బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్‌’ ఆఫర్ | Tata Communications gives BSNL users free Wifi internationally | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్‌’ ఆఫర్

Published Fri, Jan 13 2017 5:40 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్‌’ ఆఫర్

బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్‌’ ఆఫర్

ముంబై: టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) శుక్రవారం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  బీఎస్ఎన్ఎల్  చందాదారులకు  అంతర్జాతీయంగా ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. తన వినియోగదారులకు అపూర్వమైన  డాటా అనుభవాన్ని అందించే  క్రమంలో టాటా కమ్యూనికేషన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

హై క్వాలిటీ, వేగవంతమైన  డాటా అందించేలా  టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై,  వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల (44మిలియన్ల) వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది.   అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా  ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ  ఫైలింగ్ లో తెలిపింది. టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు భారతదేశం వెలుపల ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచంలో  వైఫై  నెట్వర్కుకు  అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే....వై ఫై  హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు  అయితే చాలని  చెప్పింది.  దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా  సమీపంలోని  వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్  అవుతారని  టాటా కామ్  వెల్లడించింది.

ప్రపంచంలో్ ఎక్కడున్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారుల  బిల్లు షాక్ గురించి చింతలేకుండా ఇంటర్నెట్ అనుభూతిని అందించడమే తమలక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement