ఇప్పటివరకు ఉన్న అల్ట్రాసౌండ్ స్కానర్ల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్నవన్నీ 2డీ స్కానర్లే. గర్భంలోని శిశువు, గుండె, ఇతర అవయవాల త్రీడీ చిత్రాలతో వైద్య రంగంలో ఎన్నో ఉపయోగాలున్న విషయం తెలిసిందే. కాకపోతే వీటి ఖరీదెక్కువ. తాజాగా దాదాపు కోటిన్నర రూపాయలు విలువ చేసే త్రీడీ అల్ట్రాసౌండ్ యం త్రం లక్షల్లో వచ్చేలా చేశారు డ్యూక్, స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు. ఇందుకు మన స్మార్ట్‌ఫోన్లలో ఉండే యాక్సెలరోమీటర్ సాయం తీసుకున్నారు. ఫోన్ ఏ పొజిషన్‌లో ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
వెయ్యి రూపాయలు ఖరీదు చేసే మైక్రోప్రాసెసర్‌తో దీన్ని 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు అనుసంధానించడం ద్వారా త్రీడీ ఇమేజింగ్ చేయగలిగామని, ఇది సీటీ స్కాన్, ఎంఆర్‌ఐలకు ఏమాత్రం తీసిపోదని జోషువా బ్రూడర్ అనే శాస్త్రవేత్త వివరించారు. ‘మా అబ్బాయి వీడియే గేమ్స్ ఆడుతుంటే దాని కం ట్రోలర్ నన్ను ఆకట్టుకుంది. కన్సోల్ స్థానాన్ని కచ్చితంగా గుర్తుపట్టే సామర్థ్యాన్ని 2డీ అల్ట్రాసౌండ్‌కు అందించాలన్న ఆలోచనతో మా ప్రాజెక్టు మొదలైంది’అని ఆయన పేర్కొన్నారు. 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు ఓ ప్లాస్టిక్ ఉపకరణాన్ని అనుసంధానిస్తే, అందులోని మైక్రో ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment