inagurates
-
హైదరాబాదే మన ఫ్యూచర్ ..!
-
పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు: సీఎం వైఎస్ జగన్
-
ఏపీలో టూరిస్ట్ పోలీస్టేషన్లు
-
అహోబిలాపురం స్కూల్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
వకుళామాత ఆలయంలో సీఎం జగన్
-
గిరిజన మ్యూజియం దేశానికే ఆదర్శం
సాక్షి, చింతపల్లి(విశాఖ) : తాజంగిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం దేశానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి ఆకాంక్షించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని శుక్రవారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 21 ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మ్యూజియాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాయన్నారు. చింతపల్లి ప్రాంతం వేదికగా అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో ఎంతోమంది గిరిజనులు బ్రిటిషు పాలకులపై తిరుగుబాటు చేశారన్నారు. డౌనూరు నుంచి లంబసింగి వరకు ఘాట్‌రోడ్డు నిర్మాణ సమయంలో అల్లూరి సీతారామరాజే స్వయంగా బ్రిటిషు పాలకులపై దాడి చేసేందుకు సిద్ధంకావడం గొప్ప చరిత్ర అన్నారు. సాధారణ విల్లంబులతో చింతపల్లి పోలీసుస్టేషన్‌పై దాడిచేసి తుపాకులు స్వాధీనం చేసుకోవడం బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించిందన్నారు. ఆయనకు అండగా మల్లుదొర, మర్రి కామయ్యలు ప్రాణత్యాగానికి సిద్ధంకావడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు. దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న గిరిజన యోధుల గురించి భావితరాలకు తెలియాలన్నారు. అందుకు మ్యూజియం నిర్మాణం పూర్తయితే లంబసింగి ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, గిరిజనులకు కూడా ఉపాధి కలుగుతుందని పుష్పశ్రీ వాణి అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల గిరిజనులకు ఆదర్శం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోని గిరిజనులకు ఇక్కడి మ్యూజియం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఆంధ్ర కశ్మీర్ అయిన లంబసింగిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు, జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, ఐటీడీఏ పీఓ ఆర్. గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి. అభిషేక్, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల లోగోలను ఆవిష్కరించారు. -
హైదరాబాద్‌లో 3 వేల ఉచిత హాట్‌స్పాట్ సెంటర్లు.. ఎక్కడంటే..
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ డెటాను డిజిటలైజ్ చేస్తున్నామని.. త్వరలో బస్తీ దవాఖానాలు, మాల్స్‌లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కాగా, బుధవారం హైదరాబాద్‌లో 3 వేల ఉచిత హాట్ స్పాట్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాక్ట్ ఫైబర్ నెట్‌వర్క్‌తో కలిసి హైఫై సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ హాట్ స్పాట్ల ద్వారా ప్రతిరోజు 1 జీబీ డేటాను.. 45 నిమిషాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తదితర ప్రదేశాల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. -
Suryapet: నేడు కల్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ
సాక్షి, సూర్యాపేట : వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఏర్పాటు, కోర్టు చౌరస్తాకు సంతోష్ బాబు పేరు పెడ్తామని కుటుంబ సభ్యులకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పు డు కార్యరూపం దాల్చబోతోంది. సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహావీర చక్ర, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు విగ్రహాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్ర మం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు పేరును నామ కర ణం చేస్తారని తెలిపారు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు పాత జాతీయ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని చేపలు, పండ్ల మార్కెట్ బ్లాక్‌లను కూడా ప్రారంభిస్తారని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. చదవండి: ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్ -
ఆసుపత్రి ప్రమాణాలు ప్రపంచ స్థాయికి పెంచాం
న్యూఢిల్లీ : ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్‌గా ఉన్న దశ నుంచి ఇప్పుడు కరోనాపై విజయం సాధిస్తోన్న స్థాయికి ఢిల్లీ చేరిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం బురారీలో 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వ ఆసుత్రుల్లో మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసిపోకుండా పెంచామని రానున్న కాలంలో మరిన్ని ఆసుప్రతులు నిర్మించనున్నట్లు తెలిపారు. గత నెలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని, మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. (‘త్వరలో కరోనా లక్షణాలకు ఐఐటీ బ్యాండ్’) జూన్ 23న ఒక్కరోజే అత్యధికంగా 3947 కేసులు నమోదవగా ప్రస్తుతం వెయ్యికి తక్కువగానే కేసులు నమోదవుతున్నాయన్నారు. పరీక్షల సామర్థ్యం పెంచడం, సాధ్యమైనంత త్వరగా ట్రేసింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా కరోనా కేసులు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. ప్రతీ ఒక్కరి కృషి, సామాజిక స్పృహతో ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక 24 గంటల్లో 1025 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 32 మంది మరణించారు. ఇప్పటివరకు దేశ రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,28,389కు చేరుకోగా, 3777 మంది మరణించారు. (ఇక రూ.400 లకే కరోనా పరీక్షలు!) -
కరీంనగర్ ఐటీ టవర్ రెడీ
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వ ర్యంలో వీటి నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణ శివారులో నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ప్రారం భిస్తారు. ఇప్పటికే వరంగల్‌లో మడికొండ మొదటి దశ ఐటీ టవర్‌తో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారం భించగా, రెండో దశ ఐటీ టవర్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రా ల్లోనూ రూ.25 కోట్ల చొప్పున వ్యయంతో ఐటీ టవర్ల నిర్మాణం కొనసాగుతోంది. మహబూబ్ నగర్లో నిర్మాణ పనులు ప్రాథమిక దశలో ఉండగా నిజామాబాద్, ఖమ్మంలో పనులు చివరి దశలో ఉన్నాయి. 70 వేల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ రూ.25 కోట్ల వ్యయంతో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదంతస్తుల్లో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ నిర్మాణ పనులు గతేడాది చివరిలోనే పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీని ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించినా మున్సిపల్ ఎన్నికల కోడ్ మూలంగా వాయిదా పడింది. కరీంనగర్ ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిం చేందుకు 26 కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించగా, 15 కంపెనీలకు ఆఫీస్ స్పేస్ కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 12 కంపెనీలు కార్య కలాపాలు ప్రారంభిస్తుండగా 400 మంది యువ తకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. భవిష్య త్తులో కరీంనగర్ ఐటీ టవర్ ద్వారా దాదాపు 3,600 మందికి ఉపాధి దక్కనుంది. కాగా, ప్రస్తుతం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో ఐటీ టవర్ ప్రారంభమవుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర ఐటీ టవర్ల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ మంగళవారం జరిగే కార్యక్రమంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు. ఐటీ టవర్ ప్రత్యేకతలివే – ఐదంతస్తుల్లో నిర్మించిన ఐటీ టవర్‌లో 12 చదరపు అడుగులు సెల్లార్ కాగా, మరో 60 వేల అడుగులు ఆఫీసు స్పేస్‌కు కేటాయిస్తారు. – గ్రౌండ్ ఫ్లోర్లో శిక్షణ కేంద్రం, మొదటి అంతస్తులో కార్యాలయం, రెండు, ఐదో అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తారు. – మూడు, నాలుగో అంతస్తులను హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలకు భవిష్యత్తులో కేటాయిస్తారు. -
పేదల ఆత్మగౌరవానికి శ్రీకారం
⇒ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లకు పూజ చేసి, పాలు పొంగించిన ముఖ్యమంత్రి ⇒ దేశ చరిత్రలోనే కొత్త అంకం మొదలైంది ⇒ ఇకపై కట్టే ఇళ్లన్నీ రెండు పడక గదులతోనే.. ⇒ ఇళ్లు ఎంతో బాగున్నాయని గవర్నర్ ⇒ ప్రశంసించారు, తనకూ ఒకటి కావాలన్నారు ⇒ తొలుత లాంఛనంగా నలుగురు మహిళలకు ఇంటి హక్కు పత్రాలు అందజేసిన సీఎం ⇒ లబ్ధిదారులతో సహపంక్తి భోజనం సాక్షి, హైదరాబాద్: పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే రెండు పడక గదుల ఇళ్లతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఒక విప్లవాత్మక చరిత్రకు శ్రీకారం చుట్టడం తనకెంతో సంతోషంగా ఉందని... రాష్ట్రంలో ఇకపై కట్టబోయే పేదల ఇళ్లన్నీ డబుల్ బెడ్రూంతోనేనని ఆయన చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్ మోడల్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. తొలుత నలుగురు మహిళలకు లాంఛనంగా ఇంటిహక్కు పత్రాలను అందజేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. భారత దేశ చరిత్రలోనే ఒక కొత్త అంకానికి, కొత్త పనికి శ్రీకారం జరిగిందని... ఐడీహెచ్ కాలనీలో గత ఏడాది దసరా రోజున శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లు అనుకున్న విధంగా పూర్తయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ గృహాల్లో ప్రవేశానికి తానే పూజ చేసి, పాలు పొంగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి 60 వేల ఇళ్లు కట్టించేందుకు రూ. 4 వేల కోట్లు మంజూరు చేశామని.. హడ్కో రుణంతో వాటిని నిర్మిస్తామని తెలిపారు. గవర్నర్ కూడా అడిగారు ప్రభుత్వం, నాయకులు మాటలు చెబుతారు తప్ప, ఇచ్చిన మాట మేరకు పనులు చేయరనే అభిప్రాయాలను పటాపంచలు చేశామని... ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ఇళ్లు కట్టామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీటిని చూడటానికి హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి ఐఏఎస్‌లు, అధికారులెందరో వచ్చారన్నారు. గవర్నర్ నరసింహన్ కూడా ఈ ఇళ్లను సందర్శించారని, అక్కడి నుంచే తనకు ఫోన్ చేసి ఇళ్లు ఎంతో బాగున్నాయని ప్రశంసించారని చెప్పారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా ఇంత మంచి ఇళ్లు లేవన్నారని, గవర్నర్‌కు కూడా ఒకటి అలాట్ చేయాల్సిందిగా చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఒకేగదికి డబ్బులిస్తుండగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ అదనపు నిధులతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారని కేసీఆర్ తెలిపారు. కేంద్రం ఇచ్చే కొద్ది నిధులకు తాము నిధులు కలిపి ‘డబుల్’ ఇళ్లు కడతామని ప్రకటించారు. దసరా రోజే వీటికి ప్రారంభోత్సవం చేయాల్సి ఉన్నా... ఏపీ రాజధాని శంకుస్థాపన కోసం వెళ్లినందున కుదరలేదన్నారు. పేదలు కూడా అందరిలా.. ఇప్పటిదాకా పేదల ఇళ్లంటే ఎక్కడో ఊరిబయట, అది కూడా ఒకే గదితో కట్టించేవారని... అలా కాకుండా ఆత్మగౌరవంతో బతికేలా ‘డబుల్’ ఇళ్లను నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఒకే గది ఉంటే తల్లులు బట్టలెక్కడ మార్చుకోవాలి, ఇంటికి బంధువులు వస్తే ఎక్కడ పడుకోవాలి.. ఇలాంటి సమస్యలతో బతుకు నరకంగా ఉంటుంది. ఆ బాధలు లేకుండా పేదలు కూడా ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్రూం ఇళ్లకు శ్రీకారం చుట్టాం. పనులెలా జరుగుతున్నాయో చూసేందుకు ఓసారి నేనిక్కడికి వచ్చినప్పుడు సామాన్లు పెట్టుకునేందుకు సదుపాయం లేదని మహిళలు చెప్పిండ్రు. దాంతో అటకలతో ఇళ్లు కట్టాలని సూచించిన. అనుకున్నట్లుగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినం..’’ అని చెప్పారు. 2020 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2020 నాటికి దేశంలో అందరికీ ఇల్లు కల్పించాలనే సంకల్పంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అందులో భాగంగా తెలంగాణకు 83,678 ఇళ్లు మంజూరు చేసిందని.. ఇందుకు రూ. 1,632 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, రామగుండంలను కేంద్రం మురికి వాడల రహిత జాబితాలో చేర్చిందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ మాట ఇస్తే నిలుపుకొంటారనేందుకు నిదర్శనం ఈ గృహనిర్మాణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. పేదల ఆకలి తెలిసిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం 16 నెలల్లోనే రూ. 30 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు, టీవీల కళ్లకు మాత్రం ఇవి కనిపించడం లేవని ఆవేశపూరితంగా చెబుతుండగా... సీఎం కేసీఆర్ వద్దని వారించడంతో ఆ వ్యాఖ్యలను ఆపేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులతో కలసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు.