పాట్నా: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వేలల్లో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బిహార్ రాజధాని పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో 87 మంది వైద్యులు కొవిడ్ బారినపడడం కలకలం సృష్టించింది. ఎన్ఎంసీహెచ్‌లో మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. శనివారం 12 మందికి, ఆదివారం మరో 75 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వీరిలో అయిదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగిలినవారంతా ఆస్పత్రి క్యాంపస్‌లోనే ఐసొలేషన్ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
చదవండి:ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపట్టండి..
కాగా కరోనా బారినపడిన వైద్యుల్లో చాలామంది డిసెంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఐఎంఏ జాతీయ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 33, 750 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 123మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
చదవండి: సీఎం ఎదుటే కొట్టుకున్నంత పనిచేసిన డిప్యుటీ సీఎం, ఎంపీ.. వైరల్ వీడియో
చదవండి: కరోనా కల్లోలం.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment