యశోద ఆస్పత్రికి కేసీఆర్‌.. | CM KCR Visits Yashoda Hospital For Chest CT Scan | Sakshi
Sakshi News home page

యశోద ఆస్పత్రికి కేసీఆర్‌..

Published Wed, Apr 21 2021 7:55 PM | Last Updated on Wed, Apr 21 2021 8:58 PM

CM KCR Visits Yashoda Hospital For Chest CT Scan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్‌ సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్‌కు 6 రకాల వైద్య పరీక్షలు చేశారు యశోదా వైద్యులు. సీ-రియాక్టివ్‌ ప్రొటిన్స్‌ (సీఆర్పీ), చెస్ట్ సీటి స్కాన్‌..డీడైమర్‌, ఇంటర్ ల్యుకిన్ (ఐల్‌-6), లివర్ ఫంక్షన్‌ టెస్‌(ఎల్‌.ఎఫ్‌.టి)కంప్లీట్‌ బ్లడ్ పిక్చర్‌(సీబీపీ) పరీక్షల చేశారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్‌ తిరిగి ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. 

కేసీఆర్‌ వస్తుండటంతో సోమాజిగూడ ఆస్పత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి చుట్టు పక్కల హై అలర్ట్  ప్రకటించారు. కరోనా పాజిటివ్ అనంతరం కేసీఆర్‌ మొదటిసారి ఆసుపత్రికి వచ్చారు. ఇక కేసీఆర్‌ ఆస్పత్రికి వస్తుండటంతో కేటీఆర్‌ ముందుగానే అక్కడకు చేరుకున్నారు.

కరోనా నిర్థారణ అయిన తర్వాత కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన సాగర్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నోముల భగత్‌కు మద్దతుగా హాలియాలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కాగా, నోముల భగత్‌కు, ఆయన కుటుంబానికి కూడా  కరోనా సోకిన సంగతి విధితమే.

చదవండి: కేసీఆర్‌ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్‌బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement