విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఇక ఉచితంగా వైఫైతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు జియోసిమ్‌తోపాటు రూటర్లను ఆయా జిల్లాల డీఈఓ కార్యాలయాలకు పంపించారు. అక్కడి నుంచి ఎంపిక చేసిన పాఠశాలలకు చేరవేసే ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలలోని కొన్ని పాఠశాలలకు ఇప్పటికే పంపిణీ కాగా మిగితా జిల్లాలకూ అందజేయడానికి సిద్ధం చేస్తున్నారు.
అనేక ప్రయోజనాలు..
ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే కంప్యూటర్లు ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఆన్‌లైన్‌లో వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే సమాచారం డౌన్‌లోడు చేసుకోవటం లాంటివి చేసుకోలేకపోతున్నారు. వైఫై ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోనికి వస్తే ఆయా పాఠశాలల నుంచి ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు అడిగే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఐసీసీ
అందుబాటులో పాఠ్యాంశాలు
ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు 8, 9, 10 తరగతులకు సంబంధించిన వివిధ పాఠ్యాంశాల లైవ్‌వీడియోలను తీసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇతర సంస్థలు సైతం పాఠ్యాంశాలను వీడియోలను తయారు చేసి యూటూబ్ లాంటి వాటిలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే వివిధ పాఠ్యాంశాల బోధన లైవ్ వీడియోలను డౌన్‌లోడు చేసుకొని స్కూళ్లలోని విద్యార్థులకు చూపించే అవకాశం లభించనుంది. అలాగే పాఠశాలల్లోని సమగ్ర సమాచారాన్ని సులువుగా సంబంధి విద్యాశాఖ ఉన్నతాధికారులకు చేరవేడంతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే అంశాలను డౌన్‌లోడు చేసుకునే వీలుంటుంది.
వందకు పైగా విద్యార్థులున్న పాఠశాలలకే అవకాశం..
వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్‌ను ఎంపిక చేసి వాటికి వైఫై ఇంటర్నెట్ ఉచిత సేవలను అందించేందుకు నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 417 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 136 ఉన్నత పాఠశాలలుంటే 84, రూరల్ జిల్లాలో 103 ఉండగా 91, జయజశంకర్ భూపాలపెల్లిలో 120కి గాను 93, జనగామలో 129 ఉండగా 99, మహబూబాబాద్‌లో 100 పాఠశాలలు ఉండగా 50 ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment