
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: సీనియర్ వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా సోమవారం వైద్య కళాశాలల బంద్‌కు ఏబీవీపీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నంపై.. వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ సాధారణమని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. కాగా, డాక్టర్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆల్ తెలంగాణ ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఒక ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment