పాట్నా : భారత్‌లో కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ రాష్ర్టంలో కోవిడ్ కారణంగా మొదటిసారిగా ఓ జడ్జి కన్నుమూశారు. వివరాల ప్రకారం.. పట్నా కుటుంబ న్యాయస్థానం ప్రిన్సిపల్ జడ్జి హరిశ్చంద్ర శ్రీవాస్తవ (58) శ్వాస సంబంధిత సమస్యలతో బుధవారం ఎయిమ్స్‌లో చేరగా కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
శ్రీవాస్తవ మృతిపట్ల బిహార్ జుడీషియల్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి అజిత్ కుమార్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్తవ మరణించడం తీరని లోటని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లా శ్రీనివాస్తవ స్వస్థలం. బిహార్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా ఎంపికైన తర్వాత 1995 డిసెంబర్ 16న న్యాయవ్యాదిగా ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2022 జూలై 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా కోవిడ్-19 బారిన పడి అకాలమరణం చెందారు. (బిహార్‌లో వరద బీభత్సం: 21 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment