
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద సేవలందిస్తున్న 640 నెట్‌వర్క్ ఆస్పత్రులకు జనవరి 15 నాటికి ఉన్న బిల్లులు రూ.238.15 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద సకాలంలో బిల్లులు ఇస్తున్నామని, దీనివల్ల ఆరోగ్యశ్రీ సేవలు పటిష్టంగా అమలవుతున్నాయన్నారు. రూ.238.15 కోట్ల సొమ్మును రెండు దఫాలుగా వారి ఖాతాలకు జమచేసినట్టు సీఈవో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపారు.
చదవండి: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
కొత్త నమూనాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు