యాదిగిరిగుట్టలో త్వరలో ఉచిత వైఫై
భువనగిరి(నల్లగొండ): యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తుల కోసం ఉచిత వైఫై సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని రిలయన్స్ అధికారులు నిర్ణయించారు. యాదగిరికొండపైన 12 మెగాబైట్స్‌తో ఏర్పాటు చేసిన రిలయన్స్ వైఫైతో భక్తులకు అత్యంత నాణ్యమైన నెట్‌వర్క్ సేవలు లభించనున్నాయి. ఇందుకోసం ఆ సంస్థ దేవస్థానం పరిధిలోని కొండపైన ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. నాలుగు దిక్కుల నాలుగు రౌటర్లను ఏర్పాటు చేసింది. ఇటీవల రిలయన్స్ సిబ్బంది టెస్టింగ్ సిగ్నల్‌ను కూడా పరిశీలించారు. చిన్న చిన్న లోటుపాట్లను సవరించారు.
దేవస్థానం ఉద్యోగులకు ఉచితం?
కొండపైన పనిచేసే ఉద్యోగులకు వైఫై సౌకర్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం సంస్థ దేవస్థానం ఈవో నుంచి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాల సమాచారం తీసుకుంటున్నారు. అలాగే కొండపైకి వచ్చే భక్తులకు పరిమిత కాలం ఉచిత సేవలు అందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.