ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఏ ప్రాంతంలో ఉన్నారనే టాపిక్ ప్రస్తావనకు వచ్చినప్పుడు పాకిస్తాన్‌లోని ఒక ప్రదేశం చర్చకు వస్తుంది. అందుకే ఆ ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రాంతంలోని మహిళలు 80 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఎంతో అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తారు. అందుకే ఇక్కడి అమ్మాయిలను అత్యంత అందగత్తెలుగా భావిస్తారు. దీనికితోడు మంచి ఆరోగ్యం కారణంగా ఇక్కడి మహిళలు 60 ఏళ్లు దాటిన తరువాత కూడా తల్లులయ్యే సామర్థ్యాన్ని కలిగివుంటున్నారు.
ఈ ప్రదేశం మరెక్కడో కాదు మన పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో ఉంది. దీని పేరు హుంజా వ్యాలీ. ఇక్కడి స్త్రీలు ఎంతో అందగత్తెలుగా పేరొందారు. వారి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కారణంగా ఇక్కడి మహిళలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారు.
ఇక్కడ ప్రజలు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతుంటారు. దీనికి కారణం ఇక్కడ ప్రవహించే నదిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు.
హుంజా వ్యాలీ ప్రజలు మధ్యాహ్నం ఒకసారి, రాత్రిపూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. దీనికితోడు ఇక్కడ ప్రజలు ఇక్కడివారినే వివాహం చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసి, దానినే తింటారు.
ప్రపంచంలోని ఆయుర్దాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలను బ్లూ జోన్‌లు అంటారు. హుంజా వ్యాలీ కూడా బ్లూ జోన్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడి ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు.
ఇది కూడా చదవండి: సింగపూర్ ట్రిప్‌కు ఐఆర్‌సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ
Comments
Please login to add a commentAdd a comment