పాక్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు బంద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కొన్ని గంటల పాటు ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను ఆపివేశారు. శుక్రవారం ఇస్లామాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు.
పాక్లో ఇస్లామిక్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మతాధికారి మౌలానా అబ్దుల్ అజీజ్ పిలుపునివ్వడంతో భద్రత కారణాల రీత్యా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను బంద్ చేశారు. ఇస్లామాబాద్లో రెడ్ మసీదుకు రెండు కిలో మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. గత నెల రోజుల్లోనే ఇస్లామాబాద్లో ఇంటర్నెట్, మొబైల్
సర్వీసులను రద్దు చేయడమిది మూడోసారి.