'హత్య చేసి సోఫా కేబినెట్లో కుక్కేసింది' | old fashion designer arrested on the murder of housewife | Sakshi
Sakshi News home page

'హత్య చేసి సోఫా కేబినెట్లో కుక్కేసింది'

Published Fri, Feb 13 2015 12:26 PM | Last Updated on Mon, Oct 1 2018 1:12 PM

'హత్య చేసి సోఫా కేబినెట్లో కుక్కేసింది' - Sakshi

'హత్య చేసి సోఫా కేబినెట్లో కుక్కేసింది'

దుస్తులను వినూత్నంగా తయారు చేసే ఓ ఫ్యాషన్ డిజైనర్... ఓ మహిళను హత్య చేయటంలోనూ అంతే ప్రావీణ్యం ప్రదర్శించి చివరకు కటకటాలపాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని కోరిన మహిళను... గర్భిణి అని కూడా చూడకుండా ఫ్యాషన్ డిజైనర్  దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సోఫా కింద ఉండే స్టోరేజ్ కేబినెట్లో దాచిపెట్టింది.

వివరాల్లోకి వెళితే. ముంబయిలోని బోరివ్లి ఈస్ట్లోని కాజుపాడలో ఫ్యాషన్ డిజైనర్ ఉజ్వల వీర్...ప్రీతి పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. గతంలో ప్రీతి భర్త దగ్గర ఉజ్వల రూ. 20వేలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న అప్పు కొంత అయినా చెల్లించాలని ప్రీతి పలుమార్లు ఒత్తిడి తెచ్చినా సమాధానం లేదు. డబ్బు విషయంలోనే కాకుండా, అవివాహిత అయిన ఉజ్వల...ప్రీతి భర్తతో సన్నిహితంగా ఉండటంపై కూడా  వీరిద్దరి మధ్య గత ఆరు నెలల క్రితం వివాదం జరిగింది.

దాంతో ప్రీతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఉజ్వల వీర్ నిర్ణయించుకుంది. మూడు రకాల మారణాయుధాలను ఉపయోగించి ప్రీతిని దారుణంగా హతమార్చింది.  అనంతరం మృతదేహాన్నితన ఇంట్లోనే సోఫా కింద  స్టోరేజ్ కేబినెట్లో దాచి పెట్టింది. ఆ తరువాత  ఏమీ ఎగరనట్లు ప్రీతి.. గుర్తు తెలియని దుండగుని చేతిలో హత్యకు గురైనట్లు కేసు  పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపటంతో ఉజ్వల వీర్ తానే ప్రీతిని హతమార్చినట్లు అంగీకరించింది. పోలీసులు ఉజ్వల వీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement