ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా పది రోజుల పాపకు ఆధార్ నమోదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా పది రోజుల పాపకు ఆధార్ నమోదు చేశారు. మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన దంపతులు కామ్రే పంజాబ్, జ్యోతిలకు ఈ నెల 19న పాప(ప్రీతి) జన్మించింది. మండలంలోని భోరజ్ సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్), మీ సేవా కేంద్రం నిర్వాహకుడు నివల్కర్ గజానన్ సోమవారం పాప ఇంటికి వెళ్లి ఆధార్ ఎన్‌రోల్‌మెంటు సాఫ్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్లెట్ పీసీలో పాప వివరాలు, ఫొటో, తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు నమోదు చేశారు. అనంతరం ఐదు నిమిషాల్లో పాప ఫొటో, పేరు, చిరునామాతో ఈఐడీ సర్టిఫికెట్ జారీ కాగా.. తల్లిదండ్రులకు అందజేశాడు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్‌కార్డు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం గత నెల రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్) పరిధిలో ప్రారంభమైంది. జిల్లాలోని భోరజ్ కేంద్రంలో మాత్రమే ఈ అవకాశం ఉంది.