
ఆర్ధిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో మరో సమస్య తలెత్తింది. ఇంటర్నెట్ వేగం బాగా తగ్గిపోతోంది. ఇది రోజువారీ కార్యకలాపాల మీద ప్రభావం చూపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
పాకిస్తాన్ ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుకు ఆమోదం తెలిపితే.. దానికయ్యే ఖర్చును అక్కడి ప్రజలు భరించగలరా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. శాటిలైట్ మొబైల్ ప్యాకేజీ ధర నెలకు ఏకంగా 50000 రూపాయలు. ఈ ధరతో ప్యాక్ కొనుగోలు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 50 Mbps నుంచి 250 Mbps మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే హార్డ్‌వేర్ కోసం మరో 120000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ధరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

మనం రెసిడెన్షియల్ ప్యాకేజీ ప్లాన్ విషయానికి వస్తే.. దీనికోసం నెలకు 35 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. హార్డ్‌వేర్ కోసం ఒకేసారి దాదాపు 110000 పాకిస్తానీ రూపాయలు చెల్లించాలి. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ ప్యాక్ ధర 95వేల రూపాయలు. ఈ ప్లాన్ ద్వారా యూజర్ 100-500 Mbps స్పీడ్ నెట్ పొందవచ్చు. దీని హార్డ్‌వేర్ కోసం 220000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాలి.
ఇంటర్నెట్ వేగం తగ్గడానికి కారణం
పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ వేగం తగ్గడానికి ప్రధాన కారణం.. సెన్సార్‌షిప్ అని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం జలాంతర్గామి కేబుల్స్ కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిందనే కారణమ్ కూడా వినిపిస్తోంది. ఈ సమస్యను నెమ్మదిగా ఇంటర్నెట్ వేగం సమస్యను అధిగమించడానికి, ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి కృషి చేస్తోంది.
ఇదీ చదవండి: 'ఉద్యోగాలు పోతాయనడం సరికాదు': ఏఐ సమ్మిట్‌లో మోదీ
Comments
Please login to add a commentAdd a comment