తాజ్ మహల్ వద్ద ఉచిత వైఫై 16 నుంచి
న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్‌మహల్ పరిసరాల్లో త్వరలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. సందర్శకులు జూన్ 16 నుంచి 30 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు పొందవచ్చు. ఆపై ప్రతి గంటకు అదనంగా రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజ్‌మహల్ పరిసరాల్లో 21 వైఫై కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. ప్రతి ఏటా 80 - 90 లక్షల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ని సందర్శిస్తారని, వారిలో 10 లక్షల మంది దాకా విదేశీ పర్యాటకులు ఉంటారని అంచనా.