జనగామ: నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన మెడికో విద్యార్థి ప్రీతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. మరొకవైపు ప్రీతికి కడసారి వీడ్కోలు పలికేందుకు స్థానికులు తరలివస్తున్నారు.
కొడకండ్ల మండలం గిర్ని తండాలో ప్రీతి భౌతికకాయానికి నేడు అంత్యక్రయలు జరుగనున్నాయి. తమతో పాటు తిరిగే కూతురు ఇలా విగత జీవిలా పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు దుఃఖం ఆగడం లేదు.
ఈ క్రమంలోనే ప్రీతి తండ్రి నరేందర్ శోకతప్ప హృదయంతో తమ కూతుర్ని హత్యే చేశారంటూ విలపిస్తున్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని తండ్రి నరేందర్ గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ప్రీతి మృతదేహాన్ని బలవంతంగా గిర్ని తండాకు తరలించారని, బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్తామన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘ఆమె ఏం తీసుకుందో ఇప్పటి వరకు నిర్థారణ కాలేదు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలి. మరొకరు ప్రీతిలా మారకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడిన సైఫ్ పై ఉరితీయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడిను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. బంధుమిత్రులు వచ్చాక మద్యాహ్నం అంతిమయాత్ర చేపడుతాం.’ అని తండ్రి నరేందర్ తెలిపారు.
మరొకవైపు ప్రీతి మృతి చెందడానికి సైఫ్ ఒక్కడే కాదు ఇంకా కొందరి ప్రేమయం ఉందని ఆమె సోదరి ఆరోపించింది. తనకు తానుగా మత్తు ఇంజక్షన్ తీసుకోలేదు.. కొందరు పట్టుకుంటే, సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగుర్ని ఎదురించే బలం కూడా ప్రీతికి లేదు. అంటూ ప్రీతి సోదరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment