
గుర్తు పట్టారా... ఈ ఫొటోలో హీరోయిన్ ఎవరో? పేరు... ప్రీతి జింగ్యానియా! ఇంకా గుర్తు రాలేదా? అదేనండీ... ‘తమ్ముడు, నరసింహ నాయుడు, అధిపతి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించారీమె. తర్వాత ఎక్కువగా హిందీ సినిమాలు, మధ్య మధ్యలో కొన్ని తెలుగుల్లో నటించినా... ఐదేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే... పెళ్లైంది. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మ అయ్యారు. దాంతో ఈ ఐదేళ్లూ పిల్లలే ప్రపంచంగా బతికారు. ఇప్పుడు నటిగా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ‘వజూద్’ అనే హిందీ సినిమా చేస్తున్నారు. పిల్లల్ని, సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారీ బ్యూటీ. రీ–ఎంట్రీ, పిల్లల గురించి ప్రీతి మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించాలనుకుంటున్నా.
ఇతరులతో (మదర్స్) పోలిస్తే ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం నాకు ఈజీనే. నన్ను మా ఫ్యామిలీ బోల్డంత సపోర్ట్ చేస్తుంది. నేను ఇంట్లో లేకపోయినా... పిల్లల్ని ఎవరొకరు చూసుకుంటా రు. మా మదర్, సిస్టర్ కూడా సేమ్ అపార్ట్‌మెంట్‌లోనే ఉంటారు. సో, ప్రాబ్లమ్ లేదు. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘వజూద్’లో ప్రీతి తల్లిగా ఎమోషనల్ రోల్ చేస్తున్నారు. ఇదొక ఆఫ్ బీట్ ఫిల్మ్ అట! దాంతో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్లో నటించాలనుందంటూ ప్రీతి తన మనసులోని మాట బయటపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment