బాలికపై అత్యాచారం... హత్య | Rape and murder of a girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం... హత్య

Published Sat, Feb 7 2015 1:24 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

బాలికపై అత్యాచారం... హత్య - Sakshi

బాలికపై అత్యాచారం... హత్య

బెంగళూరు(బనశంకరి) : స్థానిక పిల్లగుంప పారిశ్రామిక వాడలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. హుబ్లీలోని కలగటికి చెందిన మహంతేష్, యల్లమ్మ దంపతులు బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వచ్చి పిల్లగుంప పారిశ్రామిక వాడ సమీపంలో చొక్కహళ్లి గ్రామంలో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు ప్రీతి ఉంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. సమీపంలోని ఓ షెడ్‌లో బాలిక నిర్జీవంగా కనిపింది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక నోటిలో పేపర్ కుక్కి అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమీపంలోని అంగడి వద్ద ఉన్న సీసీ కెమెరాలోని ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో ఓ దుండగుడు బాలికను కారు షెడ్‌లోకి తీసుకెళ్లినట్లు స్పష్టంగా ఉంది. దీని ఆధారంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు గ్రామాంతర ఎస్పీ రమేష్ బానోత్, అదనపు ఎస్పీ అబ్దుల్ అహ్మద్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఐజీపీ చక్రవర్తి పరిశీలించారు. కాగా, ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement