![ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన బ్యూటీ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71466859713_625x300.jpg.webp?itok=hx7sHuqU)
ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన బ్యూటీ!
ఆమె ఓ టాప్ మోడల్. తన అందాలతో ఏకంగా ఓ దేశాన్నే ఆకట్టుకున్న బ్యూటీ క్వీన్ షాంజీ హయత్. మూడేళ్ళక్రితం ర్యాంపుపై ఒయ్యారాలు వొలకబోసి, తన అందంతో అందర్నీ కట్టిపడేసిన ఆమె.. మిస్ పాకిస్తాన్ వరల్డ్ 2013 గా ఎంపికైంది. ఇంతకూ ఆమె కథ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఆ అందాల భామ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఓ హాట్ టాపిక్ గా మారింది. తన అందాలను ఆరబోస్తూ.. వివిధ భంగిమల్లోని ఫోటోలను పోస్టు చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఎప్పుడూ ఎంతో ఆత్మస్థైర్యంతో, వినమ్రతతో కనిపించే ఆ అందాల రాణి.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన చిత్రాలను చూసినవారికి మాత్రం... ఆమె అందం.. ఓ అద్భుతం అనిపించక మానదు...ఐదడుగుల ఏడంగుళాల ఎత్తు, బంగారు తీగలా మెరిసిపోయే శరీరం. చూసినవారు కలా.. నిజమా అంటూ కళ్ళప్పజెప్పాల్సిందే...