ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతుల ఆత్మహత్య! | New couple suicide | Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతుల ఆత్మహత్య!

Published Sun, May 17 2015 4:55 PM | Last Updated on Sat, Oct 20 2018 7:45 PM

ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతుల ఆత్మహత్య! - Sakshi

ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతుల ఆత్మహత్య!

హైదరాబాద్: ఆ ప్రేమ జంటకు పెళ్లైన నాలుగు నెలలకే నూరేళ్లు నిండాయి. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పురాలో ఈ విషాద సంఘటన జరిగింది. బహదూర్పల్లికి చెందిన  వెంకటేష్, ప్రీతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వారి పెళ్లిని ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. అయినా వారు ఇద్దరూ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బహదూర్పురాలో నివాసం ఉంటున్నారు.

అయితే వారిని పట్టించుకునేవారు లేరు. దాంతో వారికి ఆర్థిక ఇబ్బందు ఎదురయ్యాయి. దాంతోనే  వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ వారు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఇరువైపుల పెద్దలు వచ్చి వారి మృతదేహాలను చూసి విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement