
సాక్షి, సూర్యాపేట : వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఏర్పాటు, కోర్టు చౌరస్తాకు సంతోష్ బాబు పేరు పెడ్తామని కుటుంబ సభ్యులకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పు డు కార్యరూపం దాల్చబోతోంది. సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహావీర చక్ర, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు విగ్రహాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు.
ఈ విషయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్ర మం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు పేరును నామ కర ణం చేస్తారని తెలిపారు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు పాత జాతీయ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లోని చేపలు, పండ్ల మార్కెట్ బ్లాక్‌లను కూడా ప్రారంభిస్తారని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
చదవండి: ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్
Comments
Please login to add a commentAdd a comment