CT scan
-
అక్కడ ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్.. భార్యకు భయపడి చెప్పని భర్త.. చివరకు..
టెహ్రాన్: ఇరాన్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి సీటీ స్కాన్ తీసీ అవాక్కయ్యారు వైద్యులు. అతని మలద్వారంలో 19 సెంటీమీటర్ల వాటర్ బాటిల్‌ను గుర్తించి కంగుతిన్నారు. సీటీ స్కాన్ చేసే వరకు ఏం జరిగిందో సదరు వ్యక్తి చెప్పకపోడం చూసి ఆశ్చర్యపోయారు. ఆస్పత్రిలో చేరిన ఈ వ్యక్తి వయస్సు 50 ఏళ్లు. కొద్ది రోజులుగా మలబద్దకం, ఆకలి లేకపోవడం, తిమ్మిరి వంటి లక్షణాలు చూసి ఆందోళనతో ఆయన భార్య హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అయితే ఏం జరిగిందో అతను మాత్రం వైద్యులకు కూడా చెప్పలేదు. పరీక్ష నిర్వహించిన అనంతరం వైద్యులకు అసలు విషయం తెలిసింది. మలద్వారంలో వాటర్ బాటిల్ ఇరుక్కున్న విషయం తన భార్యకు చెబితే రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడే భర్త ఈ విషయాన్ని దాచినట్లు వైద్యులు చెప్పారు. చివరకు మలద్వారం నుంచి వాటర్ బాటిల్‌ను బయటకు తీశారు. మూడు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. అతని పెద్దపేగుకు, ఇతర అవయవాలకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అయితే బాధితుడు స్వయంగా తానే వాటర్ బాటిల్‌ను మలద్వారంలోకి ఇన్సర్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పొరపాటున ఇరుక్కు పోయి ఉంటుందని, లైంగిక సంతృప్తి కోసమే అతను ఇలా చేసి ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం అతడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు పంపారు. చదవండి: (ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్!) -
పరీక్షల్లేవు... మందుల్లేవు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలకు తార్కాణమిది. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆస్పత్రులు సంకట స్థితిలో ఉన్నాయి. పలు విభాగాల్లో సంతృప్తికరస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నా మౌలిక వసతుల లేమి రోగులను వెక్కిరిస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన బాధితులు బిత్తరపోతున్నారు. వైద్య పరికరాలు లేని కారణంగా డాక్టర్లే ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నాలుగు ప్రధాన ఆస్పత్రులు, రెండు డయాగ్నస్టిక్ కేంద్రాలు, 70 డిస్పెన్సరీలున్నాయి. ఇందులో సనత్‌నగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తిగా ఈఎస్ఐసీ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతుండగా.. నాచారం, ఆర్సీపురం, సిర్పూర్–కాగజ్‌నగర్, వరంగల్ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్మిక రాజ్య బీమా విభాగం వైద్యసేవలను పర్యవేక్షిస్తోంది. ఆ ఆస్పత్రి మినహా తక్కిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు గందరగోళంలో పడ్డాయి. పర్యవేక్షణ లోపం, మౌలికవసతుల కల్పన తదితర కారణాలతో ఇక్కడికి వచ్చే బాధితులకు సకాలంలో సరైన వైద్యం అందకప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. ఈ ఆస్పత్రులు విభిన్నం... సాధారణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రులతో ఈఎస్ఐ ఆస్పత్రులను పోల్చలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా ప్రభుత్వ బడ్జెట్‌తో నిర్వహిస్తారు. ఇక్కడ రోగుల నుం చి ఎలాంటి ఫీజులు స్వీకరించరు. కానీ ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్వహణ పూర్తిగా చందాదారుల నుంచి స్వీకరించే ప్రీమియం నుంచే ఖర్చు చేస్తారు. ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు చెల్లించే నెలవారీ చందాతో వీటిని నిర్వహిస్తారు. ఒక్కో ఉద్యోగి నెలకు రూ.100–450 వరకు చందా రూపంలో చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో 20.78 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులు, వీరిపై ఆధారపడ్డవారిని కలిపితే లబ్ధిదారుల సంఖ్య 80 లక్షలు ఉంటుంది. ఓపీ సేవలతో సరి రాష్ట్రంలోని నాలుగు ఈఎస్ఐ ప్రధాన ఆస్పత్రులు కేవలం అవుట్‌పేషెంట్ (ఓపీ) సర్వీసులతోనే సరిపెడుతున్నాయి. జనరల్ డాక్టర్లతోపాటు స్పెషలైజ్డ్ వైద్యులు ఉన్నప్పటికీ సరైన మౌలికవసతులు లేవు. దీంతో వారంతా సాధారణ ఓపీ చెకప్‌కే పరిమితమవుతున్నారు. శస్త్రచికిత్సలు, ఇతర అత్యాధునిక వైద్య సేవలు అవసరముంటే సనత్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రధాన ఆస్పత్రుల్లో సేవలందించే వీలున్నప్పటికీ చిన్నపాటి పరీక్షల కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి రావడం, అటూఇటూ చక్కర్లు కొట్టడం అటు బాధితులకు, వారి వెంట ఉన్న సహాయకులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. జాడలేని సీటీ, ఎంఆర్ఐ సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మినహాయిస్తే ప్రధాన ఆస్పత్రుల్లో ఎక్కడా ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఇకో యంత్రాలు లేవు. ఆ సేవల కోసం సనత్‌నగర్‌కు పరుగులు పెట్టాల్సిందే. దీంతో ప్రధాన ఆస్పత్రుల నుంచి రోగులు పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్తుండగా... అక్కడ ఒత్తిడి తీవ్రం కావడంతో స్కానింగ్ తీసుకునేందుకు రోజు ల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. పారిశ్రామికవాడలు, వాణిజ్య సముదాయాల మధ్య ఉన్న నాచారం, ఆర్సీపురం ఆస్పత్రుల్లో సేవలు కాస్త మెరుగ్గానే ఉన్నా.. సిర్పూర్–కాగజ్‌నగర్, వరంగల్ ఆస్పత్రుల్లో సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఈ రెండిట్లో కనీసం ఎక్స్‌రే యంత్రాలు కూడా లేవు. వరంగల్‌లో కొన్ని రక్త పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా, సిర్పూర్–కాగజ్‌నగర్‌లో అది కూడా లేదు. ప్రైవేటు ల్యాబ్‌లో చేయించిన రిపోర్టులను అక్కడి డాక్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో రెండిట్లో 95 శాతం బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఒక రకంగా ఇక్కడ ఐపీ సేవలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. వస్తారు... వెళ్తారు వరంగల్, సిర్పూర్–కాగజ్‌నగర్ ఆస్పత్రుల్లో ఐపీ సేవలు నిలిచిపోవడంతో అక్కడ వైద్యులు, సిబ్బంది విధులను మొక్కుబడిగా నిర్వర్తిస్తున్నారు. గంట, రెండు గంటల పాటు కాలక్షేపం చేసి ఇంటికెళ్తున్నారు. ఇక్కడ మెజార్టీ వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టే వైద్యులు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అటకెక్కిన పర్యవేక్షణ ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పర్యవేక్షణ గాడితప్పింది. ఆకస్మిక తనిఖీలు, పర్యవేక్షణ నిర్వహించేందుకు రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్, సంయుక్త సంచాలకుల పాత్ర కీలకం. అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్లు సైతం తమ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలి. కానీ కొన్నేళ్లుగా ఇలాంటి పర్యవేక్షణలు మచ్చుకైనా లేవు. దీంతో వైద్యు లు, సిబ్బంది హాజరు ఇష్టారాజ్యంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా రోజుల తరబడి సెలవులు పెట్టడం, వాటిని రెన్యువల్ చేసుకోవడంలాంటి తంతు ఏళ్లుగా జరుగుతోంది. డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్) విభాగాధిపతి హోదాలో రెండున్నరేళ్లుగా ఇన్చార్జ్ అధికారి ఉన్నందునే ఈ పరిస్థితి వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఎం.ప్రవీణ్‌కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీకి చెందిన బీపీఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు. డస్ట్ ఎలర్జీతో బాధపడుతూ ఆస్తమా బారిన పడ్డాడు. సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ ఖర్చుకు భయపడి వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రికెళ్లాడు. వైద్యుడు మాత్రలు రాయడంతోపాటు చెస్ట్ ఎక్స్‌రే, స్కానింగ్ తీయించాలని సూచించారు. కానీ అక్కడ ఈ రెండు వసతులు లేవు. దీంతో వాటికోసం ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్‌కు పరుగుపెట్టాడు. అన్నిరకాల సేవలు దొరుకుతాయని భావించి 180 కి.మీ. దూరం నుంచి వచ్చిన ఆయనకు నిరాశ తప్పలేదు. 11 గంటలైనా తాళాలు తీయలే వరంగల్ ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారిని హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర పరికరాలు లేకపోవడంతో రోగులు తిప్పలు పడుతున్నారు. వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉదయం 11 గంటలు అయినా డాక్టర్ రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీ శుక్రవారం ఈ ఆస్పత్రిని ‘సాక్షి’విజిట్ చేయగా ఉదయం 11 గంటలకు కూడా పిల్లలు, ఆర్థోపెడిక్ విభాగాల తాళం కూడా తీయలేదు. గైనకాలజిస్టు, డెంటిస్టు, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య బాగా తగ్గిందని సిబ్బంది చెబుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. నిజామాబాద్‌కు చెందిన ఇతని పేరు నాగభూషణం. ఇతనికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రతి నెలా మందుల కోసం నిజామాబాద్ న్యాల్కల్ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రికి వస్తుంటారు. వైద్యులు రాసిన పది రకాల మందుల కోసం ప్రిస్కిప్షన్ తీసుకుని ఇక్కడకు వస్తే ఏ ఒక్క మాత్ర ఉండడం లేదు. వారం రోజులుగా తిరుగుతున్నప్పటికీ ఇవ్వడం లేదు. బయట మాత్రలు కొనుగోలు చేసే స్తోమత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చులు తడిసిమోపెడు నేను కొన్నేళ్లుగా నరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నా. తూప్రాన్ డిస్పెన్సరీ వైద్యుల సూచనతో ఆర్సీపురం ఆస్పత్రికి వచ్చాను. అయితే ఎంఆర్ఐ, సీటీ స్కాన్ అందుబాటులో లేవని డాక్టర్లు చెప్పారు. దీంతో సనత్‌నగర్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాను. ఆయా రిపోర్టులను తిరిగి ఆర్సీపురం వైద్యులకు చూపించి మందులు రాయించుకున్నా. దీనికోసం ఆరేడుసార్లు తిరిగాను. ప్రయాణ ఖర్చులు సైతం తడిసి మోపెడవుతున్నాయి. – సత్యనారాయణ, తూప్రాన్ -
మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!
ఈజిప్ట్ మమ్మిలు గురించి మనం కథలు కథలుగా విన్నాం. సినిమాల్లో చూశాం. అయితే శాస్త్రవేత్తలు వాటి గురించి పరిశోధనలు చేయాలంటే కచ్చితంగా చేతులతో తాకక తప్పదు. పైగా వాటిని ప్రత్యేక ద్రావణాలతో పూసి చుట్టేవారు. దీంతో వారికి ఇదంతా చాలా శ్రమతో కూడిన పనిగా ఉండేది. ఇక ఆ సమస్య ఉండదంటున్నారు. పైగా మమ్మీలను టచ్ చేయకుండానే సరికొత్త సాంకేతికత కొత్త మమ్మీఫికేషన్(మమ్మీల పుట్టు పూర్వోత్తరాలు) పద్ధతులను కనుగొన్నారు. (చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్లో ‘హలో వరల్డ్’ ట్వీట్! ఎలాగంటే..) అసలు విషయంలోకెళ్లితే.... 1881లో కనుగొన్న ఈజిప్ ప్రఖ్యాత ఫారో అమెన్హోటెప్ I మమ్మీ చరిత్రను డిజిటల్ సాంకేతికత సాయంతో దాని రహస్యలను చేధించారు. అంతేకాదు ఆ మమ్మీ సమాధికి ఎలాంటి భంగం కలిగించకుండా అధునాతన డిజిటల్ త్రీడీ ఇమేజరీ సాయంతో పరిశోధకులు కొత్త మమ్మీఫికేషన్ పద్ధతులను కనుగొన్నారు. పైగా కైరో యూనివర్శిటీలో రేడియాలజీ ప్రొఫెసర్ సహర్ సలీమ్, ప్రసిద్ధ ఈజిప్టు శాస్త్రవేత్త జాహి హవాస్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఈ మేరకు ప్రొఫెసర్ సలీమ్, హవాస్ మమ్మీని అమెన్హోటెప్ I మమ్మీని అధునాతన ఎక్స్-రే టెక్నాలజీ సీటీ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కానింగ్ చేసి తాకాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో డిజిటల్‌గా మార్చే అధునాతన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించారు. ఈ పరిశోధనలో తొలిసారిగా రాజు అమెన్హోటెప్ I ముఖం, వయసు,ఆరోగ్య పరిస్థితి సంబంధించిన మమ్మిఫికేషన్ రహస్యలను వెల్లడించింది. అంతేకాదు ఆయుధాలతో మమ్మీగా చేయబడిన మొదటి ఫారో అమెన్హోటెప్ I అని పేర్కొంది. పైగా అతని మెదడు పుర్రె నుండి తొలగించలేదని తెలిపింది. పైగా ఈ మమ్మీ క్రీస్తూ పూర్వం 1500ల క్రితం నాటిదని, తన 21 సంవత్సరాల పాలనలో అనేక సైనిక ప్రచారాలను నిర్వహించిన ఫారో, 35 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో మరణించినట్లు వెల్లడించింది. (చదవండి: లైవ్‌లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!) -
సీటీ స్కాన్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం: నవ్వుతూ వెళ్లి.. శవమై వచ్చాడు
లక్నో: సీటీ స్కాన్ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. యూపీ ధనౌలి ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తి కుమారుడు దివ్యాంష్(3) నాలుగు రోజుల క్రితం ఇంటి మేడ మీద ఆడుకుంటూ.. కింద పడిపోయాడు. ఈ క్రమంలో చిన్నారిని నామ్నిర్ ఎస్ఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దివ్యాంష్‌ను పరీక్షించిన వైద్యులు.. చిన్నారికి సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. ఈ క్రమంలో దివ్యాంష్ తల్లిదండ్రులు బాలుడిని సుభాష్ పార్క్ ప్రాంతంలో ఉన్న అగర్వాల్ సీటీ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. సీటీ స్కాన్ చేయడానికి ముందు దివ్యాంష్‌కు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం చిన్నారికి స్కాన్ చేశారు. అప్పటి వరకు బాగానే ఉన్న దివ్యాంష్.. స్కాన్ అనంతరం మృత్యువాత పడ్డాడు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు దివ్యాంష్ మృతి చెందాడని తెలిపారు. సీటీ స్కాన్ సెంటర్లోనే ఏదో తేడా జరిగిందని.. దివ్యాంష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. జరిగిన విషయం గురించి బంధువులకు సమాచారం ఇచ్చారు. (చదవండి: అలర్ట్: సీటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశం..) అనంతరం చిన్నారి మృతదేహంతో సీటీ స్కాన్ సెంటర్ వద్దకు వెళ్లగా.. అప్పటికే దానికి తాళం వేసి ఉంది. ఈ క్రమంలో చిన్నారి మృతదేహంతో సీటీ స్కాన్ సెంటర్ బయట కూర్చుని ఆందోళన చేపట్టారు దివ్యాంష్ బంధువులు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. అగర్వాల్ సీటీ స్కాన్ సెంటర్ నిర్వహకులు, సిబ్బంది మీద కేసు నమోదు చేశారు. చదవండి: యూపీ+యోగి = ఉపయోగి.. సీఎంపై ప్రధాని చమత్కారాలు ! -
అపెండిక్స్‌కు క్యాన్సర్ వస్తుందా!
మన చిన్న పేగులూ, పెద్దపేగు కలిసే జంక్షన్లో అపెండిక్స్ అనే చిన్న తోక లాంటిది ఉంటుంది. అన్ని అవయవాల మాదిరిగానే దీనికీ క్యాన్సర్ సోకుతుంది. అయితే ఇది చాలా అరుదు. ఇలాంటి క్యాన్సర్ వచ్చినవారితో పాటు మరికొన్ని గడ్డల వల్ల పొట్టకుహరంలో మ్యూసిన్ అనే స్రావాలు స్రవిస్తాయి. ఈ కండిషన్‌ను ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అన్ని క్యాన్సర్లలాగే ఇది కూడా కడుపు లేదా దాని పరిసరాల్లో ఉండే ఇతర ప్రాంతాలకూ, అవయవాలకూ విస్తరిస్తుంది. సీటీ స్కాన్ వంటి పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. దీని లక్షణాలు అంత త్వరగా బయటపడవు. దాంతో వ్యాధి నిర్ధారణ చాలా ఆలస్యమవుతుంది. దాంతో అపెండిక్స్ క్యాన్సర్ రోగుల్లో చాలామంది మృతువు బారిన పడుతుంటారు. త్వరగా గుర్తిస్తే అన్ని క్యాన్సర్లలాగే దీనికీ చికిత్స చేయవచ్చు. చికిత్స ఒకింత కష్టమే అయినప్పటికీ... ప్రస్తుతం దీనికి ‘హైపెక్’ అనే అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది. హైపర్ థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అనే ప్రక్రియకు సంక్షిప్తరూపమే ఈ ‘హైపెక్’. ఇందులో ఉదరభాగంలోని పెరిటోనియమ్ (ఒక పొరలాంటి తొడుగు)ను మొత్తం తొలగించి, ఓ నిర్దిష్టమైన ఉష్ణోగ్రత (42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్) వద్ద కీమోథెరపీ మందునంతా ఆ భాగంలో సమంగా విస్తరించేలా చేస్తారు. ఇలా 60 నుంచి 90 నిమిషాల పాటు చేయడం ద్వారా ఈ సూడో మిక్సోమా పెరిటోనీ తిరగబెట్టడాన్ని చాలాకాలం పాటు వాయిదా వేయవచ్చు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
మీ సేవలకు అభినందనలు
అధికారులందరికీ ఒక విజ్ఞప్తి. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనే ఒత్తిడిలో ఉన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డు బాయ్‌లు, శానిటేషన్ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు పగలు.. రాత్రి కష్టపడుతున్నారు. చాలా బాగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ అభినందనలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధనాస్పత్రుల్లో రూ.67 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్లు, ఎంఆర్ఐ పరికరాలను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రోజూ 20 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, మన దగ్గర టయర్–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉందని చెప్పారు. మీరంతా (వైద్యులు, వైద్య సిబ్బంది) ఆస్పత్రుల్లో బా«ధ్యత తీసుకోవడమే కాకుండా, ఎంతో ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్‌ను ఎదుర్కోగలుగుతున్నామని అభినందించారు. అయితే ఫీవర్ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, ఈ దృష్ట్యా అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు ► ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. అన్ని బోధనాస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సదుపాయాలు కల్పించి ఆరోగ్య శ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించనున్నాం. డయాగ్నస్టిక్ పరికరాల నిర్వహణ బాధ్యత ఆరోగ్య శ్రీ ట్రస్టుకు అప్పగిస్తాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పార్లమెంటు నియోజవర్గంలో ఒక బోధనాస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ► ఈ రోజు రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రుల్లో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రేడేషన్ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆస్పత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము. ► ఇవాళ రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్ఐ పరికరాలను ప్రారంభించాం. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. కొత్త ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు ► కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 టీచింగ్ ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము. ► టీచింగ్ ఆస్పత్రుల్లో సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్
-
Harish Rao: సీటీ స్కాన్‌కు రూ.2 వేలే తీస్కోవాలి
మెదక్ జోన్: కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం సీటీస్కాన్ నిర్వాహణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని, సీటీస్కాన్‌కు రూ.5 వేల వరకు వసూలు చేస్తునట్లు తన దృష్టికి వచ్చిందని కేవలం రూ.2 వేలు మాత్రమే తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 3 మాత్రమే సీటీస్కాన్లు ఉన్నాయని అందులో 2 మెదక్‌లో ఉండగా 1 మాత్రమే తూప్రాన్‌లో ఉందని చెప్పారు. కొత్తగా ఎవరు సీటీస్కాన్ నిర్వహణకు అనుమతి అడిగినా వారికి ఇవ్వాలని చెప్పారు. అలాగే జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉందని, వ్యాక్సిన్, ఆక్సిజన్, లాక్డౌన్ తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్యాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: కరోనా వ్యాక్సిన్: టీకా వేయించుకుంటే రూ.7 కోట్లు మీవే.. చదవండి: కంగారొద్దు: తెలంగాణలో రెమిడిసివిర్ కొరత లేదు -
సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదనలను ఖండించిన ఐఆర్‌ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ లేదా సీటీ స్కాన్లు చాలా హానికరం అన్న ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా వ్యాఖ్యలపై ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ స్పందించింది. ఒక్క సీటీ స్కాన్ 300-400ఎక్స్-రేలకు సమానమని, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్న వాదనలు చాలా ఔట్ డేటెడ్ సిద్ధాంతమని అసోసియేషన్ కొట్టి పారేసింది. ఈ వాదన 30-40 సంవత్సరాల క్రితం నాటిదని ఐఆర్‌ఐఏ పేర్కొంది 5-10 ఎక్స్-కిరణాలతో పోల్చదగిన రేడియేషన్‌ను విడుదల చేసే అత్యాధునిక స్కానర్లు ఇపుడు అందుబాటులోకి వచ్చాయంటూ గులేరియా వ్యాఖ్యలను అసోసియేషన్ ఖండించింది. గులేరియా వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవి, బాధ్యతా రహితమైనంటూ అసోసియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి. అమర్నాథ్ సంతకంతో ఒక ప్రకటన విడుదల చేసింది. సిటీ ఛాతీ స్కాన్ క్యాన్సర్‌కు కారణమవుతుందనే ప్రకటన ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియాలజిస్టులు అలారా (ఏఎల్‌ఏఆర్‌ఏ: సహేతుకంగా సాధించగలిగినంత తక్కువ) సూత్రాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. దీన్నుంచి వచ్చే రేడియేషన్ ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి గురయ్యే రేడియేషన్‌కు సమానమని కూడా తెలిపింది. (అలర్ట్: సీటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశం..) కోవిడ్ సోకిన వారు వివిధ రకాల లక్షణాలతో బాధపడుతున్నారనీ, తక్కువ వైరల్ లోడ్ కారణంగా, ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ వచ్చినా, ఊపిరితిత్తులు కొందరిలో పాడైపోతున్నాయని, ఇలాంటి సమయంలో సిటీ స్కాన్ అవసరం చాలా ఉందని పేర్కొంది. అంతేకాదు ప్రారంభ దశలో ఊపిరితిత్తుల పనితీరును గుర్తించే పల్స్ ఆక్సీమీటర్ కంటే సీటీ స్కాన్లు అత్యంత సున్నితమైనవి ఐఆర్ఐఎ తెలిపింది. ముఖ్యంగా కరోనా సెకండ్‌వేవ్‌లో యువకులు హ్యాపీ హైపోక్సియా (ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం) తోబాధపడుతున్నారని ఈక్రమంలో ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, రోగిని కాపాడటం అంత సులభమని వెల్లడించింది. తద్వారా వ్యాధి తీవ్రతను ముందస్తుగా గుర్తించడంతోపాటు, తొందరగా చికిత్సను ప్రారంభించడానికి సహాయపడుతుందని తెలిపింది.అలాగే వారు సూపర్-స్ప్రెడర్లు కాకుండా నిరోధించగల. సిటీ స్కాన్ ద్వారా బాధితులు ఆసుపత్రిలో చేరాలా, లేదా ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందితే సరిపోతుందా అనేది తెలుసుకోవచ్చు. వైరస్ తీవ్రతను, అతి విస్తరిస్తున్న తీరును పర్యవేక్షించవచ్చు, ముఖ్యంగా తీవ్ర లక్షణాలున్నవారిలో సిటీ స్కాన్ పాత్ర అనూహ్యం. సరైన సమయంలో స్టెరాయిడ్లను ప్రారంభించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపింది. అలాగే ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత లాంటి సంక్షోభంనుంచి బయటపడవచ్చని స్పష్టం చేసింది. (కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు) కాగా ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలతో సమానమని, దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించారు. అవసరమైతే తప్ప సీటీ స్కాన్ల జోలికి వెళ్లొద్దని సూచించిన సంగతి తెలిసిందే. -
అలర్ట్: సీటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశం..
న్యూఢిల్లీ: కోవిడ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో చాలామంది కరోనా అనుమానంతో లక్షణాలు లేకపోయినప్పటికి సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. కరోనా లక్షణాలు లేని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అన్నారు. ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సీటీ స్కాన్ చేయించుకోవాలి అని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోవచ్చన్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని గులేరియా తెలిపారు. చదవండి: కరోనా వేళ.. గుంపులుగా జనాలు -
కరోనా వైద్యపరీక్షలు.. వివరాలు
ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇందుకోసం కోవిడ్ వ్యాధి నిర్ధారణకు రకరకాల పరీక్షలు అవసరమవుతున్నాయి. దాంతో కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్న వారంతా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లూ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, సీటీ స్కాన్ వంటి రకరకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఏయే పరీక్షలు ఎందుకు ఉపయోగపడతాయో, వాటిని ఏ సమయంలో చేయించాలో తెలుసుకోవడంతో పాటు... ఆయా పరీక్షల ప్రత్యేకతలు, ప్రాధాన్యాలు... అవి మాత్రమే తెలియజేసే కొన్ని ప్రత్యేకమైన సంగతులు, కొన్ని వైద్య పరీక్షలలోని స్కోర్లు, ఆ అంకెలతో తెలిసివచ్చే వివరాలూ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఉపయోగపడేదే ఈ సమగ్ర కథనం. తొలుత ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ గురించి... కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఇది చాలా త్వరగా నిర్వహించగలిగిన వైద్య పరీక్ష. పరీక్ష ఫలితాలూ వేగంగా వస్తాయి. ఫలితాలు కొన్నిసార్లు నెగెటివ్ సూచించినా... రోగిలో మాత్రం లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అంటే ఫాల్స్ నెగెటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతో ఫలితాల కోణంలో చూసినప్పుడు ఇది పూర్తిగా ఆధారపడదగిన పరీక్ష కాకపోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ గురించి... రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్‌కు సంక్షిప్తరూపమే ‘ఆర్టీపీసీఆర్’ పరీక్ష. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఆర్టీపీసీఆర్ ఫలితాలు 48 – 72 గంటలు కూడా పడుతున్నాయి. సీటీ స్కాన్ ఇటీవల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పరీక్షల కంటే సీటీ స్కాన్‌ను ఎక్కువగా డాక్టర్లు విశ్వసిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఓ వ్యక్తికి కరోనా ఇన్ఫెక్షన్ సోకాక లక్షణాలు ఏవీ లేకుండా వ్యాధి దానంతట అదే తగ్గిపోతే అతడికి దాదాపుగా ఎలాంటి ప్రమాదమూ ఉండకపోవచ్చు. కానీ ఒక్కోసారి రోగిలో ఏ లక్షణాలూ బయటకు కనిపించకపోయినా... ప్రాథమిక పరీక్షలు అనదగిన ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్లలో నెగెటివ్, (ఒక్కోసారి పాజిటివ్) వచ్చినా... ఊపిరితిత్తుల్లో వ్యాధి కరోనా వైరస్ కారణంగా వచ్చిన కోవిడ్–19 యేనా, కాదా అన్న విషయం ఇదమిత్థంగా తెలియకపోవచ్చు. వ్యాధి ఒకవేళ ఊపిరితిత్తులను ప్రభావితం చేసినట్లయితే అందులోని కోరాడ్ స్కోర్‌ను బట్టి అది కరోనా వైరస్ కారణంగా వచ్చిన వ్యాధియేనా... కాదా అన్నది డాక్టర్లు తెలుసుకుంటారు. అలా కోవిడ్‌ను నిర్ధారణ చేసే సీటీస్కాన్ పరీక్ష గురించి విపులంగా తెలుసుకుందాం. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అనే మాటకు సంక్షిప్తరూపమే సీటీ స్కాన్. ఈ పరీక్షలో రేడియేషన్ సహాయంతో ఛాతీని పూర్తిగా స్కాన్ చేస్తారు. ఛాతీలో ఏవిధమైన సమస్య ఉన్నా సులువుగా తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణకు ఎక్స్–రే కన్నా ఎన్నో రెట్లు వివరంగా తెలిపే సామర్థ్యం సీటీ స్కాన్ పరీక్షకు ఉంది. కరోనా వచ్చినవాళ్లకు సీటీ స్కాన్ ఎప్పుడు? కరోనా వచ్చిన వాళ్లకు సీటీ స్కాన్ ఎప్పుడు చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం. వైద్య విషయాలపై విపరీతంగా పెరిగిపోయిన శ్రద్ధతో... వైద్య నిపుణులు సూచించకపోయినప్పటికీ ఇటీవల చాలామంది లక్షణాలు కనిపించిన మొదటిరోజే... తమంతట తామే నిర్ణయం తీసుకుని సీటీస్కాన్ చేయించుకుంటున్నారు. అలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. కరోనా వచ్చిన మొదటిరోజునే వ్యాధి ఊపిరితిత్తుల్లోకి చేరదు. వ్యాధి ఊపిరితిత్తుల్లోకి చేరడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధి పడుతుంది. వ్యాధి కొంతమందిలో అసలు ఊపిరితిత్తుల వరకు కూడా చేరదు. అందుకే కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైన తర్వాత ఐదు రోజుల వరకు లక్షణాలు తగ్గకుండా అలాగే కొనసాగుతున్నప్పుడు మాత్రమే సీటీ స్కాన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు రావడం, ఆయాసం రావడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతే... ఇక సీటీ స్కాన్ చేయించాల్సిన అవసరమే ఉండదు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత కూడా కొనసాగితే అప్పుడు తప్పక సీటీ స్కాన్ చేయించుకుని, డాక్టర్‌కు చూపాలి. వాసన, రుచి తెలియకపోయినా పర్లేదు. ఆ లక్షణాల కోసం మాత్రం సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యే విషయం ఏమిటంటే... లక్షణాలు తగ్గకుండా కొనసాగుతున్న సందర్భాల్లో... అవి మొదలైన ఐదో రోజు తర్వాత సీటీ స్కాన్ చేయించుకోవాలన్నమాట. వ్యాధి తీవ్రత తెలిసేదెలా? మరి వ్యాధి తీవ్రత ఇంత ఉందంటూ చెప్పడానికి సీటీ స్కాన్‌తో అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉందనే సమాధానమే వస్తుంది. అయితే వ్యాధి తీవ్రతను చెప్పడానికి సీటీ స్కాన్‌లో వేరే విధానాన్ని అవలంబిస్తారు. దీన్ని సీటీ సివియారిటీ స్కోర్‌గా పిలుస్తారు. ఇది రెండు సిస్టమ్స్‌లో ఉంటుంది. ఒక సిస్టమ్‌లో ఊపిరితిత్తులను 5 భాగాలుగా పరిగణించి రిపోర్ట్ ఇస్తారు. ఇంకో సిస్టమ్‌లో ఊపిరితిత్తులను 20 భాగాలుగా విభజించి, స్కోర్ ఇస్తారు. మొదటి సిస్టమ్‌లో మొత్తం స్కోరు గరిష్టంగా 25 భాగాలు ఉంటుంది. దాంతో రోగి తీవ్రతను బట్టి 1/25 మొదలుకొని 25/25 వరకు స్కోర్ ఇస్తూ వ్యాధి తీవ్రతను సూచిస్తారు. ఇక రెండో సిస్టమ్‌లో మొత్తం స్కోరు 40 ఉంటుంది. కాబట్టి పేషెంట్ రిపోర్ట్ 1/40 నుంచి మొదలుకొని తీవ్రత ఆధారంగా 40/40 వరకు ఇచ్చే అవకాశం ఉంది. సివియారిటీ (తీవ్రత) తెలిపే స్కోరే కీలకం సీటీస్కాన్ రిపోర్టులో అత్యంత కీలకమైన భాగమే ఈ ‘సీటీ సివియారిటీ స్కోరు’. సీటీ సివియారిటీ స్కోరు అధికంగా ఉన్నట్లయితే జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా సీటీ సివియారిటీ స్కోర్ తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే జబ్బు తీవ్రత తక్కువగా ఉన్నట్లు అవగతమవుతుంది. కొన్ని రిపోర్టులలో సీటీ సివియారిటీ స్కోర్‌కు బదులుగా ఊపిరితిత్తులు ఎంత శాతం ఇన్ఫెక్ట్ అయ్యాయనే విషయాన్ని రిపోర్ట్ చేస్తారు. ఇది కూడా వ్యాధి తీవ్రతను సూచించే కీలకమైన అంశమే. ఇదే సీటీస్కాన్లోని కోవిడ్ రిపోర్ట్స్‌లో ‘సీటీ’ అనే మరో నంబరు కూడా మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. అయితే ఇది సీటీ స్కాన్‌లో కాకుండా ఆర్టీపీసీఆర్ రిపోర్టులో కనిపిస్తుంది. ‘సీటీ’ అంటే ‘సైకిల్ థ్రెషోల్డ్’ అని అర్థం. సైకిల్ థ్రెషోల్డ్ గురించి తెలుసుకోవాలంటే ముదుగా మనం ఆర్టీపీసీఆర్ ఏవిధంగా చేస్తారు అనేది తెలుసుకోవాలి. ఆర్టీపీసీఆర్ ఎలా చేస్తారంటే... ఆర్టీపీసీఆర్ అనే పరీక్షలో గొంతులోనుంచి తీసిన స్వాబ్ (ఒక రకంగా చెప్పాలంటే అక్కడి శాంపిల్) నుంచి వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ ను విడదీస్తారు. ఈ ఆర్ఎన్ఏ ని ఉత్ప్రేరకాల సహాయంతో మరింతగా విస్తరించేలా (ఆంప్లిఫికేషన్) చేస్తారు. ఈ ఆంప్లిఫికేషన్ అనేది సైకిల్స్ (పరిభ్రమణాల)లో ఉంటుంది. ఎన్ని పరిభ్రమణాల (సైకిల్స్) తర్వాత ఈ వైరస్‌ను గుర్తిస్తున్నామో... ఆ నంబరును ‘సైకిల్ థ్రెషోల్డ్’ అంటారు. అంటే... కేవలం తక్కువ పరిభ్రమణాల తర్వాతనే వైరస్ కనబడినట్లయితే... వైరస్ దేహంలో చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అర్థం. అలా కాకుండా చాలా ఎక్కువ భ్రమణాల (సైకిల్స్) తర్వాత వైరస్ కనిపిస్తే... దాని మోతాదు దేహంలో చాలా తక్కువ గా ఉందని అర్థం. ఇక 35 భ్రమణాల తర్వాత కూడా వైరస్ ను కనుగొనకపోతే అప్పుడు దేహంలో వైరస్ లేదని అర్థం. అలాంటి సందర్భాల్లో ఫలితం ‘నెగిటివ్’ వచ్చినట్లుగా చెప్పవచ్చు. కేవలం 25 సైకిల్స్ కంటే తక్కువ ఆంప్లిఫికేషన్స్తో వైరస్ కనబడట్లుగా అయితే ఎక్కువ మోతాదులో దేహంలో వైరస్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) మార్గదర్శకాల ప్రకారం సైకిల్ థ్రెషోల్డ్స్ను వ్యాధి నిర్ధారణకు ఉపయోగించుకోవాలి తప్ప... వ్యాధి తీవ్రత ను నిర్ధారణ చేయడానికి కాదు. ఎందుకంటే ఈ సైకిల్ థ్రెషోల్డ్ వల్ల మనకు తెలుస్తున్న వ్యాధి తీవ్రతకూ... నిజానికి రోగిలో కనిపించే తీవ్రతకూ (క్లినికల్ మానిఫెస్టేషన్స్)కూ సంబంధం ఉండటం లేదు. అందుకే తీవ్రత సూచించడానికి దీన్ని పరిగణనలోకి తీసుకోకూడదంటోంది ఐసీఎమ్ఆర్. ఇటీ కరోనా వైరస్ కారణంగా వచ్చే కోవిడ్–19 వ్యాధిని నిర్ధారణ చేయడానికి ఉపయోగిస్తున్న వైద్య పరీక్షలపై స్థూలంగా అవగాహన కల్పించుకోడానికి ఉపయోగపడే అంశాలు. వీటిని కేవలం మన అవగాహన కోసం చదివి తెలుసుకోవాలి తప్ప... వీటి ఆధారంగా సాధారణ ప్రజలు విశ్లేషణలు చేయడం సరికాదు. ఎందుకంటే వైద్యులు ఆ పని కోసం సాధారణ ప్రజల (లే మెన్)కు తెలియని మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీటీ స్కాన్‌లో కనిపించే నంబర్లు... వాటి ప్రాధాన్యత సీటీస్కాన్ రిపోర్టులో మనకు రెండు రకాల నంబర్లు కనిపిస్తాయి. మొదటి నంబరు కోరాడ్ నంబరు. అంటే ‘కోవిడ్–19 రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్’ అనే మాటకు ఇది సంక్షిప్త రూపం అన్నమాట. ఈ నంబరు సహాయంతో కోవిడ్ ఉందా లేదా అని చెప్పడానికి ప్రయత్నం చేయడం సాధ్యమవుతుంది. అయితే కోవిడ్ తీవ్రతను ఈ నంబరు సూచించదు. ఈ కోరాడ్ సిస్టమ్‌లో మనకు 0 నుంచి 6 వరకు అంకెలు కనబడతాయి. అవి వేటిని సూచిస్తాయో వివరంగా చూద్దాం. ►కోరాడ్ – 0 అంటే స్కాన్ సరిగా రాలేదని అర్థం. అంటే సాంకేతిక సమస్య వల్ల స్కాన్ సరిగా రాలేదని మనకు తెలుస్తుంది. ►కోరాడ్ – 1 అంటే స్కాన్ సరిగా వచ్చింది. కానీ అది కోవిడ్ ఖచ్చితంగా కాదు. అంటే ఊపిరితిత్తుల్లో ఏ విధమైన ఇన్ఫెక్షన్ లేదు అనడానికి సూచన. కేవలం కరోనా వైరస్ మాత్రకాదు.. మిగతా ఏ రకమైన వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేవు అని అర్థం. ►కోరాడ్ – 2 అంటే అంటే స్కాన్‌లో కోవిడ్ జబ్బు ఉండే అవకాశం చాలా తక్కువ అని అర్థం. అయితే ఈ కేటగిరీలో వేరే ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుల్లో ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు బ్రాంకైటిస్ లేదా బ్రాంకో నిమోనియా లాంటివి ఉండే అవకాశం ఉందనడానికి సూచన. ►కోరాడ్ – 3 అంటే అది కోవిడ్ అయితే కావచ్చు లేదా కాకపోవచ్చు కూడా. ►కోరాడ్ – 4 అంటే కోవిడ్ అయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఇంకా కొన్ని వేరై వైరల్ నిమోనియా కూడా అయి ఉండవచ్చేమో అనేదానికి ఇది సూచన. ►కోరాడ్ – 5 అంటే ఇది దాదాపుగా కచ్చితంగా కోవిడ్–19 తాలూకు నిమోనియానే కావచ్చనేందుకు సూచన. ►కోరాడ్ – 6 అంటే సీటీ స్కాన్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ పూర్తిగా పాజిటివ్ అని అర్థం. అంటే ఈ కోరాడ్ –6 కేటగిరీ ప్రకారం అది పూర్తిగా కోవిడ్ అవునా, కాదా అని చెప్పడానికి వీలవుతుంది. అంతే తప్ప అది కోవిడ్ తీవ్రతకు సూచన కానే కాదు. ►అందుకే కోరాడ్స్ క్యాటగిరీ – 5 ఉంది కాబట్టి అడ్మిట్ చేస్తున్నాం అని చెప్పడం సరికాదు. ఇది కోవిడ్ డయాగ్నసిస్ (వ్యాధి నిర్ధారణకు) సూచనే తప్ప... వ్యాధి తీవ్రతకు సూచన కానేకాదన్న విషయం తెలుసుకోవాలి. ►వ్యాధి తీవ్రతను సూచించేందుకు ఈ కోరాడ్ అనే విధానం ఎంతమాత్రమూ సరిపోదు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
కరోనా: ఏపీ సర్కార్ ప్రత్యేక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: కోవిడ్ దృష్ట్యా సీటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీటీ స్కాన్, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 డాష్ బోర్డులో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కోవిడ్ రోగుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు. చదవండి: కరోనా బాధితులను వేధిస్తే సహించం: పెద్దిరెడ్డి ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్ -
యశోద ఆస్పత్రికి కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్ సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్‌కు 6 రకాల వైద్య పరీక్షలు చేశారు యశోదా వైద్యులు. సీ-రియాక్టివ్ ప్రొటిన్స్ (సీఆర్పీ), చెస్ట్ సీటి స్కాన్..డీడైమర్, ఇంటర్ ల్యుకిన్ (ఐల్-6), లివర్ ఫంక్షన్ టెస్(ఎల్.ఎఫ్.టి)కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ) పరీక్షల చేశారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. కేసీఆర్ వస్తుండటంతో సోమాజిగూడ ఆస్పత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి చుట్టు పక్కల హై అలర్ట్ ప్రకటించారు. కరోనా పాజిటివ్ అనంతరం కేసీఆర్ మొదటిసారి ఆసుపత్రికి వచ్చారు. ఇక కేసీఆర్ ఆస్పత్రికి వస్తుండటంతో కేటీఆర్ ముందుగానే అక్కడకు చేరుకున్నారు. కరోనా నిర్థారణ అయిన తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 14వ తేదీన సాగర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నోముల భగత్‌కు మద్దతుగా హాలియాలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. కాగా, నోముల భగత్‌కు, ఆయన కుటుంబానికి కూడా కరోనా సోకిన సంగతి విధితమే. చదవండి: కేసీఆర్‌ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్‌బాబు -
రెండోసారి కూడా నెగెటివ్ వస్తే.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: కరోనా లక్షణాలున్న వారికి నిజంగా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఈ టెస్టుల్లో కొన్నిసార్లు తప్పుడు ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఫలితం మాత్రం నెగటివ్ అని చూపుతోందని అంటున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో 80 శాతం సరైన ఫలితమే వస్తోంది. మిగతా 20 శాతం తప్పుడు ఫలితం రావడం ఆందోళనకరమే. కరోనా బారినపడినప్పటికీ నెగటివ్ అని వస్తే సదరు బాధితులు చికిత్సకు దూరంగా ఉండే అవకావం ఉంది. అది చివరకు ప్రాణాంతకంగా మారొచ్చు. కాబట్టి కరోనా లక్షణాలు కొనసాగుతుండగా ఆర్టీ–పీసీఆర్ టెస్టులో నెగటివ్ వస్తే 24 గంటల తర్వాత మరోసారి అదే టెస్టు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండోసారి కూడా నెగటివ్ వస్తే సీటీ స్కాన్/చెస్ట్ ఎక్స్–రే తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు. కరోనా సోకినప్పటికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్‌గా రావడానికి పలు కారణాలున్నాయి. నమూనాను(శాంపిల్) సక్రమంగా సేకరించకపోవడం, అందులో వైరల్ లోడ్ తక్కువగా ఉండగానే త్వరగా పరీక్ష చేయడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు. అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లను కూడా ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో గుర్తించగలుగుతున్నామని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో 40 శాతం ఫలితమే తెలుస్తుందని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. చదవండి: సర్జికల్ మాస్కుపై క్లాత్ మాస్కు ధరిస్తే.. -
RT-PCR Test: ఆర్టీపీసీఆర్కు చిక్కని కరోనా
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణలో గోల్డెన్ స్టాండర్డ్‌గా ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాస్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్)ను చెప్పుకుంటాం. కరోనా నిర్ధారణలో దీని తర్వాతే ఏదైనా. అలాంటిది ఆర్టీపీసీఆర్కే కొన్ని సార్లు కరోనా చిక్కడం లేదు. చాలామందికి పాజిటివ్ లక్షణాలున్నా నెగెటివ్ ఫలితాలు వస్తున్నాయి. దీంతో అనేక మంది బాధితులు సీటీస్కాన్‌కు పరుగులు తీస్తున్నారు. ఆర్టీపీసీఆర్కు కరోనా చిక్కకపోవడానికి కొత్త వేరియంట్స్ కారణమని, ఇవి ఎప్పటికప్పుడు రూపు మార్చుకుని శరీరంలో వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి వంద కేసుల్లో 5 కేసులు ఇలాంటివే వస్తున్నాయి. కొంతమంది నెగెటివ్ వచ్చింది కదా అని సాధారణ జ్వరం కింద లెక్కగట్టి ఇతర మందులు వాడుతున్న వారూ లేకపోలేదు. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సీటీస్కాన్ చేయించుకోవాల్సిందే కరోనా లక్షణాలుండి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వస్తే సీటీస్కాన్ చేయించుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలుండి, నెగెటివ్ వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని, ఎక్స్‌రే చేసినా తెలుసుకునే వీలుందంటున్నారు వైద్యులు. కానీ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చినంత మాత్రాన జ్వరమూ, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి కొనసాగుతుంటే దీన్ని కరోనా వైరస్ లక్షణాలుగా గుర్తించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. రకరకాల కారణాలు ఉంటాయి కరోనా లక్షణాలుండి ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చిందంటే రకరకాల కారణాలు ఉండచ్చు. కొన్ని వేరియంట్స్ దొరక్కపోవచ్చు. మరికొన్ని సార్లు నమూనా సరిగా తీయక పోయినా, పరీక్షల్లో జాప్యం జరిగినా ఇలా పలు కారణాలు కావచ్చు. లక్షణాలుండి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వస్తే వెంటనే ఎక్స్‌రే/సీటీ స్కాన్‌కు వెళితే తీవ్రత తెలుస్తుంది. అంతేగానీ, నెగెటివ్ వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. – డా.రాంబాబు, నోడల్ అధికారి, కోవిడ్ కంట్రోల్ సెంటర్ ఏపీలో 6,582 పాజిటివ్ కేసులు ఏపీలో గడిచిన 24 గంటల్లో 35,922 టెస్టులు చేయగా..6,582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా ఒకేరోజు 22 మంది మృతి చెందారు. ఒక్కరోజులో 2,343 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఏపీలో 1,56,77,992 టెస్టులు చేయగా.. 9,62,037 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,09,941 మంది కోలుకోగా 44,686 మంది చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారి సంఖ్య 7,410కి చేరింది. ఆదివారం అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు మృతి చెందారు. -
అడుగడుగునా మేసేశారు
సాక్షి, అమరావతి: విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో పనిచేయని సిటీ స్కాన్ మెషిన్‌ను పని చేస్తున్నట్టు చూపించారు. దాని విలువ రూ.2 కోట్లుగా చూపించి.. ఆ మొత్తంపై 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో బిల్లులు కొట్టేశారు. కర్నూలు జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ ధరను రూ.3.60 కోట్లుగా రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి మార్కెట్లో దీని విలువ రూ.1.69 కోట్లు. జెమిని అనే ప్రైవేట్ సంస్థ అప్పటికే పదేళ్ల ఒప్పందంతో దాని నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం టెండర్ ఇచ్చిన బెంగళూరు టీబీఎస్ సంస్థ కూడా నిర్వహణ సేవల పేరుతో బిల్లులు పెట్టి నిధులు గుంజేసింది. అంటే ఒకే ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ నిర్వహణ పేరిట రెండు సంస్థలకు బిల్లులు ఇవ్వడమే కాకుండా, మార్కెట్ ధర కంటే రెట్టింపు చూపించి ఏడాదికి రూ.26.82 లక్షలను నిర్వహణ చార్జీల పేరిట అదనంగా తినేశారు. ఈ విధంగా వైద్య పరికరాల నిర్వహణ పేరిట అడుగడుగునా ప్రజాధనాన్ని మేసేశారు. ఈ కుంభకోణం తీరును లోతుగా పరిశీలిస్తే లెక్కలేనన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్ స్కామ్‌పై సెక్షన్ 420, 406, 477 కింద నేర పరిశోధన విభాగం (సీఐడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే... కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వైద్య పరికరాల నిర్వహణ తంతు నడిపినట్టు నిర్థారణ అవుతోంది. అప్పటి సీఎం చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ కీలక అధికారుల అండతోనే అవినీతి, అక్రమాలు జరిగినట్టు సీఐడీ అంచనాకు వచ్చింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలీమాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ సంస్థకు 2015లో ఏడాది మాత్రమేనంటూ టెండర్ ఖరారు చేసిన నాటి నుంచి.. నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లు కొనసాగించడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాల మొత్తం విలువకు 7.45 శాతం చొప్పున నిర్వహణ రుసుం చెల్లించే ఒప్పందంతో ఈ కుంభకోణానికి బీజం పడింది. టెండర్ దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు పెంచేసి మోసానికి పాల్పడింది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరికరాలు మొత్తం విలువ రూ.300 కోట్లు లోపే ఉంటుందని, దాన్ని ఏకంగా రూ.508 కోట్లుగా చూపించి ఆ మొత్తానికి 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో నిధులు కొల్లగొట్టారు. ఇందుకోసం ఆ సంస్థకు ఏడాదికి రూ.38.22 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించిన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా తొలి ఏడాది చెల్లించిన రూ.38.22 కోట్లకు అదనంగా ఏటా పది శాతం చొప్పున నిర్వహణ సేవల మొత్తాన్ని చెల్లించారు. మరికొన్ని అక్రమాలు ఇలా.. ప్రకాశం జిల్లా కంభం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో రూ.లక్ష విలువైన స్కానింగ్ మెషిన్‌ను రూ.2.40 లక్షలుగా చూపించి నిర్వహణ చార్జీలు వసూలు చేశారు. వాస్తవానికి దీనికి గతం నుంచి కృష్ణా డయాగొస్టిక్స్ అనే సంస్థ నిర్వహణ కాంట్రాక్ట్ కలిగి ఉంది. అంటే ఒకే స్కానింగ్ మెషిన్‌కు రెట్టింపు ధర చూపడమే కాకుండా రెండు సంస్థలు బిల్లులు పెట్టుకునే మోసాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 పైగా వెంటిలేటర్లు ఉన్నట్టు లెక్కల్లో చూపించారు. ఒక్కొక్క వెంటిలేటర్ విలువ సుమారు రూ.7.10 లక్షలు కాగా.. రూ.11 లక్షలుగా చూపించారు. వాస్తవానికి వీటికి వారంటీ ఉన్నందున నిర్వహణ వ్యయం అవసరం లేదు. అయినా ధర అధికంగా చూపించి నిర్వహణ చార్జీల మోత మోగించారు. ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు టెక్నీషియన్లు, తగిన విద్యార్హతలు కలిగిన సిబ్బందిని నియమించాలి. అందుకు విరుద్ధంగా నాన్ టెక్నీషియన్లను, డిగ్రీ చదివిన వారిని నియమించుకుని తక్కువ జీతాలతోనే ఐదేళ్లు నెట్టుకొచ్చి కోట్లు కొల్లగొట్టినట్టు సీఐడీ పరిశీలనలో తేలింది. -
మరింత అందుబాటులో ఎక్స్‌రే, సీటీస్కాన్
సాక్షి, అమరావతి: ఎక్స్‌రే, సీటీస్కాన్‌ల కోసం గతంలో రోగులు ఇబ్బందిపడే వారు. జిల్లా ఆస్పత్రులు లేదా బోధనాస్పత్రుల్లో మాత్రమే అవి అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. సెకండరీ కేర్ ఆస్పత్రులైన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మొత్తం 115 చోట్ల ఈ సేవలు అందుతున్నాయి. ► రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1,531 మంది ఎక్స్‌రే సేవలను, నెలకు ఆరు వేల మందికి పైగా సీటీస్కాన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ► మొత్తం 71 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 36 ఏరియా ఆస్పత్రులు, ఆరు జిల్లా ఆస్పత్రులు రెండు ఎంసీహెచ్ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉండగా, మరిన్ని ఆస్పత్రులకు విస్తరించేలా చర్యలు చేపడుతున్నారు. ► ఈ 115 ఆస్పత్రుల్లో మొత్తం 1,350 ఎక్స్‌రే మెషీన్లున్నాయి. ఎమర్జెన్సీ కేసులకు ప్రాధాన్యమిస్తున్నారు. ► రేడియోగ్రాఫర్స్‌కు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
షాకింగ్: మహిళల మెదడులో సూదులు
బీజింగ్: ఓ మహిళ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. డాక్టర్లు ఆమె తలకు సీటీ స్కాన్ చేశారు. రిపోర్టులో ఆమె మెదడులోకి రెండు పొడవైన సూదులు చొచ్చుకెళ్లినట్లు గుర్తించారు. చిత్రం ఏమిటంటే.. అవి తలలోకి ఎలా చొచ్చుకెళ్లాయో ఆమెకి కూడా తెలీదు. దానికి తోడు పుర్రెపై కూడా ఎలాంటి గాయాలు లేవు. దీంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. విచిత్రం ఏంటంటే దీని గురించి ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాలేదు. అయితే, ఎందుకైనా మంచిదని.. ఒకసారి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. దీంతో సీటీ స్కాన్ చేయించుకుంది. ఆ రిపోర్ట్ చూసిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే.. ఆమె మెదడులో 4.9 మిల్లీమీటర్ల పొడవున్న రెండు సూదులు కనిపించాయి. అయితే, అవి యాక్సిడెంట్ సమయంలో ఆమె తలలోకి వెళ్లినవి కావు. ప్రమాదం కంటే ముందే.. ఎప్పటి నుంచో అవి ఆమె తలలో ఉన్నాయని వైద్యులు గుర్తించారు. (చదవండి: లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!) దీని గురించి వైద్యులు ఆమెను పలు రకాలుగా ప్రశ్నించారు. ‘గతంలో ఎప్పుడైనా నీకు సర్జరీ జరిగిందా’ అని అడిగారు. ఇందుకు ఆమె లేదని సమాధానం ఇచ్చింది. పోనీ.. తలకు ఏమైనా గాయాలు కావడం వంటివి చోటుచేసుకున్నాయా అనే ప్రశ్నకు కూడా ఆమె కాదనే సమాధానం చెప్పింది. దీంతో.. ఆమెకు ఊహ తెలియని వయస్సులోనే ఎవరో వాటిని తలలోకి చొప్పించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఆ సూదులు పూర్తిగా మెదడులోకి వెళ్లిపోయాయి. పుర్రె మీద వాటిని చొప్పించిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. దీంతో ఆ సూదులు ఆమె మెదడులోకి ఎలా ఎలా వెళ్లాయో తెలీక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. మెదడులో సూదులు ఉండటం ప్రమాదకరమని, వాటిని వెంటనే తొలగించాలని వైద్యులు చెప్పారు. తనకు ఏ రోజు తలకు సంబంధించిన సమస్యలు రాలేదని జుహు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. జుహు తలలోకి సూదులు ఎలా వెళ్లాయనేది తమకు తెలీదని, చిన్నప్పటి నుంచి ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. (వైరల్: వందేళ్ల కిందటి శవం నవ్వుతోందా?) అయితే, తాము యాత్రలకు వెళ్లినప్పుడు జుహును పిన్ని ఇంట్లో ఉంచామని, అప్పుడు ఆమె తమ బిడ్డ తలపై రెండు నల్లని గుర్తులు చూశానని తమతో చెప్పిందన్నారు. అవి సాధారణ మచ్చలు కావచ్చని తాము పట్టించుకోలేదని తెలిపారు. సీటీ స్కాన్ రిపోర్టులతో జుహు పోలీసులను ఆశ్రయించింది. తన తలలోకి ఎవరో సూదులు చొప్పించారని, దీనిపై విచారణ జరపాలని కోరింది. కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిగా ఉడకని మాంసం తినడం వల్ల పురుగులు రక్తం నుంచి మెదడులోకి చేరాయని వైద్యులు తెలిపారు. -
లక్షణాలు ఉన్నా.. లేకున్నా.. ఈ టెస్టు మస్ట్
నల్లగొండ జిల్లా కట్టంగూర్‌మండలపరిధిలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆమెనుఎల్బీనగర్‌లోని ఓ కార్పొరేట్‌ఆస్పత్రికి తరలించారు. ఆమెకు జ్వరం, దగ్గు, జలుబు వంటిలక్షణాలు కూడా లేవు. కానీఅడ్మిషన్ చేయాలంటే ముందు కోవిడ్ నిర్ధారణ కోసం సీటీ స్కాన్ చేయించాలనిఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకు రూ.6500 వసూలు చేశారు. తర్వాతే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వారం రోజుల క్రితం జనగాం సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగిపోయిన 45 ఏళ్ల వ్యక్తిని చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తరలించారు. అడ్మిట్ చేయాలంటే అంతకంటే ముందే కోవిడ్ నిర్ధారణకు సీటీస్కాన్ చేయాలని స్పష్టం చేశారు. ఆ మేరకు బంధువులు అంగీకరించి అడిగినంత చెల్లించిన తర్వాతే సీటీస్కాన్ చేశారు. ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాతే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ఒక్క నల్లగొండ జిల్లాకు చెందిన వారికే కాదు... వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిఅత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది క్షతగాత్రుల నుంచి ఇదే తరహాలోవసూళ్లకు పాల్పడుతున్నారు. లాక్డౌన్ నిబంధనల తర్వాత రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. వర్షాలు ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది పాముకాటుకు గురవుతున్నారు. అంతేకాదు దీర్ఘకాలిక లాక్డౌన్ తర్వాత ఉపాధి అవకాశాలు లేకపోవడం తో మనస్థాపంతో అనేక మంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. అనేక మంది హృద్రోగులు, కిడ్నీ, కాలేయ ఫెయిల్యూర్ బాధితులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకునే విషయంలో నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు కోవిడ్ నిబంధనలను బూచీగా చూపిస్తున్నాయి. నిజానికి కోవిడ్ నిర్ధారణ కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను ఉచింతంగా చేస్తుంది. ప్రైవేటులో.. ఆర్టీపీసీఆర్కు రూ.2200 ధర నిర్ణయించింది. నిజానికి ఆర్టీపీసీఆర్తో పోలీస్తే.. ర్యాపిడ్ టెస్టు చాలా సులువు. తక్కువ సమయంలో..తక్కువ ఖర్చుతో రిపోర్ట్ వచ్చేస్తుంది. చెస్ట్ ఎక్సరే లో కూడా కోవిడ్ ఉందో లేదో తెలిసిపోతుంది. కానీ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోకుండా అవసరం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న వారందరికీ కోవిడ్ నిర్ధారణ పేరుతో అడ్మిషన్‌కు ముందే సీటీస్కాన్లు సిఫార్సు చేస్తున్నాయి. ఇందుకు ఒక్కో ఆస్పత్రి రూ.6500 నుంచి రూ.10 వేల వరకు ఛార్జీ చేస్తుంది. బాధితుల్లో ఎవరికైనా స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయితే..వారిని వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్ చికిత్సల పేరుతో రూ.10 నుంచి 15 లక్షల వరకు ఛార్జీ చేస్తున్నారు. రోగులను నిలువు దోపిడికి గురిచేస్తున్న ఈ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖకు ఇప్పటికే వెయ్యికిపైగా ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటి వరకు కేవలం రెండు ఆస్పత్రులపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగిలిన వాటి విషయంలో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ చికిత్సలకు రెట్టింపు ఛార్జీలు మార్చికి ముందు గాంధీలో రోజుకు 200 నుంచి 250 సర్జరీలు జరిగేవి. ఉస్మానియాలో 150 నుంచి 200 సర్జరీలు జరిగేవి, కింగ్ కోఠిలో రోజుకు 10 నుంచి 20 చికిత్సలు జరిగేవి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులు కోవిడ్ సెంటర్లుగా మారాయి. ఉస్మానియా పాత భవనం శిధిలావస్థకు చేరుకోవడం, ఇటీవల ఆ భవనంలోని వరదనీరు చేరడంతో ఆ భవనంలోని వార్డులు సహా ఆపరేషన్ థియేటర్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. వార్డుల సంఖ్యను కూడా దాదాపు కుదించాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో సర్జరీలు జరగడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ఆయా రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నిజానికి కోవిడ్‌కు ముందు వరకు జాయింట్ రీప్లేస్మెంట్, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, గుండె చికిత్సలకు పలు ప్యాకేజీల కింద సర్జరీలు చేసేవి. ప్రస్తుతం కోవిడ్‌ను బూచీగా చూపించి ఆయా సర్జరీల ధరలను రెట్టింపు చేశాయి. సాధారణ చికిత్సలకు కూడా రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు ఛార్జీ చేస్తున్నాయి. విధి లేని పరిస్థితుల్లో రోగుల వారు అడిగినంత చెల్లించి సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీటీస్కాన్ రిపోర్ట్ పాజిటివ్ అయినా.. పరేషాన్
సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. అనుమానం వచ్చి స్థానికంగా ఉన్న ఓ వైద్యుడిని సంప్రదించాడు. ఆయనకోవిడ్‌గా అనుమానించి సీటీస్కాన్ చేయించుకోవాల్సిందిగా సిఫార్సు చేశారు. సీటీస్కాన్ చేయించగా..కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితివిషమించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఈ రిపోర్ట్ తీసుకుని గాంధీ ఆస్పత్రికి వెళ్లగా..అడ్మిట్‌చేసుకునేందుకునిరాకరించారు. అదేమంటె..ఆర్టీపీఆర్ కానీ, ర్యాపిడ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే...అడ్మిట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యక్తిదిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదీ ఒక్క వారాసిగూడ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి సమస్య మాత్రమే కాదు. సీటీస్కాన్ చేయించుకుంటున్నఅనేకమంది అత్యవసరపరిస్థితుల్లో ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నిజానికి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులతో పోలిస్తే సీటీస్కాన్ చేయిస్తే.. ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ లోడు ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది.అత్యవసర వైద్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న కొంతమంది వైద్యులు తమ వద్దకు వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో భాగంగా సీటీస్కాన్‌కు సిఫార్సుచేస్తున్నారు. పరిమిత కేంద్రాల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తుండటం, శాంపిల్‌ఇచ్చిన తర్వాత రిపోర్ట్ జారీకి 24 గంటల సమయం పడుతుండటం, ర్యాపిడ్ టెస్టుల్లో 80 శాతం మాత్రమే స్పష్టత ఉండటం వల్ల కచ్చితత్వం కోసం డాక్టర్లు ఈ సీటీస్కాన్‌లను సిఫార్సు చేస్తున్నారు. అంతేకాదు ప్రాథమిక దశలో ఉన్న వైరస్‌ను కూడా ఇందులో గుర్తించొచ్చు. ఇతర టెస్టులతో పోలిస్తే డయాగ్నోస్టిక్ సెంటర్లకు ఇది లాభదాయకంగా మారింది. దీంతో ఆయా ఆస్పత్రుల్లోని వైద్యులు కూడా దీనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సిటీస్కాన్‌లో పాజిటివ్ నిర్ధారణై.. అత్యవసర పరిస్థితుల్లో ఈ రిపోర్ట్‌ను తీసుకుని ప్రభుత్వ కోవిడ్ సెంటర్‌కు వెళితే..వారు అడ్మిషన్‌కు నిరాకరిస్తున్నారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల్లో ఏదో ఒకటి ఉంటే తప్ప అనుమతించడం లేదు. అప్పటికే వైరస్ శరీరంలోకి ప్రవేశించి, శ్వాసనాళాలు, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చికిత్సను నిర్లక్ష్యం చేయడం, అప్పటికే శరీరంలో వైరస్ లోడు పెరగడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందక అనేకమంది మరణిస్తున్నారు. ఈ తరహా మృతుల్లో 60 శాతం మంది 55 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఆ ముసుగులో కార్పొరేట్ దోపిడీ దగ్గు, జలుబు, జ్వరం వంటి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన బాధితులకు ఈ టెçస్టులు చేయడంలో పెద్దగా అభ్యంతరం లేదు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి, పాజిటివ్ కేసులకు ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉండి అనుమానంతో వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ సిఫార్సు చేస్తే సరిపోతుంది. సీటీస్కాన్‌తో పోలిస్తే ఈ టెస్టుకు అయ్యే చార్జీ కూడా చాలా తక్కువ. ప్రభుత్వం ఇందుకు రూ.2000 నుంచి శాంపిల్ సేకరణను బట్టి రూ.2800 వరకు నిర్ణయించింది. కానీ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అధిక సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని సాధారణ రోగులకు కూడా సీటీస్కాన్ చేస్తున్నాయి. ఇందుకు రూ.10 వేల వరకు చార్జీ చేస్తున్నాయి. ఛాతీ ఎక్సరేతో తెలిసిపోయే..వైరస్‌ను సీటీస్కాన్ వరకు తీసుకెళ్లడంతో రోగులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. అంతేగాక సీటీస్కాన్లో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ప్రభుత్వ హెల్త్ పోర్టల్‌లో నమోదు కావడం లేదు. వైరస్ సోకినట్టు ఇతరులకు తెలిసే అవకాశం ఉండటంతో వీరిలో చాలా మంది ఆస్పత్రుల్లో చేరడం లేదు. సోషల్ మీడియాలో వైద్య నిపుణులు ఇస్తున్న సూచనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొని తెచ్చి వాడుతున్నారు. అసింటమేటిక్ బాధితులు సులభంగానే కోలుకుంటున్నప్పటికీ...మధుమేహం, హైపర్‌టెన్షన్, ఇతర రోగాలు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాదు పరోక్షంగా వీరు వైరస్ సామాజిక వ్యాప్తికి కారణమవుతున్నట్టు ప్రభుత్వ వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
నట్లు, వైరు, ఇనుప గుండు
జైపూర్ : ఆపరేషన్ ముగిసిన తర్వాత బుండి ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఒకింత షాక్‌కి గురయ్యారు. ఇది కడుపా లేక ఇనుప వస్తువుల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సదరు వ్యక్తి కడుపులోంచి వైద్యులు ఇనుప నట్లు, వైరు, ఇనుప గుండు వంటి వస్తువులు బయటకు తీశారు. వివరాలు.. భోలా శంకర్ (42) అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ.. స్థానిక బుండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఎక్స్ రే తీసిన వైద్యులు ఆ రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. అతని కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు రిపోర్టుల్లో కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్ చేశారు. ఆ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో శంకర్‌కి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో అతని కడుపులోంచి 6.5 సెంటిమీటర్ల పొడవున్న 116 ఇనుప నట్లతో పాటు.. ఓ వైర్, ఇనుప గుండును కూడా బయటకు తీశారు. ఈ వస్తువులు చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్లు ఇది కడుపా.. ఇనుప సామాన్ల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం శంకర్ కోలుకుంటున్నాడని.. అయితే ఈ వస్తువులన్ని అతనికి కడుపులోకి ఎలా వెళ్లాయనే విషయం గురించి అతనేం మాట్లాడటం లేదని వైద్యులు తెలిపారు. -
సీటీ స్కాన్‌తో చిన్నారులకు ఆ రిస్క్..
లండన్ : సీటీ స్కాన్లు చేయించుకునే చిన్నారులకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. రేడియేషన్ కారణంగా వాటిల్లే ముప్పుపై ఇటీవల పలు ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అథ్యయన వివరాలు వెలుగుచూశాయి. కనీసం ఒకసారి సీటీ స్కాన్ చేయించుకున్న 1,70,000 మంది చిన్నారులపై జరిపిన పరీక్షల్లో సగటు రేటు కంటే అత్యధిక క్యాన్సర్ కేసులు ఉన్నట్టు వెల్లడైంది. ఎక్స్‌రేల కంటే స్పష్టమైన ఇమేజ్‌లను ఇస్తుండటంతో వైద్యులు ఎక్కువగా సీటీస్కాన్లకు సిఫార్సు చేస్తున్నారు. చిన్నారులపై ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయని ఈ అథ్యయనం తేల్చిచెప్పింది. జీవితంలో ఒకసారి సీటీస్కాన్ చేయించుకున్న చిన్నారుల్లో బ్రెయిన్ క్యాన్సర్ రిస్క్ 1.5 రెట్లు అధికంగా ఉందని డచ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇ క ఒకటి కంటే ఎక్కువ సార్లు సీటీ స్కాన్స్ చేయించుకున్న వారిలో క్యాన్సర్ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉంది. అయితే సీటీ స్కాన్స్కూ బ్రెయిన్ క్యాన్సర్‌కు సంబంధంపై ఆధారాలు లేవని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. -
‘హిస్’టారికల్..
హాయ్.. నా పేరు హన్నా.. ఇక్కడ పేపరు మడిచేసినట్లు.. మడిచేసేరే అది నేనే.. ఈ మధ్య నాకు ఒంట్లో కాస్త నలత చేసింది లెండి.. హిస్సు.. బుస్సుమని అనలేకపోతున్నాను.. మొహం కూడా కాస్త వాచిందేమో.. దాంతో నేనుంటున్న జూవాళ్లు తెగ కంగారు పడిపోయి.. ఎక్స్‌రేలు వంటివి తీశారు.. అయితే.. దాని వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదట.. ఇంకేం చేయాలా అని తెగ ఆలోచించేసి.. ఈ మధ్యే మాలాంటి వాటి కోసం ప్రత్యేకంగా చేయించిన సీఏటీ(కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ) స్కాన్‌లో నన్ను పరీక్షించేయాలని డిసైడైపోయారు.. నేనేమో ఏకంగా 19 అడుగులు ఉంటాను.. అందులో పట్టనాయే.. ఏం చేద్దామని ఆలోచించి.. ఇలా మడతెట్టేశారు.. కాస్త ఇబ్బందిగా ఉన్నా.. నా ఆరోగ్యం కోసమే కదా అని సరిపెట్టేసుకున్నాను.. మొన్నటికి మొన్న నా పక్క బోనులోని సింహం మామను ఇలాగే పరీక్షించారు.. అయితే.. ఓ కొండచిలువను సీఏటీ స్కాన్‌లో పెట్టి.. స్కానింగ్ చేయడం ఇదే తొలిసారట. అలా ఓ రికార్డు కూడా నా ఖాతాలో పడిందండోయ్.. స్కానింగ్ రిపోర్టు వచ్చేసింది.. ఊపిరితిత్తుల్లో ఏదో సమస్యట.. మా డాక్టరుగారు.. రిపోర్టును బాగా తిరగేసి..ఇన్ఫెక్షన్ తగ్గడానికి నాకు యాంటీబయాటిక్‌లు ఇస్తున్నారు.. ఇప్పుడిప్పుడే.. అడపాదడపా హిస్సు.. బుస్సుమనగలుగుతున్నాను.. మందులేసుకునే టైమైంది.. ఉంటానే.. ఇంతకీ నేనెక్కడుంటానో చెప్పలేదు కదూ.. అమెరికాలోని ఒహాయోలో ఉన్న కొలంబస్ జూలో.. బాయ్.. బాయ్. -
అల్ట్రాసౌండ్ స్కానర్‌తోనే సీటీ, ఎంఆర్ఐ
ఇప్పటివరకు ఉన్న అల్ట్రాసౌండ్ స్కానర్ల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్నవన్నీ 2డీ స్కానర్లే. గర్భంలోని శిశువు, గుండె, ఇతర అవయవాల త్రీడీ చిత్రాలతో వైద్య రంగంలో ఎన్నో ఉపయోగాలున్న విషయం తెలిసిందే. కాకపోతే వీటి ఖరీదెక్కువ. తాజాగా దాదాపు కోటిన్నర రూపాయలు విలువ చేసే త్రీడీ అల్ట్రాసౌండ్ యం త్రం లక్షల్లో వచ్చేలా చేశారు డ్యూక్, స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు. ఇందుకు మన స్మార్ట్ఫోన్లలో ఉండే యాక్సెలరోమీటర్ సాయం తీసుకున్నారు. ఫోన్ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వెయ్యి రూపాయలు ఖరీదు చేసే మైక్రోప్రాసెసర్‌తో దీన్ని 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు అనుసంధానించడం ద్వారా త్రీడీ ఇమేజింగ్ చేయగలిగామని, ఇది సీటీ స్కాన్, ఎంఆర్‌ఐలకు ఏమాత్రం తీసిపోదని జోషువా బ్రూడర్ అనే శాస్త్రవేత్త వివరించారు. ‘మా అబ్బాయి వీడియే గేమ్స్ ఆడుతుంటే దాని కం ట్రోలర్ నన్ను ఆకట్టుకుంది. కన్సోల్ స్థానాన్ని కచ్చితంగా గుర్తుపట్టే సామర్థ్యాన్ని 2డీ అల్ట్రాసౌండ్కు అందించాలన్న ఆలోచనతో మా ప్రాజెక్టు మొదలైంది’అని ఆయన పేర్కొన్నారు. 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు ఓ ప్లాస్టిక్ ఉపకరణాన్ని అనుసంధానిస్తే, అందులోని మైక్రో ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుందని చెప్పారు. -
త్వరలోనే సర్వజనాస్పత్రికి సీటీ స్కాన్
– సమాచారం ఇచ్చిన అడిషనల్ డీఎంఈ అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఏడాదికి పైగా 'సీటీ స్కాన్' సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆస్పత్రికి త్వరలోనే సీటీ స్కాన్ పంపుతామని అడిషనల్ డీఎంఈ బాబ్జీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వీలైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తెస్తే రోగులకు ఊటర కలగనుంది. కాగా 'సీటీ స్కాన్' లేకపోవడంతో ఆస్పత్రిలో ఇబ్బందులపై గతంలో 'సాక్షి' కథనాలు రాసింది. ఆరు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సర్వజనాస్పత్రిలో నిద్ర చేసిన సమయంలో సీటీస్కాన్‌తో పాటు ఎంఆర్ఐని మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ గడువు ముగిసినా యంత్రం ఇక్కడికి రాకపోవడంపై గత నెల 13వ తేదీన 'మూడు మారిందా!' శీర్షికతో కథనం ప్రచురించింది. స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం, ఉన్నతాధికారులు విషయాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి పరిస్థితులపై నివేదికను పంపడంతో పాటు యంత్రం పనికిరాదని బయోమెడికల్ ఇంజనీర్లు, యంత్రాన్ని సరఫరా చేసిన సంస్థ ప్రతినిధులు సర్టిఫై చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో వీలైనంత త్వరలో సీటీ స్కాన్ అందుబాటులోకి తెస్తామని అడిషనల్ డీఎంఈ బాబ్జీ ఇక్కడికి సమాచారం ఇచ్చారు. -
క్యాన్సర్ కౌన్సెలింగ్
పెట్-సీటీ స్కాన్ అవసరమా? నేను ఓవరీ (అండాశయ) క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. ఇందులో భాగంగా శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఆ తర్వాత ఆరు సైకిల్స్ పాటు కీమోథెరపీ కూడా తీసుకున్నాను. చివరి సైకిల్ కీమో 2014 మే నెలలో తీసుకున్నాను. నేను ప్రతి 3 నెలలకోసారి డాక్టర్ చెక్‌అప్‌కు వెళ్తుంటాను. ఈ సారి చెకప్‌కు వెళ్లినప్పుడు పెట్-సీటీ స్కాన్ తీయించుకొమ్మని డాక్టర్ సలహా ఇచ్చారు. ఇప్పుడు నేను పెట్-సీటీ స్కాన్ చేయించుకోవడం అవసరమా? సలహా ఇవ్వగలరు. - సుజాత, తుని కీమోథెరపీని ఆరు సైకిల్స్ పాటు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాలు ప్రతి మూడు నెలలకోసారి మీరు డాక్టర్‌కు చూపించుకోవాలి. ఆ తర్వాత మరో ఐదేళ్ల పాటు ప్రతి 4- 6 నెలలకోసారి డాక్టర్ ఫాలో అప్‌లో ఉండాలి. మీ మెరుగుదల, పురోగతిని పరీక్షించి అంతా బాగుందో లేదో డాక్టర్లు పరీక్షిస్తారు. ఈ సమయంలో మళ్లీ పెట్-స్కాన్‌గానీ లేదా మరో రకమైన పరీక్షగానీ అవసరం లేదు. మీలో ఎలాంటి ఇతరత్రా లక్షణాలు కనిపించకపోతే అంతర్జాతీయ క్యాన్సర్ కేర్ మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పరీక్షలూ అవసరం లేదు. ఒకవేళ ఏదైనా సమస్యగానీ లేదా లక్షణాలు గాని కనిపిస్తుంటేనే పరీక్షలు అవసరమవుతాయి. సమస్యలూ, లక్షణాలేమీ లేకపోతే డాక్టర్లు క్లినికల్‌గా చేసే సాధారణ పరీక్షలే చాలు. మా అబ్బాయి వయసు మూడున్నర ఏళ్లు. అతడికి ‘రెటినోబ్లాస్టోమా’ అనే కంటి క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక్కడి స్థానిక డాక్టర్ చూపి కన్ను తొలగించాలని సలహా ఇచ్చారు. ఆయన చెప్పిన విషయం వినగానే మా కుటుంబమంతా షాక్‌కు గురైంది. మీరు ఈ విషయంలో ఏదైనా సలహా ఇవ్వగలరా? - సహదేవరావు, సూర్యాపేట ఈరోజుల్లో రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్‌కు చాలా రకాల చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. చాలారకాల కేసుల్లో ఇప్పుడు కంటిని తొలగించకుండానే కంటి క్యాన్సర్‌కు చికిత్స చేసే ఆధునిక విధానాలు ఎన్నో అందుబా టులో ఉన్నాయి. కంటిలోని కంతిని తగ్గించడానికి కీమోథెరపీ ఇవ్వడంతో పాటు, దానికి క్యాన్సర్‌ను తగ్గించడానికి లేజర్ చికిత్సనూ చేసే విధానాన్ని అనుసరిస్తాం. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ కూడా అవసరం కావచ్చు. కొన్నిసార్లు స్థానికంగా ‘ప్లాక్ బ్రాకీథెరపీ’ లేదా ‘ఎక్స్టర్నల్ రేడియోథెరపీ’ వంటివీ అవసరం కావచ్చు. మీ బాబు కన్నును కోల్పోకుండానే క్యాన్సర్‌కు చికిత్స లభించి, ఆ వ్యాధి నయం కావడానికి మీరు స్థానికంగా కాకుండా అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు ఉండే అధునాతన క్యాన్సర్ కేంద్రాలకు వెళ్లమని నా సూచన. -
థెరపినిచ్చే కిరణాలు...
ట్రీట్మెంట్స్ విత్ రేడియాలజీ చికిత్సారంగంలో ఈరోజు సీటీ స్కాన్ అంటేనో, ఎమ్మారై అంటేనో తెలియని వారు ఉండరంటే అతి అతిశయోక్తి కాదు. ఈ రంగంలో జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఇరవై ఏళ్ల కిందట ఒక అధ్యయనం నిర్వహించడానికి 20 నిమిషాలు పడితే... ఇవ్వాళ్ల ఆ పనికి కేవలం రెండు సెకండ్లు చాలు! ఇదే వ్యాధినిర్ధారణ విషయంలో, చికిత్సారంగంలో ఓ విప్లవం తెచ్చింది. కేవలం సమయం, సునిశితత్వం పరంగానే కాదు. సంస్థల మధ్య పోటీ పెరుగుతూ ఆర్థిక కోణంలోనూ గతంలో సగటు రోగికి అందుబాటులో లేని కొన్ని ప్రక్రియలు ఇప్పుడు అతడి చెంతకు వచ్చాయి. అంతేకాదు... దీర్ఘకాలంలో జరిగే ఖర్చులు ముందే నివారితమయ్యాయి. మరిన్ని ప్రాణాలు నిలిచాయి. వీటన్నింటికీ కారణం... రేడియేషన్ ద్వారా వెలువడే కిరణాల సాయంతో వ్యాధి నిర్ధారణలతో పాటు కొన్ని చికిత్సలూ చేయడం సాధ్యం కావడమే. ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎమ్మారై వంటివి శరీరంలోని ఏ భాగంలోనైనా వ్యాధి నిర్ధారణలో తోడ్పడతాయన్న సంగతి తెలిసిందే. కానీ చికిత్సలో ఈ రేడియేషన్ తరంగాలు ఎలా ఉపయోగపడతాయి, ఏయే వ్యాధులకు ఉపయోగపడతాయన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఈ కథనం. వేరికోసీల్స్ కొందరిలో శుక్రకణాలను చేరవేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి వృషణాల వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అడ్డంకుల వల్ల పురుషుల్లో వంధ్యత్వం రావచ్చు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు ఈ అడ్డంకులను తొలగించడం వల్ల వేరికోసీల్స్కు చికిత్స జరగడంతో పాటు పురుషుల్లో శుక్రకణాల ప్రవాహానికి అడ్డంకులు తొలగి పిల్లలు పుట్టడానికి అవకాశాలు పెరుగుతాయి. బయాప్సీలు ఏదైనా ఒక అవయవం నుంచి చిన్న కండరాన్ని సేకరించే ప్రక్రియను ‘బయాప్సీ’ అంటారు. ఇమేజింగ్ గెడైన్స్ ప్రక్రియ ద్వారా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు సాధ్యమైనంత తక్కువ/చిన్న గాటుతో ఇప్పుడు కండను సేకరించడం సాధ్యమవుతోంది. రక్తనాళాల జబ్బులకు... వేరికోజ్ వెయిన్స్ రక్తనాళాల్లో రక్తం ఒకేవైపు పయనిస్తుందన్న విషయం తెలిసిందే. మంచి రక్తం ధమనుల్లో, చెడు రక్తం సిరల్లో ప్రవహిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తాన్ని ఇలా ఒకే వైపునకు ప్రవహింపజేస్తూ... వెనక్కు రాకుండా చూసే కవాటాలు (వాల్వ్స్) బలహీనపడటం వల్ల రక్తం మునుపటిలా ప్రవహించక సిరల్లో పోగుపడుతుంది. దాంతో చాలా సందర్భాల్లో కాళ్లపై సిరలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల చూడటానికి బాగుండకపోవడమే (కాస్మటిక్గానే) కాదు... నొప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో రేడియేషన్ కిరణాలను ఉపయోగించి ఇలా వాల్వ్స్ దెబ్బతిన్న రక్తనాళాల్లోకి ట్యూబ్‌లను పంపి, వాటి ద్వారా లేజర్ కిరణాలను పంపి చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇంటర్వెన్షనల్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ లేదా స్క్లీరోథెరపీ అంటారు. దాంతో కవాటాలు బలహీనపడ్డ రక్తనాళాలు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆ పనిని ఆరోగ్యకరమైన ఇతర సిరలు చేస్తాయి. ఫలితంగా రక్తప్రవాహం మునుపటిలాగే జరుగుతుంది. సిరలు ఉబ్బి కనిపించడం, నొప్పులు రావడం తగ్గుతాయి. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) సాధారణంగా మంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనుల గోడలు చాలా మృదువుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి గట్టిబారడం, పెళుసుబారినట్లుగా కావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. ధమని ఇరు చివరలా ఇలా జరిగితే... దీనివల్ల రక్తం మధ్యలోనే పోగుపడినట్లుగా అవుతుంది. దాంతో నొప్పి, చర్మంపైన పుండ్లు రావడం, ఒక్కోసారి ఆ పుండ్లు కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్) జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రక్తనాళంలోకి అంతకంటే సన్నటి నాళాన్ని మళ్లీ ప్రవేశపెట్టి యాంజియోప్లాస్టీ ప్రక్రియతోగానీ లేదా కొంత ఒత్తిడి కలిగించిగానీ ఆ ధమనిని వెడల్పు చేస్తారు. ఇందుకు రేడియాలజీ ప్రక్రియ సహాయం తీసుకుంటారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ) రక్తనాళాల్లోని సిరల్లో చెడురక్తం, ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తాయన్నది తెలిసిందే. శరీరం లోపల ఉండే ఏదైనా సిరలో రక్తం గడ్డ కట్టడం జరిగితే ఆ భాగంలో వాపు కనిపిస్తుంది. సాధారణంగా కాళ్లలో ఎక్కువగా కనిపించే ఈ కండిషన్లో కాలుకు విపరీతంగా వాపు రావడం, దానిపైన ఉండే చర్మపు రంగు మారిపోవడం, తీవ్రమైన నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే డీప్ వీన్ థ్రాంబోసీస్ (డీవీటీ) అంటారు. ఒకవేళ డీవీటీ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ లేదా పల్మునరీ ఎంబోలిజమ్ అనే పరిస్థితికి దారితీయవచ్చు. పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్‌లో రక్తం గడ్డకట్టిన పై భాగంలో వాపు వచ్చి, చర్మంపైన పుండ్లు పడతాయి. ఇక పల్మునరీ ఎంబోలిజమ్ అన్నది ప్రాణాపాయం కలిగించే స్థితి. ఇందులో గడ్డకట్టిన రక్తపు ముద్ద మరింత చిన్న చిన్న గడ్డలుగా విడిపోయి రక్తప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించవచ్చు. దీన్నే పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమై ప్రాణాపాయం సంభవించవచ్చు. తొలుత డీప్‌వీన్ థ్రాంబోసిస్ ఉన్న చోటికి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు రక్తనాళాల్లోకి మరింత సన్నటి నాళాన్ని (క్యాథెటర్‌ను) ప్రవేశపెట్టడం ద్వారా రక్తపు గడ్డ ఉన్న ప్రాంతానికి చేరతారు. అక్కడ బెలూన్ యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారాగానీ లేదా స్టెంటింగ్ ద్వారాగానీ ఆ అడ్డు తొలగించి చికిత్స చేస్తారు. ఫలితంగా రక్తప్రవాహం మళ్లీ మునపటి స్థితికి వస్తుంది. పల్మునరీ ఎంబోలిజమ్ ముందు చెప్పుకున్నట్లుగా గడ్డ కట్టిన రక్తం ముద్దలు మళ్లీ చిన్న చిన్న ముక్కలుగా మారి రక్తప్రవాహంలో కలిసి ఊపిరితిత్తులను చేరుతాయి. ఇది ప్రాణాపాయ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరి ఆడకపోవడం, నీసరం, నిస్సత్తువ, గుండెదడ, స్పృహతప్పిపడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లు దాన్ని పల్మునరీ ఎంబోలిజమ్గా నిర్ధారణ చేసి ‘క్యాథెటర్ డెరెక్టైడ్ థ్రాంబోలైసిస్’ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. అంటే కాలు లేదా చేతిలోని ప్రధాన రక్తనాళంలోకి మరింత సన్నటి నాళాన్ని పంపి దాని చివర గడ్డకట్టిన రక్తపు ముద్దను చెల్లాచెదురు చేసే (క్లాట్ బస్టింగ్) మందులను ఉపయోగిస్తారు. దాంతో రక్తపు గడ్డ రక్తప్రవాహాన్ని అడ్డగించలేనంత చిన్న చిన్న ముక్కలుగా చెదిరిపోయి ప్రాణాపాయం తప్పుతుంది. ఐవీసీ ఫిల్టర్ ప్లేస్మెంట్ చికిత్స పల్మునరీ ఎంబోలిజమ్ వ్యాధి చరిత్ర ఉన్న రోగులు గానీ లేదా ఇలా జరిగేందుకు అవకాశం ఉన్న రోగుల విషయంలో డాక్టర్లు ఒక ముందు జాగ్రత్త / నివారణ చర్యను చేపడతారు. అదేమిటంటే... గుండెకు చెడు రక్తాన్ని తీసుకుపోయే ‘వేన-కేవా’ అనే అత్యంత ప్రధాన రక్తనాళంలోకి గానీ లేదా ఊపిరితిత్తుల్లోకి గానీ ఈ రక్తపు గడ్డలు ప్రవేశించకుండా ముందుగానే అక్కడ రక్తపు గడ్డలను అడ్డుకునే ‘ఫిల్టర్ల’ను అమర్చుతారు. దీనికోసం రేడియేషన్ థెరపీ చికిత్స సహాయం తీసుకుంటారు. ఈ ప్రక్రియనే ‘ఐవీసీ ఫిల్టర్ పేస్‌మెంట్’ అంటారు. ఫలితంగా పల్మునరీ ఎంబోలిజమ్ను ముందుగానే నివారించవచ్చు. అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్స్ (ఏఏఏ) కడుపు/పొట్టకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళమైన అబ్డామినల్ అయోర్టా బలహీనపడటం వల్లగానీ లేదా అది తన ఎలాస్టిసిటీ కోల్పోయి మామూలు పరిమాణం కంటే ఎక్కువగా సాగిపోయి వెడల్పు కావడం వల్లగానీ తీవ్రమైన పొట్టనొప్పి లేదా వీపునొప్పి వస్తాయి. ఇలాంటి స్థితిలో ఎలాస్టిసిటీ కోల్పోయి సాగిపోయి బలహీన పడ్డ రక్తనాళం చీలిపోతే అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఈ కండిషన్‌నే ‘అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా కేవలం యాంజియోగ్రఫీ / స్టెంటింగ్ ద్వారా ‘ఎండోవ్యాస్క్యులార్ అన్యురిజమ్ రిపేర్’ అనే ప్రక్రియ సహాయంతో సాగిపోయిన/బలహీన పడ్డ అబ్డామినల్ అయోర్టాకు చికిత్స చేయవచ్చు. మూత్రపిండాలు రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ హైబీపీ ఉన్నవారికి మూత్రపిండాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రీనల్ ఆర్టరీ కుంచించుకుపోయినప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ ప్రక్రియ ద్వారా దాన్ని వెడల్పు చేసి రేడియాలజీ సహాయంతో చికిత్స చేయడం సాధ్యమే. డయాలసిస్ ఫిస్టులా / ఆర్టీరియో వీనస్ గ్రాఫ్ట్ క్లాట్ కొందరిలో మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి గడ్డలను ‘ఇంటర్వెన్షనల్ డీక్లాట్’ ప్రక్రియ ద్వారా తొలగించే అవకాశం ఉంది. నెఫ్రోస్టోమీ ట్యూబ్ రీప్లేస్మెంట్ కొందరిలో కిడ్నీలో ఏర్పడిన రాళ్లు... కిడ్నీ నుంచి యురేటర్ ద్వారా మూత్రకోశానికి చేరి అక్కడి నుంచి మూత్ర విసర్జన చేసే మూత్రనాళాల్లోకి (యురెథ్రాలోకి) ప్రవేశించి అక్కడ అడ్డంకిగా మారవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మూత్రద్వారం గుండా మరొక చిన్న నాళాన్ని ప్రవేశపెట్టి ఆ రాయిని తొలగించవచ్చు. క్యాన్సర్ గడ్డలు క్యాన్సర్ గడ్డల చికిత్స విషయంలో రేడియాలజీ రంగాన్ని ఉపయోగించి అనేక రకాల చికిత్సలు చేయడం సాధ్యమవుతుంది. ఇందులో గడ్డ ఎలాంటి రకానికి చెందింది, ఎంత పరిమాణంలో ఉంది, ఏ మేరకు వ్యాపించి ఉంది, దాని ఆకృతి ఎలా ఉంది... లాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో ‘ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్’ అనే ప్రక్రియను ఉపయోగించి... గడ్డకు జరిగే రక్తసరఫరాను ఆపివేస్తారు. దాంతో గడ్డ కుంచించుకుపోయి రాలిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్, క్రయోఅబ్లేషన్, ఇర్రివర్సిబుల్ ఎలక్ట్రోపోరేషన్, హై-ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనే ప్రక్రియలను అనుసరించి రేడియేషన్ కిరణాలతో నేరుగా క్యాన్సర్ గడ్డలోని కణజాలాన్ని శిథిలమైపోయేలా చేస్తారు. కేవలం గడ్డ ఉన్న ప్రాంతంలోనే కిరణాలు ప్రసరింపజేయడం వల్ల పక్కన ఉండే ఆరోగ్యకరమైన కణజాలానికి అత్యంత తక్కువ నష్టం జరిగేలా చూస్తారు. అలాగే కీమోథెరపీ వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్నూ తగ్గిస్తారు. కాలేయం పోర్టల్ హైపర్‌టెన్షన్ కాలేయంపై పగుళ్లు ఏర్పడటం (సిర్రోసిస్) లేదా దానికి ఇతరత్రా ఏవైనా ప్రమాదాలు జరగడం (హెపటైటిస్) వంటి సందర్భాల్లో కాలేయానికి రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో రోగులకు అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాపాయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ గాటుతో ‘ట్రాన్స్జ్యుగులార్ ఇంట్రాహెపాటిక్ పోర్టోసిస్టమిక్ షంట్ (టిప్స్)’ అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేసి రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తారు. బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ కాలేయ క్యాన్సర్, బైల్ డక్ట్ క్యాన్సర్, కోలిసిస్టైటిస్, కోలాంజిటిస్ లేదా కాలేయ, బైల్ వ్యవస్థలకు చెందిన ఏ జబ్బుల్లోనైనా బైల్ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడినప్పుడు రేడియాలజిస్ట్‌లు సాధారణంగా ‘పెర్క్యుటేనియస్ ట్రాన్స్హెపాటిక్ కోలాంజియోగ్రఫీ (పీటీహెచ్సీ లేదా పీసీటీ) అనే ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా ఆ అడ్డంకిని గుర్తిస్తారు. అలా గుర్తించిన తర్వాత పెర్క్యుటేనియస్ ట్రాన్స్హెపాటిక్ బిలియరీ డ్రైనేజ్ (పీటీబీడీ) అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. ఇందులో క్యాథెటర్ లేదా స్టెంట్‌ను చర్మం పొరల ద్వారా బైల్‌డక్ట్ లోకి పంపి, బైల్ స్రావాన్ని బయటకు డ్రెయిన్ చేస్తారు. ఆ తర్వాత సర్జరీకి పూనుకుంటారు. న్యూరలాజిక్ స్ట్రోక్ (పక్షవాతం) మెదడుకు రక్తనాళాల ద్వారా అందాల్సిన ఆక్సిజన్ లేదా పోషకాలు అందని సమయంలో మెదడులోని ఆ ప్రాంతం దెబ్బతింటుంది. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఒకవేళ మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు చిట్టిపోయి అంతర్గత రక్తస్రావం జరిగి మెదడులోని భాగాలు దెబ్బతినడం వల్ల ఆ భాగం నియంత్రించే శరీర అవయవాలు పనిచేయకపోవడాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ ఎలా వచ్చినా దాని వల్ల మాట్లాడటంలో మార్పులు, కాళ్లూ చేతులు సరిగా పనిచేయకపోవడం, చూపు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ అనే నిపుణులు సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో వచ్చిన పక్షవాతం... ఇస్కిమిక్ స్ట్రోకా లేక హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ స్ట్రోక్ రక్తం గడ్డకట్టడం వల్ల జరిగితే ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారాగానీ లేదా థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ ద్వారాగాని ఆ గడ్డను తొలగిస్తారు. ఒకవేళ రక్తనాళాలు సాగిపోయి, ఉబ్బి అవి చిదిమిపోవడం (అన్యురిజమ్స్)వల్ల రక్తస్రావం అయితే వాటిని ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. కెరటాయిడ్ ఆర్టరీ స్టెనోసిస్ మన మెడలోని కెరటాయిడ్ ఆర్టరీ అనే ధమని సన్నబారితే మెదడుకు తగినంత రక్తం అందదు. ఇలా సన్నబారినప్పుడు కెరటాయిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అనే ప్రక్రియ ద్వారా మెదడుకు తగినంత రక్తం అందేలా చేస్తారు. ఇది కెరటాయిడ్ ఎండార్టరెక్టమీ అనే శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం. కెరటాయిడ్ ఆర్టరీ సన్నబడినట్లు గుర్తించినప్పుడు స్ట్రోక్ రాకుండా ముందస్తు నివారణ చర్యగా ఈ చికిత్స చేస్తారు. స్పైనల్ ఫ్రాక్చర్స్ వెన్నెముకకు ఏదైనా పగుళ్ల వంటివి ఏర్పడితే అలా ఏర్పడిన పగుళ్ల చీలికలలోనికి ఇంజెక్షన్ ద్వారా సిమెంట్ వంటి ఎముకలోనే కలిసిపోయే పదార్థాన్ని పంపి చికిత్స చేస్తారు. ఇంజెక్షన్ ద్వారా చర్మం పొర అయిన ‘పర్క్యుటేనియస్’ లేయర్లోకి ఇంజెక్షన్ చేసి నిర్వహించే ఈ చికిత్సను వర్టిబ్రోప్లాస్టీ లేదా కైఫోప్లాస్టీ అంటారు. ఇలా రేడియాలజీ అన్నది కేవలం వ్యాధి నిర్ధారణ విషయంలోనే గాక... రకరకాల చికిత్సల్లోనూ కీలక భూమిక పోషిస్తోంది. - నిర్వహణ: యాసీన్ మహిళల ఆరోగ్యం విషయంలో... యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఇవి యుటెరస్‌లో ఏర్పడే ఒక రకం గడ్డలు. వీటి వల్ల మహిళల్లో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరుగుతాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు ‘యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ (యూఎఫ్ఈ) లేదా ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ) ప్రక్రియల ద్వారా ఈ గడ్డలకు రక్తప్రసరణ చేసే ధమని నుంచి ఒక క్యాథెటర్‌ను పంపి, ఆ ధమనిని మూసి వేసి ఆ గడ్డలకు జరిగే రక్తప్రసరణను ఆపివేస్తారు. దాంతో ఆ ఫైబ్రాయిడ్స్ కుంచించుకుపోయి రాలిపోతాయి. మహిళల్లో ఫలదీకరణకు తోడ్పడటం కొందరిలో ఫెలోపియన్ ట్యూబ్స్ కుంచించుకుపోవడం వల్ల పురుషుల నుంచి విడుదల అయ్యే శుక్రకణాలు అండాన్ని చేరలేవు. అలాంటి సందర్భాల్లో సాల్పింగోగ్రఫీ అనే ప్రక్రియ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్‌లోకి సన్నటి నాళాలను పంపి బెలూన్ సహాయంతో వాటిని వెడల్పు చేసి మహిళల్లోని వంధ్యత్వాన్ని నివారించగలరు. -
మెడకు బదులుగా...మనిషే తిరగాల్సి వస్తే!
బహుశా మనలో చాలామందికి తలకు- దేహానికి మధ్య మెడ అనే కీలకమైన భాగం ఉందనే విషయం పెద్దగా గుర్తుండదు. మెడకు ప్రాధాన్యత కూడా తక్కువే. సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్య ఏదో వచ్చి, తల తిప్పాల్సి వచ్చినప్పుడు ఆ పని సాధ్యం కాక మనిషి తిరగాల్సి వచ్చినప్పుడు మెడ ఎంత కీలకమైనదో తెలిసి వస్తుంది. దీనికి చికిత్స సులభమే కానీ దానికి ముందు ఒక నిర్ధారణకు రావడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. ప్రాథమికంగా ఎక్స్-రే తీస్తారు. ఇందులో మెడ ఎముక ఒక చోట ములుకులా పొడుచుకురావడం, లేదా ఎముకకు సంబంధించి ఇతర అపసవ్యతలు తలెత్తినా తెలుసుకోవచ్చు. ఎక్స్-రే ద్వారా కచ్చితంగా నిర్ధారించలేని సందర్భాలలో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ (సి.టి. స్కాన్) ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా నరాల స్థానాల్లో వెంట్రుక వాసి తేడా వచ్చినా కూడా స్పష్టంగా తెలుస్తుంది మైలోగ్రామ్ పరీక్షలో ఇంజక్షన్ ద్వారా రంగును వెన్నులోకి పంపించి ఆ తర్వాత సి.టి స్కాన్ లేదా ఎక్స్-రే పరీక్షలు చేస్తారు. రంగు విస్తరించడంతో ఏర్పడిన ఆకారాన్ని బట్టి వెన్నుపూసలలో వచ్చిన తేడాను తెలుసుకుంటారు. మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి వస్తే నరాల పనితీరును కూడా పరీక్షిస్తారు. వీటిలో... ఎలక్ట్రో మయోగ్రామ్ (ఇఎమ్జి) పరీక్ష ద్వారా కండరాలకు కొన్ని సంకేతాలను పంపించి నరాల స్పందనను అధ్యయనం చేస్తారు. దాంతో నరాల పనితీరు సాధారణంగానే ఉందా, తేడా ఉందా అనే వివరాలు తెలుస్తాయి. చికిత్స: నొప్పి నివారణకు, నరాలు శక్తిమంతం కావడానికి మందులు వాడుతూ ఫిజియోథెరపీ (మెడకు వ్యాయామం) చేస్తే సమస్య తగ్గిపోతుంది. చాలా కొద్ది సందర్భాలలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. -
ఈనాటి రోగాలు... ఏనాటివో!
పరిశోధన ఆధునిక జీవనశైలి, అలవాట్ల వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని మనం తరచుగా అంటుంటాంగానీ, అసలు ఈ జీవనశైలి లేని కాలంలో కూడా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయని తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. కొంతకాలం క్రితం కొన్ని ఈజిప్ట్ మమ్మీలను సీటీ స్కాన్ చేసి పరిశోధించారు. ఇప్పుడు ఏవైతే గుండెకు సంబంధించిన రుగ్మతలు ఎదుర్కొంటున్నామో, ఆ రకమైనవే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్లు ఎదుర్కొన్నారని పరిశోధనలో బయటపడింది. అయితే ఇది కేవలం ఈజిప్షియన్లకే పరిమితమా? ఇతరులలో కూడా ఉందా? అనే కోణంలో భిన్న సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న అయిదు రకాల మమ్మీలను ఇటీవల పరిశోధనకు ఎంచుకున్నారు. పరిశోధన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, ఈజిప్షియన్లతో పోల్చితే మిగిలిన వారు భిన్నంగా ఏమీ లేరని. మంటలతో పుల్లలు అంటించి అప్పటి మనుషులు పొగ పీల్చేవారు. ఈ విషయంలో మహిళలు ముందు ఉండేవారు. అందుకే గుండెకు సంబంధించిన రుగ్మతలు వారిలో ఎక్కువగా కనిపించాయి. ‘‘స్థూలకాయం అనేది నిన్న మొన్నటి సమస్యలాగే మాట్లాడుతుంటాం. నిజానికి ప్రాచీన మానవుల్లో ఆ రోజుల్లోనే ఇది కనిపిస్తుంది’’ అంటున్నారు క్యాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ మెమోరియల్ మెడికల్ డెరైక్టర్ డా.జార్జ్ థామస్. ‘‘రోగలక్షణాలు ఒకటే అయినప్పటికీ రోగానికి దారి తీసే ప్రధాన కారణాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి’’ అనేది ఆయన విశ్లేషణ. మనతో పోల్చితే ఆనాటి ఈజిప్షియన్లు చురుగ్గా ఉండేవారు, శ్రమించే తత్వం కూడా వారికి ఎక్కువగానే ఉండేది. పిజ్జాలు, మందు, సుఖసాధనాలు లేని ఆకాలంలో ఈనాటి వ్యాధులు ఎలా వచ్చాయి? ఈ సందేహానికి పరిశోధకులు ఇలా చెబుతున్నారు... ‘‘అపరిశుభ్రత, పారిశుధ్యం లోపించడం, కలుషిత నీరు, జంతువులకు దగ్గరగా నివసించడం మొదలైన కారణాలు రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉండి ఉంటాయి’’. -
శరీరానికే వైకల్యం... చెదరనివ్వకు మనోబలం
పక్షవాతం ఎంత ప్రమాదకరమైనదంటే... ఇది వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరు శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు. ఇవీ పక్షవాతం తీవ్రతకు అద్దం పట్టే అంకెలు. ఒకసారి పక్షవాతం బారిన పడితే ఇక వారు జీవితాంతం పక్క మీద పడీ, పక్కవాళ్ల మీద ఆధారపడీ జీవించాల్సిన దుస్థితి అనుకుంటారందరూ. అందుకే గుండెపోటుకూ భయపడనివారు, పక్షవాతం అంటే వణికిపోతుంటారు. అయితే మనోబలం చెడనివ్వకపోవడం, చిరునవ్వు చెరగనివ్వకపోవడాలే దీనికి అసలైన చికిత్సలు. అంతకంటే పెద్ద చికిత్స, సమర్థమైన చికిత్స నివారణే. పైగా ఈ నివారణ చాలా సులభం కూడా. ఈ నెల 29న ప్రపంచ పక్షవాత దినం (వరల్డ్ స్ట్రోక్ డే) సందర్భంగా పై అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ కథనం. పక్షవాతం వస్తే శాశ్వతంగా అంగవైకల్యం కలగడానికి ఒక కారణం ఉంది. ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా చనిపోయినా ఆ కణం స్థానంలో కొత్త కణాలు పెరిగే అవకాశం ఉంది. కానీ మెదడు కణాలు మాత్రం అలా కాదు. అవి ఒకసారి నశించాయంటే ఇక ఆ నష్టం శాశ్వతం. అందుకే పక్షవాతం వచ్చి, కాళ్లూ చేతులు చచ్చుబడిపోతే అవి సాధారణ స్థితికి రావడం ఒక పట్టాన అసాధ్యం. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించగానే రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఒక కుటుంబంలో ఎవరైనా, ఏదైనా వ్యాధికి గురైతే అది వారిని మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ పక్షవాతానికి గురైతే మాత్రం అది మొత్తం కుటుంబ సభ్యులనందరినీ ప్రభావితం చేస్తుంది. అందరికీ ఇక్కట్లను కలగజేస్తుంది. గతంలో ఒక వయసు దాటినవారు పక్షవాతానికి గురయ్యేవారు. కానీ ఇప్పుడు యుక్తవయసులోని వారు కూడా దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం. పక్షవాతానికి కారణాలు: మన శరీరంలోని ప్రతి అవయవానికీ రక్తం నిరంతరం సరఫరా అవుతుండాలి. ఇక మెదడు విషయంలోనైతే అది మరింత అవసరం. ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు మరణించడం జరుగుతుంటుంది. రక్తసరఫరాలో అంతరాయానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది... రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అడ్డుపడటం. దాదాపు 80 శాతం పక్షవాతం కేసుల్లో ఇదే కారణం. ఇక ఒక్కోసారి రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తం బయటకు ప్రవహించడంతో మెదడులోని కొన్ని కణాలకు రక్తసరఫరా అందకపోవడం. దాదాపు 20 శాతం కేసుల్లో పక్షవాతానికి ఈ కండిషన్ కారణమవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగినపోషకాలు, ఆక్సిజన్ అందక ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో అవి నియంత్రించే శరీర భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు: పక్షవాతంలోని లక్షణాలు మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మెదడులోని కాళ్లూ, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడతాయి. అలాగే ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావచ్చు. దీనివల్ల మాట పడిపోవడం, నిలకడగా/స్థిమితంగా నిలవలేకపోవడం, చూపుకోల్పోవడం, స్పృహకోల్పోవడం కూడా జరగవచ్చు. దాదాపు 90 శాతం కేసుల్లో అకస్మాత్తుగా శరీరంలోని ఒకవైపు సగభాగంపై నియంత్రణ కోల్పోవడం ద్వారా దీని లక్షణాలు బయటపడతాయి. దాంతో పక్షవాతం సోకిన వ్యక్తుల్లో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం మామూలే. అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని తప్పనిసరిగా ‘పక్షవాతం’ (స్ట్రోక్)గానే పరిగణించాలి. (నిర్దిష్టంగా అది పక్షవాతం కాదని కచ్చితంగా తెలిసే వరకూ అది పక్షవాతమేనని వైద్యశాస్త్రం పేర్కొంటోంది). మనిషిలో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం వల్ల అతడు నిరాశ, నిస్పృహల్లోకి కూరుకపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని శరీరభాగాల్లో నొప్పి, మూత్రం/మలంపై నియంత్రణ కోల్పోవడం, ఎదుటివారితో కమ్యూకేషన్కు అంతరాయం కలగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అయోమయం వంటి లక్షణాలూ ఉంటాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల సంబంధాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దారితేసే అంశాలు: భారతదేశంలో పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో హైబీపీ (రక్తపోటు) చాలా సాధారణమైనది / ప్రధానమైనది. ఈ పరిస్థితికి పొగతాగడం, స్థూలకాయం, డయాబెటిస్, ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, గుండెజబ్బులు, మితిమీరిన ఆల్కహాల్ అలవాటు, మానసిక ఒత్తిడి, శారీరకంగా తగినంత వ్యాయామం లేకపోవడం, కొద్దిమేరకు కుటుంబ చరిత్ర వంటివి పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో ముఖ్యమైనవి. నిర్ధారణ: పక్షవాతాన్ని సీటీ స్కాన్ పరీక్ష లేదా ఎమ్మారై (బ్రెయిన్) ద్వారా నిర్ధారణ చేయవచ్చు. సీటీ స్కాన్, ఎమ్మారై ద్వారా పక్షవాతం వల్ల ప్రభావితమైన మెదడులోని ప్రాంతాలను గుర్తించవచ్చు. అలాగే రక్తస్రావం జరిగినా లేదా రక్తనాళాల్లో రక్తపు గడ్డలు అడ్డుపడినా ఆ పరీక్షలో తెలుస్తుంది. దాన్ని బట్టే చేయాల్సిన చికిత్స/కోలుకోగలిగే అవకాశాల (ప్రోగ్నోసిస్)ను నిర్ధారణ చేయవచ్చు. ఒకసారి పక్షవాతం వచ్చిందని నిర్ధారణ అయ్యాక, దానికి కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సీబీపీ, రక్తంలో చక్కెర పాళ్లు (బ్లడ్ షుగర్), క్రియాటినిన్ వంటి రక్షపరీక్షలు, ఈసీజీ, టూ డి ఎకో వంటి గుండె పరీక్షలు, డాప్లర్ నెక్ వెసెల్స్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు, మూత్ర పరీక్ష వంటివి చేయాల్సి ఉంటుంది. రక్తంలో ఒక రకం ప్రొటీన్లయిన హోమోసిస్టిన్ వంటి వాటిని అంచనా వేసే పరీక్ష, ప్రో-కోయాగ్యులెంట్ ఫాక్టర్స్ (రక్తం గడ్డకట్టడానికి దోహదపడే అంశాల) పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. ఇలా నిర్దిష్టంగా పక్షవాతానికి కారణాన్ని కనుగొంటే దాన్ని బట్టి చికిత్స చేయడం సులభం. ఒక్కోసారి పక్షవాతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తాత్కాలికంగా కనబడితే... త్వరలోనే మరింత తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోడానికి అది సూచనగా పనిచేస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిలో 30 శాతం కంటే ఎక్కువమందిలో ఏడాదిలోపే మరింత తీవ్రంగా మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స: పక్షవాతం వచ్చిన వారికి థ్రాంబోలైటిక్ థెరపీ అనే చికిత్సను అందజేస్తారు. ఈ చికిత్సప్రక్రియలో టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే ఇంజెక్షన్ ఇస్తారు. అది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్న చోట ఆ రక్తపు గడ్డను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో రక్తపు గడ్డ అడ్డుతొలగి, మళ్లీ మెదడులోని ఆ భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే పక్షవాతం లక్షణాలు కనిపించాక ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇస్తే నష్టం అంత తక్కువగా ఉంటుంది. పక్షవాతం లక్షణాలు కనిపించాక కనీసం నాలుగున్నర గంటలలోపే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. కోలుకోవడం వేగంగా జరగడంతో పాటు, దుష్ర్పభావాలు తక్కువగా ఉంటాయి. అయితే ఒకసారి పక్షవాతం రావడం అంటూ జరిగితే ఇక రెండోసారి రాకుండా నివారించడమే దీనికి చికిత్సగా పరిగణించవచ్చు. (మొదటిసారి వచ్చిన పక్షవాతం నష్టనివారణ కోసం చేయాల్సిన చికిత్స అంటూ పెద్దగా ఉండదు). ఇందులో భాగంగా రక్తాన్ని పలచబార్చే మందులైన ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటివి ఇవ్వడం, రక్తంలో కొవ్వులు పేరుకోకుండా వాడే స్టాటిన్స్ వంటి మందులు వాడటం... చికిత్సలో భాగంగా ఇస్తారు. ఒకసారి పక్షవాతం కనిపిస్తే పైన పేర్కొన్న మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అయితే రోగికి హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే ఆ మందులు కూడా వాడటం అవసరం. ఒకసారి గుండె సమస్యలు లేదా మెదడుకు రక్తాన్ని చేర్చే కెరోటిడ్ లేదా వర్టిబ్రల్ రక్తనాళాల్లో ఏదైనా సమస్యలు గుర్తిస్తే... పక్షవాతాన్ని నివారించేందుకు వీలుగా మందులు వాడాల్సింది. ఒకవేళ ఆ రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువ అడ్డంకి (బ్లాక్) ఉంటే స్టెంటింగ్ లేదా శస్త్రచికిత్స అవసరమవుతుంది. పక్షవాతం బాధితుల పరిస్థితిని మెరుగుపరచడానికి ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ వంటివి చాలావరకు ఉపయోగపడతాయి. నివారణ: పక్షవాతం విషయంలో చికిత్స గురించి ఆలోచించడం కంటే నివారణ ఎంతో మేలు. ఇది చిన్నప్పట్నుంచే మొదలు కావాలి. నివారణ మార్గాలు కూడా చాలా సులభం. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఆహారంలో కొవ్వులు/ నూనెలు /మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత పైనుంచి ఉప్పు వేసుకోవడం అలవాటును మానుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు వంటి పోషకాహారాలను తీసుకోవాలి. కూరల్లో పసుపు ఎక్కువగా వాడటం పక్షవాతం నివారణకు బాగా మేలు చేస్తుంది. శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. తాజా అధ్యయనాల ప్రకారం వంటకు ఆలివ్ ఆయిల్ వాడటం, ముదురు రంగులో ఉండే చాక్లెట్లు పక్షవాతం నివారణకు ఉపయోగపడతాయని తేలింది. ఒకసారి పక్షవాతం వచ్చాక దాన్ని నయం చేసుకునేందుకు అనేక ప్రత్యామ్నాయ వైద్యవిధానాలను అనుసరించడం మన దేశంలో చాలా ఎక్కువ. అయితే అవేవి పెద్దగా సత్ఫలితాలను ఇవ్వవు. గుండెజబ్బుల వంటివి ఉన్నప్పుడు మొదట్నుంచీ రక్తాన్ని పలుచబార్చే మందుల్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల పక్షవాతాన్ని చాలావరకు సమర్థంగా నివారించుకోవచ్చని గుర్తుంచుకోవాలి. పక్షవాతానికి గురైన తర్వాత ఆ శరీర భాగానికి మసాజ్ వంటివి మన దేశంలో ఎక్కువ. అయితే వాటి వల్ల ఉండే ఉపయోగం పరిమితమే అని గుర్తుంచుకొని, నిరాశకు గురికాకుండా/మానసికంగా కుంగిపోకుండా ఉండాలి. ఒకసారి పక్షవాతానికి గురయ్యాక కోలుకోవడం లేదా నయం కావడం మెదడులో దెబ్బతిన్న భాగం ఏ మేరకు కోలుకుంటుందన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక వయసు దాటాక గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్న పెద్దవారు ఆ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే నివారణ సాధ్యం. - నిర్వహణ: యాసీన్ ఈ పరిస్థితి మారడమే ఇప్పటి అవసరం... రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 40,000 మంది బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం వంద మందికి లోపే టీపీఏ చికిత్స తీసుకోగలుగుతున్నారు. అందులోనూ 80 శాతంమందికి పైగా కేవలం హైదరాబాద్‌లోనే ఈ చికిత్స పొందగలుగుతున్నారు. ఇక మిగతా ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలో అడపాదడపా మాత్రమే ఈ చికిత్స అందుతోంది. దీనికి ప్రధాన కారణం బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఇవ్వాల్సిన ఈ చికిత్సపై పెద్దగా అవగాహన లేకపోవడమే. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
సైనసైటిస్ హోమియో చికిత్స
వాతావరణ మార్పులు జరిగే వర్షాకాలం, శీతాకాలం ప్రవేశించినప్పుడు సైనస్ అనే మాటను, ఆ వెంటే... సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషనే శరణ్యం అని తరచు వింటూ వుంటాం. అయితే ఆపరేషన్ తరువాత కూడా ఇది మరల మరల వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుందని దీని బారిన పడినవారు అంటూ వుంటారు. ఒక్క యూఎస్‌లోనే 24 మిలియన్ కు పైన దీనిబారిన పడుతుంటారు. దీనిని మూడు విభాగాలుగా మనం చూడవచ్చు. Acute వచ్చి ఒకవారం రోజులు ఉంటుంది Sub acute 48 వారాలు ఉంటుంది. Chronic- దీర్ఘకాలిక సైనసైటిస్. ఇది 8-10 వారాల పైన ఉంటుంది. సైనసైటిస్... ఇది 90 శాతంమందిలో కనిపించే సాధారణ సమస్య. దాదాపుగా ప్రతిమనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్ వలన, వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్ఫ్లుయెంజా వలన వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నివారించడమే కాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నిరోధించవచ్చు. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగం ఇన్ఫెక్షన్లతో వాచిపోవడాన్ని ‘సైనటైసిట్’ అంటారు. సైనస్ రకాలు... ఫ్రంటల్ పారానాసల్ ఎత్మాయిడల్ మాగ్జిలరీ స్ఫినాయిడల్. ఇవి కుడి, ఎడమగా రెండు జతలుంటాయి. కారణాలు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శ్వాసకోశ వ్యాధులు ముక్కులో దుర్వాసన ముక్కులో దుర్వాసన పెరుగుదల అలర్జీ పొగ విషవాయువుల కాలుష్యం వాతావరణ కాలుష్యం అకస్మాత్తుగా వాతావరణ మార్పులు చలికాలం, వర్షాకాలం గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం మంచు ప్రదేశాలు: కొడెకైనాల్, ఊటీ, జమ్ముకాశ్మీర్, మనాలి, ముస్సోరి వంటి చోట్లకు వెళ్లడం నీటిలో ఈదటం జలుబు, గొంతునొప్పి పిప్పిపన్ను టాన్సిల్స్ వాపు రోగనిరోధకశక్తి తగ్గటం. వ్యాధి లక్షణాలు ముఖంలో భారంగా ఉండటం, తలనొప్పి, బరువు, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు దురద, నీరు కారటం, గొంతులోనికి ద్రవం కారటం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక స్థైర్యం కోల్పోవటం, అలసట, విసుగు పనిపై శ్రద్ధ లేకుండటం, హోరు, దగ్గు. వ్యాధి నిర్ధారణ ఎక్స్‌రే ముఖ్యంగా ఇతర వ్యాధులతో కలిసి సైనసైటిస్ రావచ్చు. సైనస్ భాగంలో నొక్కితే నొప్పి సీటీ స్కాన్ ఇతర దుష్పరిణామాలు దీర్ఘకాలికంగా సైనసైటిస్ వ్యాధితో బాధపడేవాళ్లలో కనురెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరిగినట్లుండటం, కంటినరం దెబ్బతిని, తద్వారా చూపు కోల్పోవటం, వాసనలు తెలియకపోవటం, తరచు వచ్చే జ్వరం, ఎదుగుదల లోపాలు రావచ్చు. మానసికంగా ధైర్యం కోల్పోవటం జరగవచ్చు. సైనసైటిస్‌ను ఇలా నివారించవచ్చు నోటిని తరచు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం. అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండి, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని చుట్టూ నీరు, బురద లేకుండా ఉంచుకోవడం. ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీస్తాయి. చల్లని పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం, వేడి ఆవిరి పట్టడం వలన కొంతవరకు నివారించవచ్చు. హోమియో చికిత్స హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కాలిబైక్, కాలిసల్ఫ్, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్ న్యురియా, లెమ్నా మైనర్, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి. హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సైడ్ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స ఉంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ అలర్జీ సెంటర్ ద్వారా ఎన్నో కేసుల్లో పూర్తిగా స్వస్థత కలిగించాం. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 9030081875 / 903000 8854