సాక్షి, అమరావతి: కోవిడ్ దృష్ట్యా సీటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీటీ స్కాన్, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 డాష్ బోర్డులో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, కోవిడ్ రోగుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు.
చదవండి: కరోనా బాధితులను వేధిస్తే సహించం: పెద్దిరెడ్డి
ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్
Comments
Please login to add a commentAdd a comment