![ప్రేమకు కొత్త నిర్వచనం!](/styles/webp/s3/article_images/2017/09/17/71503254640_625x300.jpg.webp?itok=1PUAVaed)
ప్రేమకు కొత్త నిర్వచనం!
శ్రీకరణ్, అమృత, ప్రీతి ముఖ్యతారలుగా నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బెస్ట్ లవర్స్’. శ్రీకరణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత గొంటి శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. గొంటి శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే చిత్రమిది. ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సాయికిరణ్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.