పాట్నా: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో కరోనా ఆసుపత్రుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం అన్ని చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో బీహార్‌లోని పాట్నా, ముజఫర్‌పూర్‌లలో కోవిడ్-19 రోగుల కోసం పీఎం ఫండ్‌తో ఆసుపత్రిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణాన్ని డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ ఆసుపత్రిలో 125 ఐసీయూ బెడ్‌లు, 375 నార్మల్ బెడ్‌లు ఉన్నాయి. ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీని గురించి పీఎంఓ ఆఫీసు మాట్లాడుతూ, ఈ ఆసుపత్రికి కావాల్సిన సిబ్బందిని ఆర్మీ మెడికల్ సర్వీస్ నుంచి తీసుకురానున్నట్లు తెలిపారు. బిహతా, పట్నాలలో 500 పడకల ఆసుపత్రిని ఈరోజు ప్రారంభించారు. ముజఫర్ నగర్‌లో మరో 500 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించనున్నారు.
PM-CARES Fund Trust has decided to allocate funds for fight against COVID-19 by way of establishment of 500-bed COVID-19 Makeshift Hospitals at Patna & Muzaffarpur, Bihar by DRDO. This will go a long way in improving COVID care in Bihar. pic.twitter.com/AAPEIDDcRc
— PMO India (@PMOIndia) August 24, 2020
చదవండి: ప్లాస్మా థెరపీ: అమెరికా ఆమోదం!
Comments
Please login to add a commentAdd a comment