ఏటా 40–55 శాతం వృద్ధి రేటు
2027 నాటికి అంచనాలు
బెయిన్ అండ్ కంపెనీ నివేదిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) ఉత్పత్తులు, సరీ్వసుల మార్కెట్ ఏటా 40–55% మేర వృద్ధి చెందనుంది. 2027 నాటికి 780 బిలియన్ డాలర్లు–990 బిలియన్ డాలర్ల స్థాయి వరకు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో సరఫరా, డిమాండ్‌పరమైన సమస్యల వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దీర్ఘకాలికంగా ఏఐ మార్కెట్ వృద్ధి పటిష్టంగానే ఉండనుంది.
బెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన 5వ వార్షిక గ్లోబల్ టెక్నాలజీ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏఐకి విస్తృతంగా కంప్యూటింగ్ సామర్థ్యాలు అవసరమవుతాయి కాబ ట్టి వచ్చే ఐదు నుంచి పదేళ్లలో డేటా సెంటర్ల స్థాయి కూడా భారీగా పెరగనుంది.
ప్రస్తుతమున్న 50–200 మెగావాట్ల సామర్థ్యం నుంచి గిగావాట్ స్థాయికి డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుతుందని నివేదిక వివరించింది. ప్రస్తుతం భారీ డేటా సెంటర్ల వ్యయం 1 బిలియన్ డాలర్ల నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు ఉండగా ఏఐ కారణంగా అయిదేళ్ల తర్వాత ఇది 10 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. అలాగే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్‌కి (జీపీయూ) సైతం డిమాండ్ 30 శాతానికి పైగా పెరుగుతుందని వివరించింది.
సెమీకండక్టర్లకు కొరత: ఈ పరిణామాలన్నింటి వల్ల సెమీకండక్టర్లకు కొరత ఏర్పడవచ్చని నివేదిక తెలిపింది. ఒకవేళ జీపీయూలకు డిమాండ్ రెట్టింపైతే కీలక విడిభాగాలు సరఫరా చేసే సంస్థలు ఉత్పత్తిని రెట్టింపు చేస్తే సరిపోవచ్చు, కానీ సెమీకండక్టర్ల తయారీ సంస్థలు మాత్రం ఉత్పత్తి సామర్థ్యాలను మూడింతలు పెంచుకోవాల్సి వస్తుందని వివరించింది.
భారీగా వృద్ధి చెందుతు న్న కృత్రిమ మేథ కారణంగా టెక్నాలజీ రంగంలో గణనీయంగా మార్పులు వస్తాయని పేర్కొంది. చిన్న స్థాయి క్లౌడ్ సరీ్వస్ ప్రొవైడర్లు, సాఫ్ట్‌వేర్ వెండార్లు తదితర విభాగాల్లోనూ కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఏఐని వినియోగించుకోవడం, డేటా ఆధునీకరణ కోసం కస్టమర్లకు అంతగా అవసరమైన నైపుణ్యాలు, అనుభవం లేనందున మధ్యకాలికంగా టెక్ సర్వీసులకు డిమాండ్ భారీగా ఉంటుందని పేర్కొంది. అయితే, క్రమంగా చాలా మటుకు టెక్ సరీ్వసుల స్థానాన్ని సాఫ్ట్‌వేర్ భర్తీ చేస్తుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment