ్ల నూర్ ఫాతిమా క్యాన్సర్ వ్యాధితో సోమవారం మృతి చెందింది. ఆమెకు వ్యాధి తీవ్రమవడంతో అమెరికా తీసుకెళ్లి చికిత్స అందించారు. వ్యాధి నాలుగో దశను మించడంతో చికిత్స పొందుతూ అమెరికాలోని ఆస్పత్రిలో ఫాతిమా కన్నుమూసింది. దీంతో ఇంగ్లండ్‌లో ఉన్న అలీ హుటాహుటిన స్వదేశం పయనమయ్యాడు. జునైద్ నిరసన... ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించడంతో పాక్ బౌలర్ జునైద్ ఖాన్ సెలక్టర్లపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాడు. ‘నేనెలాంటి వ్యాఖ్య చేయదల్చుకోలేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది’ అని తన నోటికి నల్ల ప్లాస్టర్ తగిలించుకున్న ఫొటోను జునైద్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 29 ఏళ్ల జునైద్ ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 9 వన్డేలు ఆడి 11 వికెట్లు తీశాడు. మరోవైపు ఆమిర్ ఇంగ్లండ్‌లో 9 వన్డేలు 9 వికెట్లు పడగొట్టాడు. -
చేదు పాయసం
‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’అని ప్రశ్నించాడు నవాబు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది. దాన్ని మేమెలా తినగలం?’’ అని సమాధానం వచ్చింది. పూర్వకాలంలో సులేమాన్ ఒక నవాబు ఉండేవాడు. అతని దగ్గర రియాజ్ అనే నమ్మకస్తుడైన ఒక పల్లెటూరి యువకుడు సేవకుడుగా ఉన్నాడు. అతడంటే నవాబుకు అంతులేని ప్రేమ, అభిమానం. అంత నమ్మకంగా సేవలందించేవాడు రియాజ్. రాజుగారి కొలువులో ఎంతో తెలివైన, గొప్పగొప్ప మంత్రులు కూడా ఉండేవాళ్లు. వారందరికీ ఈ పల్లెటూరి యువకుడిపై అసూయ కలిగింది. ఎలాగైనా ఇతణ్ణి రాజదర్బారునుండి గెంటించి వేయాలని పథకం పన్నారు. రాజుకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. రాజు వీళ్ల దుర్బుద్ధిని పసిగట్టి, ఏదో ఒకరోజు వీళ్లకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒకరోజు పాయసం వండించాడు. అందులో చక్కెరకు బదులు ఉప్పువేసి, వరుసగా మంత్రులందరికీ వడ్డించారు. అందరూ ఒక్క చెంచా నోట్లో పెట్టుకోగానే ముఖం మాడ్చుకొని ‘యాక్ థూ’ అంటూ ఉమ్మేశారు. కాని పల్లెటూరి యువకుడయిన రియాజ్ మాత్రం లొట్టలేసుకుంటూ సంతోషంగా తినేశాడు. అప్పుడు రాజు వారినుద్దేశించి, ‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’ అని ప్రశ్నించాడు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది. దాన్ని మేమెలా తినగలం?’’ అని సమాధానం వచ్చింది. వెంటనే నవాబు ఆ పల్లెటూరి యువకుణ్ణి ఉద్దేశించి, ‘‘అంత ఉప్పగా, చేదుగా ఉన్న పాయసాన్ని నువ్వు ఎలా తినగలిగావు? నీకు చేదుగా అనిపించలేదా?’’ అని ప్రశ్నించాడు. అందుకు ఆ యువ కుడు.. ‘‘అయ్యా! పాయసం ఉప్పగా, చేదుగా ఉన్నమాట నిజమే. కాని జీవితాంతం తమరు నాకు ఎంతో తియ్యనైన, రుచికరమైన పదార్థాలు పెట్టారు. నేను అడగకుండానే నా సమస్త అవసరాలు తీరుస్తున్నారు.అలాంటిది ఒక్కపూట ఉప్పు ఎక్కువైతే ఏమౌతుంది? ఒక్కపూట కాస్త ఇబ్బంది పడ్డందుకే జీవితాంతం చేసిన మేలును ఎలా మరిచిపోగలను?’‘ అన్నాడు కృతజ్ఞతగా. నిజమే, అల్లాహ్ అనునిత్యం మనపై అసంఖ్యాక అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. అడగకుండానే అన్నీ సమకూరుస్తున్నాడు. కాని కాస్త బాధ కలగగానే మనం అవన్నీ మరచిపోతాం. దేవుడు నాకు ఏంచేశాడు? అనేస్తాం. పుట్టిన దగ్గరి నుండి మరణించే వరకు చేసిన మేళ్లను మరచిపోయి, కాస్తంత కష్టం కలగగానే బాధపడిపోవడం దైవాన్ని నమ్మినవారికి ఉండవలసిన గుణం కాదు. – మదీహా -
గ్యాంగ్‌స్టర్ నయూమ్ గురించి.....
నయీమ్ అనుచరుడి ఇంటరాగేషన్! రియూజ్ను ప్రశ్నించిన డీఎస్పీ? మునుగోడు: గ్యాంగ్‌స్టర్ నయూమ్ ముఖ్య అనుచరుడు, బెస్ట్ షూటర్‌గా పేరున్న రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం రాత్రి మునుగోడు పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నల్లగొండ డీఎస్పీకి అప్పగించినట్లు తెలిసింది. మూడు వాహనాల్లో పోలీసులను వెంటబెట్టుకుని డీఎస్పీ రాత్రి 1 గంట సమయంలో రియాజ్‌ను మునుగోడు పీఎస్‌కు తరలించి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆ సమయంలో స్థానిక పోలీసులను కూడా దగ్గరికి రానివ్వలేదని సమాచారం. 3 గంటల 30 నిమిషాలకు డీఎస్పీ నల్లగొండకు వెళ్లగా ఉదయం 7 గంటల సమయంలో రియాజ్‌ను మరో చోటుకు తరలించినట్లు తెలియవచ్చింది. నయీమ్ ఇంటి నుంచి వాహనాలు స్వాధీనం షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో నయీమ్ నివసించిన ఇంటి నుంచి పోలీసులు బుధవారం రెండు కార్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న ఈ వాహనాలు ఎవరివి, ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నయీమ్‌కు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, ఇతరత్రా అంశాలను పోలీసులు బయటకు పొక్కనివ్వడం లేదు. శ్రీధర్ ఆచూకీ సంగతేమిటి? పూర్తి వివరాలు సమర్పించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడుగా భావిస్తున్న నీలా శ్రీధర్‌గౌడ్ ఆచూకీ కోసం అతని భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. శ్రీధర్‌గౌడ్ అదృశ్యంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత పోలీసులు తన భర్తను పట్టుకెళ్లారని, ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియడం లేదని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ శ్రీధర్ భార్య శ్రీలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా శ్రీలత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్, ఆమె భర్త ఈ నెల 8న హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపారు. నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో శ్రీధర్‌గౌడ్‌కు ప్రాణహాని ఉందన్నారు. నయీమ్ అనుచరులు వేధించారు ఆదిబట్ల గ్రామవాసి ఇబ్రహీంపట్నం రూరల్: ‘‘గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు మా భూమి కబ్జా చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ వారు దాడులు, దౌర్జన్యాలు చేసినా జంకలేదు’’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామానికి చెందిన బురుగుల వెంకట్‌రెడ్డి పేర్కొన్నాడు. వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2013లో ఆదిబట్ల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 289లో 8 ఎకరాల భూమిని హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేశారు. కాగితాలు ఉన్నా దానికి సరిపోయేంత భూమి అక్కడ లేకపోవడంతో పక్కనే 490, 410 సర్వే నంబర్లోని మా భూమిని కబ్జా చేశారని వెంకట్‌రెడ్డి చెప్పాడు. సర్వే నంబర్ 289లోని భూమిని యజమానులు నయీమ్ అనుచరుడు శ్రీహరికి అమ్మారని, అతను చాలాసార్లు తమ కుటుంబ సభ్యులను బెదిరించాడని వెంకట్‌రెడ్డి తెలిపాడు. ప్రత్యక్ష దాడులకు కూడా దిగాడని, తమ భూమిలో ఉన్న దొండ తోటను కూడా ధ్వంసం చేశాడని చెప్పారు. శ్రీహరి భార్య మాధవి కూడా తమ ఇంటికి వచ్చి మహిళలపై దాడికి దిగిందన్నాడు. ఈ వ్యవహారంపై గతంలో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు వారి వైపే మొగ్గు చూపారని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ స్థల వివాదం భూపరిపాలన శాఖలో పెండింగ్‌లో ఉందన్నాడు. నయీమ్‌తో సంబంధాలపై విచారణ జరపండి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్: పోలీసులు, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు నయీమ్ ముఠాతో ఉన్న సంబంధాలపై సమగ్ర విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వాలు, పోలీసుల అండదండలతో అరాచకాలు, హత్యలు చేస్తూ వేల ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదును నయీమ్ కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. నయీమ్‌ను అడ్డం పెట్టుకుని చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు కోట్లు సంపాదించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ నుంచి బహిష్కృతుడైన నయీమ్‌ను పోలీసులు చేరదీసి ఆ ముఠా ద్వారా ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలను హత్య చేయించారని ఆరోపించారు. చివరకు వారికే సవాల్‌గా మారడంతో నయీమ్‌ను మట్టుపెట్టారని వెల్లడించారు. నేరస్తులను మొగ్గలోనే తుంచివేసే పద్ధతిలో కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు భరోసానివ్వాలని ఆయన సూచించారు. -
హాస్య భరితంగా ఆయ్‌వుకూడం
హర్రర్ చిత్రాల ట్రెండ్ సాగుతున్న ఈ పరిస్థితుల్లో హాస్యపు జల్లులు కురిపించడానికి సిద్ధం అవుతోంది ఆయ్‌వుకూడం. సీనియర్ నటుడు పాండియరాజన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రానికి మాంగాడు అమ్మన్ మూవీస్ పతాకంపై గణపతి నిర్మించారు. నవ జంట గణపతి, సత్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రీతి, సుందర్, ప్రభురాజ్, రియాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన అన్భరసన్ చిత్ర వివరాలను తెలుపుతూ నటుడు పాండియరాజన్ ప్రముఖ శాస్తవేత్తగా నటించారన్నారు. ఆయన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడి మెదడుకు ఫైటర్‌కు ఆయన మెదడును రోగికి మార్చడంతో సంభవించే సంఘటనలను హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చూసిన నిర్మాత అరివళగన్ వెంటనే విడుదల హక్కులను కొనుగోలు చేసి తన పీకేఏ ఫిలింస్ సంస్థ ద్వారా తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల్లో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాలు బాగుందంటూ ప్రశంసించి యూ సర్టిఫికెట్‌ను ఇచ్చారని వెల్లడించారు. రమేష్ కృష్ణ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ చాయాగ్రహణం అందించారు. -
ఇక శవం తేలితేనే!
ఫలించని గాలింపు చర్యలు చెరువు వద్ద కుటుంబ సభ్యుల రోదన రెండో రోజూ లభ్యంకాని మృతదేహం పలమనేరు: పలమనేరు మండలం కరి డిమడుగు సమీపంలోని అటవీ ప్రాంత ంలో క్రిష్ణమనాయని చెరువులో విహా రానికెళ్లి నీట మునిగిన రియాజ్ అలి యాస్ అబ్బు (22) మృతదేహం సోమవారం సాయంత్రం వరకు కూడా కానరాలేదు. ఈ చెరువులో రెండ్రోజులుగా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలి స్తున్నా లాభం లేకపోయింది. శవం దా నంతట అదే తేలితే గానీ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆదివారం స్నేహితులతో కలసి చెరువులో ఈతకెళ్లి రియాజ్ నీట మునిగిన విషయం తెలిసిందే. అ ప్పటి నుంచి మృతదేహం కోసం గాలిం పు సాగుతూనే ఉంది. ఇప్పటికే చెరువు లో చాలా వరకు గాలింపు చేపట్టామ ని, ఇక కొంత భాగం మాత్రమే మిగిలి ఉం దని ఎస్ఐ రవినాయక్ తెలిపారు. రి యాజ్ కుటుంబ సభ్యులు చెరువు వద్దే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నేటి ఉదయం తిరిగి గాలింపు చేపట్టనున్నా రు. మృతదేహం వెతుకుతూ మృత్యువాత.. రియాజ్ మృతదేహం కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లలో పలమనేరుకు చెందిన రెడ్డిప్రకాష్(52) ఉన్నారు. రెండు రో జు లుగా చలి ఎక్కువగా ఉండడం, నీళ్లలో మునుగుతూ ఉండడంతో ఊపిరి ఆడక ఆయన సోమవారం సాయంత్రం మృతి చెందాడు. రెడ్డిప్రకాష్ చేపలు పట్టుకుం టూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కు టుంబ పెద్ద మృతితో వారు దిక్కులేని వారయ్యారు. తమకు దిక్కెవరంటూ కు టుంబ సభ్యులు రోదించడం పలువురికి కలచివేసింది. -
రియాజ్‌కు బెయిలు
సాక్షి, చిత్తూరు: మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్ రియాజ్‌కు గురువారం బెయిలు మంజూరైంది. భాకరాపేట స్టేషన్లో నమోదైన ఎర్రచందనం కేసుకు సంబంధించి ఇతనికి బెయిల్ వచ్చింది. కర్ణాటకకు చెందిన రియాజ్ స్మగ్లర్ వీరప్పన్‌తో కలిసి సత్యమంగళం అడవుల్లో శ్రీగంధం స్మగ్లింగ్ చేసేవాడు. వీరప్పన్ మరణం అనంతరం ఇతను ఎర్రచంద నం స్మగ్లింగ్‌కు అలవాటు పడ్డాడు. ఇతనిపై దాదాపు 20 కేసులు ఉన్నాయి. నెలన్నర కిందట రియాజ్‌ను చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టుచేశారు. ఇతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని అప్పటి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ప్రకటించారు. అయితే కలెక్టర్ సిద్ధార్థజైన్ పీడీ నమోదులో నిర్లక్ష్యం వహించారు. ఈ కారణంగానే రియాజ్‌కు బెయిల్ మంజూరైంది. రియాజ్ నెలకు 15 కోట్ల రూపాయలు స్మగ్లింగ్ ద్వారా సంపాదిస్తున్నాడు. రియాజ్‌తో పాటు తక్కిన అంతర్జాతీయ స్మగ్లర్లకు కూడా త్వరలో బెయిల్ రానున్నట్లు తెలుస్తోంది.