న్యూఢిల్లీ: కోవిడ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో చాలామంది కరోనా అనుమానంతో లక్షణాలు లేకపోయినప్పటికి సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. కరోనా లక్షణాలు లేని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అన్నారు. ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.
అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సీటీ స్కాన్ చేయించుకోవాలి అని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోవచ్చన్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని గులేరియా తెలిపారు.
చదవండి: కరోనా వేళ.. గుంపులుగా జనాలు
Comments
Please login to add a commentAdd a comment