Aarogyasri Scheme
-
కనీస వేతనం ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి/మంగళగిరి/మంగళగిరి టౌన్: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని వైద్యసేవ ట్రస్ట్ సీఈఓ రవి పటాన్శెట్టిని వైద్యమిత్రలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ట్రస్ట్ కార్యాలయం ముందు గురువారం వైద్యసేవ క్షేత్రస్థాయి సిబ్బంది పెద్దఎత్తున ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆరోగ్యమిత్రలు తరలివచ్చి ఆందోళన చేశారు. బీమా విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మిత్రల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీమా ప్రతిపాదనల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు సీఈఓను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వారి డిమాండ్లు..⇒ వైద్యమిత్రలకు కేడర్ కల్పించాలి.. బీమా విధానాన్ని అమలుచేయాలి.. ⇒ డిగ్రీ, పీజీలు చదివి ప్రభుత్వ సేవల్లో ఉన్న తమకు ఉద్యోగ భద్రతలేదు..⇒ 17 సంవత్సరాలు దాటిన వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి డీపీఓ కేడర్ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వాలి..⇒ ఉద్యోగి మృతిచెందితే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలి..⇒ అందరికీ సర్వీసు వెయిటేజీ కల్పించాలి..⇒ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలి.ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి..ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలులో ఆరోగ్యమిత్రల పాత్ర కీలకం. మా సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు కనీస వేతనాలు అందజేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను అమలుచేసి ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి. – ఎం ప్రత్యూష, గుంటూరుఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి..ప్రభుత్వానికి, ఆస్పత్రులకు, రోగులకు అనుసంధానంగా వుండే ఆరోగ్యమిత్రల సమస్యలు పరిష్కరించడంతో పాటు కనీస వేతనం అమలుచేయాలి. ఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి. ఇటీవల మృతిచెందిన ఆరోగ్యమిత్రల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. – జీ నాగరాజు, ఆసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉంటున్నాంఆరోగ్యమిత్రల సేవలను గుర్తించి ప్రభుత్వం కనీసం వేతనాలు అమలుచేయాలి. మేం ఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉండి ఆరోగ్యశ్రీ అమలులో ఎంతో సేవచేస్తున్నాం. రోగులను ఆస్పత్రుల్లో చేర్చడమే కాక వారికి ఆరోగ్యశ్రీ అమలులో కీలకపాత్ర పోషిస్తున్నాం. – సత్యలక్ష్మి, ఆశ్రం ఆసుపత్రి, ఏలూరు -
ఆరోగ్యశ్రీ దళారీకి దాఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకాన్ని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొద్ది నెలలుగా వైద్య సేవ ట్రస్ట్‌లో బీమా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ని ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు రూ.2.5 లక్షల కవరేజీతో ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించి బీమాకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కిందకు వస్తున్నాయి. ఈ కుటుంబాలను సగంగా విభజించి శ్రీసత్యసాయి నుంచి గుంటూరు వరకూ ఒక జోన్, ఎన్టీఆర్ నుంచి శ్రీకాకుళం వరకూ మరో జోన్ కింద పరిగణించనున్నారని తెలిసింది.ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారం చేతికొచ్చాక సూపర్ సిక్స్‌ల తరహాలోనే బీమా హామీకీ తిలోదకాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని కుటుంబాలకే రూ.2.5 లక్షల మేర బీమా కల్పించనుంది.బీమా.. ఒక విఫలయత్నం దేశంలోనే మొదటిసారిగా రూ.25 లక్షల వరకూ కవరేజీతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. అప్పటి వరకూ రూ.5 లక్షల వరకూ ఉన్న కవరేజీని రూ.25 లక్షలకు పెంచారు. అంతేకాకుండా 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్లతో మొక్కుబడిగా అమలైన పథకాన్ని ఏకంగా 3,257 ప్రొసీజర్లతో బలోపేతం చేశారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. అలాంటి పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీమా విధానం విఫలమై తిరిగి ఏపీ తరహా ట్రస్ట్ విధానంలోకి మారారు. ఇప్పటికే పలు చోట్ల విఫలమైన ఒక విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
Cervical Cancer: అమ్మకడుపులో రాచపుండు
మనిషి పుట్టుకకు ప్రధాన అవయవమైన గర్భాశయమే పుండుగా మారుతోంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా లోలోపలే ఇబ్బంది పెడుతోంది. అనంతరం క్యాన్సర్‌గా మారి అమ్మనే కబలిస్తోంది. ప్రాథమిక దశలో దీనిని గుర్తిస్తే ప్రాణాలతో బయట పడవచ్చు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత గుర్తిస్తే మాత్రం ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఈ వ్యాధిపై అవగాహన లేక చాలా మంది మహిళలు తమలోపల క్యాన్సర్ ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జనవరి మాసాన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను వైద్యపరిభాషలో సెర్వికల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా, మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్ వైద్యుల వద్దకు ప్రతిరోజూ 120 నుంచి 150 మంది వరకు కొత్తగా క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. కర్నూలులో ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 20 నుంచి 30 మందికి కీమోథెరపీ, 40 మందికి రేడియోథెరపీ చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో నిత్యం 150 నుంచి 200 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెర్వికల్ క్యాన్సర్) బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 60 వేలకు పైగా ఉంటుందని వైద్యుల అంచనా. పేదరోగులకు అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ)లో ఉచితంగా వైద్యం అందుతోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణాలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రధానంగా హ్యూ మన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. ఇదే గాక తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడ ం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు. ఈ క్యాన్సర్ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా వస్తోంది. నివారణ చర్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 ఏళ్ల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70 శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్ లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు జనవరి మాసాన్ని సర్వికల్ క్యాన్సర్ అవగాహన మాసంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి. వ్యాధి లక్షణాలు ⇒ రుతుక్రమంలో సమస్యలు.. యోని నుంచి రక్తస్రావం ⇒ లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ⇒పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ⇒ యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ⇒ మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి వివాహమైన మహిళలు ఏటా గర్భాశయ ముఖద్వారంలో పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ మేరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. దీనికి తోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80 శాతం వరకు ఈ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. సాధారణంగా మహిళలకు హెచ్‌పీవీ వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. – డాక్టర్ టి.జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలుప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజీ విభాగానికి గైనిక్ సమస్యలతో వచ్చే ప్రతి వంద మంది మహిళల్లో ఇద్దరు, ముగ్గురికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంటోంది. ఓపీకి వచ్చే వారికి పాప్‌స్మియర్ పరీక్షను చేస్తున్నాం. ఇందులో అసాధారణంగా కనిపించే వారికి కాల్పోస్కోపి టెస్ట్ ద్వారా బయాప్సీ తీసి పంపిస్తున్నాం. అందులో క్యాన్సర్‌గా నిర్ధారణ అయితే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా లక్షణాలు ఉన్నా లేకపోయినా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి వారికి చికిత్స ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. – డాక్టర్ పి.స్నేహ, అసిస్టెంట్ ప్రొఫెసర్, గైనకాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు -
ఆరోగ్యశ్రీ పై అంత కక్ష ఎందుకు.. బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
ఆరోగ్యశ్రీ పథకంపై ఎందుకింత కక్ష?... చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇందులో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టింది. నిర్వీర్యం చేసే ఉద్దేశం లేకపోతే ఆస్పత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డి మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా గత ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి ఈ పథకాన్ని దెబ్బ కొడుతున్నారని ధ్వజమెత్తారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా, ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టు పెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన 17 వైద్య కళాశాలలపై స్కామ్‌లు చేస్తూ చంద్రబాబు మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదా?చంద్రబాబూ.. ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా.. అలాంటి కంపెనీలకే ఆరోగ్యశ్రీని అప్పగిస్తే వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే కంపెనీల ధ్యేయం అయినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంత వరకు మనుగడలో ఉంటాయి? కోవిడ్ వంటి కొత్త రోగాలు, అరుదైన వ్యాధులు, ప్రమాదాల సమయంలో గత ప్రభుత్వం విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకం కింద ప్రొసీజర్ల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి అనేక మార్లు ఎంతో మందిని ఆదుకున్నాం. ఈ పని ప్రైవేటు కంపెనీలు చేయగలవా? మీ ప్రభుత్వం చేయించగలదా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు (చంద్రబాబు) ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోవడం వాస్తవం. ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి?నాలుగు సార్లు సీఎం అయ్యానని చంద్రబాబు గొప్పలు చెబుతుంటారు. అయితే పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఏనాడైనా అనుకున్నారా? కనీసం ఏరోజైనా ఆ ప్రయత్నం చేశారా? దివంగత మహానేత వైఎస్సార్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక్కపనైనా చేశారా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్సలు అందించే ప్రొసీజర్లను 1,000 నుంచి 3,257కి పెంచింది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చి మధ్యతరగతి వారికీ మేలు చేశాం. రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేస్తూ, ఐదేళ్లలో 45.1 లక్షల మందికి రూ.13,421 కోట్లతో ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, విశ్రాంతి సమయంలో రోగులకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. దీని కింద 24.59 లక్షల మందికి మరో రూ.1,465 కోట్లు అందించాం. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్త అంబులెన్స్‌లతో 104, 108 సేవలను మెరుగుపరిస్తే, చంద్రబాబు నెలల తరబడి బకాయిలుపెట్టి అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారు.బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటీ.. అని చంద్రబాబు ఎన్నికల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను దుర్మార్గంగా ఎగరగొడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలనూ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా.. ఉన్న గ్యారంటీనీ తీసేశారు. ప్రజలకు నష్టంచేసే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. -
10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం!
సాక్షి, హైదరాబాద్: పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవలను నిలిపివేస్తామని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు భారీగా ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలి పాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ నేతృత్వంలోని ప్రతినిధులు ఆరోగ్య శ్రీ సీఈవోకు మెయిల్ ద్వారా లేఖ పంపారు. 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 368 నెట్వర్క్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కింద రాష్ట్రంలో 368 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలను కూడా చేర్చారు. ఈ పథకాల కింద చేసే చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.672 కోట్లు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అధిక ప్రచారంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ఇప్పటివరకు రూ.920 కోట్లు చెల్లించింది. ఇందులో పాత బకాయి రూ.672 కోట్లు పోను సుమారు రూ. 250 కోట్లు మాత్రమే కొత్తగా ఈ ఏడాది కాలంలో చెల్లించిందన్న మాట. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 368 ఆసుపత్రులకు కలిపి సుమారు రూ.1000 కోట్లకు పైగా రీయింబర్స్మెంట్ రావలసి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఒక్కో ఆసుపత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు గత సంవత్సరం జనవరి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ స్పష్టం చేశారు. బకాయిలు రూ.500 కోట్లే: అధికారులు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1000 కోట్లు ఉన్నాయన్న వాదనను ఆరోగ్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. రూ.500 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది కాలంలో రూ.920 కోట్లు చెల్లించామని, డిసెంబర్ చివరి వారంలో కూడా రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు. 2014– 2023 మధ్య ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు సగటున రూ.52 కోట్ల చొప్పున గత సర్కారు చెల్లిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య ప్రతి నెలా నెట్వర్క్ ఆసుపత్రులకు సగటున రూ.72 కోట్లు చొప్పున చెల్లించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. -
‘ఆరోగ్యశ్రీ’పై ఎందుకింత కక్ష బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘ఆరోగ్యశ్రీ’పై మీకు ఎందుకింత కక్ష? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? అంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారు? కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్య శ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు?..ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టుపెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైయస్సార్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలను స్కాంచేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదంటారా?’’ అంటూ ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!‘‘ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్తలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా చంద్రబాబు. మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం? కోవిడ్‌వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమందిని కాపాడుకుంది...ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుంది. మరి ప్రైవేటు కంపెనీలు ఈ పని చేయగలవా? మీరు చేయించగలరా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా? ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి?..చంద్రబాబు.. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. కాని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏరోజైనా ఆ ప్రయత్నంచేశారా? పోనీ దివంగత మహానేత వైఎస్సార్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతంచేసేలా ఒక్కపనైనా చేశారా? వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1,000 నుంచి 3,257కి పెంచాం. మేనిఫెస్టోలో వాగ్దానంచేసినట్టుగా సంవత్సరాదాయం రూ.5లక్షలలోపు ఉన్నవారికి కూడా వర్తింపచేసి మధ్యతరగతివారికీ మేలు చేశాం. రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేశాం...ఐదేళ్లకాలంలో 45.1లక్షల మందికి రూ.13,421 కోట్లు ఖర్చుచేసి ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంటుకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి, దానికింద మరో రూ.1,465 కోట్లు అందించి రూ. 24.59 లక్షల మందికి ఆరోగ్య ఆసరాగా నిలిచాం. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్తగా అంబులెన్స్‌లు తీసుకు వచ్చి 104,108 సేవలను మేం మెరుగుపరిస్తే, మీరు నెలల తరబడి బకాయిలుపెట్టి ఆ అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారు...చంద్రబాబు.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో మీరు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మీర్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఇచ్చిన హామీలను ఎలాగూ ఎగరగొడుతున్నారు. మేం ఇచ్చిన పథకాలనూ రద్దుచేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారు. ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. @ncbn గారూ… “ఆరోగ్య శ్రీ’’పై మీకు ఎందుకింత కక్ష? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 7, 2025 -
Andhra Pradesh: నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాథేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద ఔట్‌పేషెంట్ (ఓపీ), ఇన్ పేషెంట్ (ఐపీ) ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచి పోవడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘రూ. 3 వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు. వెంటనే ఆదుకుని రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలు ఆపేస్తాం’ అని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను ఆపేశాయి. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల వ్యవధిలో బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చాయి. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లతోపాటు ప్రతి నెల గ్రీన్ చానెల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది నెలలుగా చాలావరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఐపీ సేవలను కూడా నిలిపేశాయి. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు తేల్చిచెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తూ.. మరోవైపు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేయడం కోసం ప్రజారోగ్యంతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షకు పెద్దపీట వేసే కంపెనీలతో బీమా కార్యక్రమం అమలు కోసం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చర్చలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని.. చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపేసినట్టు వివరించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కాగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 1 నుంచి రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేశాయి. -
ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించేస్తోన్న కూటమి సర్కార్
-
ఆరోగ్యశ్రీని వదిలించుకునేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
-
ఆరోగ్యశ్రీ తొలగింపునకు చంద్రబాబు కుట్రలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పథకాల అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. తాజాగా కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీని తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించాలని ప్లాన్ చేస్తోంది.ఏపీలో కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీపై కుట్రలు చేస్తోంది. వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు శరాఘాతంగా మారనుంది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు ఒక్కసారిగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిమితి దాటితే బీమా కంపెనీలు వైద్య ఖర్చులు చెల్లించే అవకాశం లేదు.ఇక, వైఎస్ జగన్ హయాంలో రూ.25 లక్షల విలువైన వైద్యం కూడా ఆసుపత్రుల్లో ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు చెల్లించేది కేవలం రూ.2 నుంచి 2.5 లక్షలలోపే ఉంటుంది. దీంతో, పేదలు వైద్యం కోసం మళ్లీ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రానుంది. మరోవైపు.. చంద్రబాబు నిర్ణయాలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. -
ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
ఆరోగ్యశ్రీకి మంగళం!
-
బాబు హయాంలో కన్నా.. YSRCP హయాంలో తలసరి ఆదాయం పెరిగింది
-
ఆంధ్రప్రదేశ్ లో 108, 104 సేవలు అటకెక్కాయి: Vidadala Rajini
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
-
ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కుట్ర
-
AP: రోగం తిరగబెట్టింది
మునుపటికొకడు ఒక కుక్కపై కక్షగట్టి చంపాలనుకుని.. ‘అది పిచ్చి కుక్క’ అని అరిచాడట. పక్కనున్న వారందరూ తలో రాయి వేసి దానిని హతమార్చారట. ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వ తీరు అచ్చం అలానే ఉంది. రెండున్నర నెలల వరకు ప్రభుత్వాసు పత్రులంటే పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరు ఉండింది. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఉద్దేశ పూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ.. పేద రోగులకు వైద్య సేవలు సరిగా అందకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. మందులు అయిపోయినా, సిబ్బంది సీట్లలో లేకపోయినా పట్టించుకోవడం లేదు. ఆస్పత్రుల నిర్వహణను అంతకంటే పట్టించు కోవడం లేదు. క్రమంగా ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా చేసి.. ‘ప్రైవేట్’కు కట్టబెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. రాష్ట్రంలో ఆ చివర ఉన్న అనంతపురం నుంచి ఈ చివరనున్న శ్రీకాకుళం వరకు కేవలం ఈ రెండు నెలల్లోనే ఏ ఆస్పత్రి నిర్వహణ చూసినా అస్తవ్యస్తంగా మారిపోవడమే ఇందుకు తార్కాణం. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన వాస్తవమిది.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ ఆస్పత్రులు, వ్యక్తులకు మేలు చేయాలన్న లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మారుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ వ్యవస్థలను తీసుకుని వెళ్లేలా ఆ పార్టీ నాయకులు లీకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య శాఖలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ముందుకు తీసుకుని వెళతామని ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా 2014–19 తరహాలోనే టెలీమెడిసిన్, ల్యాబ్‌లు, ఇతర సేవలను ప్రైవేట్‌కు కట్టబెట్టి ప్రభుత్వ నిధులను లూఠీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి కొరత లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన జీరో వేకెన్సీ విధానానికి కూటమి సర్కార్ ఇప్పటికే తిలోదకాలు ఇచ్చేసింది. గత ప్రభుత్వంలో సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఖాళీ అయిన వైద్య పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. ఎన్నికలకు ముందు నియామకాలు దాదాపు పూర్తయిన పోస్టుల ప్రక్రియనూ కూటమి ప్రభుత్వం ఆపేసింది. నోటిఫికేషన్లను సైతం రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం నిరంతర నియామక ప్రక్రియకు ఇలా పుల్‌స్టాప్ పెట్టడంతో ఆస్పత్రుల్లో రోగుల సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంకో వైపు మందులు, సర్జికల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాస్పత్రులు, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో కొరత నెలకొంది. పలు చోట్ల గ్లౌజ్‌లు, సిరంజులకూ దిక్కులేదుజిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, బోధనాస్పత్రుల్లో ఇందులో చాలా మందులు లేవు. విశాఖ కేజీహెచ్, గుంటూరు, కర్నూలు, విజయవాడ జీజీహెచ్, తదితర పెద్దాసుపత్రుల్లో సైతం 100 రకాల మందుల కొరత ఉంది. పాడేరు ఆస్పత్రిలో చాలా వ్యాధుల నివారణకు సంబంధించిన యాంటిబయాటిక్స్ మందులు లేవు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పంపిణీ కాకపోవడంతో రోగులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మందులనే పంపిణీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిరంజులు కూడా బయటకు రాసిస్తున్నారు. రూ.30 నుంచి రూ.1000 విలువ చేసే మందుల వరకు చీటి రాసి బయటకు పంపుతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రైవేటు మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో గ్లౌజ్‌ల కొరత ఉంది. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ల సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్ వస్తువులు, రోజుకు రూ.5 వేలు లోపు వస్తువులను ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఆపరేషన్ సమయంలో రోగులు ప్రైవేట్ మందుల దుకాణంలో కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వైద్యులకు ఇస్తున్నారు. రెండు నెలల నుంచి ఫాంటాప్ ఇంజక్షన్లు లేవు. విజయవాడ జీజీహెచ్‌లో షుగర్ ఇన్ఫెక్షన్, నరాల సమస్య, గుండె జబ్బుల రోగులు బయట మందులు కొనుగోలు చేస్తున్నారు. కాంబినేషన్ మందులు, మల్టీ విటమిన్ మందులు దాదాపు పూర్తిగా బయటే కొనాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్ సోకిన రోగులకు హై యాంటిబయోటిక్ ఇంజక్షన్ అవసరమైన వారు బయట కొనుగోలు చేస్తున్నారు. ఖరీదైన ఆల్బుమిన్ ఇంజక్షన్లు, ఇన్‌పేషెంట్‌గా చేరి, డిశ్చార్జి అయిన రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేక పోవడంతో బయటకు రాస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందించారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. ఈ ఏడాది రెండో క్వార్టర్‌కు సంబంధించి మందుల సరఫరాను కూటమి ప్రభుత్వం ఆలస్యంగా సరఫరా చేయడంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఓపీ వద్ద బారులుతీరిన రోగులు నోటిఫికేషన్లు రద్దుకు యత్నాలుప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం మొత్తం నోటిఫికేషన్లను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అంశాన్ని వైద్య శాఖ పరిశీలిస్తోంది. గత ప్రభుత్వంలో వైద్య శాఖలో మానవ వనరుల కొరతకు తావు లేకుండా ఏకంగా 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ప్రత్యేకంగా వైద్య శాఖ నియామకాల కోసమే రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. హిందూపురంలోని జిల్లా ఆస్పత్రి ఓపీ కౌంటర్ వద్ద రోగుల పడిగాపులు ఇంటి నుంచి తెచ్చుకున్న కుర్చీలోనేఇతని పేరు శ్రావణ్‌కుమార్. నెల్లూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న పేద వ్యక్తి. వయస్సు 60 ఏళ్లు పైబడి ఉన్నాయి. షుగర్ ఉండటంతో ఇన్ఫెక్షన్ వచ్చి నాలుగు నెలల క్రితం ఒక కాలుకు యాంపుటేషన్ (సర్జరీ చేసి మోకాలు వరకు తొలగించారు) చేశారు. నడవలేడు కనుక మూత్ర విసర్జనకు కెథీటర్ వేశారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఈ కెథీటర్ను వారం, లేదా పది రోజులకు ఒకమారు మార్చి కొత్తది వేయాలి. ఇలా మార్పించుకునేందుకు తరచూ పెద్దాస్పత్రిలోని ఎమర్జెన్సీ (క్యాజువాలిటీ)కి ఆటోలో వస్తాడు. ఇటీవల ఒకటి, రెండు దఫాలుగా వీల్ చైర్ దొరకలేదు. ఎండలో గంటకు పైగా ఉంచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుంచే కుర్చీ తెచ్చుకున్నారు. దానిలోనే ఎమర్జెన్సీ వార్డు వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారు గంటల కొద్దీ చూస్తే గాని కెథీటర్ మార్పు జరగ లేదు.బిడ్డతో పాటు ఆక్సిజన్ సిలిండర్ నెల్లూరు నగరానికి చెందిన ఈ ఫొటోలోని పసిబిడ్డ పేరు హృతిక్నందన్. ఇతనికి మూడేళ్లు. తలలో గడ్డ ఉండటంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ నెల్లూరులోని పెద్దాస్పత్రిలో చిన్న పిల్లల వార్డులో చేర్చారు. ఆక్సిజన్ మీద వైద్యం పొందుతున్నాడు. ఇక్కడ వాంతులు కావడంతో డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. పిల్లల వార్డు నుంచి ఎంఆర్ఐ తీసే చోటు కొంత దూరంలో ఉంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఆ పసిబిడ్డ తండ్రి.. బిడ్డకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్‌ను తోసుకుంటూ పరీక్షలకు తీసుకెళ్లాడు. ఆక్సిజన్ సిలెండర్‌ని తోసుకుంటూ వెళ్తున్న ఈమె పేరు శాంతి. గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మకు సీరియస్‌గా ఉందని మధురవాడ నుంచి 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. లోపలికి వెళ్లి త్వరగా క్యాజువాలిటీకి తీసుకెళ్లి వైద్యం అందించాలంటూ అక్కడున్న సిబ్బందిని వేడుకున్నారు. ఎవ్వరూ స్పందించలేదు. ఓ నర్స్ వచ్చి వివరాలు తీసుకున్నారు. వెంటనే ఆక్సిజన్ సిలిండర్‌ని ఇచ్చి.. శాంతి తీసుకొచ్చిన అమ్మ బాధ్యతని వార్డు బాయ్‌కి అప్పగించారు. నర్స్ అటు వెళ్లగానే.. సిలెండర్‌ని వార్డు బాయ్ శాంతి చేతికి ఇచ్చి.. నువ్వే తీసుకురావమ్మా అంటూ విసుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. శాంతి ఆ సిలెండర్‌ని మోసుకుంటూ బయటికి వచ్చింది. తన కుటుంబ సభ్యులు, 108 వాహన సిబ్బంది సహాయంతో సిలెండర్‌ని తానే తోసుకుంటూ క్యాజువాలిటీకి అమ్మని తీసుకెళ్లింది. అరగంట నుంచి అడుగుతున్నా.. ఎవ్వరూ స్పందించలేదు.. అమ్మకి ఏదైనా అయితే.. ఎవరిది బాధ్యత సార్ అంటూ కన్నీటి పర్యంతమైంది.ఇలాగైతే ఎలా? నా బిడ్డ శ్రీవిద్యకు రెండ్రోజులుగా జ్వరం వస్తోంది. ఆత్మకూరులో అంతంత మాత్రంగానే చూస్తారని తెలిసి, అనంతపురం పెద్దాస్పత్రిలోనైతే బాగా వైద్యం అందిస్తారని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఉదయం 10 గంటలైనా వైద్యులు రాలేదు. ఉదయం 8 గంటల నుంచి వేచి చూస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – ఆదినారాయణ, బి.యాలేరు, ఆత్మకూరు మండలంరాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో ఇదీ సంగతి⇒ శ్రీకాకుళంలోని రిమ్స్‌లో నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆధార్‌కార్డులతో వచ్చినప్పటికీ సెల్‌ఫోన్ లేక ఓపీ రశీదు పొందలేకపోతున్నారు. కాళ్లావేళ్లా బతిమాలిడితే... ఎవరో ఒకరు స్పందించి కొందరికి ఓపీ ఇప్పిస్తున్నారు. ఫోన్లు లేని చాలా మంది వైద్యం పొందలేక ఇళ్లకు వెనుదిరిగారు. ఫ్యాన్లు, ఏసీలు, సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఐసీయూలో కూడా ఏసీలు పని చేయని దుస్థితి.⇒ రాజమహేంద్రవరం, ఒంగోలు, నంద్యాల, విశాఖ, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, పాడేరు, విజయనగరం, నర్సరావుపేట, పార్వతీపురం, కాకినాడ, తిరుపతి రుయా ఆస్పత్రుల్లో పాలన అస్తవ్యస్తమైంది. నాలుగవ తరగతి సిబ్బందితో ఇబ్బందులెదురయ్యాయి. స్ట్రెచర్లు, వీల్ చైర్లు అందుబాటులో లేవు. చాలా చోట్ల ఈసీజీ, 2డీ ఎకో మిషన్లు మొరాయిస్తున్నాయి. రక్త పరీక్షల రిపోర్టుల కోసం రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. పారిశుధ్య లోపం బాగా ఇబ్బంది పెడుతోంది. బాత్రూంలు, మరుగుదొడ్లలో చాలా చోట్ల రన్నింగ్ వాటర్ లేదు. మంచి నీరు కూడా అందుబాటులో లేదు. ఆక్సిజన్ సిలెండర్లు సైతం బంధువులే మోసుకెళ్లారు. రెండు నెలలుగా మందుల సరఫరా నిలిచి పోయింది. మృతదేహాలు పెట్టేందుకు తగినన్ని ప్రీజర్లు లేవు. ఆసుపత్రిలో రోగులకు పెడుతున్న భోజనం నాసిరకంగా ఉంది. నిధులు లేక శానిటేషన్ లోపం కనిపిస్తోంది. సెక్యూరిటీకి సైతం జీతాలు సక్రమంగా అందడం లేదు. వార్డుల్లోకి కోతులు, కుక్కలు చొరబడుతున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవు. మహాప్రస్తానం వాహనాలు అందుబాటులో లేవు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే జనరేటర్ వేయడం లేదు. దోమలను అరికట్టలేక పోతున్నారు. ⇒ భీమవరంలో బాలింతల వార్డుల్లో ఏసీలు పని చేయడం లేదు. ఎక్స్‌రే, ఈసీజీ టెక్నీషియన్లు లేరు. రక్త పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. డెడ్ బాడీ ఫ్రీజర్లు దెబ్బ తిన్నాయి. స్కానింగ్ కోసం ఏలూరుకు రిఫర్ చేస్తున్నారు. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో ఒకటి, రెండు రకాల యాంటిబయాటిక్స్ మాత్రమే ఉన్నాయి. దళారులు, ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు ఆసుపత్రిలో బాహాటంగా తిరుగుతున్నారు. వార్డు బాయ్‌లు, స్ట్రెచర్ బాయ్‌లు లేక రోగుల కుటుంబీకులే ఆ పని చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది సగానికి సగం డ్యూటీలో కనిపించలేదు. కోతుల బెడద విపరీతంగా ఉంది. ఆసుపత్రిలో సైన్ బోర్డులు లేవు.⇒ హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ మిషన్ చెడిపోయింది. మరమ్మతులు చేయలేదు. చాలా మంది రోగులను స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ⇒ అనంతపురం జీజీహెచ్‌లో పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉంది. వార్డుల్లో బయోవేస్ట్ డబ్బాలు ఏర్పాటు చేయలేదు. మందుల కొరత ఉంది. రక్త పరీక్షల రిపోర్టుల్లో జాప్యం జరుగుతోంది. 160కి గాను 60 ఏసీలు మాత్రమే పని చేస్తున్నాయి. గైనిక్, ఎక్స్‌రే, రక్తనిధి వార్డుల్లో కరెంటు పోతే చిమ్మ చీకటే.⇒ అనకాపల్లిలో ఉదయం 10 గంటల నుంచి 11.45 గంటల వరకూ కరెంట్ లేదు. జనరేటర్ ఉన్నా, 10 నిమిషాల పాటు మాత్రమే పని చేసింది. ఎక్స్‌రే కోసం చాలా మంది ఇబ్బంది పడ్డారు. గర్భిణీలకు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తున్నా.. రిపోర్టు ఇవ్వడం లేదు. తెల్ల పేపర్‌పై పెన్‌తో రాసి పంపిస్తున్నారు. సర్జికల్ గ్లౌజులు, కాటన్, ఐవి క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. రోగులకు ఇచ్చే భోజనంలో నాణ్యత తగ్గింది. ⇒ కృష్ణాజిల్లా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో స్ట్రక్చరు, వీల్‌చైర్స్ సరిపడా లేవు. ఉన్న వాటిలో బంధువులే తోసుకెళ్తున్నారు. బాగా పని చేస్తున్న వెంటిలేటర్లను గదుల్లో పెట్టి తాళాలు వేశారు. రోగులకు కనీసం బీపీ కూడా చూడటం లేదు. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో నాల్గవ తరగతి సిబ్బంది కొరత చాలా ఉంది. అవుట్‌పేషెంట్ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులే చూస్తున్నారు. ఓపీలో ఇన్‌పేషెంట్స్‌గా చేర్చిన వారిని మరుసటి రోజు పరీక్షించి మందులు రాస్తున్నారు. అత్యవసర కేసుల్లో వార్డుకు తరలించడానికి ఎక్కువ సమయం పడుతోంది.⇒ ఏలూరు జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం రోగులు కనీసం 15, 20 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు సరిపడా లేవు. ఓపీకి వచ్చే రోగులు, వారి బంధువులు గంటల తరబడి బయట షెడ్ల కింద ఉండాల్సి వస్తోంది. కనీసం ఫ్యాన్లు కూడా లేవు. రెండు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రైవేటు సంస్థ సరఫరా చేస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి మాత్రమే రోగులకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ⇒ కడపలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లోని ఐపీ, ఓపీ విభాగాల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఓపీ విభాగంలో కుర్చీలు, స్ట్రక్చర్లను మూలన పడేశారు. మెడికల్ ఐసీయూలో ఏసీలు పని చేయడం లేదు. పెడస్టల్ ఫ్యాన్లు పెట్టారు. ఎంఆర్ఐ, ఇతర ఓపీ విభాగాల్లోకి యథేచ్చగా కోతులు, కుక్కలు వస్తున్నాయి. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయి ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందని, అందువల్ల ఈ నెల 15వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. సమస్యను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ఆరోగ్యశ్రీ సీఈవోకు మంగళవారం లేఖ రాసింది. ఆస్పత్రుల నిర్వహణకు నిధులు లేక సిబ్బంది జీతాల చెల్లింపు, మౌలిక సదుపాయాలు, మందులు, డిస్పోజబుల్స్ నిర్వహించడం కూడా కష్టతరంగా మారినట్టు పేర్కొంది. గత నెల 30న సీఈవోను కలిసి సమస్యల్ని వివరించినప్పటికీ ఎటువంటి కదలిక లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జయిపోయిన ఓ క్షతగాత్రుడు ఆస్పత్రికి వస్తే.. గంట పాటు అతనికి వైద్యం అందించకుండా శ్రీకాకుళం రిమ్స్ వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రణస్థలం వద్ద యూబీ పరిశ్రమకు చెందిన కార్మికుడు పతివాడ సన్యాసినాయుడును మంగళవారం మ«ధ్యాహ్నం లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయిపోయాయి. మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రమాదం జరిగింది. సన్యాసినాయుడును యూబీ కంపెనీ అంబులెన్స్‌లో 2.55 గంటలకు శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువచ్చారు. అంబులెన్సు నుంచి అతడ్ని తీసుకెళ్లడానికి అరగంట వరకు ఎవరూ రాలేదు. 3.45 ప్రాంతంలో సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స మాత్రమే చేశారు. -
బిల్లులు చెల్లించం.. ఆరోగ్యశ్రీ ఇక ఉండదు..
-
ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల సవరణ
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్ వర్క్ ఆసుపత్రులలో రోగు లకు అందించే చికిత్సల రేట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. 2013 తర్వాత కొత్త ధరలను ప్రకటించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చోంగ్తు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.రేట్ల సవరణపై అధ్యయనం కోసం ప్రభుత్వం వేసిన కమిటీ.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ప్రైవేట్ ఆసుపత్రుల లోని మెడికల్, సర్జికల్ విభాగాల నిపుణు లతో చర్చించి మొత్తం 1,672 ప్యాకేజీలలో 1,375 ప్యాకేజీ రేట్లను సవరించాలని నిర్ణయించింది. మిగి లిన ప్యాకేజీ ధరలు మారవని తెలిపింది. 2013 నుంచి 2024 వరకు ధరల సవరణపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున 20–25 శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 163 కొత్త చికిత్సలు: ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తు తం ఉన్న వ్యాధులకు అదనంగా 163 కొత్త ప్రొసీ జర్లను చేర్చారు. ఈ మేరకు మరో ఉత్తర్వు విడుదల చేశారు. దీంతో మొ త్తం ప్రొసీజర్ల సంఖ్య 1,835కి పెరిగింది. కొత్త ప్రొసీజర్స్‌తో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకో బోతున్నామని మంత్రి దామోదర తెలిపా రు. 79 లక్షల కుటుంబాలను ఆరోగ్యపరంగా ప్రభుత్వం అదుకుంటుందని చెప్పారు. 2007లో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఆ సందర్భంగా 120 ఆసుపత్రుల్లో 533 వ్యాధు లకు చికిత్సలను అందుబాటు లోకి తెచ్చా రని దామోదర గుర్తుచేశారు. 2022లో 830 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయన్నారు. 90.10 లక్షల మంది ఆరోగ్యశ్రీకి అర్హులుగా ఉన్నారన్నా రు. 1,356 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధి లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఆరోగ్య శ్రీలో కొత్తగా 163 ప్రొసీజర్లను ప్రవేశపెట్టి న నేపథ్యంలో వాటి వివరాలను ప్రభుత్వం జీవోలో పొందుపరిచింది. అందులో ప్రధా నంగా టైప్–1 డయాబెటీస్‌కు ఇన్సులిన్ పంప్స్ ప్యాకేజీ కింద ఏడాదికి ఒక రోగికి రూ. 2 లక్షల వరకు కేటాయించారు. -
AP: ఆరోగ్యశ్రీ పేరు మార్పు
సాక్షి, విజయవాడ: ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్పు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గా ఉన్న పథకానికి 2007లో దివంగత మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుని సైతం కూటమి ప్రభుత్వం మార్చేసింది. నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్‌గా పేరు మార్పు చేసింది.కాగా, కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల పేర్లను కూడా మార్పు చేసింది. ఈ–క్రాప్‌ను ఈ–పంట, వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్‌ను అన్నదాత సుఖీభవ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకాన్ని వడ్డీ లేని రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బివై), వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ఫామ్ మెకనైజేషన్ స్కీమ్, డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు, వైఎస్ఆర్ యంత్రసేవ కేంద్రాలను విలేజ్/క్లస్టర్ సీహెచ్‌సీలు, వైఎస్ఆర్ యాప్‌ను వీఏఏ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్‌గా పేర్లు మార్పు చేసింది. ఇక నుంచి మార్పు చేసిన పేర్లను మాత్రమే వినియోగించాలని వ్యవసాయ యంత్రాంగాన్ని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు. -
ఆరోగ్యశ్రీ ఆగలేదు.. పచ్చ మీడియా కుట్ర
-
AP: యథావిధిగానే ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్లు బిల్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) డాక్టర్ లక్ష్మిషా మంగళవారం తెలిపారు. మిగతా బిల్లుల చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి రోగులకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున సంగతి తెలిసిందే. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ లక్ష్మిషా స్పష్టం చేశారు. -
తెరచాటు వ్యవహారాలు మీ బాబుకే చెల్లు
ప్రతీ నెలా ఒకటో తేదీ సుప్రభాత వేళ.. పేదింటి అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు అందే పింఛన్ సంతోషంలో జగన్ కనిపిస్తారు.. రైతుభరోసా సాయంలో రైతులకు ఆయన నవ్వు మోమే కనిపిస్తుంది.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది రూపాయల ఖరీదైన చికిత్స ఉచితంగా పొందే పేదల ఆరోగ్యంలోజగన్ రూపమే కనిపిస్తుంది.. ఇలా ప్రతీ పథకం లబ్ధిలోనూ రాష్ట్రమంతటికీ సీఎం జగన్ సంక్షేమాశయమే వేర్వేరు రూపాల్లో ప్రత్యక్షమవుతోంది ఒక్క రామోజీకి తప్ప. కనిపించకూడదని కళ్లు మూసుకుంటాడాయన. నిత్యం జనంతో మమేకమై వారి సమస్యలే తనవిగా తపించే నేత సీఎం జగన్.. జనానికి చిన్నపాటి అసౌకర్యమూ కలగరాదని ఆరాటపడే నాయకుడాయన. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ తక్షణ సాయం అందాల్సిన పేదలను దగ్గరకు తీసుకుని, ఆత్మీయ పరిష్వంగంతో తక్షణ భరోసా ఇస్తారాయన. ఆ భరోసాకు తగ్గట్టుగా 24 గంటలు తిరగక ముందే ఆర్థిక సాయాన్ని కలెక్టర్లే అందించేలా చూస్తున్న మానవతావాది. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా ఎన్నికల వేళ జగన్‌కు రాష్ట్ర ప్రజల నుంచి లభిస్తున్న అఖండ స్వాగతాన్ని జీర్ణించుకోలేక తత్తరపాటు, బిత్తరపాటుతో రామోజీ తొట్రుపాటు రాతలు రాస్తున్నారు. సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఇన్ని రోజులూ పరదాల చాటున ఉన్నట్లు.. ఎన్నికలున్నందున ఇప్పుడే ప్రజల దగ్గరకు వెళ్తున్నట్లు అజ్ఞానంతో ఈనాడు రామోజీ సీఎం జగన్‌పై విషం కక్కారు. జగన్ అంటే జనం..జనం అంటే జగన్ అనే విషయం రాష్ట్రంలో ఎవరినడిగినా చెబుతారు. ఈనాడు రామోజీకీ ఆ విషయం తెలుసు...ఆయినా నిలువునా జగన్ వ్యతిరేకతతో అక్షర కుట్రలు, కూహకాలతో ఆయనకు ప్రతీ రోజూ తెల్లారుతోంది. పథకాల అమలు సందర్భంగా సాయం అందించే క్రమంలో ఏ జిల్లాకు జగన్ వెళ్లినా నిస్సహాయులైన పేదలను స్వయంగా కలిసి, వారికి ఒక అన్నలా..తమ్ముడిలా...కొడుకులా..వారి వేదనను నివేదనను ఎంతో శ్రద్ధాసక్తులతో ఆలకిస్తారు. వారి కష్టాలను 24 గంటల్లోనే పరిష్కరిస్తారు. ఇదంతా రామోజీ ఈనాడులో రాస్తూనే ఉంటారు. జనానికి జగన్ చేస్తున్న మేలేమిటో తెలిసినా, తెలియనట్లే నటిస్తూ... ఎన్నికలు కనుక జగన్ జనంలోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. జగన్ తొలి నుంచీ జనంతో ఉండటానికే ఇష్టపడతారు తప్ప చంద్రబాబు మాదిరిగా బడా వ్యాపార వేత్తలు, పలుకుబడి గల వారితో అంటకాగడానికి ఇష్టపడరనే విషయం జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా రహదారులకు ఇరు వైపులా జనం పూలతో స్వాగతించడం, ఆయన నవ్వులు చిందిస్తూ, ఆత్మీయంగా జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగడం రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోంది. ఒక్క ఈనాడు రామోజీకి మాత్రం ఈ ముచ్చటైన దృశ్యాన్ని చూడడానికి అబద్ధాల పరదాలు అడ్డొస్తున్నాయి. వాస్తవానికి పరదాలు, తెరచాటు వ్యవహారాలు మీ చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది రామోజీ. ముఖ్యమంత్రి జగన్ పథకాల అమలుకు జిల్లాలకు వెళ్లిన సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నిస్సహాయులై అనారోగ్యంతో బాధపడే పేదలను, లేదా ఇతర ఆర్దిక సమస్యల్లో సతమతమవుతున్న పేదలను కలిసి వారి సమస్యలను శ్రద్ధగా వినడమే కాకుండా కొంత మందికి 24 గంటలు తిరగకుండానే జిల్లా కలెక్టర్ల చేత ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయిస్తున్నారు. కాలేయ మార్పిడితో పాటు గుండె, కేన్సర్ వంటి పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి భారీ ఆర్దిక సాయాన్నీ ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో జగన్‌ను కలిసిన ఆర్తుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సీఎంఓ కార్యాలయంలో ఒక బృందమే పనిచేస్తోంది. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇప్పటివరకు 699 మంది పేదలను స్వయంగా కలిసి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు వైద్యానికి, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం అందేలా జగన్ చర్యలు తీసుకున్నారు. జనం అంటే ఈ 699 మంది పేదలు కాదా ఈనాడు రామోజీ..జనంలోకి వెళ్లడం అంటే నీ అర్థం ఏంటో మరి! ఊరికో సచివాలయం.. సమస్యల పరిష్కారాలయం.. గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా, వారికి ప్రభుత్వ సేవలు అక్కడే అందేలా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఈ సీఎం ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల మధ్యే సీఎం జగన్ పాలన కొనసాగింది. మీ చంద్రబాబులా ప్రచార యావ కోసం జిమ్మిక్కులు చేయడం జగన్‌కు ఇష్టం ఉండదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లిన ఘనత మీ బాబుకే దక్కుతుంది. చంద్రబాబు 13 దేశాలకు 23 సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. నిత్యం హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలతో చంద్రబాబు విహరించినప్పుడు మీకు తప్పనిపించలేదా రామోజీ?. రాష్ట్ర ఖజానా నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానాలకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటారా?. ఎన్నికల వేళ జనంలోకి అంటూ ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే ప్రాంతాల వారీగా నాలుగు సిద్ధం సభలను నిర్వహించారు. ప్రజలకిచ్చిన హామీల అమలు గురించిన ఆలోచనతో జగన్ పాలన సాగించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ఎన్నుకున్న ప్రజల దగ్గరకే ప్రజాప్రతినిధులను ధైర్యంగా పంపించింది దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్. చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ధైర్యంగా ఆయన జనంలోకి వెళ్తుంటే దాన్నీ తప్పుపట్టే స్థాయికి రామోజీ దిగజారారు. ప్రజలకు ఏ కష్టం, ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆదుకోవడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన కొనసాగింది. బాబు తరహాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి. ఏదైనా ఆపద వస్తే దాన్ని ప్రచారానికి వినియోగించుకోవడం ఆయన నైజం కాదు. -
కాళేశ్వరంపై కమిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జస్టిస్ చంద్రఘోష్ గతంలో లోక్‌పాల్‌గా, ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై విచారణకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన మరో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. నివేదికల సమర్పణకు గాను రెండు కమిషన్లకు 100 రోజుల గడువు విధించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 2 గంటలకు పైగా సమావేశమైన కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. కొత్త రేషన్‌కార్డులు, తొలివిడతలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా సెంటర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణ: పొంగులేటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపైనా, ఎవరి ఒత్తిడితో ప్రాజెక్టును అలా కట్టారో అనే అంశంపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతుందని పొంగులేటి తెలిపారు. టెండర్లు నిర్వహించకుండా నామినేషన్ల విధానంలో ఛత్తీస్‌గఢ్ నుంచి నేరుగా 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఆ విద్యుత్‌ను వాడుకోలేదని మంత్రి ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కుమ్మక్కై గత ప్రభుత్వం దళారులకు చేసిన చెల్లింపులపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక గత 10 ఏళ్లలో ఇతర రంగాల్లో జరిగిన అవినీతికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడంపై మంత్రివర్గంలో చర్చించామని తెలిపారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున రూ.22,500 కోట్లతో మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇళ్ల స్థలం కలిగిన పేదలు, నిరుపేదలకు దీనిని వర్తింపజేస్తారు. గ్రామాల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, పింక్ షర్ట్ వారు అని చూడకుండా, పైరవీలకు తావు లేకుండా అర్హులను ఎంపిక చేస్తామని పొంగులేటి తెలిపారు. త్వరలో 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు ప్రస్తుత ప్రభుత్వం మహిళలను కోటీశ్వరుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడానికి వీలుగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఇక్కడి స్థలాన్ని జిల్లాల వారీగా మహిళా గ్రూపులకు కేటాయిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయిల్లో విశాలమైన మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 84 శాతం రైతులకు రైతుబంధు ఇచ్చిందని, వచ్చే 2 రోజుల్లో 93 శాతానికి పైగా రైతులకు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. త్వరలో కొత్త రేషన్‌కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదలందరికీ కొత్తగా తెల్ల రేషన్‌కార్డులు జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డులుంటేనే ఆరోగ్యశ్రీ, ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే భావన ప్రజల్లో ఉందని, ఈ నేపథ్యంలో రేషన్‌కార్డుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని విడదీసి అమలు చేయాలని భావిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. దీనిపై నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించామన్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు లైన్‌క్లియర్ 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మినిమమ్ పే స్కేల్ (టైమ్ పేస్కేల్) ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి అభ్యర్థులు తమకు అనుకూలంగా తీర్పులు తీసుకువచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాగా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు. గత సెపె్టంబర్, అక్టోబర్ మాసంలో వర్షాలు పడక రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోయాయని పేర్కొన్నారు. కొత్తగా 16 కార్పొరేషన్లు మహిళల సాధికారత కోసం ‘తెలంగాణ మహిళా శక్తి’ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఓబీసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీల కోసం మొత్తం 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 1.యాదవ (కుర్మ), 2.మున్నురుకాపు, 3.పద్మశాలి, 4.పెరిక (పురగిరి క్షత్రియ), 5.లింగాయత్, 6.బలిజ, 7.గంగపుత్ర, 8.మేరా, 9.ముదిరాజ్ కార్పొరేషన్, 10.ఆర్య వైశ్య, 11.రెడ్డి కార్పొరేషన్, 12.మాదిగ, మాదిగ ఉపకులాలు, 13.మాల/మాల ఉపకులాలు, 14.కుమురం భీమ్ ఆదివాసి, 15. సంత్ సేవాలాల్ లంబాడి, 16.ఎరుకలు, ఇతర ఉపకులాల కోసం ఏకలవ్య.. కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు: పొన్నం కులగణన నిర్వహణకు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన సాంకేతికత జోడించడం కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించి రూ.ఒక్క కోటి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తాము కొత్త కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని, త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా వర్గాల వారితో సంప్రదింపులు జరిపి రెండు మూడు వారాల్లో కార్పొరేషన్లకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తారని శ్రీధర్‌బాబు తెలిపారు. గీత కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు త్వరలో రక్షణ పరికరాలను అందజేస్తామని, వాటితో చెట్లను ఎక్కితే కిందపడే ప్రమాదం ఉండదని, మరణాలూ ఉండవని పొన్నం చెప్పారు. బీఆర్ఎస్ ఖాళీ అయింది: కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరం కలిసి బృందంగా పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, కేసీఆర్ ఈ రోజు మహిళలపై ప్రేమ ఒలకబోస్తున్నారని, అధికారంలోకి ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, జెడ్పీ/మున్సిపల్ చైర్మన్లు, కింది స్థాయి నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, మరో పార్టీలో చేరుతున్నారని చెప్పారు. -
పేదింటి ఆరోగ్యమే రాష్ట్ర సౌభాగ్యం
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్‌ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్ఏ అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్‌లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది. టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్‌లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
క్యాన్సర్ బాధితులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంకు చెందిన వంకాయల శ్రీనివాస్ కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవించేవారు. ఆయనకు భార్య సాయిపద్మశ్రీ, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. 2022 డిసెంబర్లో సాయిపద్మశ్రీ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారినపడింది. దీంతో శ్రీనివాస్ వైద్య పరీక్షలు చేయించగా ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉందని వెల్లడైంది. వైద్యులు చికిత్స కోసం ఏదైనా క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే అప్పటికే వ్యాపారంలో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన శ్రీనివాస్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వారికి అండగా నిలిచింది. తెలిసిన వాళ్లు చెప్పడంతో శ్రీనివాస్ తన భార్యను విజయవాడలోని ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రి హెచ్సీజీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే వైద్యులు వైద్య పరీక్షలన్నీ చేసి సాయిపద్మశ్రీకి చికిత్సను అందించారు. ఈ ఏడాది జనవరిలో చికిత్స పూర్తి కావడంతో ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. ఆరోగ్యశ్రీ వల్లే తన భార్య ప్రాణాలతో బయటపడిందని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. .. ఇది ఒక్క శ్రీనివాస్ ఆనందమే కాదు.. రాష్ట్రంలో ఎంతోమంది ఆరోగ్యశ్రీ తమ ప్రాణాలను కాపాడిందని చెబుతున్నారు. గతంలో ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఆశలు వదులుకోవాల్సిందే. రూ.లక్షల ఖర్చయ్యే వైద్యాన్ని తలుచుకుని బాధిత కుటుంబాలు భీతిల్లేవి. ఇల్లు, వాకిలి తెగనమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం క్యాన్సర్ సోకినవారికి ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తోంది. బాధితులు తమ చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టే పనిలేకుండానే మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తోంది. 3.03 లక్షల క్యాన్సర్ బాధితులకు ఉచిత వైద్యం టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే వైద్య ఖర్చులకు పరిమితి లేకుండా అన్ని రకాల క్యాన్సర్లకు పూర్తి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పెరిగాయి. లుకేమియా బాధితులకు నిర్వహించే రూ.10 లక్షలు, ఆ పై ఖర్చయ్యే బోన్‌మారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సైతం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఈ క్రమంలో 2019 నుంచి ఈ పథకం కింద 3,03,899 మంది క్యాన్సర్ బాధితులకు 10,43,556 ప్రొసీజర్స్‌లో ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.2,165.74 కోట్లు ఖర్చు చేసింది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. క్యాన్సర్‌కే కాదు.. ఒక్క క్యాన్సర్‌కే కాకుండా హృద్రోగాలు, కిడ్నీ, లివర్.. ఇలా వివిధ రకాల బాధితులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి ఉచితంగా అందుతున్నాయి. టీడీపీ హయాంలో క్యాన్సర్, గుండె జబ్బు, తదితర పెద్ద రోగాల బారినపడితే పేదలు తమ తల తాకట్టు పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితులను మారుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రొసీజర్లను 3,257కు, వైద్యం ఖర్చు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. 2019 నుంచి ఇప్పటివరకు రూ.12,150 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసింది. ఉచిత వైద్య సేవలే కాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగులకు విశ్రాంత భృతిగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5 వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇలా ఇప్పటివరకు 22.88 లక్షల మందికి రూ.1,366 కోట్ల సాయాన్ని అందించింది. ఆరోగ్యశ్రీ ఆదుకుంది.. మాది ప్రకాశం జిల్లా. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాం. బస్టాండ్‌లో స్టాల్ నడిపేవాడిని. 2021లో నాకు క్యాన్సర్ సోకింది. కరోనా, ఇతర కారణాలతో వ్యాపారాలు సాగని దుస్థితిలో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే పనిలేకుండానే పూర్తి ఉచితంగా చికిత్స లభించింది. మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. – పి.మధుసూదనరావు, విజయవాడ నా ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోంది నేను లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నా. క్యాన్సర్ నిర్ధారణ కావడంతో విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుతోంది. వైద్యం, మందులకు నాకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. – ఎన్.రాంబాబు, విజయవాడ రూపాయి కూడా ఖర్చు చేయనక్కర్లేదు అన్ని రకాల క్యాన్సర్లకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలు ఉన్నాయి. అర్హులైన నిరుపేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. చికిత్సల భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. – డి.కె. బాలాజీ, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరన్న నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలసి సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధుల విడుదలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న బోధన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 270 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. సత్వరమే ‘టిమ్స్’పూర్తి చేయాలి... వరంగల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్‌లలో చేపడుతున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోటా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్.. డిజిటల్ కార్డులు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యునీక్ నంబర్‌తో అనుసంధానించాలని.. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందిండానికి వీలవుతుందన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్... బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ చెప్పారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని... తద్వారా ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో నెలకొన్న సమస్యలను అధికారులు సీఎంకు వివరించగా ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. ఫార్మా కంపెనీల సీఎస్ఆర్... మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాలని సీఎం కోరారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ డాక్టర్లు, ఆశ వర్కర్లు, స్టాఫ్ నర్సులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించేలా చూడాలన్నారు. 108, 102 సేవల పనితీరుపై వాకబు చేసిన సీఎం.. అవి మరింత మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, కమిషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డీజీ కమలహాసన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాల రోగం.. కథనాలు ఘోరం
సాక్షి, అమరావతి: అబద్ధాలు అచ్చేయకపోతే రామోజీరావుకు నిద్రపట్టేలా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లకుండా ఆయన భోజనం చేయలేరు. పేదలకు అందించే ఉచిత కార్పొరేట్ వైద్యం పైనా విషపురాతలే. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందడం రామోజీరావుకు నచ్చడం లేదు. మన రాష్ట్రంతో పాటు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద పేద, మధ్యతరగతి ప్రజలకు అందుతున్న ఉచిత వైద్య సేవలపై నిత్యం కడుపు మంటను ప్రదర్శిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగానే ‘బకాయిల రోగం.. సేవలు ఘోరం!’ అంటూ ఈనాడు పత్రికలో శుక్రవారం కథనం అచ్చేశారు. ఆ పథకం సమర్థవంతంగా అమలు కావడం లేదంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. బకాయిల కారణంగా రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోయాయంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ ఏడాది రూ. 2,790.61 కోట్లు చెల్లించిన ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. బాబు పాలనలో నిర్వీర్యమైన పథకానికి సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ఊపిరిలూదారు. ఇటీవలే పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఏకంగా రూ. 25 లక్షలకు పెంచారు. 1,059 ప్రొసీజర్లను 3,257కు తీసుకుని వెళ్లారు. ప్రొసీజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో 2019కు ముందు రోజుకు సగటున 1,547 చికిత్సలు చేయగా, ప్రస్తుతం 5,608 చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ఇంత ఘనంగా కొనసా గుతుంటే.. రాష్ట్రంలో నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయంటూ అబద్ధాలను అల్లి ఆ కథనం ప్రచురించారు. నిజానికి ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఏ నెట్వర్క్ ఆస్పత్రిలోనూ రోగులను చేర్చుకోని ఘటనలు లేవు. కావాలని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు, సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. త్వరితగతిన క్లెయిమ్‌లు గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రూ. 2,146.90 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 2,790.61 కోట్లు విడుదల చేశారు. ఆస్పత్రుల నుంచి వచ్చే క్లెయిమ్‌లను త్వరితగతిన అత్యంత పారదర్శకంగా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులను ప్యానెల్ వైద్యులుగా తీసుకునే ప్రక్రియ చేపడుతున్నారు. క్యాన్సర్ చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎయిమ్స్, హోమీబాబా, శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్, రాష్ట్ర ప్రభుత్వం సంస్థలైన డీఎంఈ, స్విమ్స్, విమ్స్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో క్లెయిమ్స్ ఆమోద ప్రక్రియలో తీవ్రమైన జాప్యానికి ఆస్కారమే లేదు. లంచాలకు తావు లేకుండా లంచాలకు, డబ్బు వసూళ్లకు తావులేకుండా పేదరోగులకు పూర్తి ఉచితంగా పథకం సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేటప్పుడు నెట్వర్క్ ఆరోగ్యమిత్రల పర్యవేక్షణ ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందాయో రోగుల నుంచి అభిప్రాయ సేకరణ విధానం అమలు చేస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కూడా రోగులు ఇంటికెళ్లి ఏఎన్ఎంలు మరోమారు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైన రోగులు లంచాలు, చేతి నుంచి డబ్బు చెల్లించిన ఘటనలు వెలుగు చూస్తే వెంటనే ఆ డబ్బులు వెనక్కి ఇప్పించడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. రోగులకు పథకం విషయంలో సందేహాల నివృత్తి వారికి ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు 104 కాల్ సెంటర్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటున్నారు. -
ఆరోగ్యశ్రీ సేవల్లో భారీ వృద్ధి
సాక్షి, అమరావతి: అనారోగ్యం బారినపడి.. వైద్యం చేయించుకునే స్థోమతలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. చేతి చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టే పనిలేకుండా ఆపత్కాలంలో ఆపద్బాంధవిలా ఆదుకుంటోంది. ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లను గణనీయంగా పెంచడం, నెట్వర్క్ ఆస్పత్రులను విస్తరించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని మరింత విస్తృతంగా పేదలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం చేపడుతున్న సంస్కరణల ఫలితంగా సేవల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. రోజుకు సగటున 5,563 ప్రీయాథ్స్.. 2018–19లో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి రోగుల చికిత్స నిమిత్తం ఆమోదం కోసం రోజుకు సగటున 1,547 అభ్యర్థనలు వస్తుండేవి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలోకి సీఎం జగన్ తీసుకొచ్చారు. దీంతో టీడీపీ హయాంలో 1,059గా ఉన్న ప్రొసీజర్లు.. ప్రస్తుతం 3,257కు పెరిగాయి. అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదం బారినపడినా కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం పేదలకు ఉచిత వైద్యసేవలు లభిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రోజుకు సగటున 5,563 అభ్యర్థనలను వస్తున్నాయి. ఇలా ట్రస్ట్‌కు వచ్చిన అభ్యర్థనలకు ఆమోదం తెలపడంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య 9,12,370 మందికి రాష్ట్ర ప్రభుత్వం 12,66,365 చికిత్సలను ఉచితంగా చేసింది. ఇందుకు సంబంధించి సర్కారు రూ.2,489.78 కోట్లు వెచ్చించింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ఏడాది నవంబరు నెలాఖరు వరకూ 37.40 లక్షల మందికి 53.02 లక్షల చికిత్సలను ఉచితంగా అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.11,859.96 కోట్లను ఖర్చుచేసింది. టీడీపీ ప్రభుత్వంలో 2014–19 మధ్య అరకొర ప్రొసీజర్లతో కేవలం 22.32 లక్షల చికిత్సలను మాత్రమే అందించారు. రికార్డు స్థాయిలో నిధుల ఖర్చు పెరిగిన సేవలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ సర్కారు రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. సీఎం జగన్ ప్రభుత్వం మాత్రం 2019 నుంచి గత ఏడాది నవంబరు నెలాఖరు వరకు ఏకంగా రూ.11,859.96 కోట్లు ఖర్చుచేసింది. దీనికి అదనంగా చికిత్సానంతరం రోగులకు భరోసానిస్తూ ఆరోగ్య ఆసరా నిమిత్తం రూ.1,309 కోట్లు వెచ్చించింది. ఇలా నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం ఏకంగా రూ.13,165.96 కోట్లు ఖర్చుచేసింది. రూ.25 లక్షలకు పెంపు.. ఆరోగ్యశ్రీ అమలు విషయంలో సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి వైద్యసేవల ఖర్చును ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, బీఆర్ఎస్ రూ.15 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని, బీజేపీ రూ.10 లక్షల వరకూ అంటూ తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద సీఎం జగన్ ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. కేన్సర్ బాధితులకు సైతం రూ.25 లక్షలు ఖర్చయినా ఆ భారాన్ని మొత్తంగా భరిస్తోంది. -
దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు
-
Andhra Pradesh: అందరికీ ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో పథకం గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండటానికి వీల్లేదని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందనే అవగాహన ఉండాలన్నారు. పథకాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ అమలు, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, ప్రచార కార్యక్రమాలపై ఆరా తీసిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చేతి నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు.. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలందిస్తూ అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు, చికిత్స వ్యయ పరిమితిని విప్లవాత్మక రీతిలో భారీగా పెంచాం. పేద, మధ్య తరగతి ప్రజలెవరూ వైద్యం కోసం చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడా రాకూడదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదు. తమకు దగ్గరలోని నెట్వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి. విస్తరించిన ప్రయోజనాలతో కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు కార్డుల పంపిణీ పూర్తి చేయాలి. జల్లెడ పట్టి గుర్తిస్తూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గుర్తించిన అనారోగ్య బాధితులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతోందో నిరంతరం సమీక్షించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రివెంటివ్ కేర్ అత్యంత ముఖ్యమైన అంశం. ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను గుర్తించి శిబిరాల ద్వారా అవసరమైన వైద్య సేవలు అందించాలి. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణాన్ని జల్లెడ పట్టాలి. శాచ్యురేషన్ విధానంలో ఈ ప్రక్రియ జరగాలి. ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్లు ఉన్నాయి? ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు? వారికి అందే వైద్యసేవలు ఏమిటి? తదితర అంశాలతో డేటా మ్యాపింగ్ చేపట్టాలి. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు, కాలానుగుణంగా మందులు అందించాలి. ఈ మొత్తం డేటాను ప్రతి ఆర్నెల్లకు ఒకసారి మీ రికార్డుల్లో అప్డేట్ చేయాలి. గ్రామంలో వంద శాతం ఇళ్లు, వ్యక్తులు ఈ ప్రక్రియలో కవర్ కావాలి. సదుపాయాలపై శ్రద్ధ.. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా సరే వారికి కూడా ఉచిత వైద్యం అందాలి. ప్రాథమిక వైద్య పరీక్షల్లో గుర్తించిన సమస్యలను నిర్ధారించేందుకు మరోసారి పరీక్షలు చేయాలి. సురక్ష రెండో దశ నిర్వహణ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి. గుండె పోటు బాధితులకు సత్వర వైద్యం కోసం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమం వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి మొదలవ్వాలి. దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించాలి. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సదుపాయాలపై ఫోకస్ పెట్టాలి. అవసరమైన అన్ని వసతులను కల్పించాలి. కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ త్వరలో ప్రారంభం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కింద ఇప్పటివరకూ 1,338 శిబిరాలు నిర్వహించి 98,210 మందికి అక్కడే స్పాట్ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందినట్లు తెలిపారు. సురక్ష తొలి దశ కార్యక్రమం సందర్భంగా నేత్ర పరీక్షలు నిర్వహించి 5,76,493 మందికి కళ్లద్దాల అవసరం ఉందని గుర్తించగా 67 శాతం మందికి ఇప్పటికే పంపిణీ చేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి అద్దాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్ఎన్సీయూలు, 5 ఎన్ఐసీయూలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విశాఖలోని మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బరŠన్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్‌ను అతి త్వరలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఆపత్కాలంలో ఆరోగ్య ఆసరా
సాక్షి, అమరావతి: సత్యనారాయణ తరహాలోనే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు దురదృష్టవశాత్తూ ఏదైనా అనారోగ్యం బారినపడితే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి కొండంత అండగా నిలుస్తోంది. రోగులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా శస్త్రచికిత్సలను, వైద్య సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు చికిత్సలు చేయించుకుని మంచానికి పరిమితమైనప్పుడు వారిని విశ్రాంతి సమయానికి ఆర్థికంగా ఆదుకుంటోంది. విశ్రాంతి సమయంలో వారి పోషణ కష్టం కాకుండా ఉండటానికి ఆపత్కాలంలో ఆర్థిక భరోసాను అందిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినప్పటి నుంచి గతేడాది నవంబర్ నెలాఖరు వరకు రోగులకు ప్రభుత్వం రూ.1,309.92 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. ఈ చిత్రంలోని వ్యక్తి.. టి.సత్యనారాయణ (60). ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెంలో ఉంటారు. ఇటీవల గ్రామంలో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో సత్యనారాయణ శిబిరానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నట్టు అనుమానించి పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు సత్యనారాయణను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయన గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా రెండు స్టెంట్లు వేశారు. సత్యనారాయణ రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేకుండా ఉచితంగా చికిత్సలు పూర్తి చేశారు. అంతేకాకుండా వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.4వేలకు పైగా భృతిని ప్రభుత్వం ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ‘వయోభారంతో ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నా. నా కుమారుడి సంపాదనతో కుటుంబం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు గుండె సమస్య అని తెలిసి చికిత్సకు ఎంత ఖర్చవుతుందోనని చాలా ఆందోళనకు గురయ్యాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకుంది. అంతేకాకుండా విశ్రాంత సమయానికి ఆర్థిక సాయం చేయడంతో అదనపు ఖర్చుల భారం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన ఈ మేలును ఎన్నటికీ మరువలేం’ అని సత్యనారాయణ చెమర్చిన కళ్లతో చెబుతున్నారు. 21.92 లక్షల మందికి ఆర్థిక చేయూత ఆరోగ్యశ్రీ పథకం కింద 1,519 ప్రొసీజర్లలో చికిత్సలు పొందినవారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే సమయంలో వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఈ మొత్తాన్ని ప్రభుత్వం రోగులు/వారి కుటుంబీకుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే గర్భిణులకు ప్రసవానంతరం రూ.5 వేలు చొప్పున సాయం అందజేస్తోంది. ఇలా గత ఏడాది నవంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 21,92,467 మందికి రూ.1,309.92 కోట్ల మేర సాయం అందించింది. ప్రభుత్వం అందజేస్తున్న ఈ సాయం రోగులు పూర్తిగా కోలుకునేందుకు దోహదం చేస్తోంది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చింది. 2019కు ముందు 1,059 ప్రొసీజర్లు ఉండగా, వీటిని ఏకంగా 3,257కు ప్రభుత్వం పెంచింది. అంతేకాకుండా పథకం కింద వైద్య పరిమితిని కూడా ఇటీవలే ప్రభుత్వం ఏకంగా రూ.25 లక్షలకు చేర్చింది. ఆర్థికంగానూ ఆదుకున్నారు.. నాకు గుండెలో రంధ్రం ఉండటంతో మూడు నెలల క్రితం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్‌కు నా చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆపరేషన్ తర్వాత వైద్యులు సుమారు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. విశ్రాంత సమయానికి భృతి కింద డిశ్చార్జి చేసిన రోజే నా బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం రూ.9,500 జమ చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా కోలుకునే సమయంలోనూ ఆర్థికంగా ఆదుకుంది. ఈ సాయం పౌష్టికాహారం తీసుకోవడానికి, ఇతర నా అవసరాలకు ఎంతో ఉపయోగపడింది. – ఎస్.లలిత, కణేకల్ మండలం, అనంతపురం జిల్లా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా.. వైద్యం పొందిన లేదా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి భృతి ఇస్తున్నాం. రోగులు/వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల కుటుంబాలు కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం. ఇందుకే ప్రభుత్వం జీవన భృతిని అందిస్తోంది. దీన్ని పొందడంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 104 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. వీటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. – బాలాజీ, సీఈవో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
CM Jagan: ‘నాడి’ పట్టిన నేత
సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు.గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు.నాడుప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన సిబ్బంది కొరత.. వెరసి ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. నేడుసర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. ♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059 ♦ వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198 ♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది ♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు ♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు ♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు– రూ.13,169.86 కోట్లు ♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు ♦ కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. ♦ కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు. ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 ♦ మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసింది 86,690 మంది ♦ సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు ♦ కేటరాక్ట్ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి నాడు–నేడులో పనులు.. ♦ రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. ♦ రూ.664.96 కోట్లతో పీహెచ్‌సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్‌సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. ♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. ♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్/జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్‌సీల బలోపేతం చేశారు. ♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. ♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేశారు. 17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు.♦ రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు. ♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. ♦ కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. ♦ వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం. ♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 108 సేవలకు ఊపిరి.. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. ♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. ♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది. ♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు. ♦ ఇలా అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది. -
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ : పేదలకు ఆరోగ్యమస్తు
సాక్షి, అమరావతి: వైద్యం కోసం పేదలు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేశామని, ఇది ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వ వైద్య రంగం స్వరూపాన్ని మార్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వ్యయం పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే సిబ్బంది ఉండరనే దుస్థితిని మన ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందన్నారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 53,126 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లాంటి వైద్య సిబ్బందిని నియమించి మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం 3.96 శాతం మాత్రమే ఉందని, ఈ కొరతను కూడా అధిగమించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇక జాతీయ స్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా అని తెలిపారు. జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా స్థాయికి తెచ్చామని, నూటికి నూరు శాతం పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందడానికి ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్లాలి? చికిత్స వ్యయం ఎంతవరకు వర్తిస్తుంది? తదితర సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేస్తూ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను లబ్ధిదారులకు అందజేసి విస్తృత అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, స్మార్ట్ కార్డుల పంపిణీ, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాలను సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత మందికి ఆరోగ్యశ్రీ అందించాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని పథకం పరిధిలోకి తెచ్చాం. దీంతో 1.48 కోట్ల కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. తద్వారా 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా కల్పించాం. 2019 నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2,300 వరకు కొత్తగా పథకం పరిధిలోకి తెచ్చాం. అనంతరం మరికొన్ని చేర్చి ఇవాళ 3,257 ప్రొసీజర్లతో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన సందర్భాల్లో ఏ ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గత సర్కారు హయాంలో అరకొర సేవలతో కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమైంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కలిపి 2,513 ఆస్పత్రులకు సేవలను విస్తరించాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోనూ 204 కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నాం. ఆరోగ్య సంరక్షణకు రూ.14,439 కోట్లు గత సర్కారు ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కోసం కేవలం రూ.5,171 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ.1,034 కోట్లు మాత్రమే వెచ్చించిన దుస్థితి. 2014–19 మధ్య 108, 104 సేవల కోసం రూ.729 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏడాదికి సగటున రూ.4,100 కోట్లు వ్యయం చేస్తున్నాం. దీనికి అదనంగా ఏటా మరో రూ.300 కోట్లు 104, 108 సేవల కోసం ఖర్చు పెడుతున్నాం. ఆరోగ్యశ్రీ, 104, 108 కోసం గత సర్కారు రూ.5,900 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా మనం ఏటా ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే రూ.14,439 కోట్లు వెచ్చించాం. గత సర్కారు హయాంలో 22.32 లక్షల చికిత్సలు అందించగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీతో 53 లక్షల చికిత్సలు అందించగలిగాం. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ నాడు – నేడు ద్వారా పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని స్థాయిల్లో సదుపాయాలు కల్పించాం. 2019కు ముందు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా ఇవాళ కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతున్నాం. గతంలో 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి. నాడు 108 వాహనాలు కేవలం 336 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు మొత్తం 2,204 వాహనాలను అందుబాటులో ఉంచాం. చికిత్సానంతరం ఆసరా.. ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున, రెండు నెలలు అయితే రూ.10 వేలు పేదవాడి చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపుతున్నాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,309 కోట్లు అందించాం. లక్షలు ఖర్చయ్యే ప్రాణాంతక వ్యాధులకూ.. గతంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్స ఖర్చు రూ.5 లక్షలు దాటితే ఇచ్చేవారు కాదు. కీమోథెరపీ లాంటిది ప్రారంభిస్తే కేవలం రెండు మూడు డోసులకే రూ.5 లక్షలు ఖర్చు అయిపోతాయి. దీంతో ఇక ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని వెనక్కు పంపడం లేదంటే నామమాత్రంగా చికిత్స చేసేవారు. 6 నెలలు తర్వాత ఆ పేషెంట్‌కు మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో వైద్యం అందక చనిపోయిన దుస్థితి ఉండేది. ఇప్పుడు చికిత్స వ్యయంతో పని లేకుండా పూర్తిస్థాయిలో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నాం. రూ.12 లక్షల ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు రెండు చెవులకూ చేయిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల్లో రూ.11 లక్షలు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయిస్తున్నాం. రూ.11 లక్షలయ్యే గుండె మార్పిడి చికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డ 1,82,732 మందికి ఆరోగ్యశ్రీతో ఉచితంగా చికిత్స అందించి తోడుగా నిలబడ్డాం. ఒక్క క్యాన్సర్ చికిత్సకే ఏకంగా రూ.1,900 కోట్లు ఖర్చు చేశాం. 60.27 లక్షల మందికి ఫేజ్ 1లో వైద్య సేవలు ఫేజ్ 1 ఆరోగ్య సురక్షను 50 రోజుల పాటు నిర్వహించాం. 60,27,843 మంది వైద్య సేవలు అందుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పంపిణీ చేసే ప్రతి ఔషధం డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నాం. 562 రకాల మందులను అందుబాటులోకి తెచ్చాం. ప్రివెంటివ్ కేర్‌తో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి వైద్యం అందిస్తూ అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశంలో తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా తెచ్చాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతి పీహెచ్‌సీలోనూ ఇద్దరు డాక్టర్లు చొప్పున నలుగురు వైద్యులను అందుబాటులోకి తెచ్చాం. పాల్గొన్న ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ, ఎంఏయూడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రచార కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు పొందటాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియచేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. మంగళవారం నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో వీటిని ప్రారంభిస్తారు. ఇలా ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో ఏఎన్ఎంలు, సీహెచ్‌వోలు ఒక బృందంగా, మరో బృందంలో ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపేవారు పాలు పంచుకుంటారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరించాలి. ఇంట్లో కనీసం ఒకరి మొబైల్ ఫోన్లోనైనా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించాలి. మహిళా పోలీసులు కూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. ఆరోగ్యశ్రీ సేవలపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన 6 నిమిషాల వీడియో సందేశాన్ని ఆయా కుటుంబాలకు చూపించాలి. వారి ఫోన్లలో కూడా ఈ వీడియోను ఉంచండి. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డుల్లో సరికొత్త ఫీచర్లున్నాయి. ఇవి స్మార్ట్ కార్డులు. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. పేషెంట్లకు సంబంధించిన అన్ని వివరాలూ నిక్షిప్తం అవుతాయి. దీంతో వైద్యులు సులభంగా వైద్యం అందించడానికి వీలవుతుంది. ఇది ఈ కార్డులో విశిష్టత. వీటిని ప్రతి ఇంట్లో చక్కగా వివరించాలి. వైద్య రంగంలో అద్భుతాలు ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలన్న గొప్ప ఆలోచనతో అత్యున్నత స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తూ సీఎం జగన్ వినూత్న సంస్కరణలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. నాడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాణం పోస్తే నేడు సీఎం జగన్ మరింత విస్తరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా జగనన్న ప్రభుత్వం వైద్య శాఖలో 53 వేలకుపైగా నియామకాలు చేపట్టిన ఘనత దక్కించుకుంది. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా, గుమ్మం వద్దకే ఫ్యామిలీ డాక్టర్, పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారు. వైద్యులు రోగిని కాపాడి మిరాకిల్స్ చేస్తారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జనవరి 1 నుంచి ‘సురక్ష’ ఫేజ్–2 జనవరి 1వతేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో సురక్ష శిబిరం నిర్వహిస్తారు. మండలాన్ని రెండుగా విభజించి ఒక డివిజన్లో మంగళవారం, మరో డివిజన్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. ఉచితంగా మందులు కూడా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పటికే ట్రైల్ రన్ ప్రారంభించాం. జనవరి ఒకటో తేదీ నుంచి మందులు ఉచితంగా డోర్ డెలివరీ ద్వారా అందుతాయి. రిఫరెల్ కేసుల వివరాలు తెలుసుకుని డాక్టర్ వద్దకు పంపించే కార్యక్రమం విలేజ్ క్లినిక్స్ ద్వారా జరుగుతుంది. రోగులకు ప్రయాణ ఖర్చుల కింద రూ.300 ప్రభుత్వమే అందిస్తుంది. వీటిని జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా చేపడతారు. -
ఆరోగ్యశ్రీ యాప్ తో దగ్గరలోని నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకోవచ్చు: రోజా
-
పేదవాడికి ఆరోగ్యశ్రీ చేరువ చేయడమే లక్ష్యం: సీఎం జగన్
-
ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్ లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయ్యేలా చర్యలు
-
ఇక రూ.25లక్షల వరకు ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ దానిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమంతోపాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల జారీని కూడా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. అలాగే, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించడం.. దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా చూస్తారు. తద్వారా 1.48 కోట్ల కుటుంబాలకు, 4.25 కోట్ల మంది లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పిస్తారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 ఇక జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి ప్రతీవారం గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో ప్రతీవారం ఒక వార్డు పరిధిలో సురక్ష శిబిరాలు నిర్వహిస్తారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు మందులు చేరవేసి అక్కడి నుంచి ఏఎన్ఎంల ద్వారా సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నేరుగా ఇంటివద్దనే డబ్యుహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలుగల మందులు ఉచితంగా అందిస్తారు. ♦ ఈ మందులు అయిపోయిన తరువాత వాటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేకుండా విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌తో అనుసంధానం చేసి డోర్ డెలివరీ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. కొత్త కార్డుల ఫీచర్లు ఇవే.. ♦ ప్రతీ కార్డులో క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ ఉంటుంది. ♦ ఈ క్యూఆర్ కోడ్‌తో లాగిన్ అవడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు. ♦ అలాగే, ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలుంది. ♦ దీని ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన.. మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం కానుంది. -
ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం
-
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి 25 లక్షల రూపాయలకు పెంపు..ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆరోగ్యశ్రీపై కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాగా, కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది నేటి నుంచి అమలులోకి రానున్నట్టు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. వివరాలు ఇలా.. ఆరోగ్యశ్రీ క్రింద వైద్యానికి రూ.10 లక్షలకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఇది నేటి నుంచి అమలు. 2004లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్ఆర్. ఇది వరకు ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఉంది. నేటి నుంచి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే అవకాశం రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు. రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్సీలలో అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు. ఆరోగ్య శ్రీ కింద అందుబాటులో ఉన్న 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలు. -
ఒక్క పథకంతో రూ.25 లక్షల వైద్య సేవలు ఉచితం
-
దేశమంతా ఆరోగ్యశ్రీని ప్రశంసిస్తుంటే రామోజీ వికృత రాతలు
-
డాక్టర్లు కాన్సర్ అన్నారు.. ఆరోగ్యశ్రీ అండగా నిలిచింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా తల రాత మారింది ఇంటి కోసం టీడీపీ పాలనలో కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిగో.. ఈ ప్రభుత్వం వచ్చాక మా కల సాకారమైంది. మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం. నా భర్త పేరు బంగారయ్య. మాకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద పాప మూడో తరగతి, చిన్న పాప ఎల్కేజీ చదువుతున్నారు. మాది నిరుపేద కుటుంబం. ఇతర ఆస్తులు ఏమీ లేవు. నా భర్త బంగారయ్య ఆనందపురం జంక్షన్లో ఆటో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మాకు 2013లో వివాహమైంది. మాకు సొంతిల్లు లేక పోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నాము. ఒక వైపు ఇంటికి అద్దె చెల్లించుకుంటూ, మరో వైపు కుటుంబాన్ని పోషించుకోవలసి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారం. చంద్రబాబు హయాంలో ఐదుసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. మా ఖర్మ ఇంతే అనుకొని తీవ్ర నిరాశతో ఉన్నాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత మా రాత మారిపోయింది. దరఖాస్తు చేసిన వెంటనే సుమారు రూ.10 లక్షల విలువ చేసే స్థలాన్ని మంజూరు చేశారు. సిమెంట్, ఇసుక ఇచ్చారు. మొత్తంగా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. మా వద్ద ఉన్న కొంత పొదుపు సొమ్ముతో ఇంటిని నిర్మించుకున్నాం. దీంతో మా సొంతింటి కల నెరవేరింది. అద్దె లేక పోవడంతో సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతోంది. నా కుమారుడికి అమ్మ ఒడి కింద ఏటా డబ్బు వస్తోంది. ఇంటికే రేషను తెచ్చి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వలన ఏమాత్రం అనారోగ్యానికి గురైనా ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నాము. – పిన్నింటి రామలక్ష్మి (మహంతి శివాజీ, విలేకరి, ఆనందపురం) ఆరోగ్యశ్రీ లేకపోయుంటే జీవితమే లేదు మాకు వచ్చే ఆదాయం ఇంటి అద్దెకు, పిల్లల చదువులకే సరిపోదు. అలాంటి పరిస్థితిలో కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన నేను ఆస్పత్రికి వెళ్లాను. వైద్యులు పరీక్షించి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలంటే రూ.15 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దీంతో మా కుటుంబంపై పిడుగు పడ్డట్లయింది. ఆపరేషన్ చేయించుకోగలమా? అని బాధపడ్డాము. అప్పుడు వైద్యులు మీకు రూపాయి ఖర్చు కాదు.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఆపరేషన్, మందులు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పారు. అన్నట్లుగానే రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేయడంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చారు. చికిత్స అనంతరం వారే మా ఇంటి వద్ద దించారు. ఇప్పటికీ మందులు అందజేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే నాకు జీవితమే లేదు. జగనన్న పుణ్యమా.. అని మా కుటుంబం సంతోషంగా ఉంది. నా పేరు షేక్ సాజిదా. నా భర్త షేక్ ఇస్మాయిల్ టీ కొట్టులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు రహమాన్ ఇంటర్ మొదటి సంవత్సరం, కుమార్తె తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఇదివరకు ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఒకరిని స్కూలు మాని్పంచి కూలికి పంపుదామని అనుకున్నాము. ఇప్పుడు ఆ కష్టం లేదు. అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు, బట్టలు, బూట్లు.. అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. స్కూల్లోనే మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నారు. ఈ ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి ఇంతగా మేలు జరుగుతుందని ఊహించలేదు. – షేక్ సాజిదా, టిప్పర్ల బజారు, మంగళగిరి (ఐ.వెంకటేశ్వరరెడ్డి, విలేకరి, మంగళగిరి) దివ్యాంగ పింఛనుతో బడ్డీ కొట్టు పెట్టుకున్నా మాది చిన్న కుటుంబం. భార్య, ముగ్గురు పిల్లలు. ఆరి్థకంగా అంతంత మాత్రమే. చిన్న హోటల్ నడుపుకుంటూ బతుకు బండి లాగుతుండేవాడిని. 2019లో నాకు పక్షవాతం వచి్చంది. దీంతో ఏ పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. లేచి నిలబడడానికి కూడా శరీరం సహకరించేది కాదు. నా భార్యే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచి్చంది. కొన్నాళ్లకు వాకర్ సహాయంతో నెమ్మదిగా నిలబడడం, చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతున్నాను. 90 శాతం వికలాంగత్వం ఉండటంతో నాకు దివ్యాంగుల పింఛను మంజూరైంది. 2021 నుంచి నెలకు 5 వేల రూపాయలు అందుకుంటున్నాను. నా కుమారుడికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నా కుమార్తె బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుండడంతో ఫీజుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాలేదు. నా భార్యకు కూడా కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15 వేలు అందుతున్నాయి. నా భార్య కూలి పనుల సంపాదన, నాకు వచ్చే పింఛను డబ్బులపై ఆధారపడకుండా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులోని మా ఇంటి దగ్గరే బడ్డీ దుకాణం పెట్టుకున్నా. మా జీవితంలో ఇంత మార్పు వస్తుందని, ప్రభుత్వం నుంచి ఇలా సాయం అందుతుందని ఊహించలేదు. – శిఖినం సుధాకర్, భట్టిప్రోలు (నందం వెంకటేశ్వరరావు, విలేకరి, భట్టిప్రోలు) -
ఇక గర్భిణులకు నిశ్చింత
సాక్షి, అమరావతి: నవ మాసాలు మోసి కన్న బిడ్డకు గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, నయంకాని వ్యాధులుంటే ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. ఇలా ఏ తల్లి క్షోభకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ సేవలను ఉచితంగా సీఎం జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్(టిఫా) స్కాన్ దోహదపడుతుంది. ఖరీదైన ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఉచితంగా చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి ఆరోగ్యశ్రీ కింద గర్భిణులకు ఒక టిఫా, రెండు అ్రల్టాసౌండ్ స్కాన్లు/మూడు అల్ట్రా సౌండ్ స్కాన్ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్ అబ్్రస్టెటిక్ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు(మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వారికి, ఇతర సమస్యలున్న గర్భిణులకు వైద్యుడి సూచన మేరకు టిఫా స్కాన్ చేస్తున్నారు. పైసమస్యలేవీ లేని గర్భిణులకు మూడు అ్రల్టాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 1500 మందికి పైగా గర్భిణులు ఉచిత టిఫా, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలు పొందారు. టిఫా స్కానింగ్‌కు ప్రైవేట్‌గా అయితే రూ.1,500 నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లే వరకూ మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ప్రసవించిన మహిళలకు విశ్రాంత సమయానికి భృతిగా రూ.5 వేల చొప్పున వైఎస్సార్ ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇక 108 అంబులెన్స్‌ల ద్వారా ఉచితంగా ఆస్పత్రులకు తరలించడం, ప్రసవానంతరం వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా వారిని ఇంటికి చేరుస్తుండటం తెలిసిందే. ముందే గుర్తిస్తే నయమయ్యే అవకాశం మేనరికం వివాహాలు, జన్యు సంబంధిత లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి వివిధ కారణాలతో శిశువుల్లో లోపాలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను ముందే గుర్తిస్తే అత్యధిక శాతం నయం చేయడానికి వీలుంటుంది. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్‌తో గుర్తించే అవకాశముంటుంది. – డాక్టర్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య, ఆరోగ్య శాఖ -
Fact Check: ఈనాడు ఆరోపణలు అవాస్తవం
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రుల ఎంపానల్మెంట్ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి పాదర్శకంగా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దీపక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ముడుపులు అందితేనే ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అంటూ ఈనాడులో సోమవారం ప్రచురించిన కథనంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ఎంపానల్మెంట్ అవడానికి నిర్దేశించిన సదుపాయాలున్న ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పోర్టల్ అందుబాటులో ఉండే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తుల్ని నిర్ణీత సమయపాలనతో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంపానల్మెంట్ ప్రక్రియలో మాన్యువల్ ప్రమేయం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఏవైనా లోపాలుంటే ఆ వివరణలతో ఆన్లైన్లోనే ఆస్పత్రులకు నోటీసులు వెళతాయని తెలిపారు. ఇక రోగులకు వైద్యసేవల కోసం ముందస్తు అనుమతులు (ప్రీ ఆథరైజేషన్), క్లెయిమ్‌లు ఆన్లైన్లో వివిధ స్థాయిల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులను, వైద్యసేవలకు సంబంధించి ప్రజలను ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే నేరుగా 104 (ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల నంబరు), 14400 (అవినీతి నిరోధక విభాగం) నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆస్పత్రుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల యాజమాన్యాలు సమస్యలను cgro@aarogyasri.ap.gov.in కు మెయిల్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకం ఎలా మొదలైందో మీకు తెలుసా..?
-
ఆరోగ్యశ్రీ స్కీమ్ వల్లనే నేను ఇంకా బతికి ఉన్న..!
-
ఆరోగ్య దాత..అభయ ప్రదాత
సాక్షి, అమరావతి: రోడ్లపై కుయ్.. కుయ్‌మని సౌండ్ చేస్తూ తిరిగే 108 అంబులెన్సు.. ఆరోగ్యశ్రీ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004కి ముందు బడుగు, బలహీనవర్గాలు, పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఏవైనా పెద్ద జబ్బుల బారినపడితే ఆస్తులను అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవి. పెద్ద జబ్బులు వస్తే ప్రాణాలపైన ఆశలు వదులుకోవాల్సిందే. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని.. అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి దైన్యంతో నిండిపోయిన కుటుంబాలే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ ఆరోగ్య దాతగా.. అభయ ప్రదాతగా నిలిచారు. పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ప్రవేశపెట్టి ఎంతోమంది రోగులకు ఆయుష్షు పోశారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దైన్యం.. అప్పుల సుడిగుండంలో చిక్కుకోవాల్సిన బాధలు తప్పాయి. ఆపద్బంధు 108 ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడమే కాకుండా ప్రమాదాల్లో గాయపడిన వారిని, అనారోగ్యంతో ఉన్నవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్సును కేటాయించారు. అవసరమున్నవారు ఎవరైనా 108కి ఫోన్ చేస్తే నిమిషాల్లోనే వారి వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడానికి 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో 18 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు వివిధ పేర్లతో అమలు చేస్తుండటం విశేషం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. అదే విధంగా 108, 104 సేవలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. కొత్త ఊపిరిలూదిన సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో పడకేసిన ఆరోగ్యశ్రీ సేవలకు కొత్త ఊపిరిలూదారు. 108, 104 పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంతోపాటు వీటి సంఖ్యను మరింత పెంచారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ప్రొసీజర్లను 1,059 నుంచి ఏకంగా 3,257కు పెంచారు. అంతేకాకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయానికి రోగులకు నెలకు రూ.5 వేల వరకు భృతిని కూడా అందిస్తున్నారు. వైద్య విద్య బలోపేతానికి కృషి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య విద్య బలోపేతానికి వైఎస్సార్ చేసిన కృషి అమోఘం. ఆయన సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో కడప, ఒంగోలు, శ్రీకాకుళం, ఆదిలాబాద్‌ల్లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లను ఏర్పాటు చేశారు. అలాగే కడపలో దంత వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలోపేతమైంది.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకే. ఈ క్రమంలో సీఎం జగన్ ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఐదు వచ్చే ఏడాది, మిగిలిన ఏడు 2025–26 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. -
ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్దిదారులకు అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినందున కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందిస్తున్నామని చెప్పారు. అందుకోసం లబ్దిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల ప్రోత్సాహకం కోవిడ్ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ తరహా సేవలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కిడ్నీ బాధితులకు మరింత నాణ్యంగా డయాలిసిస్ సేవలు అందించేందుకు ఆన్లైన్ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి, వినియోగించడానికి ఆరోగ్యశ్రీ బోర్డు అనుమతి ఇచ్చిందన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్ వేర్ వినియోగానికి కూడా అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ప్యానెల్ బృందంలో ఉన్న కాంట్రాక్టు డాక్టర్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్ రావు వెల్లడించారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప పాల్గొన్నారు. -
‘ఆరోగ్యశ్రీ సేవలు యథాతధంగా కొనసాగుతాయి’
విజయవాడ: ఆరోగ్య శ్రీ సేవల యథాతధంగా కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ స్సష్టం చేసింది. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) రూ. 368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించినట్లు ఆయన తెలిపారు. -
వైఎస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రి: మంత్రి విడదల రజినీ
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్య రంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనుచేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజనీ పేర్కొన్నారు. మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు నిత్యం తపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు గొప్ప సేవలు అందిస్తున్నారని అన్నారు. మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్ధేశంతోనే రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనవని ప్రశంసించారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను పెంచామని, 3255 వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారని, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. గతంలో ఎన్నడూ జరగనంతగా వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 49వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. వైద్యానికి కావాల్సిన బడ్జెట్ పెంచాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ‘సీఎం జగన్ మనసున్న ముఖ్యమంత్రి. ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించడం వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. మెడికల్ కాలేజీలు తేవాలంటే చాలా ధైర్యం కావాలి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నదే సీఎం ఆశయం. భావితరాలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సీఎం ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇప్పటికే కొంత మేర చెల్లించాం. త్వరలోనే మిగతా వాటిని కూడా చెల్లిస్తాం. నాణ్యమైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడదు.’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన..షెడ్యూల్ ఇదే.. అపర సంజీవని ఆరోగ్యశ్రీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిలా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు తదితర అంశాలపై మంత్రి విడదల రజిని మంగళగిరిలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,336 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసిందని, తమ ప్రభుత్వం కొత్తగా మరో 2,446 ప్రొసీజర్లను చేర్చిందని చెప్పారు. దీంతో ఏకంగా 3,255 ప్రొసీజర్లకు వైద్యం ఉచితంగా ప్రజలకు అందుతోందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసేదన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం రూ.3వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఆసరా కోసం రూ.445 కోట్లు, 108 వాహనాల నిర్వహణకు రూ.187 కోట్లు, 104 వాహనాల నిర్వహణకు రూ.164 కోట్లు, ఈహెచ్ఎస్ కోసం రూ.140 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని వివరించారు. ఏపీలో 2,061ఆస్పత్రులు, తెలంగాణలో 132, కర్ణాటకలో 49, తమిళనాడులో 22 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, అడిషనల్ సీఈవో మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
AP: రైతన్నకు కంటి వెలుగును ప్రసాదించిన ఆరోగ్యశ్రీ.. తొలిసారి కంటి మార్పిడి
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నేత్ర విభాగంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఓ రైతన్నకు కంటి మార్పిడి (కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేసి చూపును ప్రసాదించారు. నెల్లూరు జీజీహెచ్‌లో తొలిసారి కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన సందర్భంగా ఆ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ శనివారం తెలియజేశారు. తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామానికి చెందిన రామయ్య (60) అనే రైతుకు 20 ఏళ్ల క్రితం కంటికి దెబ్బతగిలి నల్లగుడ్డు మీద పువ్వు ఏర్పడింది. దీంతో కంటి చూపు పూర్తిగా తగ్గి రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రామయ్య ఈ నెల 3న నెల్లూరు జీజీహెచ్‌కి రాగా, కంటి విభాగాధిపతి డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి కంటి గుడ్డు మార్పిడి ద్వారా చూపును ప్రసాదించవచ్చని చెప్పారు. ఈ నెల 9న రాజయ్య కంటికి ఆపరేషన్ చేసి దాత నుంచి సేకరించిన నల్లగుడ్డును విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్‌ను విజయవంతంగా చేసిన డాక్టర్ సంధ్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. రోగి రామయ్య మాట్లాడుతూ తనకు చూపును ప్రసాదించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
చేయని ఆపరేషన్‌కు కుట్లు తీయాలన్న వైద్యులు..షాకైన పేషెంట్
సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన రోగమైనా ఇక్కడ ఇట్టే నయమవుతుందనే నమ్మకం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా దొరకని స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయనే భావన. అరుదైన చికిత్సలు..పరిశోధనలతో ఉత్తమ గుర్తింపు పొందిన నిమ్స్ నేడు కొంత మంది వైద్యుల తీరుతో అబాసు పాలవుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తోడు అక్రమార్జనకు అలవాటు పడిన కొంత మంది వైద్యులు రోగులను మభ్యపెట్టి ఆస్పత్రికి చెడ్డపేరు తీసు కొస్తున్నారు. ఫలితంగా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. తాజాగా ఓ వైద్యుడు రోగికి ఎలాంటి సర్జరీ చేయకుండానే చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో చూపించడమే కాకుండా ఆయన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 15 మంది రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణ కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సర్జరీ చేయకుండానే...చేసినట్లు రికార్డులు.. ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకటేశ్వర్రావు(47) వాంతులు, కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం2 2021 ఏప్రిల్4న నిమ్స్‌కు చేరుకున్నాడు. న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఉంది..ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, అం దులోనే సర్జరీ చేయాలని సదరు బాధితుడు వైద్యులకు మొర పెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ చికిత్స లేదని, డబ్బులు కట్టి సర్జరీ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైద్య ఖర్చులకు డబ్బు లేకపోవడంతో వెంకటేశ్వరరావు శస్త్రచికిత్స చేసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. అయితే, డాక్టర్లు ఇక్కడే తప్పులో కాలేశారు. డిశ్చార్జీ సమ్మరీలో వెంకటేశ్వరరావుకు సర్జరీ చేసినట్లు నమోదు చేయడమేగాకుండా.. కుట్లు తీయించుకునేందుకు ఫలానా తేదీనాడు రావాలని సూచించారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడం..లాక్డౌన్ కారణంగా ఆయన ఆస్పత్రికి రాలేకపోయారు. ఇటీవల ఆనారోగ్య సమస్య తీవ్రం కావడంతో గతేడాది డిసెంబర్ 28న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సమాధానం విని బిత్తెరపోయారు. నిమ్స్ వైద్యులు రాసిన డిశ్చార్జీ సమ్మరీ చూసి వైద్యులు ఆశ్చర్య పోయారు. ఆపరేషన్ చేయక పోయినా...చేసినట్లు సమ్మరిలో పేర్కొనడంతో వారు చికిత్సకు నిరాకరించి.. మళ్లీ నిమ్స్‌కు వెళ్లమని తిప్పిపంపారు. దీంతో ఆయన గురువారం నిమ్స్ న్యూరాలజీ ఓపీకి వచ్చాడు. ఇంతకు ముందు నిన్నెవరు చూశారో వాళ్ల దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో చూసిన వైద్యుడెవరో తెలియని వెంకటేశ్వరరావు..ఏం చేయాలో అర్థంగాక తలపట్టుకున్నారు. ఇప్పటికే చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేసుకున్న తనకు సర్జరీ కోసం మళ్లీడబ్బులు సర్దుబాటు చేయడం తలకు మించిన భారమని వాపోయారు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన మరో బాధితుడు అదే విధంగా బడంగ్‌పేటకు చెందిన అరుణ కుమార్ మెదడులో ఏర్పడిన కణితి సమస్యతో బాధపడుతూ నిమ్స్‌ను ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.. డబ్బులు కట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రిలోని ఓ అధికారి సిఫార్సుతో వచి్చన ఆ రోగికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.50 వేలు కట్టించి పరీక్ష చేయించారు. అంతే కాకుండా ఓ అధికారి కూడా అతని వద్ద నుంచి ఆపరేషన్ చేయించేందుకు గానూ రూ. 20వేలు వసూలు చేశాడు. చివరికి ఆపరేషన్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. సదరు బాధితుడు ఇటీవల ఏసీబీకి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సదరు అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ సాయిబాబాలతో విచారణ కమిటీ వేసింది. (చదవండి: వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్ మోసం ) -
కోమాలో ‘ఆరోగ్యశ్రీ’ : షర్మిల
సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్యానికి సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అద్భుత పథకమని, దీనిని తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేస్తుందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని ఆయన నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనూ ఆరోగ్యశ్రీ కేసులను చేర్చుకోవడంలేదని, సర్కారు నిధులు ఇవ్వనందున డబ్బులు కట్టి చేరాలని పేదల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
అవీ సర్కారు ఆసుపత్రులు.. ఆరోగ్యశ్రీ లేకుంటే.. వైద్యమూ అందట్లే!
ఆమె పేరు శ్వేత (పేరు మార్చాం)... పది రోజుల క్రితం ప్రసవం కోసం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. డిశ్చార్జి సమయంలో మగబిడ్డ పుట్టినందున రూ.3 వేలు చెల్లించాలని అక్కడి సిబ్బంది ఒత్తిడి చేశారు. వైద్యాధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో రూ. 3 వేలు, ఇతరత్రా రూ.500 చెల్లించి బయటికొచ్చారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగికి ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే గుండె వైద్యం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌పేషంట్లుగా చేరే రోగులకూ చాలాచోట్ల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రెండు మూడు రోజులు ఇన్‌పేషంట్‌గా ఉంటే సొమ్ములు ఇవ్వాల్సిందే. లేకుంటే వారికి వైద్యసేవలు గగనమే. ఇలాంటి వాటిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధమేంటని.. ఎవరికైనా ఉచిత వైద్యం చేయాల్సిందే కదాని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉచిత వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. కోట్లలో వసూలు... సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవానికి, ఇతర చికిత్సలకు ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్న పరిస్థితులున్నాయి. విచిత్రమేంటంటే కొన్ని చోట్ల కేసీఆర్ కిట్టు ఇచ్చినందుకూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి దందాల్లో కొందరు డాక్టర్లు సూత్రధారులుగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వసూలు చేసిన సొమ్మును డాక్టర్‌కు లేదా ఏజెన్సీ నిర్వాహకుడికి ఇచ్చి అంతా పంచుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో జరిగే కాసుల దందాతో ఏడాదికి రూ.కోట్లు వసూలు అవుతున్నాయి. నిలోఫర్‌లో ఏడాదికి రూ. 2 కోట్లు, గాం«దీలో రూ.కోటిన్నర, ఉస్మానియాలో రూ. కోటి వరకు వసూలు అవుతున్నట్లు అంచనా. జిల్లా ల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనూ జోరుగా వసూళ్లపర్వం సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 6 లక్షల కాన్పులు జరుగుతుండగా, వీటిలో 4 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. డబ్బులు వస్తేనే చేయగలం! యాంజియోగ్రాం చేసేటప్పుడు అవసరమైతే స్టెంట్లు వేయాలని, వాటికి ఖర్చవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ అడుగుతున్నామని వైద్యులంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అయితే స్టెంట్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ ఇదే పద్ధతి నడుస్తోంది. కాగా, ‘గాంధీ’లోని ఒక గైనకాలజీ వైద్యురాలు ఆపరేషన్‌కు రూ.10 వేలు డిమాండ్ చేశారని ఒక బాధితురాలు ఇటీవల లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలోనూ వసూలు దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రసవానికి వచి్చన మహిళ నుంచి ఆడబిడ్డ పుడితే రూ. 2 వేలు, మగబిడ్డ పుడితే రూ.3 వేలు ఇవ్వాలన్న షరతు పెట్టారు. ఈ దందా వెనుక ఒక ప్రముఖ వైద్యుడు కీలకంగా ఉండటం గమనార్హం. కాసుల కక్కుర్తిలో మచ్చుకు కొన్ని... ► గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగంలో ఆడబిడ్డ పుడితే రూ. వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 1,500 వసూలు చేస్తున్నారు. ► పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రితోపాటు బేలాలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన వారి నుంచి అబ్బాయి పుడితే రూ.2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. ► హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే రూ.వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 2 వేలు డిమాండ్ చేస్తున్నారు. ► నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి, మగ బిడ్డ పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. డెలివరీ తరువాత ఆయాలకు రూ. 500 ఇవ్వాల్సి వస్తోంది. ► జనగామ జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడబిడ్డ పుడితే రూ.500, మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి గుంజుతున్నారు. ► ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ప్రభుత్వం మందులు సరఫరా చేస్తున్నా, అందుబాటులో లేని ఔషధాల కొనుగోలుకు బడ్జెట్ కేటాయించినప్పటికీ రోగులు ప్రైవేట్ దుకాణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఐదు రకాల మందులు రాస్తే కనీసం రెండు రకాల ఔషధాలు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిందే. నాకు ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించాడు. గురువారం డిశ్చార్జి చేసేటప్పుడు అక్కడి సిబ్బంది రూ.వెయ్యి వసూలు చేశారు. అలాగే కేసీఆర్ కిట్టుకూ వంద రూపాయలు తీసుకున్నారు. - ఝాన్సీ, హైదరాబాద్ -
ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి ఏఎన్ఎం ఖాళీ పోస్టుల భర్తీకి నెలారెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రెండో ఏఎన్ఎం మహాసభల్లో మంత్రి మాట్లాడారు. అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, రాబోయే రోజుల్లో కీమో, రెడియో థెరపీ కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్ఎంలది కీలక పాత్ర అని కొనియాడారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలియదని, అలాంటివారిని గుర్తించి ముందుగా చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, ఫలితంగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖానాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరగగా, ఇప్పుడు అవి 67 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానం దక్కించుకుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉందని, డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజినే తప్ప దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని తెలిపారు. జనవరి వరకు అన్ని జిల్లాల్లో టి–డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏఎన్ఎం పరిధిలో వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటట్టు చూడాలన్నారు. మొదటి ఏఎన్ఎం పోస్టుల ఖాళీల భర్తీలో కరోనా తర్వాత వెయిటేజీ ఇస్తున్నామని, ఏడాదికి 2 మార్కుల చొప్పున కలుపుతున్నామని చెప్పారు. టీవీవీపీలో 228 ఉద్యోగాలు ఇస్తే, 200 పోస్టులు ఏఎన్‌ఎంలకే వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో వయో పరిమితి సడలింపు ఇచ్చామని హరీశ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్‌సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్‌లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. క్రిటికల్ కేర్‌కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత) -
‘ఆరోగ్యశ్రీ’లో 25 లక్షల శస్త్రచికిత్సలు
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకంతో ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానించింది. దీంతో 87.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలకుపైగా శస్త్రచికిత్సలు జరిగాయని పేర్కొంది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్తనిల్వ కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. 27 బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్ సెపరేటర్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్తగా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో భాగంగా డైట్ చార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్ మెనూను ప్రవేశపెట్టారు. కొత్త ఔషధ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. రూ.61 కోట్ల అంచనా వ్యయంతో 29 బోధనాసుపత్రులు, 20 జిల్లా ఆసుపత్రులు, 30 సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ పనులు సాగుతున్నాయి. రూ.61 కోట్లతో 20 ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్టీపీ) మంజూరయ్యాయి. రూ.31 కోట్ల అంచనా వ్యయంతో 153 ఇతర ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పనులు మంజూరయ్యా యి. 61 ఆసుపత్రుల్లో మార్చురీల మర మ్మతు, పునరుద్ధరణ, అప్‌గ్రేడేషన్ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతిచి్చందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగిందని, జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానానికి చేరుకుందని తెలిపారు. -
మానసిక వ్యాధులకు ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే మానసిక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా చెప్పారు. విజయవాడలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి నిర్వహిస్తున్న ఇండ్లాస్ విమ్హాన్స్ మానసిక వైద్యశాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంత వాసులు మానసిక వ్యాధులకు చికిత్స పొందేందుకు ఇప్పటి వరకు ఆస్పత్రి అందుబాటులో లేదన్నారు. దీంతో కడప రిమ్స్‌లో రూ.50 కోట్లతో 100 పడకల మానసిక వ్యాధుల ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ జిల్లాకు చెందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్‌రెడ్డి నాలుగు దశాబ్దాల కిందటే విజయవాడలో మొదటి మానసిక వ్యాధుల ఆస్పత్రి స్థాపించి, ఈ ప్రాంతం వారికి సమర్థమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తాను రచించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రికి అందచేశారు. -
వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష
సాక్షి, అమరావతి: సీజనల్ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది. 7,032 మందికి చికిత్స ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్ కిట్‌లో పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు. పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్‌మ్యారో సప్రెషన్)తో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ జ్వరాల బారినపడి.. ప్లేట్లెట్స్ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు -
ఆహార భద్రత కార్డుదారులకూ ఆరోగ్యశ్రీ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కోసం తెల్లకార్డుల స్థానంలో 10లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది. వాటిని కేవలం రేషన్ సరుకుల కోసం మాత్రమే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రజల నుంచి వినతులు రావడంతో.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత సేవలు లభిస్తాయి. -
Aarogyasri: ఖైదీలకూ ఆరోగ్యశ్రీ! ఇతర రాష్ట్రాల ఖైదీలకూ చాన్స్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మానవతా దృక్పథంతో ఖైదీలకు సైతం చికిత్స అందించనుంది. ఈ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారి ఖైదీలకూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది. 2019 డిసెంబర్లో జరిగిన ప్రిజన్ డెవలప్మెంట్ బోర్డు సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఖైదీల వైద్య సదుపాయాలపై నివేదిక సమర్పించాలని జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో స్వతహాగా వైద్యుడైన జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావుతో పాటు అప్పటి గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.రఘు, డీజీ అషాన్‌రెజా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 22న జీవో విడుదల చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత జబ్బుకు చికిత్స లభించకపోతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరి కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో నెట్వర్క్ ఆస్పత్రులను గుర్తించారు. ఖైదీలు వైద్య సేవలు పొందడానికి ఆధార్/రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అవి లేని ఇతర రాష్ట్రాల ఖైదీలకు చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ (సీఎంసీవో) కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఇబ్బందులకు చెక్.. గతంలో ఎవరైనా ఖైదీకి అనారోగ్యం చేస్తే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేవారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడేవారు. వ్యా«ధి తీవ్రతను బట్టి దూరంగా ఉండే ప్రభుత్వాస్పత్రులకు ఖైదీలను రిఫర్ చేసేవారు. ఇందుకోసం న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తయి ఆస్పత్రులకు వెళ్లినా ఆరోగ్యశ్రీ ఉండేది కాదు. దీంతో వైద్యం అందక ఖైదీలు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించడంతో ఖైదీలకు కూడా మెరుగైన వైద్యం అందనుంది. జైళ్లలో మరణాలు గణనీయంగా తగ్గుతాయి.. ఖైదీలకు మెరుగైన వైద్యసేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఇటువంటి సదుపాయం కల్పించిన ఘనత దేశంలో మొట్టమొదట రాష్ట్రానికే దక్కుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో జైళ్లలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసరావు, ఐజీ, జైళ్ల శాఖ -
చెప్పాడంటే చేస్తాడంతే..!!
-
ప్రాణం నిలబెట్టిన ఆరోగ్యశ్రీ.. రూ.25 లక్షల చికిత్స ఉచితంగా
సాక్షి, అమరావతి: గుండె జబ్బుతో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పునర్జన్మ ప్రసాదించింది. రూ. 25 లక్షల వరకూ ఖర్చయ్యే హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (గుండె మార్పిడి) చికిత్సను ప్రభుత్వం ఉచితంగా చేయించింది. దీంతో ఆ పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం నరుకుల్లపాడు గ్రామానికి చెందిన 27 ఏళ్ల బుడ్డె రాంబాబు విజయవాడలోని ఓ ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తాడు. అతనికి భార్య శిరీష, ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు రిషి ఉన్నారు. ప్రస్తుతం శిరీష 8 నెలల గర్భిణి కూడా. గతేడాది జూన్‌లో రాంబాబు గుండెల్లో నొప్పిగా అనిపించి విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి గుండె 70 శాతం పనిచేయడం లేదని నిర్ధారించారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని తేల్చి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యానికి రూ. 25 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో.. అంత ఆర్థిక స్తోమత లేని కుటుంబ సభ్యులు రాంబాబును ఇంటికి తీసుకువచ్చేశారు. అయితే గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను సంప్రదించగా ఆయన ఆరోగ్యశ్రీ అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అధికారులు రాంబాబును బెంగళూరులోని వైదేహీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను ఈ నెల 10న వైద్యులు రాంబాబుకు అమర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు తమను ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా ఆదుకుందని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా పాలిట వరం కూలి పనులు చేసుకునే కుటుంబం మాది. రాంబాబు నా పెద్ద కుమారుడు. గుండె సరిగా పని చేయడం లేదని వైద్యులు చెప్పినప్పుడు నా కుమారుడు దక్కడేమో అని ఇంటిల్లిపాది ఎంతో ఆందోళన చెందాం. వాడికి ఏమైనా అయితే మనవడు, కోడలు, ఆమె కడుపులోని బిడ్డ అనాథలుగా మారతారని భయపడ్డాం. గుండెమార్పిడి శస్త్రచికిత్సకు రూ. 25 లక్షలు ఖర్చు చేయడం మా వల్ల కాని పని. ఆరోగ్యశ్రీ మా పాలిట వరంగా మారింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా గుండె మార్పిడి చేయించింది. నా కుమారుడికి పునర్జన్మ ప్రసాదించారు. సీఎం వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరువలేం. – జమ్మయ్య, రాంబాబు తండ్రి -
ఇకపై బోధనాస్పత్రుల్లో కాక్లియర్ ఇంప్లాంట్స్
సాక్షి, అమరావతి : కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి దాకా రెండు లేదా మూడు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే వీటిని వేసేవారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సర్జరీలు చేసేకంటే ప్రభుత్వాస్పత్రుల్లోనే చేస్తే.. ఆరోగ్యశ్రీ కింద వచ్చే సొమ్ము కూడా ప్రభుత్వాస్పత్రులకే వస్తుందన్నది ప్రధానోద్దేశం. అలాగే ఎక్కువ ఆస్పత్రుల్లో ఈ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది.. ఫలితంగా చిన్నారులకు జాప్యం లేకుండా సర్జరీలు పూర్తవుతాయి. పుట్టుకతో చెవుడు, మూగతో ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేస్తారు. దివంగత సీఎం వైఎస్సార్ ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. దీంతో వందలాది మంది చిన్నారులకు మాటలు, వినికిడి వచ్చాయి. రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులున్నాయి. సుమారు 100 మంది వరకూ ఈఎన్టీ సర్జన్‌లున్నారు. సీనియర్లు, నైపుణ్యం ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. బోధనాస్పత్రుల్లోనే కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయడంపై గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం కాగా, కోవిడ్ రాకతో ఆ ప్రక్రియ ఆగింది. మళ్లీ తాజాగా దీనిపై కసరత్తు మొదలైంది. కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసేందుకు ఎలాంటి వైద్య ఉపకరణాలు కావాలి? ప్రస్తుతం ఉన్న వసతులేంటి? ఉన్న వైద్యులకు శిక్షణ ఎక్కడ ఇవ్వాలి? అన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. గతంలో ఒక చిన్నారికి ఒక చెవికి మాత్రమే ఇంప్లాంట్స్ వేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెండు చెవులకూ వేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు కాక్లియర్ ఇంప్లాంట్ బోధనాస్పత్రుల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈఎన్టీ సర్జన్లకు శిక్షణ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మౌలిక వసతులున్నప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం ఎందుకనేది ప్రధానోద్దేశం. – డా.బి.సాంబశివారెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వైస్ చైర్మన్ -
పేదలకు వరం లా మారిన ఆరోగ్యశ్రీ
-
Telangana: ఆరోగ్యశ్రీ అందట్లే!
రాష్ట్రవ్యాప్తంగా వందల ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదు. సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏడాదిన్నరగా బకాయిలు రావడం లేదని, అందువల్ల నగదు రహిత సేవలు అందించలేకపోతున్నామని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వస్తున్నవారిని ఏదో ఒక కారణం చెప్తూ తిప్పి పంపేస్తున్నాయి. దీంతో చివరికి అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద కూడా నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన గొరుకంటి యాదగిరి కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. శని వారం ఉదయం ఆయనకు భరించలేని నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును చూపించి ఔట్‌పేషెంట్ విభాగం (ఓపీడీ)లో న్యూరాలజీ వైద్యులను కలిశారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సీటీ స్కాన్ చేయాలని, ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ చేసుకోవాలని రిఫర్ చేశారు. కానీ సాయంత్రం దాకా వేచిచూసినా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగితే ముందు రూ.10 వేలు కడితే జాయిన్ చేసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు కట్టాలంటే ఎలాగని నిలదీస్తే.. ‘ఆరోగ్యశ్రీ నుంచి వచ్చేదే తక్కువ. ఇప్పటికే బకాయిలు రావడం లేదు. నిమ్స్ ఎలా నడవాలి’ అని సిబ్బంది ప్రశ్నించ డంతో చేసేది లేక డబ్బులు కట్టి అడ్మిట్ అయ్యారు. నల్లగొండకు చెందిన రాజేందర్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనను పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, దాని కింద అడ్మిట్ చేసుకుని చికిత్స చేయాలని రాజేందర్ కోరగా.. ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించారు. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బు కడితే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు రూ. 900 కోట్లకుపైగా బకాయిలు రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. వాటిలో 41,398 పడకలు ఉన్నాయి. మొత్తం 77.19 లక్షలమంది పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)ను కూడా ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రం లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా, ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. 949 వ్యాధులకు నగదు రహిత వైద్యం అందజేయాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఒక్క 2018–19 ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ కింద రూ.720 కోట్ల విలువై న చికిత్సలు జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిచిపోయాయని..ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రులు వాపోతున్నాయి. దీంతో రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్తున్నాయి. చదవండి: హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..! రోగులకు తీవ్ర అవస్థలు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఇన్‌పేషెంట్ సేవలేకాకుండా.. ఔట్‌పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలూ సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులు కరోనా చికిత్సల్లో ఉన్నామని, ఆరోగ్యశ్రీ కింద ఇతర చికిత్సలు చేయడం లేదని చెప్తూ రోగులను తిప్పి పంపేస్తున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ గందరగోళంతోనూ.. ఆరోగ్యశ్రీతోపాటు కేంద్ర సార్వత్రిక ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రపథకంలో 1,393 వ్యాధులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి రూ.175 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా. ఈ రెండు పథకాలను కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఆచరణలో స్పష్టత ఇవ్వలేదని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ వద్దు బాబోయ్! ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది నెట్వర్క్ ఆస్పత్రులు ఈ విషయంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత చికిత్సలు చేసి, బకాయిలు రాక అప్పుల్లో కూరుకుపోయామని.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలంటూ ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తేవని.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తీసేయాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సీఈవోలుగా ఇన్చార్జులే.. ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టును కొన్నేళ్లుగా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీ సీఈవోగా నాన్ ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్ అధికారి మాణిక్‌రాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను రెండింటినీ కలిపి నిర్వహించాలన్న నిర్ణయం నేపథ్యంలో.. పూర్తిస్థాయి సీఈవోను నియమించాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయి సీఈవో లేకపోవడం వల్ల రోజువారీగా నెట్వర్క్ ఆస్పత్రుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆరోగ్యశ్రీ సమస్యల విషయంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ‘సాక్షి’ప్రతినిధి సంప్రదించగా.. కావాల్సిన వివరాలేమిటో వాట్సాప్‌లో పంపాలని సూచించారు. ఈ మేరకు ఆయన వాట్సాప్‌కు సమస్యల వివరాలను పంపినా.. స్పందించలేదు. ఏడాదిన్నరగా సంక్షోభం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.900 కోట్లు బకాయి పడింది. దీనితో సాధారణ ఆస్పత్రులు ఏడాదిన్నరగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంగా ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. ఇక ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు ఏళ్లకింద ప్యాకేజీలను నిర్ధారించారు. ఆ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్యాకేజీ ధరలను ఏటా ఐదు శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి రాలేదు. దీనివల్ల చికిత్సలు అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. – డాక్టర్ వద్దిరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 3 కోట్లు బకాయిలు రావాలి మా ఆస్పత్రికి సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. చాలారోజులుగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. అప్పులు తెచ్చి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడ్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొంది. – జి.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం -
ఆరోగ్యశ్రీ... ఏపీ భాగ్యం
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రూపుదిద్దుకున్న ఎన్నో సంక్షేమ, అభివృధ్ది పథకాలకు... అంతకు ముందు ఆయన సుదీర్ఘ ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఎదురైన అనుభవాలు, జనం అగచాట్లు స్వయంగా గమనించి చేసిన ఆలోచనలే మూలం. ఆయనను ప్రధానంగా కలచివేసిన అంశం, జబ్బుల బారిన పడిన పేద జనానికి మెరుగైన వైద్యం అందక ఆస్తులు అమ్ముకుని ప్రాణం కాపాడుకోవడానికి బడుగు జీవి పడిన పాట్లు ఒక డాక్టరుగా ఆయనలో సరికొత్త పథకానికి నాంది పలికింది. డబ్బులు ఉన్నవాడికే కార్పొరేట్ వైద్యం, లేనివాడు ఆరోగ్యం కోసం అప్పులపాలైనా కావాలి లేదా ప్రాణం మీద ఆశ వదులు కోవాలి. ఈ పరిస్థితిలో సమూల మార్పు తీసుకువచ్చి సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ధన్వంతరి మంత్రంగా ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చింది. వాస్తవానికి వైఎస్సార్ సీఎంగా రోజులో ఎక్కువ సంతకాలు చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సాయం కోసం దరఖాస్తుల ఫైళ్లపైననే. 14.05.2004 నుంచి 26.06.2007 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 168.52 కోట్ల నిధులు విడుదల చేశారంటే పేదల ఆరోగ్యంపై ఎంతగా శ్రద్ధవహించేవారో అర్థం చేసుకోవచ్చు. జబ్బుపడ్డ పేదవాడి కుటుంబం ఆ ఆపత్కాలంలో సీఎం కార్యాలయం వరకు కలిగే ప్రయాసకు స్వస్తి చెప్పదల్చుకున్నారు వైఎస్సార్. డబ్బులు లేక వైద్యం అందని దుర్భర పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా ఆరోగ్యశ్రీని ప్రిస్క్రైబ్ చేసి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు డాక్టర్ వైఎస్సార్ చేసిన ప్రయత్నం, సాధించిన తక్షణ ఫలితాలు యావద్దేశం ఆరోగ్యశ్రీ వైపు దృష్టిపెట్టేట్టు చేశాయి. దేశంలో తొలిసారిగా బీపీఎల్ కుటుంబాలకు ఉచిత కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పిస్తూ ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. నేషనల్ హెల్త్ బిల్లులో, 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లు ఉన్నా ఆరోగ్యశ్రీ స్పూర్తిగా పేదలకు ఉచిత వైద్య బీమా పధకాలు అమలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోదీ హెల్త్ కేర్ వైఎస్సార్ తెచ్చిన ఆరోగ్యశ్రీ కోవలోనిదే. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని 229.11 లక్షల కుటుంబాలలో వైఎస్సార్ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 198.25 లక్షల కుటుంబాలు (87 శాతం) ప్రయోజనం పొందడానికి అర్హత కలిగి ఉండేవి. తన సొంతఊరు పులివెందులలో ఒక రూపాయి ఫీజు తీసుకునే డాక్టరుగా పేరొందిన వైఎస్సార్.. ఆరోగ్యశ్రీతో పాటు వైద్య సేవారంగంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసును వైఎస్సార్ 2007 ఆగష్టు 15న ప్రారంభించారు. వైఎస్సార్ 108 సర్వీసును ప్రవేశపెట్టిన పదిరోజుల్లోగానే ఆగష్టు 29న అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ తమ రాష్ట్రంలో ఈ సర్వీసును అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మార్చి అమలు చేస్తూ ఈ స్కీంను మరింత విస్తృతం చేసి రాష్ట్ర జనాభాలో 90 శాతం పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందుకోవడానికి వీలు కల్పించారు. తన హయాంలో వైఎస్సార్ 940 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే, వైఎస్ జగన్ జనరల్ సర్జరీ నుంచి సైక్రియాట్రీ వరకు లెక్కకు మించిన వైద్య చికిత్సలను ఈ స్కీంలో చేర్చి తండ్రికి తనయుడు అనిపించుకుంటున్నారు. కరోనా బారిన పడిన వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద అన్ని హాస్పిటల్స్‌లో ఉచిత చికిత్స అందించేందుకు ఆదేశాలిచ్చిన వైఎస్ జగన్.. దేశంలో కరోనా చికిత్సను ఫ్రీ హెల్త్ సర్వీస్ కిందకు తెచ్చిన తొలి ముఖ్యమంత్రి. బీఎస్ రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ -
బడుగుజీవులకు ఆరోగ్య భరోసా !
పేదవాడికి సుస్తీ చేస్తే బంగారం, ఇల్లు, భూమి తాకట్టుపెట్టి వైద్యం పొందే రోజుల్లో.. నేనున్నానంటూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి అంకురార్పణ చేశారు. ఆరోగ్య భరోసా కల్పించారు. పైసా ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువచేశారు. వేలాది మందికి పునర్జన్మ కల్పించారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు పథకంపై సవతితల్లి ప్రేమ చూపారు. పేదల్లో వైద్య భయాందోళనలు కలిగించారు. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగిస్తూనే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ నెల 8న నిర్వహించే వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తండ్రీతనయుల ప్రజారోగ్య పాలనను జనం గుర్తుచేసుకుంటున్నారు. సాక్షి,విజయనగరం : కార్పొరేట్ ఆస్పత్రుల వైపు చూడడానికే పేద, మధ్య తరగతి ప్రజలు భయపడే రోజులవి. ఆరోగ్యం పాడైతే మంచానికే పరిమితమై కాలం చేయాల్సిన దుస్థితి. వీటిని పాదయాత్రలో కళ్లారా చూసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి... ప్రతీ పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలని తలచారు. అధికారంలోకి వచ్చాక 2007లో ఆరోగ్యశ్రీ పథకానికి అంకురార్పణ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు పేదలకు ఎదురొచ్చి మా ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటూ స్వాగతం పలికే పరిస్థితులను సృష్టించారు. క్యాన్సర్, కిడ్నీవ్యాధులు, గుండె సంబంధిత రోగులు గుండెమీద చెయ్యివేసుకుని జీవించేలా వైద్య భరోసా కల్పించారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. మరిన్ని జబ్బులను పథకంలో చేర్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వాటితో పాటు ఆరోగ్య ఆసరా పేరిట రోగులు కోలుకునేవరకు ఆర్థిక భృతిని అందజేస్తున్నారు. అపర సంజీవిని 108... ఆరోగ్యశ్రీవలే ఆపదవేళ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్ 108 సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్నామని ఫోన్ చేసిన 15–20 నిమిషాల్లో కుయ్‌కుయ్ అంటూ సంఘటనా స్థలానికి 108 వచ్చి క్షణాల్లో ఆస్పత్రికి చేర్చుతోంది. వాహన సేవలతో చాలా వరకు ప్రమాద మరణాలు తగ్గాయి. జిల్లాలో 108 అంబులెన్సులు 36 ఉన్నాయి. వీటిలో 2 నియోనేటల్ అంబులెన్సులు, 24 బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా నియోనేటల్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మిస్–సి
సాక్షి, అమరావతి: కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ వంటి రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కోవకే చెందిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో ఎదురవుతున్న మిస్–సి (మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్) జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు మేలుచేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పీడియాట్రిక్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనల మేరకు పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిస్–సిలో నాలుగు రకాల జబ్బులుంటాయి. వీటన్నింటినీ ఇందులో చేర్చారు. కేటగిరీలు.. వాటి రేట్లు ఇలా.. ► మిస్–సి విత్ షాక్, లేదా విత్ఔట్ రెస్పిరేటరీ (సివియర్): రూ.77,533తో పాటు ఎన్ఐవీ/వెంటిలేటర్‌కు అదనంగా రూ.25వేలు. దీంతో పాటు ఇమ్యునోగ్లోబులిన్ మందులకు అదనంగా ఉంటుంది. ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. ► మిస్–సి విత్ఔట్ షాక్ (మోడరేట్) : దీనికి రూ.42,233లు (మందులతో కలిపి). ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. ► మిస్–సి కవాసాకి లేదా సివియర్ : రూ.62,533లు (మందులతో కలిపి). దీనికీ ఐదు రోజులు ఐసీయూలోనూ మరో ఐదు రోజులు నాన్ క్రిటికల్ వార్డులో ఉండాలి. ► ఫిబ్రిల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (మైల్డ్) : దీనికి రూ.42,183గా నిర్ణయించారు. ఒకరోజు ఐసీయూలో, ఏడు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. మందులు, వెంటిలేటర్ కోసం.. పైన పేర్కొన్నవి కాకుండా అదనంగా ఐవీ–ఐజీ డ్రగ్స్ అవసరమైతే ప్రతీ ఐదు గ్రాముల వయెల్‌కు రూ.8వేలు, 10 గ్రాముల వయెల్‌కు రూ.13,500 చెల్లిస్తారు. ఇది చిన్నారి శరీర బరువును బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వయెల్ ఫొటోలు, బిల్లులు, బ్యాచ్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కేస్‌షీట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఎన్ఐవీ లేదా వెంటిలేటర్‌కు ఒక్కరోజుకు రూ.5వేల వరకూ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా గరిష్టంగా 5 రోజులకు రూ.25వేల వరకూ చెల్లిస్తారు. దీనికి కూడా వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించినట్లు కేస్‌షీట్, ఫొటోలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఏవైనా అదనంగా శస్త్రచికిత్సలు చేసినప్పుడు ప్రత్యేక ప్రీ ఆథరైజేషన్ (ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బుల పరిధిలోకి వచ్చేవి అయితే) చేసి పంపించాలి. ఉదా.. జనరల్ సర్జరీ, అపెండిసైటిస్, పీడియాట్రిక్ సర్జరీ వంటివి. మిస్–సి లక్షణాలు ఇవే.. ఇది కోవిడ్ సమయంలో వచ్చే వ్యాధి. ఇది 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. ► 24 గంటలపాటు లేదా అంతకంటే ఎక్కువ సమయం బాగా జ్వరం రావడం ► చిన్నారుల్లో వాంతుల లక్షణాలు ఎక్కువగా ఉండటం. వాంతులతో పాటు కొంతమందిలో విరేచనాలు రావడం ► విపరీతమైన కడుపునొప్పి ► చర్మం మీద దద్దుర్లు వంటివి రావడంతో పాటు అలసట ఉండటం ► సాధారణంగా కంటే శ్వాస ఎక్కువగా తీసుకోవడం.. లేదా ఒక్కోసారి అందుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ► కళ్లు ఎర్రగా మారి, తలనొప్పి ఉంటుంది ► పెదాలతో పాటు నాలుక కూడా ఎర్రగా మారి కొద్దిగా వాపు వస్తుంది. శరీరం, పెదాలు, గోళ్లు నీలిరంగులోకి మారొచ్చు. -
ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన 62 ఏళ్ల మున్నీరెడ్డి కృష్ణారెడ్డికి ఈనెల 12న బెంగళూరులోని నారాయణ హార్ట్ సెంటర్లో ఉచితంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రోగి వేగంగా కోలుకుంటున్నారని పేర్కొంది. నాలుగేళ్ల నుంచి గుండె వ్యాధితో బాధపడుతున్న కృష్ణారెడ్డికి ఆపరేషన్ కోసం రూ.11 లక్షలు కేటాయించినట్లు తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడం కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలను 2019 నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆరునెలల్లో బెంగళూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రెండు గుండెమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఉచితంగా సేవలను అందించినందుకు సీఎంకు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, హాస్పిటల్ సిబ్బందికి కృష్ణారెడ్డి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు -
మూడు కాళ్లతో శిశువు జననం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగం రెండో యూనిట్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. మూడు కాళ్లతో జన్మించిన ఆడ శిశువుకు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతంగా మూడో కాలును తొలగించారు. జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరిజిల్లా చింతలపూడికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ, మోహన్‌రావు దంపతులకు మార్చి 4న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. బిడ్డకు నడుములోని వెన్నుపాము నుంచి మూడో కాలు బయటకొచ్చింది. దీంతో డెలివరీ చేసిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు శిశువుకు శస్త్రచికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఒక్క రోజు వయసున్న ఆడశిశువుకు త్రీడీ ఎమ్మారై, త్రీడీ సీటీస్కాన్ చేసి నడుము లోపలి భాగం నుంచి మూడో కాలు వచ్చినట్లు నిర్ధారించామని న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంతేకాకుండా, మూడో కాలి వద్ద పురుష జననాంగాలు ఏర్పడి, రెండు కాళ్లకు సంబంధించిన నరాలు మూడో కాలికి అతుక్కుని ఉన్నట్లు తెలిపారు. వైద్య పరిభాషలో దీనిని ‘లంబార్ మైలోమినింగో సీల్ విత్ ట్రై పెడస్ డిఫార్మెటీ’ అంటారని, ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటివరకు 25 మాత్రమే నమోదయ్యాయని వివరించారు. ప్రొఫెసర్ డాక్టర్ దత్తలూరి శేషాద్రి శేఖర్ ఆధ్వర్యంలో మార్చి 31న సుమారు మూడు గంటలపాటు ఆపరేషన్ చేసి మూడో కాలిని తొలగించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల రూ.1.5 కోట్ల ఖరీదు చేసే అత్యాధునిక లైకా మైక్రోస్కోప్ వైద్య పరికరాన్ని తమ న్యూరోసర్జరీ వైద్య విభాగానికి అందించారని, ఈ పరికరం ద్వారానే ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలిగామన్నారు. ఆపరేషన్ ప్రక్రియలో మత్తు వైద్యుడు డాక్టర్ నాగభూషణం, న్యూరోసర్జరీ పీజీ వైద్యులు సత్య, ధీరజ్, విజయ్ పాల్గొన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైద్యులకు బిడ్డ తల్లిదండ్రులు కృతజ్ఙతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డిస్క్ ఆపరేషన్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చేసే డిస్క్ ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగంలో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం’ ద్వారా ఉచితంగా చేస్తున్నట్లు ప్రొఫెసర్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. న్యూరోసర్జరీ వైద్య విభాగం రెండో యూనిట్లో ఇక నుంచి రెగ్యులర్‌గా కోత, కుట్లు లేని డిస్క్ ఆపరేషన్లు, డే కేర్ సర్జరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు పెద్దపీట
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగులు పెద్దఎత్తున ఉపశమనం పొందుతున్నారు. గతంలో చికిత్సలు తక్కువ సంఖ్యలో ఉండటం, ఇతర రాష్ట్రాల్లో అనుమతి లేకపోవడం తదితర కారణాలతో రోగులు ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. దీనివల్ల ఆర్థిక భారంతో పేద రోగులు తీవ్రంగా చితికిపోయేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని పటిష్టపర్చడంతో ఒక్క క్యాన్సర్‌లోనే అదనంగా 54 చికిత్సలను చేర్చడం.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ చికిత్సకు అనుమతించడంతో బాధితులకు ఎంతో మేలు చేకూరుతోంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా వైద్యం లేదనకుండా ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. ఒక్క ఏడాదిలో రూ.300 కోట్లు వ్యయం 2018–19లో క్యాన్సర్ చికిత్సలకు గరిష్టంగా ఏటా రూ.197 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కానీ, 2020–21లో సుమారు రూ.300 కోట్లు వెచ్చించారు. దీన్నిబట్టి క్యాన్సర్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో పెద్దపీట వేస్తోందో అంచనా వెయ్యొచ్చు. ఇందులో భాగంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద 38,935 మంది బాధితులు లబ్ధిపొందగా.. 1,39,701 ప్రీ ఆథరైజేషన్లు (కీమో, రేడియేషన్ వంటి వాటికి రావడం) జరిగాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5,056 మంది బాధితులు నమోదయ్యారు. -
వ్యాక్సిన్‌కు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు
సాక్షి, హైదరాబాద్: లబ్ధిదారులు నేరుగా కేంద్రాలకే వచ్చి కరోనా టీకా వేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడకు వచ్చాక కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేస్తారు. అనంతరం వారికి టీకా వేస్తారు. ఇక నుంచి యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి కాదని సర్కారు తేల్చి చెప్పింది. అయితే ఎవరైనా తమ పేర్లను ముందస్తుగా నమోదు చేసుకోవాలంటే, అటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం కోవిన్ యాప్‌లో పేర్లు నమోదైన వారికే టీకా వేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దానిలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కోవిన్ యాప్‌తో సమస్యలు ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం సెకండ్ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. అది ఒకట్రెండు రోజుల్లో విడుదల కానుందని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో లబ్ధిదారులు నేరుగా వచ్చి టీకా వేసుకోవడంతో పాటు, ముందస్తుగానూ రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. దాదాపు 55 లక్షల మందికి.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేయాలని నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వాస్తవంగా 50 ఏళ్లు పైబడిన వారందరికీ, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకా వేయాలనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ కేటగిరీ వ్యక్తులు రాష్ట్రంలో 69 లక్షల మంది ఉంటారు. అయితే తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 55 లక్షలకు పడిపోనుంది. అంటే రాష్ట్రంలో 14 లక్షల మంది కరోనా టీకా లబ్ధిదారులు తగ్గుతారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. 60 ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 45 లక్షల మంది.. 45 నుంచి 60 ఏళ్లలోపు వారు దాదాపు 10 లక్షల మంది ఉంటారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు లెక్కగట్టారు. వీరందరికీ టీకా ఉచితంగానే వేస్తారని తెలిపారు. 1,500 కేంద్రాల్లో.. రోజుకు లక్షన్నర మందికి ఇక రాష్ట్రంలో టీకా కార్యక్రమం 1,500 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ‘పీహెచ్సీ స్థాయి నుంచి గాంధీ, ఉస్మానియా సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ జాబితాలోని 230 ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ టీకా కేంద్రాలుంటాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మంది చొప్పున లక్షన్నర మందికి వేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. గ్రామాల్లో ఉన్న ఆయా లబ్ధిదారులంతా సమీపంలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు. లబ్ధిదారులు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలను కోరాం. పీహెచ్‌సీలు మండలానికి ఒకటి చొప్పున ఉంటాయి. అయితే మున్ముందు లబ్ధిదారులకు ఇబ్బంది కలిగితే, రాష్ట్రంలో 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. అంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలో 6 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తున్నాం. అందులో లబ్ధిదారుల ఇష్టానుసారంగా కాకుండా, కేంద్రంలో ఏ వ్యాక్సిన్ ఉంటే దాన్నే వేసుకోవాలి. ప్రతీ కేంద్రంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవు. ఒక్కోచోట ఒక కంపెనీ వ్యాక్సిన్‌ను ఉంచుతారు. కాబట్టి లబ్ధిదారులకు ఎలాంటి చాయిస్ ఇవ్వడం లేదు..’అని శ్రీనివాసరావు తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ఇలా.. ఇక 60 ఏళ్లు పైబడిన ప్రజలను గుర్తించేందుకు వారి వద్ద ఉండే ఓటర్ ఐడీ కార్డు సహా ఏదైనా వయసు తెలియజేసే కార్డు తీసుకొని రావాలి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను మాత్రం తమ వద్ద ఉన్న కొద్దిపాటి సమాచారం ఆధారంగా గుర్తిస్తారు. తమ వద్ద సమాచారం లేని మిగిలిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా డాక్టర్ వద్ద వైద్యం చేయించుకున్నట్లు ప్రిస్కిప్షన్, వైద్య పరీక్షల నివేదికలు తీసుకొని రావాలి. అలాగే వయసును తెలియజేసే గుర్తింపు కార్డులు కూడా తేవాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు త్వరలో కేంద్రం విడుదల చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక టీకా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఒక బృందం రానుంది. కోవిన్–2 వెర్షన్‌పైనా వారు స్పష్టత ఇస్తారు. నేరుగా వచ్చిన లబ్ధిదారుల పేర్లను టీకా కేంద్రంలో ఎలా నమోదు చేయాలో శిక్షణ ఇస్తారు. నేటి నుంచి 4 రోజులు మాప్‌అప్ రౌండ్ ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా మొదటి డోస్ పూర్తి కాగా రెండో డోస్ నడుస్తోంది. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ మొదటి డోస్ దాదాపు పూర్తయింది. అయితే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో చాలామంది ఇంకా మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకోలేదు. చాలా మంది మిగిలిపోయారు. 3.31 లక్షల మంది వైద్య సిబ్బంది టీకా వేసుకోవాల్సి ఉండగా, వారిలో 1.96 లక్షల మంది మాత్రమే మొదటి డోస్ వేసుకున్నారు. అలాగే 2.57 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 89 వేల మంది మాత్రమే టీకా వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోని మిగిలిన వారందరికీ గురువారం నుంచి నాలుగు రోజుల పాటు మాప్‌అప్ రౌండ్ నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉండగా, ఒకటో తేదీ నాటికి 10 లక్షల వ్యాక్సిన్లు రాష్ట్రానికి రానున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. -
రూ.238.15 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద సేవలందిస్తున్న 640 నెట్వర్క్ ఆస్పత్రులకు జనవరి 15 నాటికి ఉన్న బిల్లులు రూ.238.15 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద సకాలంలో బిల్లులు ఇస్తున్నామని, దీనివల్ల ఆరోగ్యశ్రీ సేవలు పటిష్టంగా అమలవుతున్నాయన్నారు. రూ.238.15 కోట్ల సొమ్మును రెండు దఫాలుగా వారి ఖాతాలకు జమచేసినట్టు సీఈవో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపారు. చదవండి: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు కొత్త నమూనాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు -
ఆయువు పోసిన ఆరోగ్యశ్రీ
తాడేపల్లి రూరల్: ఆరోగ్యశ్రీ పథకంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో ఓ చిన్నారి క్లిష్టమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను మణిపాల్ ఆస్పత్రి అంకాలజీ వైద్యుడు డాక్టర్ జి.కృష్ణారెడ్డి, హెమటో అంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దంతాల మాధవ్ బుధవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా నంబూరు గ్రామానికి చెందిన రాణి కుమార్తె సిరిస్పందన (6) ప్రైమరీ రిఫ్రాక్టరీ హడ్కిన్ లింఫోమా అనే వ్యాధితో రెండేళ్లుగా బాధపడుతోంది. వైద్యం నిమిత్తం ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు మణిపాల్ ఆస్పత్రికి తీసుకురాగా.. అక్కడి వైద్యులు సాల్వేజ్ కీమోథెరపీ జీడీపీతో చికిత్స అందించారు. బాలికకు జబ్బు తగ్గిన తర్వాత బీఈఎం కండిషనింగ్, ఆటోలోగాస్ మూల కణ మార్పిడి చికిత్స అందించారు. బాలిక పూర్తిగా కోలుకుని మంచి బ్లడ్ కౌంట్ సాధించటంతో మూడు వారాల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ కంటెపూడి సుధాకర్ మాట్లాడుతూ చిన్నారి అన్నిరకాల ఆరోగ్య చిక్కుల నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు మణిపాల్ వైద్య బృందం చేసిన కృషి అభినందనీయమన్నారు. చిన్నారికి చికిత్స అందించిన క్లినికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ మనోజ్‌కుమార్, మెడికల్ అంకాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. బాలిక తల్లి రాణి మాట్లాడుతూ ఈ విధమైన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి సీఎం వైఎస్ జగన్ తన బిడ్డకు ప్రాణం పోశారని కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఆరోగ్యశ్రీ’లో డిశ్చార్జి వరకు మనదే బాధ్యత
సాక్షి, అమరావతి: ‘ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే ఏ లబ్ధిదారుడైనా ఆస్పత్రిలో చేరినప్పటినుంచి డిశ్చార్జి అయ్యేవరకు అతనికి సేవలందించే విషయంలో పూర్తిబాధ్యత మనదే. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిందంటే ఆ ఫిర్యాదు అక్కడికక్కడే పరిష్కారం కావాలి’ అని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఆయన సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షతో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే.. ► ప్రజలకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందుతున్నాయా, లేదా అని ప్రతిరోజూ నిఘా ఉండాలి. ► ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఏ ఆస్పత్రుల్లోనైనా నాణ్యత లేకపోతే వాటిని జాబితానుంచి తొలగించాలి. ► ఏ గ్రామ సచివాలయం వద్దకు వెళ్లినా బాధితులకు ఆరోగ్యశ్రీ సేవల సమాచారం అందించాలి. జాబితాలోని ఆస్పత్రులపై ప్రత్యేక నివేదిక ఉండాలి. ఆరోగ్యమిత్రలను తక్షణమే నియమించాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఉండాలి. ఐవీఆర్ఎస్ను మరింత అభివృద్ధి చేయాలి. ► ఇప్పటివరకు ఆరోగ్య ఆసరాకు రూ.145 కోట్లు వ్యయం అయింది. 2.50 లక్షల మంది లబ్ధిపొందారు. ► వైకల్యం సర్టిఫికెట్ల కోసం వచ్చేవారికి అదేరోజు ఇవ్వాలి. వారిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుకోకూడదు. కరోనా రెండోదశను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ► వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు, మలేరియా, డెంగీ వంటి దోమకాటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. -
ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగు
సాక్షి, అమరావతి: ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత పదును పెంచుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వేల సంఖ్యలో వ్యాధులను చేర్చడం, రూ.1,000 బిల్లు దాటితే ఆ జబ్బును పథకం కిందకు తెచ్చి భారీ సంస్కరణలకు సర్కార్ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పేదలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా మరిన్ని కీలక సంస్కరణలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. ప్రతి జేసీ వారానికి రెండు ఆస్పత్రులను తనిఖీ చేయడంతోపాటు సేవలు సరిగా లేకుంటే ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ చక్కటి వైద్యం అందించాలని, రోగులను గౌరవప్రదంగా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పులు చేసి వైద్యం చేయించుకుని.. ఆ నగదు రీయింబర్స్మెంట్ కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే విధానం మారాలని, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కోసం పంపే దరఖాస్తుల సంఖ్యను భారీగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నగదు రహిత వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించేలా.. ప్రతి నెట్వర్క్ ఆస్పత్రిపైనా నిఘా ఉంచేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు అన్ని ఆస్పత్రుల్లోనూ తప్పనిసరిగా ఆరోగ్యమిత్రలు ఉండాలి. ప్రతి రోగికీ సాయమందించే బాధ్యత వీరిదే. ప్రతి ఆరోగ్యమిత్ర ఫోన్ నంబర్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 581 ఆరోగ్యమిత్ర ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. డిశ్చార్జి అయ్యే రోగికి 108 ద్వారా ఉచిత రవాణా సదుపాయం ఆరోగ్యమిత్ర దగ్గరుండి కల్పించాలి. ఆరోగ్య ఆసరా కింద ఇచ్చే నగదు సాయాన్ని డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగి ఖాతాలో జమయ్యేలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిబ్బంది చూడాలి. ఫిర్యాదులు రాకుండా.. ప్రతి పేదవాడికీ మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యమందించాలనే తపనతో సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు వైద్యం అందలేదు అనే మాట లేకుండా మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. –ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఒక్కో కోఆర్డినేటర్‌కు 35 నుంచి 40 ఆస్పత్రులు ప్రతి జాయింట్ కలెక్టర్ (జేసీ) వారానికి రెండు ఆస్పత్రులను తనిఖీ చేసి బాధితులకు నాణ్యమైన వైద్యం అందిందా? లేదా? చూస్తారు. ఏదైనా ఆస్పత్రి వైద్య సేవల్లో నిర్లక్ష్యం చూపితే జేసీ అధ్యక్షతన ఉండే క్రమశిక్షణా కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అలాగే కోఆర్డినేటర్ల సంఖ్యను కూడా పెంచుతారు. ఒక్కో కోఆర్డినేటర్ 35 నుంచి 40 ఆస్పత్రులను పర్యవేక్షిస్తారు. అర్హత ఉన్న అందరికీ నగదు రహిత వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు సీఎం సహాయ నిధి కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను తగ్గిస్తారు. ఏయే వ్యాధుల చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తులు వస్తున్నాయో పరిశీలించి.. ఆ వ్యాధులకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స అందేలా చర్యలు చేపడతారు. ఈ ఆరు ఉండాల్సిందే.. నెట్వర్క్ ఆస్పత్రులు ప్రధానంగా 6 విభాగాలపై దృష్టి సారించాలి. ► ఆస్పత్రుల్లో కనీస మౌలిక వసతులు ► నర్సు, డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టులతో కూడిన నిపుణులు ► నాణ్యమైన మందులు ► రోజూ చక్కటి పారిశుధ్య నిర్వహణ ► రోగులకు రోజూ పౌష్టికాహారం ► ప్రతి ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రతో కూడిన హెల్ప్‌డెస్క్ ఇవి లేని ఆస్పత్రులను జాబితా నుంచి తొలగిస్తారు. నాణ్యతను బట్టి ఆస్పత్రులకు రేటింగ్ ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో నెట్వర్క్ ఆస్పత్రుల జాబితా సిద్ధంగా ఉంటుంది. ఏ ఆస్పత్రిలో సేవలు అందుతాయి? ఎక్కడకు వెళ్లాలి? వంటి సందేహాలను సచివాలయాలు తీరుస్తాయి. ఆరోగ్యశ్రీ సేవలపై అందరికీ అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి తక్షణమే అందిస్తాయి. ప్రతి ఆస్పత్రికీ అవి అందిస్తున్న వైద్య సేవల్లో నాణ్యతను బట్టి మార్కులు ఉంటాయి. ఏ, ఏ ప్లస్, బీ కేటగిరీలుగా వీటిని విభజిస్తారు. ఈ 3 విభాగాల్లో లేని ఆస్పత్రులు 18 నెలల్లోగా తమ లోపాలు సరిదిద్దుకోవాలి. రేటింగ్ ఇలా.. ► ఆస్పత్రిలో ఉన్న ఆరోగ్యమిత్ర రోజూ నాణ్యతపై ఇచ్చే నివేదికకు 25 మార్కులు ► డిశ్చార్జ్ సమయంలో రోగి అభిప్రాయాలకు 50 మార్కులు . ► రోజూ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా రోగుల నుంచి తీసుకునే అభిప్రాయాలకు 25 మార్కులు వీటిలో మార్కులు తగ్గితే ఆ ఆస్పత్రులపై చర్యలుంటాయి. -
2.10 లక్షల మందికి ‘ఆరోగ్య ఆసరా’
సాక్షి, అమరావతి :పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం అండగా నిలుస్తోంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి జబ్బు బారిన పడి చికిత్స పొందాక, డిశ్చార్జ్ అయిన రోజు నుంచి తిరిగి కోలుకునే వరకు రోజుకు రూ.225 చొప్పున లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పది మాసాల్లోనే 2,10,248 మందికి పైగా లబ్ధి పొందారు. వివిధ ఆస్పత్రుల్లో వైద్యం పొంది, డిశ్చార్జి అయిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి సొమ్ము చేరుతోంది. దీంతో ఆ కుటుంబాల పోషణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పటి వరకూ ఆరోగ్య ఆసరా కోసం దాదాపు రూ.134 కోట్లు వ్యయం చేశారు. నెలకు సగటున రూ.15 కోట్లు పైనే ఖర్చవుతోంది. ఆసరా చెల్లింపు ఇలా.. మొత్తం 836 జబ్బులకు వైద్యం పూర్తయ్యాక కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా ఇస్తున్నారు. పేషెంట్ డిశ్చార్జి అయ్యే సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటారు. పేషెంట్ కోలుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో డాక్టర్లు నిర్ధారిస్తారు. ఆ మేరకు రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ఇస్తారు. బ్యాంకు ఖాతాలేని వారు కుటుంబ సభ్యుల ఖాతా ఇవ్వొచ్చు. ఆసరాకు సంబంధించి ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఆరోగ్య ఆసరా లబ్ధిదారులు నెల లబ్ధిదారులు వ్యయం (రూ.కోట్లలో) 2019 డిసెంబర్ 28,335 18.92 2020 జనవరి 28,333 18.80 2020 ఫిబ్రవరి 28,680 19.57 2020 మార్చి 28,741 19.23 2020 ఏప్రిల్ 10,028 5.89 2020 మే 14,915 8.83 2020 జూన్ 23,800 14.58 2020 జూలై 19,431 11.83 2020 ఆగస్ట్ 15,127 8.72 2020 సెప్టెంబర్ 12,858 7.52 -
అన్ని ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు
ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి గ్రేడింగ్ తప్పనిసరి. అక్కడ సదుపాయాలు, సేవల ఆధారంగా వాటి నిర్ధారణ జరుగుతుంది. అన్ని ఆస్పత్రులు ఏ–కేటగిరీలోకి రావాలి. ఇందుకోసం 6 నెలల సమయం ఇవ్వాలి. ఆలోగా అవి ప్రమాణాలు పెంచుకోకపోతే జాబితా నుంచి తొలగించే అంశం పరిశీలించాలి. అన్ని ఏ–కేటగిరీ ఆస్పత్రులు ఏడాదిలోగా ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కిట్లు ఇవ్వాలి. ఆ మేరకు అధికారులు పక్కాగా పర్యవేక్షించాలి. కరోనా వైద్య సేవలు అందించడంలో ఎక్కడా లోటు ఉండకూడదు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ నిర్వహించాలి. ఆ దాతలను ప్రోత్సహించే విధంగా రూ.5 వేలు ఇవ్వాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రులతో సహా అన్ని ఆస్పత్రుల్లో ప్రమాణాలు మరింతగా పెరగాలని, తద్వారా మంచి గ్రేడింగ్ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఐవీఆర్ఎస్లో అడిగే ప్రశ్నలు ఇంకా స్పష్టతతో ఉండాలని, ముఖ్యంగా వైద్య సేవలు, శానిటేషన్‌పై పూర్తి వివరాలు ఆరా తీయాలని సూచించారు. ఆ మేరకు ప్రశ్నలు మార్చాలని నిర్దేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. కోవిడ్–19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ తదితరులు ఆస్పత్రులు, ప్రమాణాలు ► ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారం, శానిటేషన్, యాంబియెన్స్ (ఆస్పత్రి చూడగానే చక్కగా ఉండేలా) బాగా ఉండేలా చూడాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అవే ప్రమాణాలు ఉండాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్న ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం. అందువల్ల ప్రమాణాలపై రాజీ పడం. ► రాష్ట్రంలో ఇప్పుడున్న 11 టీచింగ్ ఆస్పత్రులతో పాటు, కొత్తగా ఏర్పాటు కానున్న 16 ఆస్పత్రులు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటవుతున్న ఆస్పత్రులలో తప్పనిసరిగా ప్రమాణాలు ఉండేలా చూడాలి. అన్ని ఆస్పత్రుల్లో మంజూరు చేసిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ► ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య ఆసరా కింద సాధారణ కాన్పుకు ఇక నుంచి రూ.5 వేలు, అదే విధంగా సిజేరియన్ కాన్పుకు రూ.3 వేలు ఇవ్వాలి. ► మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గంలో ఆ శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వైద్య సదుపాయాల కల్పనపై ఎస్ఓపీ రూపొందించాలి. రెండు వారాల్లో అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు ► భవిష్యత్తులో విలేజ్ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా ఉంటాయి. ఆ తర్వాత కోవలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు రెఫరల్‌గా ఉంటాయి. ఆరోగ్య మిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్పత్రి బయట, లోపల తప్పనిసరిగా ప్రదర్శించాలి. రెండు వారాల్లోగా అన్ని ఆస్పత్రులలో వారి నియామకాలు పూర్తి కావాలి. ► రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో వెంటనే ఆరోగ్య మిత్రల (హెల్ప్ డెస్క్)ను ఏర్పాటు చేయాలి. వీరు ప్రధానంగా ఆస్పత్రిలో వైద్య మౌలిక సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారంలో నాణ్యత, శానిటేషన్, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందజేయడం, పేషెంట్ కేరింగ్.. వంటి 6 బాధ్యతలను నిర్వర్తించాలి. ► ఏదైనా ఆస్పత్రిలో రోగికి అవసరమైన వైద్య సదుపాయం లేకపోతే అంబులెన్స్ ఏర్పాటు చేసి.. ఆ సేవ అందించే ఆస్పత్రికి పంపించాలి. ► జిల్లా స్థాయిలో ఆరోగ్యశీ పథకం సమన్వయ బాధ్యతలను ఇక నుంచి ఒక జేసీకి అప్పగించాలి. ఆరోగ్యశ్రీ కార్డులు ► ఆరోగ్యశ్రీ క్యూఆర్ కోడ్ కార్డులతో పాటు, యాప్‌పై సమావేశంలో అధికారులు వివరించారు. ఆ కార్డులో రోగి బ్లడ్ గ్రూప్ సమాచారం కూడా ఉండాలని సీఎం సూచించారు. ఆ కార్డుల పంపిణీలో గ్రామ సచివాలయాల సేవలు వినియోగించుకోవాలన్నారు. ► రాష్ట్రంలోని 540 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు కాగా, మిగిలిన 27 ఆస్పత్రుల్లో కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయని అధికారులు వివరించారు. ► సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు. -
ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఇవ్వాళ్టికి సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా అందుబాటులో ఉన్నాయని సీఎంకు వివరించారు. కొన్ని పత్రికలు కావాలనే విషపూరిత రాతలు రాస్తున్నాయని సమీక్షలో చర్చించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో తాత్కాలిక నియామకాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయగా.. రెగ్యులర్ రిక్రూట్మెంట్లో 9,971 పోస్టులకుగాను 4,676 పోస్టుల నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. ఇందులో 5,295 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మరో 10 రోజుల్లో వీటి భర్తీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్ కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు చేస్తోందని వెల్లడించారు. వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రూ. 4.3 కోట్లు, ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందులు కోసం రూ. 4.57 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. కాగా, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. (చదవండి: సోషల్ మీడియాలో చూసినా.. సత్వర పరిష్కారం) ఆరోగ్య శ్రీ సేవల్లో వారే కీలకం ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. సేవలు అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్‌లను పెట్టాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపానల్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్ డెస్క్ కచ్చితంగా ఏర్పాటు చేయాలని, రిఫరల్ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్ ఆస్పత్రుపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్ ఆస్పత్రులపై సమీక్ష చేయాలని అన్నారు. రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేనని సీఎం స్పష్టం చేశారు. పతిరోజూ అధికారులు కాల్ సెంటర్లకు మాక్ కాల్ చేసి పనితీరును పరిశీలించాలని చెప్పారు. ప్రతి మాక్ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలని చెప్పారు. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలు.. ఈనాలుగు పారామీటర్స్ మీద ప్రశ్నలు వేసి.. రోగులనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. వీటిద్వారా ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని సీఎం చెప్పారు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. (చదవండి: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్) -
ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు
సాక్షి, విజయవాడ: వైద్య ఖర్చులు రూ. వెయ్యిదాటితే ఇప్పటికే 1000 చికిత్సా విధానాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 47 వేల వరకు ఖర్చయ్యే 87 చికిత్సా విధానాలను కొత్తగా ఆరోగ్య శ్రీ పథకంలోకి చేర్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇందులో ఇన్ పేషెంట్‌కు అవసరమయ్యే 53 విధానాలతో పాటు, 29 స్వల్పకాలిక చికిత్సా విధానాలు, మరో 5 డేకేర్ విధానాలు ఉన్నాయి.(ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలు ప్రారంభం) కాగా వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అమల్లోకి తీసుకు వచ్చేందుకు గురువారం శ్రీకారం చుట్టారు. -
నివారణా చర్యలపై మరింత దృష్టిపెట్టాలి..
-
మరో అధ్యాయానికి సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అమల్లోకి తీసుకు రానున్నారు.(ఏపీలో కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్) ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని తెలిపారు. ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని తెలిపారు. ఆస్పత్రులకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ‘‘ కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. వైద్యం కోసం ఎవరూ అప్పులు పాలు కాకూడదు. కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తామని సీఎం జగన్ తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని సీఎం తెలిపారు. నెట్వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వ బకాయిలన్నింటినీ చెల్లించామని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1059 చికిత్సలు ఉంటే..ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని వెల్లడించారు. త్వరలో అన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు వర్తింపు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 27 టీచింగ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు డబ్ల్యూహెచ్‌వో సూచించిన మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. నివారణా చర్యలపై మరింత దృష్టిపెట్టాలి.. కోవిడ్ నివారణా చర్యల పట్ల మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్లుకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందే. కోవిడ్‌పట్ల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘కోవిడ్ వచ్చిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్న దానిపై అవగాహన ఉండాలి. ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలి. కోవిడ్ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయన్నదానిపై అవగాహన కలిగించాలి. 85 శాతం మంది ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే తగ్గిపోతుంది. ఇళ్లలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చు. అన్నిరకాలుగా వారిని బాగా చూసుకుంటాం. వైద్యులు కూడా ఉంటారు. కలెక్టర్లు దీనిమీద దృష్టిపెట్టారు. ప్రతి రాష్ట్ర సరిహద్దులను తెరిచారు కాబట్టి రాకపోకలు పెరుగుతాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కూడా తిరుగుతున్నాయి. కాబట్టి కేసులు పెరుగుతాయి. ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఎలా అవగాహన కలిగించగలం? వారిలో అవేర్నెస్ కలిగించామా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని’’ సీఎం వైఎస్ జగన్ సూచించారు. కోవిడ్ రాగానే ఏం చేయాలన్న దానిపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని, కలెక్టర్ స్పెషల్ డ్రైవ్స్ తీసుకోవాలని సీఎం తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ లాంటి వాటిని పెట్టుకోవడం వల్ల వ్యాప్తి తగ్గుతుంది. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో కీలక అంశాలు.. ►అధికారంలోకి రాగానే రూ. 680 కోట్ల బకాయిలు నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం ►పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం తీసుకుని చిరునవ్వుతో ఇంటికి రావాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకున్నాం ►ఎలాంటి జాప్యం లేకుండా ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తున్నాం ►1059 చికిత్సలు గతంలో ఉంటే.. వాటిని 2200 చికిత్సల వరకూ ఆరోగ్యశ్రీని విస్తరిస్తున్నాం ►జనవరిలో ప.గో. జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టాం ►ఇవాళ 2200 చికిత్సలకు పెంచి, మరో 6 జిల్లాల్లో వర్తింపు చేస్తున్నాం ►1059 చికిత్సలకు మరో 200 చికిత్సలు పెంచి.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశాం.. అధికారంలోకి రాగానే ఇందులో క్యాన్సర్, కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి వాటన్నింటినీ తీసుకువచ్చాం ►ప.గో.జిల్లాలో మాత్రం 2059కి, తర్వాత 2200 చికిత్సలు పెంచి పైలట్‌ప్రాజెక్టు కింద చేపట్టాం ►ఇప్పుడు మరో 6 జిల్లాల్లో 2200 చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వస్తున్నాం ►దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన రాష్ట్రం మనదే... ►మనం చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయి ►నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నాం ►1088 సంఖ్యలో 108, 104 అత్యాధునిక సదుపాయాలున్న అంబులెన్స్‌లను మనం ప్రారంభించాం ►ప్రతి మండలంలో కూడా సేవలు అందించడానికి ఈ చర్యలు తీసుకున్నాం ►రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఉండాలని, వైద్యం ఖర్చులకు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ►చికిత్స తీసుకున్న తర్వాత కూడా విశ్రాంతి సమయంలోకూడా ఇబ్బందులు పడకూడదని రోజుకు రూ.225లు చొప్పున లేదా నెలకు రూ.5వేల వరకూ మనం డబ్బులు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నాం ►దేవుడి దయంతో, మీ అందరి చల్లని దీవెనలతో మనం గొప్పగా చేయగలుగుతున్నాం ►వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బతకడు.. వైద్యం కోసం ఏ మనిషీ కూడా అప్పులు పాలు కాకూడదు ►రూ.5లక్షల ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఇందులోకి వచ్చాం ►నెలకు రూ.40వేలు సంపాదించే వ్యక్తిని కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చాం ►1.4కోట్లకు పైగా ఆరోగ్యకార్డులను పంపిణీచేస్తున్నాం ►4 లక్షల కార్డులు తప్ప.. మిగతావన్నీకూడా పంపిణీ చేశారు.. మిగిలినవి కూడా త్వరలోనే పంపిణీచేస్తున్నారు ►ఆరోగ్య డేటా అంతా కూడా స్టోర్ చేసి.. ప్రతి రికార్డుకూడా అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం ►రాష్ట్రంలో ఆరోగ్య రంగంలోకి పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నాం ►ఆస్పత్రులన్నీ కూడా నాడు – నేడుతో రూపు రేఖలు మారుస్తున్నాం ►రాష్ట్రంలో ఇప్పుడు 11 టీచింగ్ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి ►కొత్తగా మరో 16 టీచింగ్ ఆస్పత్రులను కట్టబోతున్నాం ►జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆస్పత్రులను నిర్మిస్తున్నాం ►దాదాపు రూ.16వేల కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నాం ►ప్రతి నెట్ వర్క్ ఆస్పత్రికీ గ్రేడింగ్ ఇచ్చాం ►గ్రేడింగ్‌లో పాస్ అయిన ఆస్పత్రినే నెట్ వర్క్ ఆస్పత్రిగా గుర్తింపు నిచ్చాం ►ఇవన్నీ ఒకవైపున చేస్తూనే.. దేవుడి దయతో.. మరో ముఖ్యమైన పనిచేయగలుగుతున్నాం ►ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు తీసుకుంటే... వాటి నాణ్యతమీద సందేహాలు, భయాలు ఉన్న పరిస్థితి అలాంటి భయాన్ని తొలగించాం ►డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులను మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్నాం ►బయటకూడా దొరకని నాణ్యమైన మందులను అందిస్తున్నాం ►500కుపైగా నాణ్యమైన మందులను ఆస్పత్రులకు అందుబాటులో తీసుకొచ్చాం. ఇవన్నీ జీఎంపీ ప్రమాణాలున్న మందులే ►ప్రతి గ్రామంలోకూడా ఎవరికైనా బాగోలేకపోతే అదే గ్రామంలోనే , గ్రామ సచివాలయం పక్కనే వైయస్సార్ విలేజ్ క్లినిక్ కూడా తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశాం ►13వేల విలేజ్ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం ►54 రకాల మందులు.. అక్కడే అందుబాటులోకి వస్తాయి ►24 గంటలు ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు ►ఆరోగ్య శ్రీ రిఫరెల్ పాయింట్‌గా కూడా అందుబాటులోకి వస్తుంది ►ఈ కార్యక్రమానికి గ్రామాల్లో పనులుకూడా ప్రారంభం అయ్యాయి ►ఏప్రిల్‌నాటికి పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ►ఈ ఏడాదిలో మనసుకు సంతోషం కలిగించే కంటివెలుగు కార్యక్రమం చేపట్టాం ►ప్రతి పిల్లాడికీ కూడా కంటి పరీక్షలు చేశాం ►65 లక్షల మంది కంటి పరీక్షలు చేశాం ►1.58 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని భావిస్తే... అందులో 1.29 లక్షల మందికి అద్దాలు ఇచ్చాం... ►కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది.. ఈనెలాఖరు లోగా మిగిలిన వారికి కంటి అద్దాలు పంపిణీ ►కరోనా తగ్గానే అపరేషన్లు కూడా చేస్తాం ►ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలని కలెక్టర్లు దీనిపై ధ్యాసపెట్టి... ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నాం ►బాధ్యులైన జేసీలు కూడా ధ్యాసపెట్టాలని కోరుతున్నాం ►గాడిలో పడేంతవరకూ క్రమంతప్పకుండా రివ్యూ చేయాలి ►2200 చికిత్సలు ఆరోగ్యశ్రీ కింద అమలయ్యేలా చూడాలి -
ఆరోగ్యమస్తు.!
ఆరోగ్యం సామాన్యుడికి అందనంత దూరం. చిన్నచిన్న రుగ్మతలకూ లక్షలకొద్దీ ఖర్చుచేయడం అనివార్యం. మరి నిరుపేదలకు ఎలాంటి సమస్య వచ్చినా... ఆస్పత్రి గడప తొక్కడం అసంభవం. ఒక వేళ వెళ్లినా ఆస్తులు హారతికర్పూరంలా హరించుకుపోవడం ఖాయం... ఇది ఒకప్పటి మాట. మహానేత రాజశేఖరరెడ్డి పుణ్యమాని... నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం సైతం పూర్తి ఉచితంగా లభించింది. అందుకు ఆరోగ్యశ్రీ వారధిగా నిలిచింది. దేశంలోనే ఈ పథకానికి విశేష ఆదరణ లభించింది. తరువాత వచ్చిన పాలకులు దానిని పూర్తిగా మూలకు నెట్టేశారు. వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి హయాంలో మళ్లీ ఆ పథకానికి జవసత్వాలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అదనంగా వ్యాధులు చేర్చారు. వెయ్యి రూపాయలు దాటినా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు చేపట్టారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్య ప్రజల జీవితాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. అనారోగ్యం బారిన పడ్డవారికి, వారి వైద్యానికి అయ్యే ఖర్చును భరించడమే కాకుండా, వారు పూర్తిగా కోలుకొనే వరకూ ఆరోగ్య ఆసరా నిస్తూ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచింది. వెయ్యి రూపాయలు దాటితే, ఆరోగ్యశ్రీని వర్తింపజేసే పథకం గురువారం నుంచి విజయనగరం జిల్లాకు కూడా వర్తింపజేస్తుండటంతో, సుమారు 7లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాకు వరం ప్రజాసంకల్ప యాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని మాట ఇచ్చారు. దానిని ఇప్పుడు అమలులోకి తీసుకువచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, తాజాగా ఈ పథకాన్ని మరింత విస్తరించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసి, రెండోవిడతలో మరో ఆరు జిల్లాలకు గురువారం నుంచీ వర్తింపజేస్తున్నారు. ఈ జాబితాలో విజయనగరం కూడా ఉండటంతో, జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన 6,99,852 కుటుంబాలకు నేటినుంచి అదనపు భరోసా కలుగుతుంది. ఇకనుంచీ రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందవచ్చు. వ్యాధుల సంఖ్య 2145కి పెంపు గత ప్రభుత్వ హయాంలో 1059 వ్యాధులకు మాత్రమే ఆరో గ్యశ్రీ క్రింద వైద్యం అందేది. ఈ ఏడాది జనవరిలో ఈ జాబి తాలో 200 కొత్త వ్యాధులను చేర్చగా, తాజాగా గురువారం నుంచి ఒకేసారి అదనంగా 886 కొత్త వ్యాధులను చేరుస్తున్నారు. ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సనందించే వ్యాధుల సంఖ్య 2145కి పెరిగింది. అలాగే ఏడాదికి కుటుంబానికి వైద్యానికి అయ్యే ఖర్చు గరిష్ట పరిమితిని రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స నందించాలన్న సాహ సోపేత నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. కరోనాతో పాటు ప్రస్తుతం 2145 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సనందించేందుకు జిల్లా లో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా గుర్తించింది ప్రభుత్వం. విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రి, ఎస్‌కోట ప్రభుత్వాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రితోపాటు మరో పది పీహెచ్సీలలో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ప్రైవేటు రంగంలోని తిరుమల, సాయి సూపర్ స్పెషాలిటీ, పుష్పగిరి, ఆంధ్రా, వెంకటపద్మ, మువ్వగోపాల, మిమ్స్, పీవీఆర్, వెంకటరమణ, అభినవ్, కులపర్తి, మారుతి ఆస్ప త్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సనందిస్తున్నారు. కేవ లం జిల్లాలోను, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని రాష్ట్రప్రజలకు కల్పించడం ద్వారా, ప్రజారోగ్యంపై తనకున్న చిత్తశుద్ధిని ప్రభుత్వం చాటుకుంది. కోలుకొనేవరకూ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, బడుగుజీవులు అనారోగ్యానికి గురైతే, ఆ కుటుంబం కుదేలవ్వాల్సిందే. రెక్కాడితే గాని డొక్కాడని వేలాది పేద కుటుంబాలకు, ఆ ఇంటి యజమాని జబ్బుపడితే, అతను కోలుకొని పనుల్లోకి వెళ్లేవరకూ ఇంట్లో పస్తే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోగి పూర్తిగా కోలుకొనే వరకూ, ఆరోగ్యశ్రీ ఆసరా కింద రోజుకు రూ.225 చొప్పున లేదా నెలకు రూ.5వేలు వరకూ ప్రభుత్వమే చెల్లించి ఆ రోగిని, కుటుంబాన్ని ఆదుకుంటోంది. కిడ్నీ వ్యాధి, తాలసేమియా తదితర దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ.10వేల వరకూ పింఛన్ అందిస్తూ, ఆ కుటుంబాలకు ఆసరానిస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు ఇప్పటివరకు 1059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. జనవరి 2వ తేదీన అదనంగా 200 వ్యాధులను కలిపారు. ఇప్పుడు మరో 886 వ్యాధులను కలిపి 2,145 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించనున్నారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ఆస్పత్రికి వెళితే ఉచితంగా వైద్యం చేస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.’ – డాక్టర్ పి.ప్రియాంక, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ -
రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ..
-
రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ... మరో ఆరు జిల్లాలకు
సాక్షి, అమరావతి: రూ.వెయ్యి దాటిన వైద్యం ఖర్చును ఆరోగ్యశ్రీ పథకం వర్తింపులో భాగంగా మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతోన్న ఈ పథకం ఈ నెల 16వ తేదీ నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున సోమవారం సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. మరో ఆరు జిల్లాల్లో అమలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఎన్నికల సమయంలో హామీ వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ హామీని అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు 2020 జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇందులో భాగంగా అప్పటి వరకూ ఉన్న 1,059 చికిత్సలకు మరో వెయ్యి చేర్చి 2,059 చికిత్సలకు ఆరోగ్యశ్రీని వర్తింప చేశారు. ప్రస్తుతం చికిత్సల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద 54 క్యాన్సర్ చికిత్సలనూ చేర్చారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో... గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింప చేసేవారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతో వైద్యం అందని పరిస్థితి. వీటిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. 2019 జూన్ నుంచి ఇప్పటివరకూ రూ.1,815 కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి, మరో రూ.315 కోట్లు ఈహెచ్ఎస్ (ఉద్యోగుల వైద్యపథకం) కింద ఈ ప్రభుత్వం చెల్లించింది. -
ఇది కేసీఆర్ వైఫల్యం కాదా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘోరంగా విఫలమయ్యారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తే, అదే తెలంగాణలో మాత్రం లక్ష టెస్టులు మాత్రమే చేశారని, ఇది కేసీఆర్ వైఫల్యం కాదా అని సూటిగా ప్రశ్నించారు. (చదవండి : ఐసీయూలో 500 మంది బాధితులు) కరోనాపై పోరాటం కోసం వచ్చిన కోట్ల విరాళాలు ఎక్కడకు పోయాయని అడిగారు. మేధావులు,విద్యావంతులు,ప్రజలు కేసీఆర్ వైఖరిని గమనించాలని, ప్రగతి భవన్లో కరోనా కేసులు వచ్చాయని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల బాగోగులు చూడాలని, కరోనా పేషేంట్లకు మెరుగైన వైద్యం అందించాలని, తక్షణమే ఈ వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా వైద్యపరీక్షలు, వైద్యం చేస్తున్నదీ లేనిదీ ఈ నెల 22 నాటికి వివరించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది పి.తిరుమలరావు రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజ న పథకం కింద కరోనా వైద్య పరీక్షలకు మార్గదర్శకాలు జారీచేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను అమలు చేయకుండా సొంతంగా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. దీనికి ధర్మాసనం స్పం దిస్తూ, రెడ్ జోన్స్ ఎక్కువ అవుతున్నాయని, అలాంటి ప్రాంతాల్లోని వారికి వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నించింది. 37 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సివుంటే 67 వేల కిట్లు మాత్రమే ఉన్నాయని, భారీగా లక్షల కిట్లను ఎలా సమకూర్చుతారని కూడా ప్రశ్నించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద పరీక్షలు చేస్తున్నదీ లేనిదీ తెలుసుకుని తమకు వివరించాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనాకు సంబంధించి 15 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజి నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కనీస మొత్తం గా 16 వేల నుంచి గరిష్టంగా 2.16 లక్షల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. -
క్యాన్సర్‌పై యుద్ధం!
ఆకివీడు: రాష్ట్రంలో క్యాన్సర్‌ను అదుపు చే సేందుకు ప్రభుత్వం గట్టి చర్యలకు పూనుకుంది. వ్యాధి ముదరకముందే గుర్తించి నివారించే ప్రణాళికలు చేపట్టింది. ప్రాథమిక దశలో గుర్తించని కారణంగా.. క్యాన్సర్ వ్యాధి ముదిరి వేలమంది మృత్యువాత పడుతున్నారు. ముందు గుర్తించగలిగితే కొన్ని ప్రాణాలనైనా కాపాడగలమనే ఉద్దేశంతో ప్రభుత్వం క్యాన్సర్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకంలో క్యాన్సర్ రోగులకు విస్తృత సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో 131 రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్స అందిస్తుండగా మరో 44 రకాల జబ్బులను పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. విస్తరిస్తున్న వ్యాధి.. జిల్లాలో చాప కింద నీరులా క్యాన్సర్ విస్తరిస్తోంది. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభమమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా అనారోగ్యంగా పెరిగి కణుతులుగా మారతాయి. శరీరంలో ఇష్టారాజ్యంగా కణుతులు పెరగడమే క్యాన్సర్‌గా చెప్పవచ్చు. సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా క్యాన్సర్ విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో క్యాన్సర్‌కు పూర్తి వైద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లాలో 40 వేల మందికి పైగా రోగులు.. జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కలుషిత వాతావరణం, ఆహారం, నీటి కాలుష్యం, కల్తీ నూనెలు తదితరాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో మూడు, నాలుగు స్టేజ్లలో ఉన్న క్యాన్సర్ రోగుల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుందని అంచనా. 1, 2 స్టేజ్లలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు రోగం బయటపడే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ప్రతిఒక్కరూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా జబ్బును గుర్తించి, తగిన మందులు వాడటంతో నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రతినెలా పరీక్షా శిబిరం : కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా నెలకో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించవచ్చని ప్రభుత్వం నిర్ధారించింది. పలు రకాల క్యాన్సర్ రోగాల్ని ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా తగిన మందులు వాడటంతో నివారించవచ్చని వైద్యులు పేర్కొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోదావరి వాసులే అధికం.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లోని క్యాన్సర్ ఆసుపత్రుల వద్ద గోదావరి జిల్లాలకు చెందిన క్యాన్సర్ రోగులే అధిక శాతం ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఆకివీడులో ఇటీ వల క్యాన్సర్ వ్యాధితో ముగ్గురు వైద్యులు అకాల మృతి చెందడం వ్యాధి విస్తరణకు అద్దం పడుతోంది. మలం, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలను గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం ద్వా రా వ్యాధిని నిర్ధారించవచ్చు. ప్రధానంగా గొంతు, రక్త, మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బాధితులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారిలో 20 నుంచి 30 శాతం క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఎన్ ఐపీ సంస్థ గతంలో వెల్లడించింది. నాణ్యమైన గింజతోనే ఆరోగ్యం నాణ్యమైన, సేంద్రియ, ఆరో గ్యకరమైన ఆహారాన్ని పండించేలా చర్యలు చేపడితే రోగాలు తగ్గుతాయి. క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా పారద్రోలవచ్చు. కలుషిత ఆహారం వల్లే క్యాన్సర్ విస్తరి స్తోంది. మనిషిలోని కణాలు రోజురోజుకూ మందగించడం వల్లే కణం అదుపు తప్పి క్యాన్సర్‌గా మారుతోంది. – డాక్టర్ పీబీ ప్రతాప్‌కుమార్, సీనియర్ వైద్యులు, ఆకివీడు ఆరోగ్యశ్రీ వరం ఆరోగ్యశ్రీ పథకం క్యాన్సర్ రోగులకు వరం. ఈ పథకంలో కొత్తగా 44 రకాల క్యాన్సర్ చికిత్సలను చేర్చడంతో మొత్తం 175 క్యాన్సర్ జబ్బులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించనుంది. క్యాన్సర్ రోగులను ప్రాథమిక దశలో గుర్తించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించడం అభినందనీయం. – కేశిరెడ్డి మురళీ, మండల కన్వీనర్, వైఎస్సార్సీపీ, ఆకివీడు ప్రాథమికస్థాయిలో కొన్ని గుర్తిస్తున్నాం ప్రాథమిక స్థాయిలో కొన్ని క్యాన్సర్ వ్యాధుల్ని గుర్తించి, ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నాం. అన్ని క్యాన్సర్ వ్యాధుల్ని గుర్తించలేం. స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే గుర్తించాలి. ప్రతి నెల ఆరుగురు, ఏడుగురు రోగులను ఉన్నత వైద్యానికి రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ భీమవరపు బిలాల్, సీహెచ్‌సీ వైద్యులు, ఆకివీడు -
ఉషస్సులు నింపుతున్న ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,059 జబ్బులను చేర్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పథకం సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఆరోగ్యశ్రీ విస్తరణ పథకం పేదల జీవితాల్లో కొత్త ఉషస్సులు నింపుతోంది. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే జనవరి 3 నుంచి 14వ తేదీ వరకూ రూ.వెయ్యి బిల్లు దాటిన 1,100 మందికి పైగా పేదలు నమోదయ్యారు. విస్తరించిన పథకం ప్రారంభమైన నాటినుంచి రోజు రోజుకూ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. రూ.వెయ్యి బిల్లు దాటిన వారంతా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి వెళుతున్నారు. అక్కడ ఆరోగ్యమిత్ర రోగుల జబ్బులు నమోదు చేసుకుని ఆ జబ్బు జాబితాలో ఉంటే తక్షణమే అనుమతుల నిమిత్తం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపిస్తున్నారు. వీలైనంత త్వరగా అనుమతులు వస్తుండటంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో 54 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు 54 వరకూ ఉండగా.. వాటిలోని 34 ఆస్పత్రుల్లో గడచిన 12 రోజుల్లో రూ.వెయ్యి బిల్లు దాటిన వారు ఉచితంగా చికిత్స పొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని ఏప్రిల్ 1నుంచి ప్రతినెలా ఒక జిల్లాలో 2,059 జబ్బులకు చికిత్సలను అందుబాటులోకి తెస్తారు. ప్రతి రోగి వివరాలూ నమోదు చేయాలని చెప్పాం ప్రతి రోగి వివరాలను నమోదు చేయాలని చెప్పాం. 2,059 రకాల జబ్బులు కాకుండా కొత్తగా ఏమైనా నమోదవుతున్నాయా, అలాంటి వారెవరైనా వైద్యం కోసం వచ్చి వెనక్కి వెళుతున్నారా, జాబితాలో చేర్చిన జబ్బుల్లో వైద్యం కోసం రోగులు రావడం లేదనే వివరాలనూ నమోదు చేయిస్తున్నాం. జాబితాలో లేని జబ్బులు ఏవైనా నమోదైతే వాటిని గుర్తించటం, ఎవరూ వైద్యానికి రాని జబ్బులు ఉంటే వాటిని తీసెయ్యడం వంటి వివరాల కోసం రిజిస్ట్రీని నిర్వహిస్తున్నాం. జబ్బుల సరళిని గుర్తించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. –డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈఓ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
ఏపీకి గొప్ప వరం ఆరోగ్యశ్రీ
సాక్షి అమరావతి: ‘పేదలు, సామాన్యులకు ఉచితంగా.. అన్ని వైద్య సేవలు అందించాలంటే గొప్ప సంకల్పం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్పులతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఆ గొప్ప సంకల్పం నాకు కనిపిస్తోంది. అన్ని ఖరీదైన చికిత్సలతో పాటు డెంగీ, మలేరియా వంటి జ్వరాలను ఈ పథకంలో చేర్చడం రాష్ట్ర ప్రజలకు గొప్ప వరంగా భావించాలి. ఇలాంటి పథకం అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేందుకు ఆరోగ్యశ్రీ పథకమే ఉదాహరణ’ అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, యూపీఏ ప్రభుత్వంలో ఆరోగ్య సలహాదారుగా పనిచేసిన డా.కె.శ్రీనాథరెడ్డి.. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా కూడా ఉన్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో మార్పులు చేర్పులపై మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సల్ హెల్త్ కవరేజీ పేరిట అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గొప్ప పథకం. ప్రస్తుత వ్యాధుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే.. ఈ పథకంతో చేకూరే లబ్ధి వల్ల అన్ని రకాల వైద్య సేవలు సామాన్యులందరికీ చేరువైనట్లే భావించాలి. పకడ్బందీగా అమలు చేస్తే పేదవారి జేబునుంచి ఏమీ ఖర్చు కాదు. ఖరీదైన చికిత్స అవసరమయ్యే వ్యాధులను ఈ పథకంలో చేర్చారు. అంత భారీ వ్యయం చేయడం సాధ్యమేనా? క్యాన్సర్, న్యూరో, గుండెజబ్బులతో పాటు వందలాది జబ్బులు జాబితాలో ఉన్నాయి. వీటికి చాలా వ్యయమవుతుంది. సామాన్యులకు వచ్చే వ్యాధులకు ఉచితంగా వైద్యమందించాలనే దృక్పథంతోనే ఈ జబ్బుల్ని చేర్చారు. భారమైనా ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యమే. ఆరోగ్యశ్రీలో నిబంధనల్ని సరళతరం చేశారు. ఈ మార్పులతో సామాన్యులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ప్రమాదకర రోగాల చికిత్స కోసం పేదలు డబ్బు ఖర్చు పెట్టలేక మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పథకం అందుబాటులో ఉండి, సకాలంలో వైద్యమందితే లక్షలాది మందికి ప్రాణదానం చేసినట్లే.. రూ.1000 దాటితే రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు. దీని సాధ్యాసాధ్యాల గురించి ఏమంటారు? కచ్చితంగా సాధ్యమే. 2,059 జబ్బుల పరిధిలో బిల్లు రూ. వెయ్యి దాటితే చికిత్స అందిస్తున్నారు. ఇందులో 170 వరకూ డే కేర్ జబ్బుల్ని చేర్చారు. మొదట కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే మిగతా జిల్లాల్లో అమలు చేసే సమయానికి అంతా సర్దుకుంటుంది. డెంగీ, మలేరియా వంటి జ్వరాలనూ పథకం పరిధిలో చేర్చారు. ఈ కొత్త సౌలభ్యం సామాన్యులకు ఎంతవరకూ ఉపయోగపడుతుంది.? ఇటీవలి డెంగీ వంటి జ్వరాలు సోకినప్పుడు సామాన్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లేట్లెట్స్ కోసం బాగా ఖర్చవుతుంది. మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల వల్ల కూడా వేలకు వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. పైగా ఇలా జ్వరాల బారిన పడుతున్న వారు వేలల్లో ఉంటారు. కొన్ని జ్వరాలను ఈ పథకంలో చేర్చడం వల్ల అలాంటి వారికి లబ్ధి చేకూరుతుంది. మీరు ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య బీమా పథకాలు చూసుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీపై ఒక ప్రముఖ వైద్యుడిగా మీ అభిప్రాయం? సామాన్యులకు వైద్యబీమా కల్పించి అమలు చేయడంలో దేశంలో గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగలను. నాకు తెలిసినంత వరకూ మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి వైద్యబీమా పథకాన్ని చూడలేదు. నిధుల వ్యయం ఒక్కటే కాదు, అమలు చేయాలంటే ప్రభుత్వాలకు గొప్ప సంకల్పం ఉండాలి. రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయం చేయడంపై మీ అభిప్రాయం? నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఇలా ఆర్థిక సాయం చేయడం చూడలేదు. కుటుంబ ప్రధాన పోషకుడు జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. శస్త్రచికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోజుకు రూ.225 ఇవ్వడమంటే సాహసోపేత నిర్ణయం. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది కాదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం ఎంత వరకూ ప్రయోజనకరం? కొన్ని చికిత్సలకు కొన్ని ప్రాంతాల్లో వైద్యం చేసే అవకాశం ఉండకపోవచ్చు. రోగులకు న్యాయం జరగాలంటే ఎక్కడ వైద్యం ఉంటుందో అక్కడ చేయించాలి. ఏపీ ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వైద్యానికి అనుమతించడం గొప్ప పరిణామం. -
నాడు వైఎస్సార్.... నేడు వైఎస్ జగన్
సాక్షి, ఏలూరు: ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాగా ఆరోగ్య శ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా.. అదనంగా మరో 1000 చేర్చి మొత్తం 2,059 వ్యాధులకు సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి.. ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, రఘురామకృష్ణమ రాజు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద్యం కాగా ఈ ప్రాజెక్టు అమల్లో అనుభవాలు, ఇబ్బందుల్ని బేరీజు వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. నాడు వైఎస్సార్.... నేడు వైఎస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభించడం విశేషం. చదవండి: ఆరోగ్య ధీమా -
ఆరోగ్య శ్రీ పథకానికి మరింత మెరుగులు
-
మహా ప్రాణదీపం
కోరకుండానే దేవుడు వరమిచ్చినంత ఆనందంగా ఉంది ఆ కుటుంబం.. అనారోగ్యవంతుల పాలిట ఆపద్బాంధవిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం తమ కుమార్తెకు వర్తించదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. తమను ఆదుకునే దిక్కెవ్వరని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలిక సహ విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చందాలు వేసుకొని కొంత సాయం చేశా రు. చికిత్సకు లక్షల్లో అవసరం కావడంతో.. చేయూతనందించే ఆదరవు కోసం ఎదురుచూస్తున్న దశలో ఓ సంతోషకర వార్త.. బాలిక అనారోగ్యం గురించి ‘సాక్షి’ పత్రిక ద్వారా తెలుసుకున్న ఆరోగ్యశ్రీ అధికారులు ప్రత్యేక కేసుగా పరిగణించి అవసరమైనంత సాయం చేస్తామని ముందుకు వచ్చారు. శ్రీకాకుళం: మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న డిగ్రీ విద్యార్థిని జస్మితను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంటోంది. నగరంలోని ఆ నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చికిత్స పొందుతున్నా ఎప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో స్థానిక వైద్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు జస్మితకు శస్త్ర చికిత్స అవసరమని తేల్చారు. నిరుపేద కుటుంబమైన వీరికి శస్త్ర చికిత్స జరిపించేందుకు అవసరమైన రూ.6 లక్షలు భరించలేమని మానసికంగా కుంగిపోయారు. జస్మిత చదువుతున్న కళాశాల విద్యార్థులు, యాజమాన్యం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ విషయం సాక్షిలో ప్రచురితం కావడంతో స్థానిక ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పేదలు ఎటువంటి వ్యాధి తో బాధపడుతున్నా స్పందించి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని అప్పటికే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించడంతో దీనిని అధికారులు ఆచరణలో పెట్టారు. జస్మితకు ఉన్న వ్యాధి ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని, నిరుపేద కుటుంబమని చెప్పడంతో రాష్ట్ర అధికారులు తక్షణం స్పందించి ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్సలు చేయించాలని జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించారు. ఈ విషయం సోమవారం జస్మిత కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా ఆనందపడుతూ విశాఖపట్నం వెళ్లారు. అయితే అక్కడ బుధవారం రావాలని చెప్పడంతో తిరిగి నగరానికి చేరుకున్నారు. రానున్న శుక్ర, శని వారాల్లో గాని, సోమవారం గాని జస్మితకు శస్త్ర చికిత్స జరిగే అవకాశాలున్నాయి. వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటాం.. బిడ్డను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుందని జస్మిత తండ్రి రాము ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. తాపీమేస్త్రి గా పనిచేస్తున్న తనకు అంత పెద్ద మొత్తం వెచ్చించే స్థోమత లేదని, తమ కూతురు పడుతున్న బాధ చూడలేక రోజూ తన భా ర్య, తాను కుంగిపోయేవారమన్నారు. బాగా చదివే జస్మిత తమను ఆదుకుంటుందని భావించి ఎన్ని కష్టాలు ఎదురైనా చదివించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో జస్మితకు ఉన్న వ్యాధి రాదని తొలుత వైద్యులు చెప్పడంతో ఆశలు వదులుకున్నామని, ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్స చేయిస్తామని ఆ రోగ్యశ్రీ అధికారులు చెప్పగానే ఆనందం ప ట్టలేకపోయామన్నారు. వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. -
సత్యలీలకు 'ఆసరా' తొలి చెక్కు
సాక్షి, గుంటూరు: ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని సోమవారం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ప్రారంభించిన అనంతరం రోగులకు సీఎం జగన్ చెక్కులను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన డేగల సత్యలీలకు సీఎం తొలి చెక్కు అందించారు. ఆమె పది రోజుల క్రితం కూలి పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందారు. వైద్యుల సలహా మేరకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం ఆమెకు రూ.10 వేలు చెల్లించింది. ఆరోగ్యం జాగ్రత్తమ్మా అన్నారు.. ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ కింద నీ ఆరోగ్యం మెరుగయ్యే వరకూ రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు ప్రభుత్వం నుంచి నీకు డబ్బులు వస్తాయి. తొలి చెక్కు నీకే అందిస్తున్నామమ్మా.. ఆరోగ్యం జాగ్రత్త అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కూలికి వెళ్తేగానీ ఇల్లు గడవని పరిస్థితి. పూర్తిగా కోలుకునే వరకూ డబ్బులిస్తామని సీఎం చెప్పారు. ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు రుణపడి ఉంటాను’ – డేగల సత్యలీల, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా భరోసా కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు... ‘నా భర్త చనిపోవడంతో చెరుకు రసం అమ్ముకుంటూ జీవిస్తున్నా. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరగా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాకు ముగ్గురు కుమార్తెలు. నేను ఖాళీగా ఉంటే పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితి. ఆరోగ్య ఆసరా పథకం కింద నాకు రూ.8 వేలు అందించారు. నువ్వు దిగులు పడొద్దమ్మా, నీ ఆరోగ్యం కుదుటపడే వరకు ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. నాకు, నా పిల్లలకు ఆరోగ్య భరోసా కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు. – షేక్ ఇస్మాల్ బీ, కొత్తపేట, గుంటూరు అన్నం పెడుతున్న ‘ఆసరా’ వైఎస్సార్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నాకు బ్రెయిన్ ట్యూమర్‌కు ఉచితంగా ఆపరేషన్ చేశారు. కొంతకాలం బాగున్నా తిరగబెట్టడంతో ఇబ్బందిపడుతున్నా. ఆపరేషన్ చేయించుకున్నవారికి వైఎస్సార్ ఆసరా ద్వారా భృతి చెల్లించడం వల్ల కడుపు నిండా అన్నం తినగలిగే అవకాశం కలిగింది. మాలాంటి పేదల కోసం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలి. – షేక్ మున్నీ, ఆరోగ్య ఆసరా లబ్ధిదారు, గుంటూరు ఊహించనంత సాయం... నా భర్త గుడిపూడి నాగరాజుకు గుండెనొప్పి రావడంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. పనికి వెళ్లకుంటే ఇల్లు ఎలా గడవాలని ఆలోచిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ‘ఆసరా’ ద్వారా మాలాంటి పేదలను ఆదుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సాయం అందుతుందని ఊహించలేదు. మాలాంటి పేదల కోసం ఎల్లప్పుడూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్షాలు ఎలా ఎక్కువగా ఉన్నాయో ఈ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. – మణికుమారి, వేములూరిపాడు,ఫిరంగిపురం మండలం నెల కాదు.. ఆర్నెల్లు ‘ఆసరా’ బండి వెంకన్న పరిస్థితిపై తక్షణమే స్పందించిన సీఎం జీబీ సిండ్రోమ్ (గులియన్ బెరీ సిడ్రోమ్) వ్యాధితో బాధపడుతున్న బండి వెంకన్నకు ఆర్నెల్ల పాటు ‘ఆసరా’ ద్వారా సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన వెంకన్న శరీరం మొత్తం ఈ వ్యాధి వల్ల పక్షవాతానికి గురైంది. చికిత్స కోసం ఆయన కుటుంబం ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేసింది. గుంటూరు జీజీహెచ్ వైద్యులు అందించిన చికిత్స వల్ల పది రోజుల్లోనే వెంకన్న శరీరం, చేతుల్లో కదలిక వచ్చింది. వైద్యుల సలహా మేరకు వెంకన్నకు నెల రోజుల పాటు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా చెక్కును ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిద్ధం చేసింది. ఈ చెక్కును సీఎం చేతులమీదుగా ఇచ్చే సమయంలో వెంకన్న పరిస్థితిని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి వివరించారు. వెంకన్న కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్.. ఆరోగ్య ఆసరా సాయాన్ని ఆ మేరకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంకు నర్సుల సంఘం వినతి గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా చెక్కుల పంపిణీ అనంతరం ప్రభుత్వ నర్సుల సంఘం సభ్యులు తమ సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. జీజీహెచ్‌లో నర్సుల కొరత, ప్రోత్సాహకాలు అందక ఇబ్బందులు పడుతున్నట్టు నివేదించారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం పేదలకు అండగా నిలవటం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉండగాఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. నిధులు పక్కదారి పట్టించి పేదల మరణాలకు కారణమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి పరిధి రూ.5 లక్షల వరకు పెంచారు. నెట్వర్క్ ఆస్పత్రుల విస్తృతి పెంచారు. మూడు మహానగరాల్లో పేదలు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రకటించి ఆపరేషన్ చేయించుకున్న కుటుంబాలను పోషించే బాధ్యత స్వీకరించారు. – ఆళ్ళ నాని,ఉప ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో చరిత్ర సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తున్నారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి అన్ని వ్యాధులకు వర్తింపచేస్తున్నారు. మంచాన పడిన పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలుస్తారు. – మోపిదేవి, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి అంతా గర్వపడేలా చేశారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్ చేయించుకున్నవారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా జీవన భృతిని ముఖ్యమంత్రి జగన్ అందజేస్తున్నారు. ఆరు నెలల పాలనలో అందరూ ఎంతో గర్వపడేలా చేశారు. ప్రతి వారం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రికార్డు సృష్టిస్తున్నారు. విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం ఎన్నడూ లేనంత ప్రాధాన్యం కల్పించింది. – మేకతోటి సుచరిత, హోంశాఖ మంత్రి -
‘ఆసరా’తో ఆదుకుంటాం
మంచి పాలన అందుతున్నప్పుడు, వేలెత్తి చూపించే పరిస్థితులు ఏవీ లేనప్పుడు చిన్నచిన్న వాటిని, మనకు సంబంధం లేని అంశాలను కూడా పెద్ద సమస్యలుగా చూపించే ప్రయత్నాలు ఇవాళ జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతా. మీ అందరి దీవెనలు, దేవుడి దయ... వీటిమీదే నేను గట్టిగా నమ్మకం ఉంచా. మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నా. ఈరోజు కూడా మిమ్మల్నే, దేవుడినే నమ్ముకుంటా.. – సీఎం జగన్ సాక్షి, అమరావతి బ్యూరో: మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతున్నామని సోమవారం గుంటూరులో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామని సీఎం వివరించారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చేసి అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇందుకోసం రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. మాట నిలబెట్టుకుంటున్నా... ‘నా పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా ఈరోజు ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేక ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. గుంటూరు వేదికగా ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. పేదలు ఆపరేషన్ తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనను పక్కనపెట్టి కడుపు నిండటం కోసం మళ్లీ పనుల కోసం పరుగెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్ని మారుస్తూ శస్త్రచికిత్స అనంతరం రోగిని ఆప్యాయంగా పలుకరిస్తూ కోలుకునేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా దీన్ని ప్రారంభించాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో రోగులు ఇంట్లో పస్తులు ఉండకుండా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల వరకు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర ఈ జీవనోపాధి భృతిని అందజేస్తాం. ఏ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది? ఈ సహాయం ఎంత కాలం ఇవ్వాలన్నది నిపుణులతో కూడిన డాక్టర్లు నిర్ణయిస్తారు. సంపాదించే వ్యక్తి రోగాలతో బాధపడుతుంటే ఆ కుటుంబాలు ఆదాయం లేక ఎంత సతమతమవుతాయో నా పాదయాత్రలో కళ్లారా చూశా. ఆ కుటుంబాలన్నింటికీ ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను...’’ అని ఆ రోజు చెప్పా. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటున్నందుకు గర్వంగా ఉంది. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సభలో హాజరైన ప్రజలు జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. 3,648 కిలోమీటర్ల మేర సాగిన నా పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే.. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్ కోడ్‌లో పేషెంట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టును పొందుపరుస్తాం. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తాం. తొలిదశలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మూడు మహానగరాల్లోనూ వర్తింపు వచ్చే ఏప్రిల్ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం. ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోనే మంచి అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. మంచి ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా ఉచితంగా మెరుగైన వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఇబ్బంది పడకుండా చెక్కు మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి తెస్తాం. ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు తెస్తూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో నవంబర్ 1 నుంచే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. రోగులకు మొక్కుబడిగా కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలి. ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘ఏ’ ప్లస్ గ్రేడ్‌కి ఆర్నెళ్లలో మారాలి. అలా మారని ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ నుంచి తొలగిస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ ‘వైఎస్సార్ కంటి వెలుగు’.. ఆర్నెళ్లు తిరగక ముందే ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఓ వర్గాన్ని ఈ పథకంలోకి తెస్తాం. విద్యార్థుల తర్వాత అవ్వా తాతలకు దీన్ని వర్తింపజేస్తాం. ఆ తర్వాత ఆర్నెళ్లకు రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తానికి పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో 510 రకాల ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 15వతేదీ నుంచి 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలను మాత్రమే అందుబాటులోకి తెస్తాం. డయాలసిస్ రోగులకు మన ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం. ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్ చెల్లిస్తాం. బోధకాలు, కిడ్నీ బాధితుల(స్టేజ్ 3, 4, 5)ను రూ.5 వేల పెన్షన్ కేటగిరీలోకి తెస్తాం. లెప్రసీ బాధితులను రూ.3 వేల పెన్షన్ కేటగిరీలోకి తెచ్చి ప్రతి రోగికీ నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తాం. కేన్సర్ పేషెంట్లను కూడా మార్పులతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం. వారికి ఎన్ని దశల చికిత్స అవసరమైన పూర్తిగా భరిస్తాం. పుట్టుకతో మూగ, చెవుడు లోపం కలిగిన చిన్నారులకు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అందచేస్తాం. అలవాట్లు మారినప్పుడే... ప్రజల అలవాట్లు మారినప్పుడే వైద్యంపై ప్రభుత్వం వెచ్చించే ఖర్చు తగ్గుతుంది. అందుకనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తున్నాం. దాదాపు 43 వేల బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్‌రూంలు లేకుండా చేశాం. 4,500 మద్యం షాపులను 3,500కి తగ్గించాం. పర్మిట్ రూమ్‌లు లేకుండా చేస్తున్నాం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం షాపులను మూసివేస్తున్నాం. ప్రైవేట్ వ్యాపారుల్లాగా లాభాపేక్ష ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేశాం. బార్లను కూడా 40 శాతం తగ్గించేశాం. మద్యం ధరలు షాక్ కొట్టేలాగే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతున్నాం. మూడేళ్లలో రూపురేఖలు మార్చేస్తాం డిసెంబర్ చివరి వారంలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చిస్తాం. విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం. మే నెల నాటికి డాక్టర్లు, నర్సులు, ఇతర ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఈ అడుగులు ఒకవైపు వేస్తూనే ఒక మంచి సమాజం ఉండాలనే ఉద్దేశంతో స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. నిధుల కొరత ఉన్నా, నావద్ద ఎలాంటి మంత్రదండం లేకున్నా.. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజల దీవెనతో అడుగులు ముందుకు పడతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’’ -
పులివెందులలో రూపాయికే ఆరేళ్లపాటు వైద్యం!
సాక్షి, తిరుపతి: పేదల ఆరోగ్యం విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మొదటి నుంచీ అవగాహన ఉందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రిలో ‘ఆరోగ్య శ్రీ ఆసరా’ పథకం లబ్ధిదారులకు సోమవారం ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ తిరుపతిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలోనే వైఎస్సార్ పేదల కోసం ఆలోచించారని తెలిపారు. ఆ తర్వాతే ఆయన పులివెందులలో ఒక్క రూపాయికే పేదప్రజలకు ఆరు సంవత్సరాల పాటు వైద్యం అందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి వైఎస్సార్ ప్రజలందరి గుండెల్లో కొలువయ్యారని తెలిపారు. ఇలా పేదల కోసం వైద్య పథకాన్ని తీసుకురావడం అప్పట్లో దేశ చరిత్రలోనే రికార్డు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకువేశారని, చికిత్స అనంతరం నిరుపేద ప్రజలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని, రోగులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారికి ఏ కష్టం ఎదురుకాకుండా సహాయం చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా దేశంలో గొప్ప చరిత్ర అని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ఈ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్
-
పేదలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వరం లాంటిది: పిల్లి సుభాష్
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చక్కగా సాగుతోందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరులో సోమవారం సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాలో పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. పేదవారికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వరం లాంటిదని ప్రశంసించారు. వైద్య విధానంలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ముఖ్యమని తెలిపారు. వైద్యంలో పేదలకు మనోధైర్యాన్ని తెచ్చేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సీఎం జగన్ తీసుకు వచ్చారన్నారు. ఈ పథకం దేశంలోనే వినూత్నమైన సంస్కరణ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ పాలనలో ఆర్యోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. మళ్లీ ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ బలోపేతం చేశారని ఆయన స్పష్టం చేశారు. -
నా మతం మానవత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఓ హామీ ఇచ్చాను. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ ఆర్నెల్లు పని చేశాం. అందులో భాగంగా ఇచ్చిన మాటలో ఒకదాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చాను. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాను. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడారు. దానికి నాకు చాలా బాధ అనిపించింది. నా మతం మానవత్వం. ఈ వేదికగా చెబుతున్నా... నా కులం మాట నిలబెట్టుకునే కులం. నేను ఉన్నాను... నేను విన్నాను అనే మాటను నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. ఇక వాళ్లు చేస్తున్న అవాకులు, చెవాకులు పక్కనపెడితే..ఇవాళ జరుగుతున్న ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికాం. ఇందుకు నాకు సంతోషంతో పాటు గౌరవంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ‘ఆరోగ్యలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఆర్థిక సాయం ఎంతవరకూ ఇవ్వాలో నిర్ణస్తాం. పాదయాత్ర సందర్భంగా నేను మాటిచ్చాను. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్ కోడ్‌లో పేషెంట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టును అందులో పొందుపరుస్తాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేల రోగాల వరకూ పెంచుతున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాడు-నేడు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వచ్చే ఏప్రిల్ నాటికి 1060 కొత్త 104, 108 వాహనాలను కొనుగోలు చేస్తాం. ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లో అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా, మంచి వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. అలాగే స్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ నెల 15 నుంచి 510 రకాల మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రామాణికం ఉన్న మందులు అందుబాటులోకి తెస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాడు-నేడు అమలు చేస్తాం. మూడేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చి, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తాం హెల్త్ రికార్డులతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తాం. డయాలసిస్ రోగులకు ఇస్తున్న విధంగానే తలసేమియా, హీమెఫిలియా వ్యాధిగ్రస్తులకు జనవరి 1 నుంచి నెలకు 10వేలు ఇస్తాం. అలాగే కేన్సర్ పేషంట్లు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందికి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తాం.’ అని తెలిపారు. చదవండి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్ -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బపడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనా. కాగా నిన్నటినుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినా ముఖ్యమంత్రి లాంఛనంగా ఇవాళ ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. -
నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే మరో కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ను గుంటూరు జనరల్ ఆస్పత్రిలో సోమవారం సీఎం ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలను ఈ పథకంలో అందచేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగే కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు అందుకుంటారు. డిసెంబర్ 1 నుంచే పథకం అమల్లోకి వచ్చినా సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించేలా ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే మార్గదర్శకాలు జారీచేసింది. రోగి డిశ్చార్జి సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమచేస్తారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోగి ఆర్థికంగా ఇబ్బందిపడకూడదనే.. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకానికి ఏటా రూ.270 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ పథకంలో ప్రభుత్వం సాయం అందిస్తుంది. –డాక్టర్ మల్లిఖార్జున, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ వైఎస్సార్ ఆసరా వివరాలు మొత్తం స్పెషాలిటీ విభాగాలు 26 ఎన్నిరకాల శస్త్ర చికిత్సలు 836 రోజుకు ఇచ్చే మొత్తం రూ.225 నెల రోజుల విశ్రాంతికి రూ.5000 లబ్ధిదారుల సంఖ్య 4.50 లక్షలు ఏటా వ్యయం దాదాపు రూ.300 కోట్లు -
వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి అర్హులు వీరే..
-
వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి అర్హులు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందుడుగు వేసింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిని కూడా ఈ పథకానికి వర్తింపచేసింది. అలాగే అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా తేల్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి. 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వారు అర్హులు 5.00 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు 334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు 5.00 లక్షలోపు వార్షిక ఆదాయం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ.. గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపు కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా తెలిపిన ప్రభుత్వం -
కొత్త రూపు
-
ఆసుపత్రులు, విద్యా సంస్థలకు కొత్త రూపు
నాడు–నేడులో ప్రతి విడతలోనూ గ్రామీణ, గిరిజన, మున్సిపాలిటీల్లోని స్కూళ్లు ఉండేలా చూసుకోవాలి. స్కూలు యూనిఫామ్ దగ్గర నుంచి ఫర్నిచర్ వరకూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. యూనిఫామ్, బూట్లు, పుస్తకాలను స్కూళ్లు ప్రారంభమైన వెంటనే ఇవ్వాలి. ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. స్కూళ్లకు సంబంధించిన పరిపాలన అంశాల్లోనే కాకుండా, నిర్వహణలోనూ పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యా కమిటీలు కీలక పాత్ర పోషించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థల రూపు రేఖలు సమూలంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలన్నింటిలో దశల వారీగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు భారీగా వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యుటీ సీఎం (వైద్య శాఖ) ఆళ్లనాని, సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి దశల వారీగా స్కూళ్లలో, డిసెంబర్ 26వ తేదీ నుంచి ఆసుపత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తొలుత 45 వేల స్కూళ్లలో.. దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమం చేపడుతున్నామని, తర్వాతి దశలో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగు చేయనున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందుకోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డుల పెయింటింగ్, ఫినిషింగ్.. తదితర తొమ్మిది రకాల మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్ లిస్టు ఉండాలని, నవంబర్ 14న స్కూళ్లలో నాడు–నేడు ప్రారంభించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నామని అధికారులు తెలిపారు. 8వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని, ఆ పై వచ్చే ఏడాది నుంచి 9వ తరగతిలో కూడా ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెడుతున్నామని, దీనికి సంబంధించి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. స్కూలు ప్రారంభం కాగానే వారికి యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమానికి ఆర్థిక వనరుల లోటు లేకుండా చూసుకోవాలని సూచించారు. మండలంలోని మంచి హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలని ఆదేశించారు. నాడు–నేడు తొలి దశలో 15 వేల స్కూళ్లలో ప్రారంభిస్తున్నామని, సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. రోగులకు పింఛన్లు.. వలంటీర్ల భాగస్వామ్యం తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇచ్చే పెన్షన్ల లబ్ధిదారుల విషయంలో గ్రామ సచివాలయాలు, వలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు, గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలు పంపించాలని, లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 21 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. వచ్చే మే నెల నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ పూర్తి చేసేందుకు జనవరిలో క్యాలెండర్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు టెండర్లు నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వాసుపత్రులను బాగు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులను కూడా బాగు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ మందుల కొరత లేకుండా చూడాలని, డిసెంబర్ 15 నుంచి 510 రకాలకు పైగా మందులు అందుబాటులో పెడుతున్నామని చెప్పారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రమాణాలు బాగా పెంచాలని సీఎం సూచించారు. మొదటి దశలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కలిపి 230 ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ (ఐపీహెచ్ఎస్) ప్రమాణాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు వెంటనే పంపాలని, ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. -
ఏపీలో ఆరోగ్య కాంతులు
-
ఆరోగ్య కాంతులు
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ.. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులకే కష్టమొచ్చి వ్యాధుల బారినపడి మంచానికే పరిమితమైన దుస్థితి.. ఆస్తులమ్ముకున్నా కూడా వైద్యానికి సరిపోక.. ప్రభుత్వం ఆదుకోక.. జీవశ్ఛవాలుగా మారిన దయనీయ పరిస్థితి.. వారందరి కష్టాలను 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా విన్నారు.. కళ్లారా చూశారు.. ‘జగన్ అనే నేను.. ఉన్నాను’ అంటూ అభయమిచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదునెలలైనా కాకముందే ఇచ్చిన మాట మేరకు పేదలందరికీ మరోజన్మను ప్రసాదించే ‘ఆరోగ్యశ్రీ’ పథకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సీఎం నిర్ణయాలపై సర్వత్రా ‘దటీజ్ వైఎస్ జగన్..’ అంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: లక్షలాది మంది వ్యాధిగ్రస్తులకు వైద్యం అందక, సొంతంగా వ్యయం చేసి వైద్యం చేయించుకోలేక రకరకాల బాధలు అనుభవిస్తున్న పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి కానుక ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి శనివారం నాలుగు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గుండె జబ్బులు, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, రేడియేషన్ అంకాలజీ వంటి పలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇకపై నవంబర్ 1 నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లోనూ పొందడానికి అవకాశం కల్పించారు. రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన బాధితుడు కుటుంబ పోషకుడైతే ఆ కుటుంబం వీధినపడే పరిస్థితి ఇకపై ఉండదు. రకరకాల వ్యాధులతో మంచానపడిన వారికి నెలవారీ పెన్షన్ ఖరారు చేసింది. రోగి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరితే ఇంట్లో భార్యా పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకూ పరిష్కారం చూపుతూ.. కుటుంబ పెద్ద.. రోగంతో మంచానపడితే చికిత్స తర్వాత కోలుకునే వరకూ రోజుకు రూ.225 చొప్పున ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇన్నాళ్లూ అత్తెసరు వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.16 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ కీలక నిర్ణయాలతో రాష్ట్రంలో సామాన్య ప్రజలందరికీ సర్కారు దీపావళి కానుక ప్రకటించినట్టయింది. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వైఎస్ జగన్ వడివడిగా అడుగులు ముందుకేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులపై నిపుణుల కమిటీ నియమించి, ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. 716 జబ్బులకు నవంబర్ 1 నుంచి ఇతర రాష్ట్రాల్లో వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైన పలు జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో వైద్యం అందడం లేదు. 2019 నవంబర్ 1వ తేదీ నుంచి ఈ జబ్బులన్నిటికీ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లో వైద్యం చేయించుకునేందుకు అనుమతిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 17 సూపర్ స్పెషాలిటీ సేవల్లో భాగంగా 716 జబ్బులను సర్కారు పేర్కొంది. ఈ జబ్బులన్నింటికీ రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లో నిర్ణయించిన జాబితాలోని ఆస్పత్రుల్లోగానీ ఉచితంగా వైద్యం పొందే అవకాశం కల్పించింది. రోగులకు మరింత మెరుగైన సేవలకు 71 మంది ఆరోగ్యమిత్రలను, ముగ్గురు ఆఫీస్ అసోసియేట్లను, ముగ్గురు జిల్లా కో ఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. పేద రోగులకు ఎంతో మేలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. ఆయన తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు పథకాన్ని నీరుగార్చాయి. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఆసుపత్రులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని ఆస్పత్రుల్లోనూ ఈ పథకం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. దీనివల్ల ఎంతో మంది పేదల ప్రాణాలు నిలిచే అవకాశం ఏర్పడింది. మంచి వైద్యం పొందేందుకు వీలుంటుంది. ఇది చాలా కీలక నిర్ణయం. – జిలానీ బాషా, మెకానిక్, కర్నూలు కోలుకునే సమయంలో కొండంత అండ కుటుంబాన్ని పోషించే వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరితే ఆ కుటుంబానికి దిక్కెవరు? ఇకపై ఇలాంటి ప్రశ్నలకు తావు లేకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు ఆస్పత్రిలో చేరి కోలుకుంటున్న సమయంలో కొండంత అండగా ఉన్నామంటూ రోజుకు రూ.225 చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా సర్జరీ చేయించుకుంటే కనీసం వారం రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో ‘పోస్ట్ ఆపరేటివ్ అసిస్టెన్స్ (చికిత్స అనంతరం రోగికి సాయం) పేరుతో ఆ రోగికి రోజుకు రూ.225 చొప్పున ఇస్తారు. ఈ సొమ్ము గరిష్టంగా రూ.5 వేల వరకు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇలా చికిత్స సమయంలో ఆసరా పొందే బాధితులు ఏటా 80 వేల నుంచి లక్ష మంది ఉంటారని అంచనా. మొత్తం 131 జబ్బులకు సంబంధించి రోగులు ఇలా ఆస్పత్రిలో కోలుకోవాల్సి ఉంటుందని, వాళ్లకు ఇది కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వం వారికి సాయం ప్రకటించింది. ఈ సాయం 2019 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పేదలపై ప్రేమ కనిపిస్తోంది పేదలంటే ఆ గొప్ప మనసులో ఉన్న ప్రేమ ఆయన ప్రతి నిర్ణయంలో రాష్ట్ర ప్రజల కళ్లకు కనిపిస్తోంది. ఒక పేద కుటుంబంలో కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద ఆసుపత్రి పాలైతే ఆ కుటుంబం అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. అటువంటి సమయంలో ఆ ఇంటి పెద్దగా ముఖ్యమంత్రే ఆదుకునేలా ఆసుపత్రిలో చేరిన కుటుంబ యజమానికి రోజుకు 225 రూపాయలు ప్రభుత్వం తరపున ఇవ్వాలన్న నిర్ణయం సీఎం దయార్ధ హృదయాన్ని లోకానికి చాటుతోంది. – గుబ్బల నరసింహమూర్తి, రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి జీవితాంతం మంచానికే పరిమితమైతే ఆ వ్యక్తి పరిస్థితేమిటి? ఆ కుటుంబానికి ఆ బాధితుడి వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. తలసేమియా బాధితుడు ఒక్కసారి రక్తం ఎక్కించుకోవాలంటే ఎంత వ్యయమవుతుంది? పక్షవాతానికి గురైన బాధితుడి పరిస్థితేమిటి? ఇలాంటి ఇబ్బందులు, బాధలకు తావులేకుండా వారికి నెలవారీ పెన్షన్ ఇస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. పెన్షన్‌పై తీసుకున్న ఈ నిర్ణయం 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ జబ్బును బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ప్రకటించింది. నిపుణుల కమిటీ పలు జిల్లాలో పర్యటించి ఇచ్చిన నివేదికతో పాటు, వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్య నిపుణులు కూడా బాధితుల ఇబ్బందులపై నివేదిక ఇచ్చారు. దీనిపై సర్కారు తక్షణమే స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. నా పేరు పి.మదన్. కవిటి మండలం శ్రీహరిపురం అనే చిన్న పల్లెటూరులో ఉంటున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం మాది. ఐదారేళ్ల కిందట నాకు కిడ్నీ వ్యాధి ఉందని వైద్యులు చెప్పారు. దీంతో నాకున్న కొద్దిపాటి భూమిని సైతం అమ్మేసి విశాఖపట్నం వెళ్లి వైద్యం చేయించుకున్నాను. ప్రస్తుతం కవిటి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దయవల్ల నెలకు రూ.10 వేల పెన్షన్ వస్తోంది. దీంతో వైద్యం కోసం బెంగ లేకుండా వైద్య సేవలు పొందుతున్నాను. అంతకుముందు నా భార్యాబిడ్డల సంపాదనతోనే నా వైద్యం సాగేది. జన్మజన్మలకూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేను. – పి.మదన్, కిడ్నీ బాధితుడు, శ్రీహరిపురం, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా పారిశుధ్య కార్మికులకు వేతనం పెంపు పారిశుధ్య పనులంటే అందరూ చేయలేని పని. ప్రత్యేక పరిస్థితుల్లోనే వాళ్లు పనిచేస్తుంటారు. అలాంటి వారు తక్కువ వేతనంతో ఎలా మనగలుగుతారు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులందరికీ వేతనం పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకూ నెలకు రూ.6,500 మాత్రమే పారిశుధ్య కార్మికులకు వేతనం ఇస్తుండగా..వారి వేతనం నెలకు రూ.16 వేలకు పెంచుతున్నట్లు శనివారం సర్కారు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పెంచిన వేతనాలు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులందరికీ పెంచిన వేతనాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. పెంచిన వేతనాలు శానిటేషన్/కంటిజెంట్ వర్కర్లందరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాకు మంచి రోజులు వచ్చాయి నేను ఎంతో కాలంగా ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు మాకు ఇచ్చే జీతం ఏ మూలకూ సరిపోయేది కాదు. కానీ మా ఇబ్బందులు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగనన్న మాకు జీతాలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వడంతో మాకు మంచి రోజులు వచ్చాయి. నెలకు రూ.16 వేలు ఇచ్చేలా జీవో ఇవ్వడం ఆనందంగా ఉంది. నాతో పాటు ఇక్కడ 200 మందికిపైగా పని చేస్తున్నారు. వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. – గంటా జయమేరి, పారిశుద్ధ్య కార్మికురాలు, విజయవాడ చాలామందికి భరోసా కల్పించినట్టే రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 ఇవ్వడం వారికి భరోసా కల్పించినట్టే. దీనివల్ల చాలామందికి లబ్ధి కలుగుతుంది. దీన్ని నాలుగు కేటగిరీలుగా విభజించి అమలు చేయబోతున్నాం. ప్రధానంగా ఆపరేషన్ చేయించుకునే పేషెంట్లకు ఇది మంచి భరోసా ఇస్తుంది. ఉచితంగా వైద్యం లభిస్తుంది, చికిత్స సమయంలో సాయం అందుతుంది. ఆరోగ్యశ్రీ పథకంలో ఇది కీలక నిర్ణయం. –డా.ఎ.మల్లికార్జున, సీఈఓ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ మనసున్న ముఖ్యమంత్రి మేము చాలా జిల్లాల్లో పర్యటించాం. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీకి అనుమతులు ఇవ్వడం, రోగికి కోలుకునే సమయంలో సాయం చేయడం గొప్ప నిర్ణయం. ముఖ్యమంత్రికి బాధితులకు సాయం చేయాలని మనసుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు వేగంగా తీసుకోగలిగారు. డా.కె.సతీష్‌కుమార్‌రెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు బాధితులు ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో సర్కారుకు నివేదిక ఇచ్చాం. పెన్షన్‌కు ఎంతమంది అర్హులో చెప్పాం. వాళ్లకు పెన్షన్ ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. దీనివల్ల ఇప్పటి వరకు మంచంలో ఉన్న ఈ బాధితులు ఈ పెన్షన్ వల్ల ఎవరిమీదా ఆధారపడి జీవించాల్సిన అవసరం ఉండదు. –డా.కె.వెంకటేష్, వైద్య విద్య సంచాలకులు ఐదు మాసాల్లో ఆరోగ్య శాఖలో సీఎం కీలక నిర్ణయాలు – ఆశా వర్కర్లకు ఎన్నికలకు కొద్ది నెలల ముందు అప్పటి ప్రభుత్వం రూ.3 వేల పారితోషికం మాత్రమే ప్రకటించింది. అది కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఆశా వర్కర్ల పారితోషికం రూ.10 వేలకు పెంచారు. దీనివల్ల 40 వేల మందికి పైగా ఆశా వర్కర్లకు లబ్ధి. – కిడ్నీ బాధితులకు రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచారు. ప్రధానంగా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు గొప్ప ఊరటనిచ్చింది. – రాష్ట్రంలో ఆస్పత్రుల అభివృద్ధికి బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఉన్న స్థితిగతులు, రెండేళ్ల తర్వాత పరిస్థితులు దీనిద్వారా చూపిస్తారు. దీనికి సుమారు రూ.1,800 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 174 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 28 ఏరియా ఆస్పత్రులు, 11 జిల్లా ఆస్పత్రులు అభివృద్ధి చేస్తారు. – ఉద్దానం ప్రాంతంలో రక్షిత మంచినీటి కోసం రూ.600 కోట్ల విలువైన పనులు ఇప్పటికే జుడిషియల్ ప్రివ్యూకు వెళ్లాయి. – పలాస, మార్కాపురంలో కిడ్నీ పరిశోధనా కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం. ఇప్పటికే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. – మండలానికి ఒక 108 అంబులెన్స్, ఒక 104 వాహనం ఏర్పాటుకు నిర్ణయం. కొత్త వాహనాల కొనుగోలు టెండర్ల దశలో ఉన్నాయి. జనవరి నుంచి మార్చి నాటికి కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయి. – 2020 జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద పైలెట్ ప్రాజెక్టుగా చికిత్స అందిస్తారు. వైద్యం బిల్లు రూ.వెయ్యి దాటిన పేదలందరూ ఈ పథకంలోకి వస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో అమలు అనంతరం నెలకొక జిల్లా చొప్పున అన్ని జిల్లాల్లో అమలు చేస్తారు. – జనవరి నుంచి అన్ని జిల్లాల్లో 1200 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందిస్తారు. – డెంగీతో పాటు మరికొన్ని సీజనల్ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతించారు. – డిసెంబర్ 21న రాష్ట్రంలో అందరికీ కొత్త హెల్త్‌కార్డులు (ఆరోగ్యశ్రీ) అందుబాటులోకి వస్తాయి. ఈ కార్డులో బాధితుడికి సంబంధించిన పూర్తి డేటా నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడు ఏ జబ్బుతో ఆస్పత్రికి వెళ్లినా గతంలో వచ్చిన జబ్బుల గురించి తెలుసుకోవచ్చు. – పాడేరు, విజయనగరం, మార్కాపురం, ఏలూరు, పులివెందుల, గురజాల, మచిలీపట్నంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికలు ఇప్పటికే తయారు చేస్తున్నారు. – రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల నోటిఫికేషన్లో భాగంగా ఇప్పటికే 13,500కు పైగా ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేశారు. బోధనాసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. – రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు. దీనికోసం ఇప్పటికే 500 రకాల మందులతో అధికారులు జాబితా తయారు చేశారు. – బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాంటీన్ల ఏర్పాటు. – ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి వస్తే వారికి వైద్యం నిరాకరించకూడదు. డబ్బుల్లేవని వారిని వెనక్కు పంపకూడదు. ప్రభుత్వమే దీనికి రూ.50 వేల వరకూ భరిస్తుంది. – ఇప్పటి వరకు ‘వైఎస్సార్ కంటివెలుగు’ పథకంలో భాగంగా 65 లక్షల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4.8 లక్షల మంది విద్యార్థులకు కంటి చూపు సమస్యలున్నట్టు గుర్తించారు. వాళ్లందరికీ ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. త్వరలోనే కాలేజీ విద్యార్థులకు, మిగతా వారికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. – ఆరోగ్యశ్రీలో డబుల్ కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను చేర్చాలని సీఎం ఆదేశించారు. – నియోజక వర్గానికి ఒకటి చొప్పున 175 ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆరు సూత్రాలతో ఆరోగ్యాంధ్రప్రదేశ్
-
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆరోగ్యశ్రీ పథకం కింద నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని 150 ఆస్పత్రుల్లో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలు పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ వంటి కీలక అంశాలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. అనారోగ్యంతో ఉన్నవారికి పెన్షన్లు.. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందుల్ని ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్ర వ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెల పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతానికి మార్గదర్శక ప్రణాళికను సీఎం జగన్ సూచించారు. డిసెంబర్ 1 నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునేంత వరకూ నెలకు రూ. 5వేలు లేదా రోజుకు రూ. 225 ఆర్థిక సహాయం అందించాలని.. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేల ఆర్థికం సాయం వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రూ. 5వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆస్పత్రుల్లో మందులకు కొరత లేకుండా, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మందులు దొరకడం లేదన్న ఫిర్యాదు ఎక్కడా రాకూడదని స్పష్టం చేశారు. హెల్త్ సబ్సెంటర్లలో అభివృద్ది కార్యక్రమాలు కూడా వచ్చే మే నెల నుంచి ప్రారంభమవ్వాలని, ఆరోగ్యశ్రీలో డబుల్ కాంక్లియర్ ఇంప్లాంట్‌ను చేర్చాలని సీఎం జగన్ వెల్లడించారు. డిసెంబర్ 21న ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థులకు వర్తింప చేయాలని, నెలరోజుల్లో వారికి కూడా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పాఠశాల విద్యార్ధుల నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టనున్నట్టు చెప్పారు. ‘పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికి.. రెండు కాళ్లు లేక చేతులు లేని లేదా పనిచేయని స్థితిలో ఉన్నవారికి.. కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నవారికి రూ.5వేల పెన్షన్ వర్తింపు చేయాలి. వీరికి జనవరి 1 నుంచి ఈ పెన్షన్ అమలు చేయాలి. డెంగీ, సీజనల్ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలి. గిరిజన ప్రాంతాల్లో బైకుల ద్వారా వైద్యసేవలను మారుమూల ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని కమ్యూనిటీ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల అభివృద్ది కార్యక్రమాలు వచ్చే డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 నాటికి పూర్తి చేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని సీఎం ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారు ఆస్పత్రికి వస్తే డబ్బుకోసం వేచి చూడాల్సిన అవసరం లేదనే రీతిలో తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నుంచే కొంత మొత్తాన్ని దీనికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి విధివిధానాలు ఖరారు చేయాలని, త్వరలోనే ఓ కార్యక్రమాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచించారు. -
నిబంధనలు పాటించాల్సిందే..
సాక్షి, విజయనగరం : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పోరేట్ వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం గుర్తింపు ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులు కూడా నిబంధనలకు అనుగుణంగా రోగులకు వైద్య సేవలు అందించాలి. రోగులకు మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలి. కాని కొన్ని ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ అధికారులు నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కొరడా ఝళిపించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భోజనం సక్రమంగా లేని ఐదు ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు. కల్పించాల్సిన సౌకర్యాలు.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స లేదా శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు వైద్య పరీక్షలు, ఈసీజీ, స్కానింగ్, ఎక్సరే, తదితర అన్ని సేవ లు ఉచితంగా అందించాలి. ఆరోగ్యశ్రీ రోగులు చికిత్స పొందే ఇన్‌పేషేంట్ వార్డు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. బెడ్స్, బెడ్‌షీట్స్ పరిశుభ్రంగా ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మంచి భోజనం అందించాలి. ఆకుకూరలు, ప ప్పు, పండు, పెరుగు, గుడ్డు, అన్నం, సాంబారుతో కూడిన మంచి భోజనాన్ని రోగులకు పె ట్టాలి. ఒక వేళ సంబంధిత ఆస్పత్రిలో స్కా నింగ్ లేదా ఎక్సరే, బయాప్సీ వంటి పరీక్షలు బయట స్కానింగ్ సెంటర్లో చేయించినట్లైతే తక్షణమే వాటి బిల్లులు రోగికి చెల్లించాలి. 29 ఆస్పత్రులు.. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం గుర్తింపు ఉన్న ఆస్పత్రులు 29 ఉన్నాయి. వీటిల్లో 15 ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని ఆరోగ్యశ్రీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా భోజనం కూడా చాలా ఆస్పత్రుల్లో నాణ్యంగా లేదని ఆరోగ్యశ్రీ అధికారులు గుర్తించారు. దీంతో ఐదు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు. పారిశుద్ధ్యం, భోజనం సక్రమంగా లేని మూడు ఆస్పత్రులకు, భోజనం సక్రమంగా లేదని మరో రెండు ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు పుష్పగిరి కంటి ఆస్పత్రి, కొలపర్తి ఆస్పత్రి (ఎస్.కోట), మిమ్స్ ఆస్పత్రి ( నెల్లిమర్ల), తిరుమల నర్సింగ్ హోమ్, ఆంధ్ర ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, వెంకటరామ ఆస్పత్రి, శ్రీ సాయి సూపర్ స్పెషాలటీ, శ్రీ సాయి పీవీఆర్ ఆస్పత్రి, మువ్వ గోపాల ఆస్పత్రి, అభినవ్ నర్సింగ్ హోమ్ (ఎస్.కోట), వరుణ్ డెంటల్ ఆస్పత్రి, ఆపిల్ డెంటల్ ఆస్పత్రి, విజయ డెంటల్ ఆస్పత్రి, బీఎస్ఆర్ ఈఎన్టీ డెంటల్ ఆస్పత్రి, స్వామి కంటి ఆస్పత్రి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వాస్పత్రులు కేంద్రాస్పత్రి, ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రి, నెల్లిమర్ల, బొబ్బిలి, భోగాపురం, చీపురుపల్లి, సాలురు, కురుపాం, భద్రగిరి సీహెచ్‌సీలతో పాటు చినమేరంగి, బాడండి ఆస్పత్రులున్నాయి. చర్యలు తప్పవు.. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. రోగులకు నాణ్యమైన భోజనం పెట్టాలి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని ఐదు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశాం. – డాక్టర్ పి. ప్రియాంక, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్. -
కుల మత రాజాకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ పథాకాలు
-
ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కోసం రూ. 12 వేల కోట్లు
సాక్షి, కాకినాడ: ప్రతి పేదకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.12 వేల కోట్లు కేటాయించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. శుక్రవారం కాకినాడలోని జెడ్పీ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపచేసేందుకు వీలుగా హెల్త్ కార్డులు అందిస్తున్నామన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. ఏవైనా లోపాలుంటే గుర్తించిన అనంతరం అన్ని జిల్లాల్లోనూ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, ఒక 104 వాహనం చొప్పున అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. సెప్టెంబర్ నాటికి 676 కొత్తగా 108 వాహనాలను, 773 కొత్త 104 వాహనాలను కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. కండిషన్లో లేని వాహనాలను పూర్తిగా తొలగిస్తామన్నారు. మరో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలో డయాలసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని, ఇప్పటికే 32 మంది డయాలసిస్ బాధితులు ఉన్నట్టు అధికారులు గుర్తించారని చెప్పారు. వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్ల వాపు వ్యాధితో అనేక మంది గిరిజనులు మరణిస్తున్నారన్నారు. ఆ వ్యాధి ఎందుకు వస్తున్నదో గుర్తించేందుకు ఓ కమిటీ వేసి నిర్ధారించాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ అమలాపురం ఏరియా ఆస్పత్రికి 10 మంది నర్సులను, డాక్టర్లను నియమించాలని కోరారు. రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన బిడ్డ బతుకుతుందో లేదోనన్న ఆందోళనలో గర్భిణులు ఉన్నారని కన్నీరు పెట్టుకున్నారు. కాళ్ల వాపు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద చెన్నై, బెంగళూరు, ముంబయ్ తదితర ప్రాంతాల్లోని 150 సూపర్ స్పెషాలటీ ఆస్పత్రుల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతతో తీవ్ర ఇబ్బందులు
తలకొండపల్లి మండలానికి చెందిన మల్లయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో కుటుంబీకులు మంగళవారం నగర శివారులోని ఓ ప్రైవేటు (నెట్వర్క్) ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆరోగ్యశ్రీ కార్డు సహాయంతో సదరు ఆస్పత్రికి వెళ్లిన మల్లయ్యకు.. చికిత్స చేసేందుకు ఆస్పత్రి వర్గాలు తిరస్కరించాయి. ఇదేమని అడగగా.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, అందుకే సేవలు నిలిపివేశామని తేల్చిచెప్పారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఎలాగైనా ఆదుకోవాలని కుటుంబీకులు బతిమాలినా ఆస్పత్రి యాజమాన్యం మెట్టు దిగలేదు. సుమారు అరగంటపాటు అక్కడే ఉన్నా కనికరించలేదు. దీంతో చేసేది లేక హుటాహుటిన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇది మల్లయ్య ఒక్కడికే ఎదురైన అనుభవం కాదు.. ఇలాంటి రోగులు చాలామంది నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు వైద్య సేవలు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. తమ వద్ద డబ్బులు లేకున్నా కార్పొరేట్ వైద్యం అందుతుందన్న నమ్మకంతో ఆస్పత్రుల మెట్లెక్కుతున్న రోగుల గుండె బరువెక్కుతోంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యసేవలను నిలిపివేశామని తేల్చిచెబుతుండడంతో రోగులకు రోదనే దిక్కవుతోంది. అలాగే, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్ఎస్) కింద చికిత్స పొందాలనుకుంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. ఇటు ప్రభుత్వ వైఖరి.. అటు బకాయిల విడుదలపై ప్రైవేటు ఆస్పత్రుల పట్టు విడువని ధోరణి.. ఫలితంగా రోగులు సమిధలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు రోజులుగా ఆస్పత్రులు ఆందోళనపథంలో ఉండడంతో.. బాధితుల దుస్థితి వర్ణణాతీతంగా మారింది. బకాయిలు రూ.317 కోట్లు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు పేరుకుపోవడంతో పేదలతోపాటు ఉద్యోగులు, పాత్రికేయులకు అందించే వైద్య సేవలను ప్రైవేటు ఆస్పత్రులకు నిలిపివేశాయి. కొన్ని ఏళ్లుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆందోళన బాటపట్టాయి. మరోవైపు త్వరలో నిధులు వస్తాయని సేవలు కొనసాగించాలని ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం కోరుతున్నా మెట్టుదిగడం లేదు. బకాయిలు విడుదల చేస్తారని ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంటోంది. వందల కోట్ల రూపాయలు అందకపోవడంతో తమకు ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు విడుదల చేస్తేనేగాని సేవలను పునరుద్ధరించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో చోటుచేసుకుంటున్న జాప్యంపై మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 550 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. వీటిలో 79 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ , ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆరు మెడికల్ కాలేజీలు ఉండగా.. వీటిలో మాత్రమే ఆరోగ్యశ్రీ , ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కింద సేవలు రోగులకు అందుతున్నాయి. మిగిలిన ఆస్పత్రులు ఆందోళన పథాన్ని పట్టాయి. ఈ ఆస్పత్రులకు సుమారు రూ. 317 కోట్లను ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. దాదాపుగా రెండు మూడేళ్లుగా సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో సేవల నిలిపివేతే శరణ్యమని భావించిన ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన వస్తే తప్పా సమ్మె విరమించబోమంటున్నారు. ‘సేవల బంద్’ బోర్డులు బకాయిలు పేరుకుపోవడంతో వైద్యసేవలు అందించలేమని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బోర్డులు పెడుతున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు బహిర్గతంగా బోర్డులు ఏర్పాటు చేయకున్నా.. సేవలకు దూరంగా ఉంటున్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వెళ్తున్న రోగులను యాజమాన్యాలు తిప్పి పంపిస్తున్నారు. కాళ్లావేళ్లా పడి ప్రాదేయపడినా కనికరించడం లేదు. ఆరోగ్యశ్రీ ఉందని చేతుల్లో డబ్బులు లేకున్నా కొండంత ధైర్యంతో ఆస్పత్రుల బాట పడుతున్న రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ తదితర వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారి పరిస్థితి వర్ణనాతీతం. ఇక రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు, ఇతర అత్యవసర అనారోగ్య సమస్యలు వారు కచ్చితంగా డబ్బులు పెట్టుకుని వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రులు సేవలను నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలించడం లేదు. పెండింగ్‌లో ఉన్న నిధులన్నింటినీ విడుదల చేస్తేనే సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లో సేవలు..కొన్ని ఆస్పత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలను నిలిపివేశాయి. ఇలా ఇబ్బంది పడుతున్న రోగులను మెడికల్ కాలేజీలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. ధర్నా కొనసాగిస్తున్న ఆస్పత్రుల వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాం. ఏయే ఆస్పత్రులు.. రోజువారీగా ఎంతమందికి వైద్యం అందిస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాం. – డాక్టర్ రఘునాథ్ రెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త -
ఆరోగ్యశ్రీ ఆగింది
ప్రభుత్వ వాదన... ఇప్పటివరకు రూ. 450 కోట్ల బకాయిలు చెల్లించాం మిగిలిన బకాయిలు రూ. 600 కోట్లే వచ్చే నెలలో రూ. 200 కోట్లు చెల్లిస్తాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సమ్మెలో లేవు బంద్ ప్రభావం పెద్దగా లేదు ఆసుపత్రుల మాట... బకాయిలు రూ. 1,500 కోట్లు ఇప్పటివరకు 15–20 శాతం బకాయిలే అందాయి ప్యాకేజీ సొమ్ము పెంచాలి ప్రభుత్వంతో చర్చల్లో స్పష్టత రాలేదు నేడు, రేపు కూడా ప్రభుత్వంతో చర్చిస్తాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిల చెల్లింపుపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆçస్పత్రులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బంద్ యథావిధిగా కొనసాగుతుందని ప్రైవేటు నెట్వర్క్ ఆçస్పత్రులు స్పష్టం చేశాయి. అయితే కార్పొరేట్ ఆçస్ప త్రులు మాత్రం సమ్మెలో పాల్గొనడం లేదని ప్రభు త్వం తెలిపింది. ఇతర నెట్వర్క్ ఆçస్పత్రులు కూడా సేవలు నిలిపివేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలంటూ ప్రైవేటు నెట్వర్క్ ఆçస్పత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) రోగులకు వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఆయా ఆశాఖ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ భవన్లో చర్చలు జరిపారు. తెలంగాణ నెట్వర్క్ ఆçస్పత్రుల సంఘం, సూపర్ స్పెషాలిటీ ఆçస్పత్రుల సంఘం తో వేర్వేరుగా చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు తాము రూ. 450 కోట్ల మేరకు బకాయిలు చెల్లించామని, మరో రూ. 600 కోట్ల బకాయిలే ఉన్నాయని స్ప ష్టం చేశారు. వివిధ దశల్లో ఉన్న బిల్లులను కూడా బకాయిలుగా ఆస్పత్రులు చెబుతున్నాయన్నారు. ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకూడదన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, మానవీయ కోణంలో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతా... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ప్యాకేజీ సొమ్ము పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వానికి ప్రాధాన్యం కలిగిన అంశమన్నారు. ఆసుపత్రుల కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంలో సవరణలు చేయాలని కోరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఆ మేరకు తాము అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ రోగులకు, ఈహెచ్ఎస్ రోగులకు కూడా సేవలు అందడంలేదని మంత్రి దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా అటువంటి పరిస్థితి లేదన్నారు. ఎక్కడన్నా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. 240 ఆస్పత్రుల్లో సేవలు బంద్ మొదటి రోజు 240 ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు నిలిపివేసినట్లు తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం నేత డాక్టర్ రాకేశ్ వెల్లడించారు. చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమకు ఎటువంటి స్పష్టత రాలేదని, అందువల్ల యథావిధిగా సేవల నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు. తాము రూ. 1,500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబితే, ప్రభుత్వం మాత్రం రూ. 800 కోట్లే ఉన్నా యంటోందన్నారు. దీనిపై మరోసారి ప్రభుత్వం తో చర్చలు జరుపుతామన్నారు. ఇటీవల రూ. 300 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తెలిపిందని, కానీ ఆయా ఆస్పత్రులకు ఆ మేరకు సొమ్ము వచ్చి న పరిస్థితి కనిపించడంలేదన్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సందర్భంగా రూ. 200 కోట్లు చెల్లిస్తామని చర్చల్లో మంత్రి ఈటల పేర్కొన్నారని, అయినా బకాయిలు ఇంకా ఉంటాయన్నారు. శని, ఆదివారాల్లోనూ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరుపుతామన్నారు. కాగా, చర్చల సందర్భంగా ఒక కీలకాధికారి ఆరోగ్యశ్రీ ఆçస్పత్రులు తమ సొమ్ము తోనే బతుకుతున్నాయనంటూ చేసిన వ్యాఖ్యలపై ఆస్పత్రుల యాజమాన్యాలు మండిపడ్డాయి. -
జిల్లా నుంచే ‘ఆరోగ్యశ్రీ’కారం
సాక్షి, పశ్చిమగోదావరి : ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లా ఎంపికైంది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సొంత జిల్లా నుంచి ఈ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. 2020 జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేయనున్నారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మూడు నెలలపాటు పథకం అమలును అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత దీనిని క్రమంగా అన్ని జిల్లాలకు వర్తింపు చేస్తారు. కాగా ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితా తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ జాబితాలో ఇప్పుడున్న వ్యాధుల సంఖ్య రెట్టింపు కానుంది. 2వేలకుపైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే వెసలుబాటు కలుగనున్నట్లు సమాచారం. అర్హులైన ప్రతి కుటుంబానికీ హెల్త్ కార్డు, క్యూఆర్ కోడ్‌తో కార్డుల జారీ చేయనున్నారు. కార్డు స్కాన్ చేయగానే ఆ కార్డుదారునికి ఓటీపీ నంబర్ వస్తుంది. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. అదే విధంగా 104 వాహనాల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా ఎవరైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది వైద్యులకు సులభంగా తెలిసే అవకాశం ఉంటుంది. వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ గోప్యంగా ఉంచుతారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు రూపొందించనున్నారు. డిసెంబర్ 21 నుంచి కార్డుల జారీ ప్రారంభం అవుతుంది. అదే విధంగా నవంబర్ మొదటివారం నుంచి రాష్ట్రం వెలుపల హైదరా బాద్, బెంగళూరు, చెన్నైల్లోని సుమారు 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. -
ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు ఇవ్వాలని, క్యూ ఆర్ కోడ్‌తో వీటిని జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయన్నారు. కార్డు స్కాన్ చేయగానే సంబంధిత కార్డుదారుడికి ఓటీపీ నెంబర్ వచ్చేలా ఉండాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 104, 108 వాహనాలు కొత్తవి కొనుగోలు చేయాలని, సెప్టెంబర్ చివరికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం సూచనలు చేశారు. వైద్య చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 2020 జనవరి 1 నుంచి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆదేశించారు. పథకాన్ని మూడు నెలలపాటు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం చేసిన తర్వాత క్రమంగా అన్ని జిల్లాలకు వర్తింప చేస్తామని వివరించారు. సదుపాయాలను బట్టి ఆస్పత్రుల కేటగిరీలు ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకునే నెట్వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. థర్డ్ పార్టీతో ఆస్పత్రులను తనిఖీలు చేయిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. నాణ్యమైన వసతులు, సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులను ‘ఏ ప్లస్’, ‘ఏ’ కేటగిరీలో చేర్చాలని, నామమాత్రంగా ఉన్నవాటిని ‘బి’ కేటగిరీలో ఉంచి మెరుగైన వసతులు కల్పించేందుకు గడువు ఇవ్వాలని సీఎం సూచించారు. మళ్లీ తనిఖీలు చేసినప్పుడు లోపాలుంటే నెట్వర్క్ జాబితా నుంచి తొలగించాలని, ప్రమాణాలు, సౌకర్యాలు లేని ఆస్పత్రులను ‘సి’ కేటగిరీలో చేర్చి వాటిని జాబితా నుంచి పూర్తిగా లేకుండా చేయాలన్నారు. ఏపీ వెలుపల 150 ఆస్పత్రుల్లో.. కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సుమారు 150 ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఈ ఆస్పత్రుల సేవలను నవంబర్ మొదటి వారం నుంచి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి చర్యలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ‘ఏ ప్లస్’ కేటగిరీలోకి తీసుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఆస్పత్రుల్లో ఫొటోలు తీసి చేపట్టాల్సిన పనులను ప్రాధాన్య క్రమంలో నిర్ణయించాలన్నారు. మందులు, రక్తపరీక్షల కోసం ఎవరూ ఆస్పత్రినుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదని సీఎం ఆదేశించారు. పరికరాల నిర్వహణ టెండరులో ఒక షరతుగా ఉండాలని, దీనివల్ల ప్రతి ఆస్పత్రిలో పరికరాలు సక్రమంగా పని చేస్తాయన్నారు. 2021 సెప్టెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైఎస్సార్ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 5 క్యాన్సర్ ఆస్పత్రులు రాష్ట్రంలో పూర్తి సదుపాయాలతో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులను కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్లు, కళ్లద్దాలు అవసరమైన వారిని గుర్తించి వైద్యసేవలు అందించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా తదితరులు ఉన్నారు. సీఎంను కలసిన నిపుణుల కమిటీ వైద్య శాఖలో సంస్కరణలపై నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. కమిటీ చైర్పర్సన్ సుజాతారావు ఆధ్వర్యంలోని ఈ కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి పలు అంశాలను తెచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి, రోగులకు అందుతున్న సేవలు, పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్) అమలుపై వివరించింది. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను పకడ్బందీగా అమలు చేయటంపై నివేదించింది. సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ తెలిపింది. పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నాం పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. కొత్తగా 3 మెడికల్ కాలేజీలు, పేద రోగులకు అండగా ఉండేందుకు 5 క్యాన్సర్ ఆస్పత్రులు, 2 కిడ్నీ ఆస్పత్రుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులను, 108, 104 సర్వీసులను మెరుగు పరుస్తున్నామని తెలిపారు. – డిసెంబర్ 21 నుంచి రాష్ట్రంలో హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ – క్యూ ఆర్ కోడ్‌తో ప్రతి కుటుంబానికి కార్డు జారీ – చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి – పశ్చిమ గోదావరి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా జనవరి 1 నుంచి ప్రారంభం – క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరణ – మెరుగైన సదుపాయాలు కల్పించే ఆస్పత్రులు ‘ఏ ప్లస్’, ‘ఏ’ కేటగిరీలోకి – ఏపీ వెలుపల 150 ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపు – హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో నవంబర్ నుంచి మొదలు – అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు -
కార్డుల కొర్రీ.. వైద్యం వర్రీ
హైదరాబాద్‌కు చెందిన సావిత్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించింది. ఆమె వద్ద తెల్ల రేషన్‌కార్డు ఉండటంతో దాని కింద వైద్యం పొందొచ్చని భావించింది. కానీ తెల్ల రేషన్‌కార్డుతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలని కార్పొరేట్ ఆసుపత్రి వర్గాలు చెప్పేశాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి ఆరోగ్యశ్రీ కార్డుంది. కానీ ఆహారభద్రత కార్డు లేకపోవడంతో కేవలం ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యం చేయలేమని ఓ ప్రైవేటు ఆసుపత్రివర్గాలు చెప్పడంతో 3 లక్షలు పోసి వైద్యం చేయించుకున్నాడు. సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా.. కొన్ని ఆసుపత్రుల తీరుతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుల్లో ఏదో ఒక కార్డు ఉన్నప్పటికీ ఉచిత వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలంటే అటు ఆరోగ్యశ్రీ కార్డుతోపాటు ఇటు ఆహార భద్రత కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో ఉచిత వైద్యం చేయించుకోవాలనే పేదలకు ఆరోగ్యశ్రీ అక్కరకు రాకుండా పోతోంది. ఈ విషయంపై ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోగ్యశ్రీ కార్డులున్న కుటుంబాలు, ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలను ఒకసారి పరిశీలించి ఉమ్మడిగా మరో కార్డు ఇవ్వాలని గతంలో ట్రస్టు భావించినట్టు తెలిసింది. కానీ తర్వాత ఆ ఆలోచనను ఉపసంహరిం చుకుంది. అయినా ప్రైవేటు ఆస్పత్రులు 2 కార్డులూ ఉండాల్సిందేనని కొర్రీలు పెడుతున్నాయి. ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయి పడినందున ఈ నెల 16 నుంచి సమ్మెకు వెళ్లాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలోనే ఆసుపత్రులు 2 కార్డులు కావాలని కొర్రీలు పెడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచితానికి లక్షలాది మంది దూరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆ పథకం ఇప్పటివరకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది. ప్రస్తుతం తెలంగాణలో 330 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 77.19 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉండగా.. 87.89 లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులున్నాయి. అంటే 10.70 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నప్పటికీ, ఆహార భద్రత కార్డులు లేవు. ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పడంలేదు. పౌరసరఫరాల లెక్కల ప్రకారం ఒక్కో కుటుంబం కింద సరాసరి 3.20 మంది సభ్యులున్నారు. అంటే ఆహార భద్రత కార్డులు లేని కారణంగా దాదాపు 34 లక్షల మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వైద్య సేవలు అందడంలేదు. అయితే, ఏ ఒక్క కార్డు ఉన్నా వైద్యం చేయడానికి అంగీకరించాలని తాము స్పష్టంచేసినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు కార్డులకూ లింక్ పెట్టాలని అనుకున్నా.. తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నామని తెలిపాయి. సీఎం కార్యాలయ లెటరే దిక్కు... ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుల్లో ఏదో ఒకటి మాత్రమే ఉన్న పేదలకు ఉచిత వైద్యం అందాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా లేఖలు తీసుకోవాల్సిందే. ఈ లేఖలు ఇవ్వడం కోసం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. తొలుత ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలనే పేదలు తమ వద్దనున్న కార్డును ఆసుపత్రికి చూపించాలి. ఆసుపత్రి వర్గాలు రోగం, అందుకయ్యే వ్యయం వివరాలతో కూడిన లెటర్ ఇస్తాయి. ఆ లేఖను తీసుకెళ్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇవ్వాలి. వారు దాన్ని పరిశీలించిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి అనుమతి ఇస్తున్నారు. ఇదంతా పెద్ద ప్రహసనంగా ఉండటంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి ఆయా ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని పలువురు కోరుతున్నారు. 330 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు 77 : ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న కుటుంబాలు 88 : ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలు 11 : ఆరోగ్యశ్రీ కార్డున్నాఆహార భద్రత కార్డు లేని కుటుంబాలు -
ఆరోగ్యశ్రీ నుంచి 50 వ్యాధులు ఔట్!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ జాబితా నుంచి దాదాపు 50 రకాల వ్యాధులను తొలగించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా వ్యాధులు జాబితాలో ఉన్నా పెద్దగా రోగులు రాకపోవడంతో తొలగించడమే సమంజసమని భావిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యశ్రీపై సుదీర్ఘ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఈ మేరకు ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. తొలగించిన వాటి స్థానంలో మరికొన్ని కొత్త వ్యాధులను చేర్చాలని పేర్కొన్నట్టు సమాచారం. కొన్ని రకాల వ్యాధులకు రోగులు వస్తున్నా, అవి ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తావనకు వచ్చింది. అయితే వ్యాధుల తొలగింపు, చేర్పుల విషయంలో తొందరపడకుండా ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించి అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాతే ఏ వ్యాధులను తొలగించాలి? వేటిని చేర్చాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి పేర్కొన్నట్లు సమాచారం. 200 నుంచి 300 వ్యాధులకు కేసులు నిల్.. కొన్ని రకాల వ్యాధులు జాబితాలో ఉన్నా నాలుగైదు ఏళ్లుగా వాటికి పేద రోగులు పెద్దగా రావడంలేదని ఆరోగ్యశ్రీ వర్గాలు అంటున్నాయి. చర్మవ్యాధులకు సంబంధించి చికిత్స చేయించుకోవడానికి ఎవరూ రావడంలేదు. ఇక ఎండోక్రినాలజీ, కాక్లియర్ ఇంఫ్లాంట్ సర్జరీ, రుమటాలజీ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్ వంటి కేసుల్లో చాలా తక్కువగా వస్తున్నాయి. వీటిలో కొన్ని రకాల వ్యాధులకు అసలు కేసులే రావడంలేదు. రాష్ట్రంలో 29 రకాలకు చెందిన 949 వ్యాధులు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉండగా.. వాటిలో దాదాపు 200 నుంచి 300 వ్యాధులకు పెద్దగా రోగులు రావడంలేదనేది ఆరోగ్యశ్రీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో కొన్నింటిని ఉంచినా, 50 రకాల వ్యాధులు ఏమాత్రం అవసరం లేదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. అలాంటివాటిని లెక్క కోసం ఉంచే బదులు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వాటిని గుర్తించి, పేదలకు ఉపయోగపడేవాటిని జాబితాలో చేర్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు గుండె, లివర్ మార్పిడి చేయించుకున్న రోగులకు జీవితాంతం ఉచిత మందులు ఇవ్వాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి మాత్రమే జీవితాంతం ఉచిత మందులు ఇస్తున్నారు. -
రోల్‌మోడల్‌గా ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. బిల్లు వెయ్యి రూపాయలు దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తేవాలని సీఎం హామీ ఇచ్చినందున ఈ పథకం రూపకల్పనకు అనుకరించాల్సిన నమూనాలు దేశంలో ఎక్కడా లేవని.. ఏ దేశంలోనూ ఇలాంటి పథకాల్లేనందున మనమే అన్ని వ్యూహాలు సిద్ధంచేసుకుని ఈ దీనిని ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలవాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీకి అధ్యక్షురాలైన సుజాతారావు నేతృత్వంలో గురువారం ఈ అంశంపై సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రైవేటు ఆస్పత్రులు, నిపుణులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధుల అభిప్రాయాలను సమావేశంలో తీసుకున్నారు. వెయ్యి రూపాయలు బిల్లు దాటిన కేసులన్నీ పథకంలో చేర్చాలంటే ముందుగా రెండు రెవెన్యూ డివిజన్లలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తే బావుంటుందని నిర్ణయించారు. ఏ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టును అమలుచేయాలో నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాది స్తామన్నారు. దీనికోసం ఒక సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని కూడా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు పరిధిలోని ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) మినహా వివిధ వర్గాలకు వర్తించే వైద్య బీమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న దానిపై సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీంలో రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు చేసిన సూచనను కమిటీ ఆమోదించింది. తొందరపాటు వద్దు.. ఇదిలా ఉంటే.. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆదరాబాదరాగా కాకుండా అన్ని కోణాల్లోనూ ఆలోచించి పకడ్బందీగా అమలుచేయాలని.. ఒకసారి ప్రారంభమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదన్న ముందుచూపుతో అడుగులు వేయాలని అధికారులకు సుజాతారావు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన మేరకు తాము ప్రభుత్వానికి సహకరించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని, ఇది మంచి కార్యక్రమం కాబట్టి కలిసి పనిచేస్తామని ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (అప్నా), ఏపీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న ఆసుపత్రుల్ని కూడా నెట్వర్క్ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకురావాలని అప్నా ప్రెసిడెంట్ డాక్టర్ శివప్రసాద్ సూచించారు. అలాగే, కేరళకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజీవ్ సదానందన్ మాట్లాడుతూ.. గతంలోని రాజీవ్ ఆరోగ్యశ్రీలో నిర్దేశిత రోగాలకే చికిత్స ఉండేదని.. ప్రస్తుత వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో అలా లేకపోవడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులు వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు, ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఉచిత వైద్యం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా పథకం వర్తింపు.. ఆపరేషన్ లేదా జబ్బుచేసిన వ్యక్తికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం.. రెండేళ్లలోగా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్ని తీర్చిదిద్దడం వంటి అంశాలపై కూడా నిపుణుల కమిటీ చర్చించింది. ప్రతి చిన్నదానికీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆసుపత్రులకు వెళ్లకుండా కొన్ని స్పెషలిస్ట్ చికిత్సల కోసమే వెళ్లేలా మార్గదర్శకాలను తీసుకొస్తే బాగుంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పీహెచ్‌సీలను బలోపేతం చేస్తే తప్ప భవిష్యత్తులో ఆశించిన మేర సేవలందించలేరని పలువురు సభ్యులు వివరించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, చెన్నై ఐఐటికి చెందిన ప్రొ.విఆర్ మురళీధరన్, హెల్త్ ఎకనమిస్ట్ డాక్టర్ శంకర్ ప్రింజా, సీఎంఓ స్పెషల్ ఆఫీసర్ (ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్) డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ కోసం బడ్జెట్లో రూ.1740 కోట్లు ప్రతిపాదన
-
వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి భారీ కేటాయింపులు
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్లో రూ.11,399 కోట్లు కేటాయించారు. దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అన్నారు. 108 అంబులెన్స్‌లకు రూ.143 కోట్లు కేటాయించారు. వైద్యరంగానికి చేయూత.. ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.1500 కోట్లు ఆశావర్కర్లకు పెంచిన రూ.10 వేల వేతనానికి రూ.455 కోట్లు మెడికల్ భవనాలకు రూ.68 కోట్లు వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాలకు రూ.66 కోట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల-గురజాలకు రూ.66 కోట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల-విజయనగరంకు రూ.66 కోట్లు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ. 50 కోట్లు రాష్ట్ర కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు రూ.43 కోట్లు -
ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన దిశగా అడుగు ముందుకు పడింది. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శాఖపై ఆయన ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్య శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన మందులు అందజేయాలని చెప్పారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఈ పథకం కింద దేశంలో ఎక్కడైనా వైద్య సేవలు పొందవచ్చు. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ‘108’, ‘104’ అంబులెన్స్ సేవలను మరింతగా అభివృద్ధి చేయాలని సీఏం సూచించారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి, ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. హాస్పిటళ్లలో సరిపడా సిబ్బందిని నియమించాలని చెప్పారు. బాగా పేరున్న డాక్టర్లను జిల్లాల్లో నియమించాలని, వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మందుల సరఫరా వ్యవస్థ లోపభూయిష్టం ప్రస్తుతం రాష్ట్రంలో మందుల కొనుగోలు, సరఫరా వ్యవస్థ అత్యంత లోపభూయిష్టంగా ఉందని నిపుణుల కమిటీ సభ్యుడు డా.దుట్టా రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న టెండరింగ్ విధానాలు పారదర్శకంగా లేవని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కమిటీలో సభ్యులైన డా.చంద్రశేఖర్‌రెడ్డి, డా.సాంబశివారెడ్డిలు కూడా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి, డీఎంఈ డా.కె.బాబ్జీ, ఆరోగ్యశ్రీ ఇన్చార్జి సీఈఓ డా.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాల పర్యటనకు వెళ్లాలి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలోని సభ్యులు బృందాలుగా ఏర్పడాలని, ఒక్కో బృందం మూడు జిల్లాల్లో పర్యటించాలని కమిటీ చైర్పర్సన్ సుజాతారావు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులతో పాటు నర్సులు, ఏఎన్ఎంలు, డాక్టర్లతో మాట్లాడాలని, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతోనూ చర్చించి, వారి సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పారు. ఆగస్ట్ 20న ముఖ్యమంత్రికి నివేదిక! వచ్చే నెల 3వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు సమావేశం కావాలని నిపుణుల కమిటీ సభ్యులు నిర్ణయించారు. జులై 20న ముఖ్యమంత్రిని సంప్రదించి, ఆయన సూచనల మేరకు ముందుకెళ్లాలని తీర్మానించారు. ఆగస్ట్ 20వ తేదీలోగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తమ నివేదిక అందజేయాలని భావిస్తున్నారు. నిపుణులు కమిటీ తొలి భేటీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖలో సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇటీవల నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ చైర్పర్సన్ సుజాతారావు ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో కమిటీ తొలిసారి సమావేశమైంది. వివిధ కీలక అంశాలపై చర్చించారు. ఇకపై 20 పడకల ఆసుపత్రులనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని పలువురు సభ్యులు సూచించారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఆ పైస్థాయి ఆస్పత్రులన్నీ 24 గంటలూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రతి మండలానికి ఒక ‘108’ వాహనం, ఒక ‘104’ వాహనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాత వాహనాలు పనిచేయకపోతే కొత్తవి సమకూర్చుకోవాలని సభ్యులు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఒక మోడల్‌గా ఉండాలని కమిటీ సభ్యులు చెప్పారు. ఇలాంటి సమూల మార్పులు రెండేళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుందని చర్చించారు. ఈ సమావేశంలో వైద్యవిద్యా సంచాలకులు, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ మండలి తదితర విభాగాల అధికారులు తమ నివేదికలను సమర్పించారు. ఆరోగ్య సేవల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి నిపుణుల కమిటీకి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ఆరోగ్యసేవల విషయంలో దేశానికి మోడల్‌గా రాష్ట్రం ఉండాలని, దీనికోసం కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యసేవల్లో సంస్కరణల కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యింది. సుమారు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు అంశాలపై కమిటీ సభ్యులకు రాష్ట్రంలో ఆరోగ్యసేవలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే ఆరోగ్యశ్రీని పూర్తిగా సమీక్షించాలని, రోగి వైద్యానికి రూ. 1,000 బిల్లు దాటితే ఆ రోగికి వైద్యం ఉచితంగా అందేలా ఆరోగ్యశ్రీలో చేర్చాలని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ అందడం లేదన్న వ్యాఖ్యలు వినిపించకూడదని స్పష్టం చేశారు. ఎంత పెద్ద జబ్బు చేసినా పేదలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మండలానికొక 104 వాహనాన్ని ఏర్పాటు చేసి, పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మందులు అందజేయాలని సూచించారు. అలాగే 108 అంబులెన్సులు కొత్తవి కొనుగోలు చేసి బాధితుడు ఫోన్ చేసిన 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంబులెన్సుల కొనుగోలుకు ఈ బడ్జెట్లోనే నిధులిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 104, 108, ఆరోగ్యశ్రీ పథకాల్లోని ప్రస్తుత పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్నారు, బాధితులకు సత్వరమే సేవలందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నియమించిన ఈ నిపుణుల కమిటీ పని సిఫార్సులు చేయడం వరకే కాదని, ఆరోగ్యసేవలు ఎలా అందుతున్నాయో, పేదలకు లబ్ధి జరుగుతోందా లేదా అన్న దానిపైన పర్యవేక్షణ కూడా చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కమిటీతో తాను 15 రోజులకోసారి సమావేశం నిర్వహించి ఆరోగ్య సేవలను సమీక్షిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వైద్య క్యాంపులు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ప్రాథమిక దశలోనే జబ్బులను గుర్తించి దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఇది అందరి ప్రభుత్వం
నవరత్నాల అమలు మా ప్రభుత్వ అజెండా. మేనిఫెస్టో ప్రతిరోజూ కనిపించేలా ఉండాలని ఆదేశాలిచ్చా. మా మేనిఫెస్టోలో మూడింట రెండొంతుల వాగ్దానాల అమలుకు రంగం సిద్ధం చేశాం. ఇదే మాట నిలబెట్టుకుంటూ పరిపాలన ప్రారంభించామని చెబుతున్నా. మాకు ఓటు వేయని ప్రజలు కూడా నిండు మనసుతో దీవించాలని వినమ్రంగా కోరుతున్నాను. – సీఎం వైఎస్ జగన్ నీతివంతమైన పాలన అందిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. అవినీతిని అంతం చేస్తేనే అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది. అప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తాం. మనకు 972 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. రోడ్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా పనుల్లో పారదర్శకత తీసుకు వచ్చి అవినీతికి అడ్డుకట్ట వేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రపంచం అంతా ఇదే చెబుతోంది. అందుకే ప్రపంచంలో తక్కువ అవినీతి ఉన్న డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, సింగపూర్ తదితర దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. నాకు రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందంటూ ఏవోవో మాట్లాడిన వారి మాటలు చూశాం. వారి మంత్రివర్గంలో సామాజిక వర్గాలకు జరిగిన అన్యాయాలూ చూశాం. 2020లో, 2050లో ఇంకా 2070లో ఏం జరుగుతుందో నేను వారిలా చెప్పడం లేదు. సామాజిక వర్గాల వారీగా న్యాయం చేసి చూపించా. సాక్షి, అమరావతి: ‘వ్యక్తులు, వర్గాలు, పార్టీలు ఇవన్నీ ఎన్నికల వరకే. ప్రభుత్వం ఏర్పాటయ్యాక అందరూ మనవాళ్లే. ప్రతి వర్గం వారికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలి. ఈ దిశగానే ఈ ప్రభుత్వం పని చేస్తుంద’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, ఇది ఏ రాజకీయ పార్టీకో, ఏ వర్గానికో మాత్రమే పనిచేసే ప్రభుత్వం కాదని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ప్రజలు, దేవుడు మెచ్చి కనీవినీ ఎరుగని రీతిలో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. 3,648 కిలోమీటర్ల తన పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని, వారి సమస్యలు తీర్చేందుకే నాడు హామీలిచ్చానని చెప్పారు. జగన్ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే.. పాదయాత్రలో చెప్పిందే చేస్తున్నాం ‘కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. నాడు పాదయాత్రలో కూడా పదే పదే ఇదే విషయం చెప్పాను. అవినీతిని నిర్మూలిస్తేనే ఆదాయం పెరుగుతుంది. అవినీతికి అడ్డుకట్ట వేయగలిగితే దేశంలోనే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం పని చేస్తున్నాం. ఈ మూడు వారాల పాలన కూడా ఇదే మాదిరిగానే ఉంది. గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ వరకు చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా ఇసుక, మట్టి, రేషన్‌కార్డు, ఇల్లు.. కుల, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, బీమా, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సొమ్ము.. చివరకు మరుగుదొడ్డి కోసం కూడా లంచాలు తీసుకుని ఐదేళ్లూ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. ఇలాంటి వ్యవస్థను పై నుంచి కింది దాకా పూర్తిగా మార్చాలన్న నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాం. ఈ పని చేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో.. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుస్తానని ప్రజలను అడిగాను. ప్రజలు, దేవుడు ఆశీర్వదించారు. ప్రజలు మాకు 50 శాతం ఓట్లు వేసి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీలు సీట్లు ఇచ్చారు. నీతివంతమైన పాలన అందించాలన్నదే నా లక్ష్యం. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. దేశమంతా మనవైపు చూసేలా పారదర్శకమైన పాలన అందిస్తాం. టెండర్ల పరిశీలనకు ఒక జడ్జిని ఇవ్వమని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరాం. టెండర్లు నేరుగా జడ్జికే ఇస్తాం. వారం రోజుల పాటు పబ్లిక్కు అందుబాటులో పెట్టండి. మాకు వ్యతిరేకులైన వారు ఇచ్చే సలహాలు సైతం తీసుకోండని చెప్పాం. ఆ జడ్జి గారి వద్ద ఉన్న టెక్నికల్ టీం ఖర్చులు కూడా మా ప్రభుత్వమే భరిస్తుంది. జడ్జి గారు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తాం. టెండర్లకు ముందే సలహాలు తీసుకుంటాం. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి, దుబారాలకు అడ్డుకట్ట వేస్తాం. పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు కళ్లారా చూశాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి పేద, ప్రతి రైతు, పేదింటి అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, మధ్య తరగతి కుటుంబాలు పడే కష్టాలను, కన్నీళ్లను చాలా దగ్గరగా చూశాను. వారి కష్టాలు నేను విన్నాను. వీరందరికీ కష్టాలు రానివ్వకుండా చూడాలన్నదే నా తపన. అందుకే ఇక్కడ నిలుచున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఏం కోరుకుంటున్నారో నేను విన్నాను. మంచి చేస్తాను. నవరత్నాలతో పేదవారికి మంచి చేయాలని ఆరాట పడుతున్నాను. అన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా జీవించగలిగితే నాకు ముఖ్యమంత్రిగా సంతృప్తికరంగా ఉంటుంది. సామాజిక న్యాయంతో దేశంలోనే నంబర్1గా నిలిచేలా పాలన సాగించడానికి శ్రీకారం చుట్టాము. మంత్రి మండలి ఏర్పాటులోనే 13 సామాజిక వర్గాలకు చోటు కల్పించాం. నామినేటేడ్ పనుల్లోనూ సామాజిక న్యాయం వర్ధిల్లేట్లుగా చేస్తాం. నా సొంత సామాజిక వర్గానికి మంత్రి పదవులు తగ్గించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలోను, రాష్ట్రాధికారంలోనూ వాటా ఇచ్చి ఒక విప్లవానికి శ్రీకారం చుట్టానని గర్వంగా చెబుతున్నాను. నామినేటేడ్ పదవుల్లోనే కాదు.. నవరత్నాల ద్వారా ప్రతి వర్గానికి సామాజిక, ఆర్థిక న్యాయం చేస్తాం. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసేది కాకూడదు ఓటు రాజకీయాలు చేయం. మేనిఫెస్టో అంటే వందల పేజీల పుస్తకాలు పెట్టకుండా, కేవలం రెండే రెండు పేజీలతో మా మేనిఫెస్టో రూపొందించాం. అది ఎప్పుడూ కనిపించే విధంగా రూపొందించాం. నా చాంబర్లో కూడా మేనిఫెస్టో కనిపించేలా ఏర్పాటు చేశాం. మంత్రులు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నారు. అధికారులందరి ఛాంబర్లలో ఈ మేనిఫెస్టో ఉండాలని చెప్పాం. మేనిఫెస్టో అన్నది చెత్త బుట్టలో పడేసే కార్యక్రమం మాదిరిగా కాకుండా ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావిస్తాం. రైతు భరోసా కింద రూ.12,500 ప్రతి రైతుకు లబ్ధి కలిగేలా రైతు భరోసా పథకం ఏర్పాటు చేస్తున్నాం. చెప్పినదానికంటే ముందుగానే ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ఏటా రూ.12,500 చొప్పున రైతులకు ఇస్తాం. బోర్లు వేసి చాలా మంది నీళ్లు పడక అప్పుల పాలయ్యారు. ఇకపై అలా కాకుండా నియోజకవర్గానికి ఒక బోర్వెల్ మెషీన్ లెక్కన మొత్తం 200 బోర్వెల్ మెషీన్లు కొనాలని ఆదేశించాం. ఏ రైతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని ఈ బడ్జెట్ నుంచే దానిని అమలు చేస్తాం. గత ప్రభుత్వం హయాంలో రైతులకు సున్నా వడ్డీ పథకం అభాసుపాలైంది. ఇకపై అలా కాకుండా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. రైతులకు, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. 2016 మే నుంచి అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ బంద్ అయింది. చంద్రబాబు పాలన నుంచి మళ్లీ రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తాం. రైతులకు సంబంధించిన బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది. కరువు, వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. ఇన్‌ఫుట్ సబ్సిడీలను చంద్రబాబు చెల్లించలేకపోయారు. బాబు చెల్లించని ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.2 వేల కోట్ల సొమ్మును విడుదల చేస్తూ సంతకాలు పెట్టాను. రైతులకు ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితి రాకుండా రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి కూడా రూ.2 వేల కోట్లు వస్తుంది. ఇదే బడ్జెట్లో దీనిని పెడతాం. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. అన్నిరకాలుగా రైతుల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థులకు పుస్తకాలు కూడా ఇవ్వలేక పోయారు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తే బాధ కలుగుతోంది. గత ప్రభుత్వం స్కూళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. జూన్ మొదటి వారంలోనో, రెండవ వారంలోనో పాఠశాలలు తెరిస్తే సెప్టెంబర్ దాటినా కూడా పుస్తకాలు అందించలేదు. మధ్యాహ్న భోజనం పథకంలో సరుకులు కొనుగోలు చేస్తే బిల్లులు కూడా ఇవ్వలేదు. 6 నెలల నుంచి 8 నెలల పాటు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. విద్యార్థులకు యూనిఫాం గత సంవత్సరం నుంచి ఇవ్వని పరిస్థితి. టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించని దుస్థితి. ఈ పాఠశాలల రూపు రేఖలు మార్చబోతున్నాం. రెండేళ్లలోపే స్కూళ్లను మార్చిచూపుతాం. అవసరమైన వన్నీ కూడా సమకూరుస్తాం. అవ్వా తాతలకు భరోసా నాలుగు నెలల క్రితం వరకు అవ్వా తాతలకు పింఛన్ ఎంత ఇస్తున్నారు అని అడిగితే వెయ్యి రూపాయలు అని చెప్పేవారు. మరికొందరు ఏమీ రావడం లేదని చెప్పేవారు. నేను పాదయాత్రలో పింఛన్ రూ.2 వేలు ఇస్తామంటే ఈయన ఆ మాత్రం పెంచారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2,250కి పెంచుతూ సంతకం చేశాను. ప్రతి ఏటా రూ.250 పెంచుతూ రూ.3 వేల వరకు పింఛన్‌ను తీసుకెళ్తాం. తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువ ఎన్నికలు వచ్చే వరకు అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ నాడూ రాలేదు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్న హామీని నెరవేర్చుతూ మేము వారి వేతనాలు పెంచాం. డ్వాక్రా యానిమేటర్ల వేతనం రూ.10 వేలకు పెంచాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఆశా వర్కర్లకు రూ.10 వేలు వేతనం పెంచాం. పారిశుధ్య కార్మికులకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. వాళ్లు చేసే పని ఎవ్వరూ చేయలేరు. నిజంగా వారి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాంటి వారిని గత సర్కారు ఉద్యోగం నుంచి తొలగించే దుర్మార్గానికి ఒడిగట్టింది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. పారిశుధ్య కార్మికులకు మేలు చేసే దిశగా వారి వేతనాలు రూ.18 వేలకు పెంచాం. ఆర్టీసీని విలీనం చేస్తామని కార్మికులకు మాట ఇచ్చాం. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. ఇందుకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. వారి అర్హతలు, సర్వీసు ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తాం. ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు చాలా తక్కువ. ఎలక్ట్రిసిటీ మీటర్ల బిల్లింగ్ కోసం ఔట్సోర్సింగ్ వారిని నియమించి ఇన్నాళ్లూ ప్రభుత్వం ఏజెన్సీలకు దోచిపెట్టింది. ఇకపై అలా ఉండదు. ప్రభుత్వం ఇచ్చేది నేరుగా ఆ ఉద్యోగులకు చేరేలా ఆదేశాలు జారీ చేశాం. బిల్లింగ్ కోసం ఒక్కో విద్యుత్ మీటర్‌కు రూ.4 ఇస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇచ్చింది కేవలం ఒక్క రూపాయి.. నుంచి రూపాయిన్నర మాత్రమే. వైద్యం అందక ఎవరూ చనిపోయే పరిస్థితి ఉండకూడదు రూ.5 లక్షలలోపు ఆదాయమున్న వారందరికీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఎవరైనా డబ్బుల్లేక వైద్యం అందలేదు అనే కారణంతో మృతి చెందకూడదు. ఈ లక్ష్యంతో పని చేస్తాం. దీనికోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకూ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించని పరిస్థితి. 108, 104 వాహనాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రోగులు, బాధితులు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వాహనం రాలేని పరిస్థితి. అందుకే 350 కొత్త 108 అంబులెన్స్‌లు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశాం. మండలానికి ఒక వాహనం లెక్కన 650 కొత్త 104 అంబులెన్స్‌లు కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వైద్య నిపుణులతో మెడికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశాం. నివేదిక ఇచ్చేందుకు రెండు నెలలు గడువు ఇచ్చాం. ఏంచేస్తే మంచిదో చెప్పమన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా మార్చితే ప్రజలకు మంచి జరుగుతుందో చెప్పాలని సూచించాం. ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తామని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు దేశంలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేసి రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పండుగలా ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం. అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అగ్రిగోల్డు బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. దీంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్షరాల 9 లక్షల మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నాం. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను నిలువునా ముంచింది. గ్రామ సచివాలయాలతో సత్వర లబ్ధి అక్టోబర్ 2న గాంధీ జయంతి. ఆ రోజు నుంచే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్, గ్రామ వలంటీర్లను తీసుకొచ్చి వ్యవస్థలో మార్పు తెస్తాం. లబ్ధిదారుడికి మంచి జరిగేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్లో ప్రతి గ్రామంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని గర్వంగా చెబుతున్నాను. అగస్టు 15 నుంచి ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమిస్తాం. రూ.5 వేల గౌరవ వేతనంతో 4 లక్షల మందిని నియమిస్తున్నాం. అవినీతి, పక్షపాతం ఎక్కడా లేకుండా ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేస్తాం. వలంటీర్లు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకే రూ.5 వేలు వేతనం ఇస్తున్నాం. అవినీతికి పాల్పడిన వారికి శిక్ష తప్పదు ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ఆదేశాలు జారీ చేశాం. వచ్చే నెల 1 నుంచి ఇది అమలవుతుంది. సీపీఎస్ రద్దు చేస్తామని మాట చెప్పాం. దానిని రద్దు చేసే దిశగా కమిటీ ఏర్పాటు చేశామని గర్వంగా చెబుతున్నాం. ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు రెండే కులములని మహాకవి చెప్పారు. అవినీతికి, అన్యాయానికి పాల్పడితే ఎంతటి వారైనా సహించేది ఉండదు. రాష్ట్ర విభజన ఎవరు చేశారో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలుసు. గత ఐదేళ్లుగా గాయాలు మానలేదు. గత పాలకులు రక్తం పిండారు. ఆర్థిక వ్యవస్థను సర్వనాశం చేశారు. అస్తులు పోయి అప్పులు మిగిలాయి. రంగాల వారీగా.. వ్యవసాయం, పరిశ్రమలు, సేవ, చదువులు, ఉద్యోగాలు, నీటి ప్రాజెకులు.. ఇలా ఆయా రంగాల పరిస్థితిని సభలోనే ప్రజల ముందుంచుతా. మా ప్రభుత్వంలో రాజకీయ కక్షసాధింపులు ఉండవు. కానీ అవినీతికి పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష తప్పదు. పేదలు పేదలుగా ఉండటానికి, చదువుకునే శక్తిలేని పిల్లలు ఉండటానికి వీలు లేదు. సమానత్వం అందకుండా ఉండటానికి వీలు లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాను కూడా సహకరించాలని కోరుతున్నాను. సహకరించకపోయినా నా అడుగులు ముందుకే అని స్పష్టం చేస్తున్నాను. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ గత ప్రభుత్వం ప్రైవేటు స్కూలు యాజమాన్యాలకు అమ్ముడు పోయింది. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో పేదలకు 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉన్నా ఏ ఒక్క స్కూల్లోనూ ఇది అమలు కాలేదు. ఆ దిశగా ప్రయత్నమూ జరగలేదు. ఈ దృష్ట్యా విద్యా హక్కు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. స్కూళ్లు, కాలేజీల్లో పేదలకు భారం లేకుండా ఫీజులు తగ్గిస్తాం. దీనికోసం ‘ఫీ రెగ్యులేటరీ, క్వాలిటీ మానిటరింగ్ కమిషన్లను ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ చట్టాలు తెస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 33 శాతం మంది చదువు రాని వారున్నారు. జాతీయ సగటు 26 శాతం మాత్రమే. దేశంలో మనమే వెనుకబడ్డాం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరక్షరాస్యతను రూపుమాపుతాం. జనవరి 26న (గణతంత్ర దినోత్సవం రోజున) రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం మధ్య ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు చెల్లిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులో అవినీతిని పెకలిస్తాం నీటి పారుదల రంగంలో ఏ ప్రాజెక్టును తీసుకున్నా అవినీతే. ఆ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి పనిమీదా అధ్యయనం జరుగుతుంది. అంచనాలు ఎలా పెంచారో ఇంజినీర్లు తేలుస్తారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆ వర్క్‌ను మారుస్తాం. ఫ్రీ క్వాలిఫికేషన్ ద్వారా ఎక్కువ మంది టెండరింగ్‌లో పాల్గొనే విధంగా పారదర్శకంగా మార్పులు చేస్తాం. తద్వారా 15 నుంచి 20 శాతం రేట్లు తగ్గుతాయి. ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రులు, ఉద్యోగులు, మంత్రులు ఎవరైనా సరే.. అందరూ ప్రజా సేవకులే. ప్రతి ఒక్కరూ నీతిమంతంగా ఉండాలి. అవినీతిని మాత్రం సహించేది లేదు. పేదలకు మంచి బియ్యం ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో ఆ బియ్యాన్నే పేదలకు ఇవ్వాలని ఆదేశించాం. చౌక దుకాణాల నుంచి ఇచ్చే బియ్యం నాణ్యతను మారుస్తాం. మనందరం తినే బియ్యాన్నే పేదలకు ఇస్తాం. ఆ బియ్యాన్ని 5, 10, 15 కేజీల చొప్పున ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తాం. వేలిముద్రలు పడటం లేదని ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి రాకుండా చేస్తాం. వేలి ముద్రలు పడకపోతే వీడియో స్క్రీనింగ్ తీసుకోండని చెప్పాం. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ పథకం కూడా నేరుగా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేపట్టాం. ఎక్కడా కూడా అవినీతి, అన్యాయం జరుగకుండా ఉండేందుకు ఆదేశాలు ఇస్తున్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగిందని ఫోన్ చేస్తే ఆ గ్రామ వలంటీర్‌ను తొలగిస్తామని గర్వంగా చెబుతున్నాం. ఇందుకోసం నేరుగా సీఎం కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేస్తాం. ఎన్నికల తర్వాత అందరూ మనవాళ్లే. రాష్ట్రంలోని దాదాపు 40 వేల పాఠశాలల ప్రస్తుత పరిస్థితిని ఫొటోలు తీయండని చెప్పాం. వాటి పరిస్థితి సరిదిద్ది మళ్లీ రెండేళ్ల తర్వాత కొత్త ఫొటోలు చూపిస్తాం. బాత్రూం మొదలు నీళ్లు, ఫర్నీచర్.. ఇంకా ఏమేం కావాల్లో అన్నీ ఇస్తాం. అన్ని స్కూళ్లనూ ఇంగ్లిష్ మీడియంగా మారుస్తాం. తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా అమలు చేస్తాం. ప్రభుత్వ స్కూళ్లు.. నారాయణ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా చేస్తాం. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచేందుకు బడ్జెట్ పెంచుతాం. -
ఉచిత వైద్యం.. కొంచెం కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: ఉచిత వైద్యం కొంచెం ఖరీదుగా మారనుంది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)లో మార్పులు, చేర్పులకు సర్కారు నడుం బిగించింది. ఈ పథకం కింద నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రకాల ఆపరేషన్లు తప్ప ఇతర వైద్య సేవలు అందించడంలో ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీని పై సర్కారుకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పథకంలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. పథకం సక్రమంగా నడిచేందుకుతాము కొంత నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగైతే అంగీకారం తెలుపుతూ ఒక లేఖ ఇవ్వాలని శాంతికుమారి సూచించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఉద్యోగుల నుంచి ఏడాదికి 330 కోట్లు.. పథకం ప్రారంభ సమయంలో ఉద్యోగులు తమ వాటాగా కొంత చెల్లిస్తామని చెప్పినా ఉచిత సేవలకు సర్కార్ మొగ్గుచూపింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లో కలపకుండా ప్రత్యేకంగా ఈజేహెచ్ఎస్ పథ కాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్యశ్రీలో లేనటువంటి అనేక జబ్బులను ఈజేహెచ్‌ఎస్‌లో చేర్చా రు. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో 236 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రు లు, 96 ప్రభుత్వ నెట్వర్క్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటికితోడు మరో 67 డెంటల్ నెట్వర్క్ ప్రైవేటు ఆస్పత్రులూ ఉన్నాయి. ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అవి ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడంలేదు. సాధారణ వైద్య సేవలను అందించడంలేదు. కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నాయి. నగదు రహిత సేవలకు వచ్చేవారిని గౌరవప్రదంగా చూడడంలేదన్న విమర్శ లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాము నెలకు రూ.500 చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని రవీందర్‌రెడ్డి అంటున్నారు. ఆ ప్రకారం 5.50 లక్షలమంది ఉద్యోగుల నుంచి ఏడాదికి రూ.330 కోట్లు వసూలు కానుంది. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వైద్యం కోసం చేస్తున్న ఖర్చు కూడా రూ.300 కోట్లు మాత్రమే. సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలన్నీ సక్రమంగా చేసేట్లయితే మరో రూ.100 కోట్లు ఖర్చు కానుంది. అంటే ప్రభుత్వంపై పడే భారం కేవలం రూ.100 కోట్ల లోపే ఉంటుంది. అయితే, అందరి నుంచి రూ. 500 వసూలు చేస్తారా? లేక కేడర్‌ను బట్టి నిర్ణయిస్తారా? అన్న దానిపై స్పష్టతలేదు. జర్నలిస్టుల నుంచీ భాగస్వామ్యం కోరుతారా లేదా అన్నదానిపైనా స్పష్టత రాలేదు. రెండు, మూడు రోజుల్లో లేఖ ఉద్యోగుల భాగస్వామ్యంపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారితో మాట్లాడాను. నెలకు రూ.500 భరించడానికి సిద్ధంగా ఉన్నా మని చెప్పాను. భాగస్వామ్యంపై లేఖ ఇవ్వాలని ఆమె కోరారు. రెండు, మూడు రోజుల్లో దానిని ఇస్తాం. –కారెం రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, టీఎన్జీవో -
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు సేవ చేయాల్సిన ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ఇప్పుడు వారి నుంచే యూజర్ చార్జీల పేరుతో వసూళ్లు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కేన్సర్ చికిత్సకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆసుపత్రి, ఇప్పుడు వైద్యానికి డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పలువురు రోగులు గగ్గోలు పెడుతున్నారు. పైగా వివిధ పరీక్షలకు రసీదులు కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆరోగ్యశ్రీ రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సి ఉండగా, వారిపై కూడా యూజర్ చార్జీల భారం వేస్తుండటం రోగులకు ఆవేదన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చాక తిరిగి రోగులకు చెల్లిస్తామంటూ ఆసుపత్రి అధికారులు చెబుతున్నారని రోగులు అంటున్నారు. అలా ఇస్తామన్న హామీ ఎక్కడా లేదని, అక్రమాల కేంద్రంగా ఆసుపత్రి తయారైందని అంటున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు శ్రీనివాసరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి పరీక్షలకోసం యూజర్ చార్జీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుండటాన్ని ఆయన అధికారులకు విన్నవించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు వసూలు చేసినట్లుగా చూపుతున్న రసీదులు రూ. 2,500 వరకు వసూలు కొన్ని పరీక్షలకు రూ.100 నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలకు రూ. 2 వేలు, రూ. 2,500 వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులకైతే డబ్బు వసూలు చేయకూడదు. పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి భిన్నంగా ఫీజులు భారీగా వసూలు చేయడంపై రోగులు గగ్గోలు పెడుతున్నారు. యూజర్ చార్జీలు రద్దు చేయాలని తాము కోరగా, ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు రాగానే రోగులకు తిరిగి వెనక్కి ఇస్తున్నామని ఆసుపత్రి అర్ఎం చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత వసూలు చేయడమే తప్పు, పైగా తిరిగి చెల్లిస్తున్నామని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధమని ఆయన ఆరోపించారు. పైగా రోగులు ఎవరికీ డబ్బు తిరిగి చెల్లిస్తున్న పరిస్థితి లేదు. అదీగాక యూజర్ చార్జీల బిల్లులు కంప్యూటరైజ్డ్వి కాకుండా చేతిరాతతో ఇస్తున్నారు. యూజర్ చార్జీల పేరుతో వసూలైన డబ్బు పూర్తిగా దుర్వినియోగమవుతున్నదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశాఖ అధికారులతో కుమ్మక్కై ఆసుపత్రిలో కొందరు ఈ డబ్బును దిగమింగుతున్నారన్నారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ దందాపై విచారణ జరపాలని, అక్రమ వసూళ్ళను అరికట్టాలని ఆయన కోరారు. -
ఆరోగ్య ప్రదాత వైఎస్సార్
సాక్షి, విజయనగరం ఫోర్ట్: 2004 సంవత్సరానికి ముందు పేదోడికి గుండె ఆపరేషన్ చేయాలంటే ఇల్లో, భూమో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. లేకుంటే ఎక్కడో చోట రూ.లక్ష అప్పు చేయాల్సిన దుస్థితి. పొరపాటున క్యాన్సర్ వస్తే వైద్యం చేయించుకోలే మంచాన పడి, చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను తన పాదయాత్రలో భాగంగా చూసిన మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి చలించిపోయి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడంపై దృష్టి సారించారు. ఇలా అధికారంలోకి వచ్చారో లేదో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. అంతే పేదోడి జీవితం మారిపోయింది. జబ్బు చిన్నదైనా, పెద్దదైనా హుందాగా కార్పొరేట్ ఆస్పత్రికి తెల్లకార్డు పట్టుకుని వెళ్లి ఎంత డబ్బైనా ఇబ్బంది లేకుండా వైద్యం చేయించుకునేవాడు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల ఘన స్వాగతం.. ఆరోగ్య శ్రీలో భాగంగా కార్పొరేట్ ఆస్పత్రికి గుండె ఆపరేషన్లు, క్యాన్సర్, గైనిక్ సమస్యలు, జనరల్ సమస్యలతో వెళిలే అక్కడి సిబ్బంది సాదరంగా ఆహ్వానించేవారు. జీవితంలో తాము కార్పొరేట్ ఆస్పత్రిలో అడుగుపెడతామని ఊహించి ఉండని వారు కూడా ఆరోగ్య శ్రీ పథకం వల్ల దీమాగా కార్పరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందేవారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి లెక్కకు మిక్కిలి మంది వైద్యం చేయించుకున్నారు. పూర్తిగా ఉచిత వైద్యం.. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు చేతిలో చిల్లిగవ్వలేకపోయినా కార్పొరేట్ ఆస్పత్రుల వారు సైతం పిచిలి మరి వైద్యం చేసేవారు. దీంతో పేదవాడికి ఎంత పెద్ద జబ్బు వచ్చినా భయపడేవారు కాదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మాకు చింత ఎందుకు అనే భావనలో ఉండేవారు. ఉచిత వైద్యంతో పాటు రోగి డిశార్జి అయిన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు వారం, పది రోజులకు సరిపడా మందులు, రవాణా ఛార్జీలు కూడా ఇచ్చి పంపించే వారు. రోగికి ఒక్క రుపాయి కూడా ఖర్చు కాకుండా పూర్తి ఉచితంగా వైద్యం అందించేవారు. చచ్చి బతికా.. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. తల్లిదండ్రులు 108లో కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ అవసరమని చెప్పారు. అనంతరం ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఆపరేషన్ చేసేశారు. కడుపునొప్పి కారణంగా ఎక్కడ చనిపోతానో అని అందరూ బెంగ పెట్టుకున్నారు. నేనే ఈ రోజు బతికున్నానంటే కారణం వైఎస్సార్. ఆ జన్మాంతం ఆయనకు రుణపడి ఉంటా. – ఎస్.త్రినాథ్, పెదవేమలి, గంట్యాడ. -
ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టుపై అనిశ్చితి
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టు భర్తీపై అనిశ్చితి నెలకొంది. గత నెలాఖరు వరకు అదనపు బాధ్యతల్లో సీఈవోగా కొనసాగిన మాణిక్‌రాజ్ హైదరాబాద్ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికీ జరగకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు వైద్యం చేయించుకునే వెసులుబాటుంది. అయితే లక్షన్నర రూపాయలకు మించి బిల్లు అయితే సీఈవో అనుమతి తప్పనిసరి. ప్రధానంగా కేన్సర్, గుండె తదితర ప్రాణాంతక వ్యాధులకు మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో అటువంటి రోగులు సీఈవోకు విన్నవించుకొని ప్రత్యేక అనుమతి తీసుకుంటారు. అయితే ప్రస్తుతం సీఈవో లేకపోవడంతో వారం రోజులుగా రోగులకు అటువంటి అనుమతులివ్వడం సాంకేతికంగా ఇబ్బంది అవుతుందని ఆరోగ్యశ్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులు అల్లాడుతున్నారని వారు అంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులున్న వారు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఈ ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఇలాంటి కీలకమైన ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టుకు మొదటి నుంచీ ముఖ్యమైన అధికారులే ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభించినప్పుడు ఓ ఐఏఎస్‌ను సీఈవోగా నియమించారు. తెలంగాణ వచ్చాక నాన్ ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్ అధికారి మాణిక్‌రాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ అదనపు బాధ్యతగానే ఆరోగ్యశ్రీ సీఈవోగా పనిచేశారు. దీంతో ఆరోగ్యశ్రీపై పూర్తిస్థాయిలో కేంద్రీకరించే అధికారి లేరన్న భావన నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న కొందరు కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు నచ్చిన ఆస్పత్రులు తప్పులు చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించడం, నచ్చని ఆస్పత్రులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వంటివి అనేక అక్రమాలు జరుగుతున్నాయన్న వాదనలున్నాయి. దీనిపై కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీలో పనిచేసే ఓ అధికారికి వైద్య ఆరోగ్యశాఖలోనూ కీలక బాధ్యతలు ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టు కోసం కొందరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. -
కీడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్
-
రోగమొస్తే..ఇక అంతేనా
నవరత్నాలు –3 బతకాలనేది రోగులందరి ఆశ.. ఆ ఆశకు వైద్యమే శ్వాస.. ఇప్పుడా శ్వాసకు గడ్డు కాలం నడుస్తోంది. నిలువ నీడలేని, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి నేడు ఏదైనా పెద్ద జబ్బు వస్తే.. ప్రమాదాల బారిన పడితే ‘రేపటి రోజు’కు రూపు కరువైన దుస్థితి. రోగమొస్తే ఇక అంతే.. అనే దయనీయ పరిస్థితి రాజ్యమేలుతోంది. అధైర్య పడొద్దు.. బతికిస్తాం.. అనే భరోసా ఇవ్వడానికి పాలకులకు మనసొప్పని దౌర్భాగ్యపు రోజులివి. చావు బతుకులతో బడ్జెట్ లెక్కలు వేసి ‘మీ చావు మీరు చావండి’ అని వదిలించుకుంటున్న వైనం కళ్లారా చూస్తున్నాం. అర్ధాయుష్షుతో తనువు చాలించకుండా చూసేందుకు వైద్యులకు అవకాశం ఇవ్వని వైనమూ కంటున్నాం. ‘ఈ రోజులు పోవాలి. మళ్లీ వైఎస్సార్ నాటి స్వర్ణ యుగం రావాలి’ అని కోట్లాది మంది కోరుకుంటున్నారన్నది అక్షర సత్యం. ఆ రోజు త్వరగా రావాలి. ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలి. – సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్ అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దిగులుగా కూర్చున్న రఘుపతి దంపతులు ఇప్పుడేం చేసేది మా ఆయన రఘుపతి కూలి పని చేసి కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. వారం క్రితం కూలి పనికి పోయినప్పుడు ఇసుక తిన్నెలు మీద పడటంతో కుప్ప కూలిపోయినాడు. నడవలేక పోవడంతో ఆటో మాట్లాడుకుని వెంటనే తాడిపత్రిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఎక్స్‌రే తీసి చూశారు. కాలు విరిగిందని, ఆపరేషన్ చేసి రాడ్ వేయాలని చెప్పినారు. టెంపరరీ కట్టు కట్టారు. అనంతపురం తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ అంబులెన్స్ కోసం చాలా సేపు ఎదురు చూశాం. ఎంతసేపటికీ రాకపోవడంతో 1,500 రూపాయలిచ్చి ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ వెంటనే వైద్యం అందే పరిస్థితి లేదని అర్థమైంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆరోగ్య శ్రీ కార్డు చూపించి, ఆపరేషన్ చేయాలని (ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందిని) కోరాం. ఎంతసేపటికీ వాళ్లు ఏమీ చెప్పలేదు. ఆ ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చిన ఒకాయన మా పరిస్థితి చూసి వాళ్లతో మాట్లాడారు. ఆసుపత్రికి గవర్నమెంటోళ్ల నుంచి రావాల్సిన డబ్బులు (బకాయిలు) రాలేదని, అందుకే ఆపరేషన్లు చేయడం లేదని మాకు చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బులిచ్చి వైద్యం చేయించుకోవాలంటే 40 వేల రూపాయలు అవుతుందని చెప్పారు. కూలి పనులు చేసుకునే మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. పక్కన పల్లెలో ఎవరో కట్టు కడతారని (నాటు వైద్యం) చెప్పారు. ఎలాగైనా 5 వేల రూపాయలు తీసుకుని రావాలని మా పిన్ని వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు రాగానే మా ఆయన్ను అక్కడికి తీసుకెళ్లాం. అక్కడ ఏం చేస్తారో.. ఏమో.. మా ఖర్మ. – రఘుపతి భార్య, ఆలూరు, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా భర్త వద్ద దిగాలుగా కూర్చున్న కాంతమ్మ ఈ పరిస్థితి పగోళ్లకు కూడా రాకూడదు.. మా ఆయన అప్పలస్వామి (60)కి కొన్నాళ్ల క్రితం కిడ్నీ దెబ్బతినిందని చెప్పారు. ఎందుకు దెబ్బతినిందో తెలీదు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూపించాం. మందులిచ్చారు. వాడాము. కొన్నాళ్ల తర్వాత వ్యాధి మరింత ముదిరింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందలేదు. దీంతో రెండెకరాల పొలం అమ్మాము. ఏకంగా 15 లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేశాము. అయినా వ్యాధి ముదిరిపోయింది. డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పటికే అప్పులపాలయ్యాం. డయాలసిస్ చేయించడానికి కూడా ఇప్పుడు డబ్బులు లేవు. మా ఆయన్ను దక్కించుకోవడం ఎలానో తెలీక తల్లడిల్లిపోతున్నాం. ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో రోగులు క్యూకట్టారు. మరిన్ని కేంద్రాలు ఉండుంటే వెంట వెంటనే డయాలసిస్ చేయించడానికి వీలవుతుంది. మేము పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదని కోరుకుంటున్నాం. – కాంతమ్మ, లొహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా.. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా బతుకుతున్న రోజులవి. నా భర్త గురయ్య 15 ఏళ్ల క్రితం నన్నొదిలి కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు. క్షయ వ్యాధి ఆయన్ను కబళించింది. తర్వాత ఐదేళ్లకు (ఇప్పుడు నాకు 48 ఏళ్లు) నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధి ఉందని తేలింది. ఆ విషయం వినగానే గుండె ఆగినంత పనైంది. భవన నిర్మాణ పనులకు వెళ్లి పొట్ట పోసుకుంటున్న నాకు ఈ వ్యాధి రావడం బాధనిపించింది. మా ఆయన లేడు. ఇద్దరు పిల్లలు దుర్గారావు, భాస్కరరావులు ఇంకా చదువుకుంటున్నారు. డాక్టర్లు చూస్తే మందులు వాడుతూ బాగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇలాగైతే ఇల్లు గడిచేదెలా? బాధను పంటి బిగువున భరిస్తూనే పనులకు వెళ్తున్నాను. రెండేళ్లుగా నా సమస్య మరింత ముదిరింది. దీంతో పిల్లలు 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. ఆటో తోలుతున్నారు. ఇప్పుడు నాకు వారానికి మూడు మార్లు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. మందుల కోసం నెలకు 8 వేల రూపాయలు ఖర్చవుతోంది. పిల్లలు సంపాదించింది నా ఖర్చులకే సరిపోతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. పలాసలో డయాలసిస్ కేంద్రం పెట్టారు కాని అక్కడ పడకలు లేవు. పిల్లలు ఆటో తోలుతున్నారు కాబట్టి దారి ఖర్చులు కాస్త కలిసొస్తున్నాయి. లేకుంటే ప్రత్యేకంగా ఆటో తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం బస్సు పాస్‌లు ఇస్తామని ప్రకటించిందే కానీ ఇవ్వలేదు. మరోవైపు ఇల్లు గడవడం బాగా కష్టంగా మారింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా ముఖ్యమంత్రి అవుతారా అని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మా లాంటోళ్లకు ఆయన నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తామన్నారు. – మీలపల్లి పుణ్యావతి, గుణుపల్లి గ్రామం,వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా వైఎస్ జగన్‌తోనే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజుల్లో పేదలకు ఒక ధీమా కల్పించింది. రోజు కూలీలు సైతం హైదరాబాద్‌కు వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు. ఏ ఒక్క రోగీ చికిత్సకు డబ్బులేదని బాధ పడకూడదనేది వైఎస్సార్ ధ్యేయం. ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు మించితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని చెబుతుండటం రోగుల్లో భరోసా నింపుతోంది. ఎంతో మంది రోగులు ఇతర రాష్ట్రాలకు వైద్యం కోసం వెళ్లే అవకాశం ఉన్నా సర్కారు అనుమతి లేక బాధ పడుతున్నారు. ఇలాంటి వారందరికీ ఉపశమనం కలుగుతుంది. మూడింట రెండొంతులకు పైగా జనం లబ్ధి పొందనున్నారు. గుండె జబ్బులు, కిడ్నీ, నరాల జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలకు మంచి చికిత్స అందుతుంది. జగన్ సీఎం అయితేనే మళ్లీ ఈ పథకానికి పూర్వ వైభవం వస్తుందని నిత్యం ఎంతో మంది రోగులు మందుల కోసం ఇక్కడి కొచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, కష్టాలు భవిష్యత్‌లో కనిపించే పరిస్థితే ఉండదన్న నమ్మకం ఉంది. జగన్ త్వరగా ముఖ్యమంత్రి అయితే లక్షలాది మంది పేదలు మృత్యు ముఖం నుంచి తప్పించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. – గాండ్ల ఆదినారాయణ, మెడికల్ షాపు యజమాని, అనంతపురం. ఇదీ వైఎస్సార్ ఘనత ప్రమాదకర జబ్బు వస్తే ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందక, కార్పొరేట్ ఆస్పత్రుల మెట్లు ఎక్కే తాహతు లేక ప్రాణాలు కోల్పోతున్న దశలో పేదలు, సామాన్యుల కష్టాలను దగ్గరి నుంచి చూసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 ఏప్రిల్ ఒకటిన పైలెట్ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీని మూడు జిల్లాల్లో అమలు చేశారు. తర్వాత ఏడాది తిరక్కముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. తొలుత 468 జబ్బులతో మొదలైన ఈ పథకం ఏడాది తిరక్కముందే 938 జబ్బులకు చికిత్స అందే స్థాయికి చేరింది. గుండె జబ్బు నుంచి కాలేయ జబ్బు వరకు, క్యాన్సర్ నుంచి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ వరకు.. ఏ జబ్బుకైనా సరే, ఏ కార్పొరేట్ ఆస్పత్రి అయినా సరే వెనుదిరిగి చూడకుండా వైద్యం చేయించిన రోజులవి. జబ్బు బారిన పడిన వారికి చికిత్సతో పాటు వైద్యం జరిగినన్ని రోజులూ భోజనం, రవాణా చార్జీలు సైతం ఆస్పత్రిలోనే చెల్లించిన తీరు సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఓ చరిత్ర. పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న చిన్నారులు ఒక్కొక్కరికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసినందుకు రూ.6.5 లక్షలు చెల్లించారు. ఆరోగ్యశ్రీకి ఏటా రూ.925 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం తక్కువైందని సీఎం సహాయ నిధి కింద ఏటా రూ.400 కోట్లు చెల్లించి చరిత్ర పుటల్లో నిలిచారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ తరహా ప్రాజెక్టు దేశంలో ఇంత పకడ్బందీగా ఎక్కడా అమలు కాలేదు. లక్షలాది మంది ఇన్ పేషెంట్లకు ప్రాణం పోసింది. చాలా విజయవంతమైన కార్యక్రమం ఇది. 80 శాతం కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్యం అందించడం అంటే మాటలు కాదు. దీనివల్ల పేదలు తమ వైద్యం కోసం ఆస్థులమ్ముకునే దుస్థితి తప్పింది’ అని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సోఫీ బెర్గ్విస్ట్, ఆడం వాగ్‌స్టాఫ్, అనురాధా కాత్యాల్, ప్రబాల్ వి.సింగ్, అమిత్ సామ్రాట్, మాలారావులు అప్పట్లో కొనియాడారు. ఇదీ బాబు నిర్వాకం పుట్టుకతోనే మూగ, చెవుడు చిన్నారులకు వైద్యం చేయించుకునే వయసు 12 ఏళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు. (దీంతో వేలాది మంది చిన్నారులు వైద్యం చేయించుకోవడానికి అర్హత కోల్పోయారు) 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా అందులో 133 జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయకూడదని నిర్ణయం. ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయాలని నిబంధన. 1600 మంది ఆరోగ్యమిత్రల తొలగింపు. కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసే ఆస్పత్రులు నెలకు ఒక కొత్త కేసు మాత్రమే తీసుకోవాలని ఆదేశం. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే వీలు లేదని ఆంక్షలు. (మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం హైదరాబాద్ స్థాయిలో ఇంకా అభివృద్ధి కాలేదు) ప్రమాదంలో గాయపడిన (పాలీట్రామా) బాధితులకు వైద్యం అందించేందుకు ప్యాకేజీ రేట్లు సరిపోవడం లేదని ఆస్పత్రుల నిరాకరణ. న్యూరో, కాలేయ బాధితులకు వైద్యం చేసేందుకు చాలా చోట్ల ఆస్పత్రుల నిరాకరణ. రోగులకు మార్గదర్శకం చేసే ఆరోగ్య మిత్రల తొలగింపు. (ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులతో కొందరు ఉద్యోగంలో కొనసాగుతున్నారు) ఆరోగ్యశ్రీ ట్రస్ట్.. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు రూ.600 కోట్లు బకాయి పడటంతో 2019 జనవరి 1వ తేదీ నుంచి సేవల నిలిపివేత. సొంతూళ్లలో రేషన్ తీసుకుంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని లింకు. తద్వారా పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిన పేదలు వైద్యానికి అనర్హులయ్యేలా చేశారు. మీ ఆరోగ్యానికి నాదీ భరోసా : వైఎస్ జగన్ ఏడాదికి రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షలు లబ్ధి పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడో, కుటుంబీకులకు పెద్ద జబ్బు వచ్చినప్పుడో పేదలు అప్పులపాలవుతారని దివంగత మహానేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పేవారు. వాళ్ల జీవితాలు చెదిరిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన ‘ఆరోగ్య శ్రీ’ ప్రారంభించారు. ఆ పథకం ద్వారా ఎంతో మంది ప్రజలు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ గత నాలుగున్నరేళ్లుగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు పోతే.. ఏపీ కార్డులు అక్కడ చెల్లవని అంటున్నారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వస్తోందా? మూడు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవు.. డీజిల్ లేదని సమాధానం వస్తోంది. ఈ దుర్మార్గపు పాలన ముగిసి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఆరోగ్య శ్రీ’లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సమున్నతంగా అమలు చేస్తాం. ఆ దివంగత నేత కుమారుడిగా పేదల కోసం నేను రెండడుగులు ముందుకు వేస్తానని చెబుతున్నా. ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తాం. మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయిస్తాం. క్యాన్సర్ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. ఆపరేషన్ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం. ఈ సాయం వారం.. నెల.. ఆరు నెలలు అయినా సరే ప్రభుత్వం చేస్తుంది. -
గోదావరి జిల్లాల్లో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు
-
అనంతపురం జిల్లాలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు
-
చిన్నారి ప్రాణంతో చెలగాటం
సాక్షి, గుంటూరు: ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదు..బుడిబుడి అడుగులు వేసే మూడేళ్ల వయస్సులోనే దాదాపు 45 రోజులుగా క్షణం క్షణం నరకం చవిచూస్తోంది. శరీరం వెనుక భాగంలో తీవ్రంగా కాలిన గాయాల బాధతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేసే వీలున్నప్పటికీ.. ఇప్పటికే బకాయిలు అధికంగా ఉండడంతో ప్రైవేటు వైద్యులు ఎవరూ ముందుకు రాని దుర్భర పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వినుకొండ పాత క్రిస్టియన్‌పాలెంలో నివాసం ఉంటున్న యెలికపాటి ఆదయ్య, కీర్తి దంపతుల చిన్న కుమార్తె అమూల్య తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గౌనుకు నిప్పంటుకుని వీపు నుంచి కింది భాగమంతా పూర్తిగా కాలిపోయింది. నవంబరు 14వ తేదీన ఘటన జరగడంతో తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించారు. అక్కడ రూ.50 వేలు ఖర్చు కావడంతో నిరుపేద కుటుంబం కావడంతో అప్పు తేలేక, ఆస్పత్రి నుంచి అమూల్యను ఇంటికి తీసుకెళ్లి మందులు వాడుతున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో గాయం మానకుండా పెద్దది అవుతూ వచ్చింది. దీంతో గురువారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి, మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రులకు అమూల్యను తీసుకెళ్లారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందని, దాని ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా చేసే వీలు ఉన్నప్పటికీ అనుమతులు వచ్చే వరకు అయ్యే ఖర్చు భరించాలని, అనుమతులు రాకపోతే పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆర్థిక స్థోమత లేని ఆదయ్య దంపతులు అమూల్యను తీసుకుని సాయంత్రం 5.30 గంటల సమయంలో జీజీహెచ్‌కు వెళ్లారు. జీజీహెచ్‌లో బర్న్స్ వార్డు లేదని, చిన్న పిల్లల వార్డులో ఉంచితే ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా ఎక్కువ ఇబ్బంది జరుగుతుందంటూ అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేది లేక ఇంటికి బయల్దేరారు. వారి సమీప బంధువు సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీన్ని గమనించిన జీజీహెచ్ అధికారులు ఆదయ్యకు ఫోన్ చేసి వెనక్కు రావాలని కోరారు. దీంతో గురువారం రాత్రి జీజీహెచ్‌కు తీసుకొచ్చి అమూల్యను అడ్మిట్ చేశారు. ప్రస్తుతం అమూల్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. అయితే జీజీహెచ్‌లో దీనికి సంబంధించి ఎటువంటి మందులూ లేకపోవడం గమనార్హం. బర్న్స్ వార్డు నిర్మాణానికి రూ. 8 కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు జారీ చేసిన జీవో బర్న్స్ వార్డుకు కేంద్రం నిధులిచ్చినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. గుంటూరు జీజీహెచ్‌కు కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఆరు జిల్లాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా వైద్యులు ఇక్కడకు రిఫర్ చేస్తుంటారు. అయితే ఇంత పెద్ద ఆస్పత్రిలో బర్న్స్ వార్డు లేకపోవడంతో కాలిన గాయాలతో వచ్చిన అనేకమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న దుర్భర స్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో ఉన్న పెద్ద ఆస్పత్రిలో సైతం బర్న్స్ వార్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయని పరిస్థితి. కాలిన గాయాల నివారణ, నియంత్రణ జాతీయ కార్యక్రమం (ఎంపీపీఎంబీఐ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు బోధనా ఆస్పత్రుల్లో బర్న్స్ వార్డుల నిర్మాణానికి ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జీజీహెచ్‌కు సైతం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ కనీసం టెండర్లు కూడా పిలిచిన దాఖలాలు లేవు. బర్న్స్ వార్డు నిర్మాణానికి నిధులు ఉన్నా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు చెల్లించమని చెప్పిన మాట వాస్తవమే.. కాలిన గాయాలతో అమూల్య అనే చిన్నారిని తీసుకుని మా వద్దకు వచ్చారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు అనుమతి కోసం పంపుతామని, అనుమతి వచ్చే వరకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాం. అనుమతి వస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపాం. అయితే వారు ఆస్పత్రిలో చేర్చకుండా వెళ్లిపోయారు. ఎన్టీఆర్ వైద్యసేవలో ఎక్కువగా కాలిన గాయాలు ఉంటే మాత్రమే అనుమతి వస్తుంది. అందుకే ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చుకోలేకపోయాం. – రామాంజనేయులు,ఎన్నారై ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్య మిత్ర -
రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!!
సాక్షి, అమరావతి: పేద రోగులకు భరోసా కల్పించాల్సిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడం, వైద్యానికి అనేక ఆంక్షలు విధించడంతో రోగులకు వైద్యమందడం లేదు. ప్రభుత్వం తమకు బాకీ పడిన మొత్తాన్ని చెల్లించేవరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమని ఆస్పత్రి యాజమాన్యాల అసోసియేషన్ (ఆశా) స్పష్టం చేసింది. 450 ఆస్పత్రులకు 500 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆశా అధ్యక్షుడు మురళీ కృష్ణ విమర్శించారు. రేపటి నుంచి (సోమవారం) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఆస్పత్రులకు సంబంధించిన 80 వేల క్లెయిమ్‌లను ఆరోగ్యశ్రీ ట్రస్టు పెండింగ్‌లో పెట్టిందనీ, ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : అవసాన దశలో..ఆరోగ్యశ్రీ) -
ఆరోగ్యశ్రీ రోగుల విలవిల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఈ నెల 20 నుంచి ఔట్‌పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు ఓపీ, వైద్య పరీక్షలు నిలిపేశామని చెబుతున్నా ఇన్‌పేషెంట్ (ఐపీ) సేవలను కూడా అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) కింద రోజుకు సరాసరి 2 వేల మంది వరకు ఓపీ పేషెంట్లు రిజిస్టర్ అవుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద దాదాపు 13 వేల మంది ఓపీ సేవలకు వస్తుంటారు. అంటే ఈ వారం రోజుల్లో దాదాపు లక్ష మందికి పైగా ఓపీ సేవల కోసం ప్రయత్నించారు. అందులో కొందరికి మాత్రం కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో, నిమ్స్‌లో వైద్యం అందింది. కానీ మరో 50 వేల మంది వరకు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకాల కింద ఎక్కడా వైద్య సేవలు అందలేదని ఆ శాఖ వర్గాలే అంచనా వేశాయి. దీంతో ఆయా రోగులంతా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. అత్యవసర సేవలకూ బ్రేక్! నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలను పాక్షికంగా నిలిపేయడంతో అనేకచోట్ల అత్యవసర సేవలనూ నిలిపేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన రమేశ్‌బాబు అనే వ్యక్తి తన సోదరికి డయాలసిస్ కోసం నిత్యం ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తుంటారు. కానీ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయడంతో డయాలసిస్‌ను ఉచితంగా చేయడానికి ఆ ఆసుపత్రి నిరాకరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేన్సర్‌కు కీమోథెరపి వంటి చికిత్సలనూ అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. కొన్ని రకాల అత్యవసర ఫాలోఅప్ వైద్య సేవలనూ అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. దీంతో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల కార్డులపైనే ఆధారపడిన బాధితులు ఘొల్లుమంటున్నారు. రైతుబంధుకే ప్రాధాన్యం.. ఎన్నికల సమయం కావడంతో పేదలు, ఉద్యోగుల బాధను ఎవరూ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ విచిత్రమేంటంటే ఆరోగ్యశ్రీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్కారు ఆపద్ధర్మంలో ఉంటే అధికారులు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నట్లు రూ.1,200 కోట్ల బకాయిలను చెల్లించడంలో సర్కారుకు అనేక పరిమితులున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పథకానికి తప్ప వేటికీ నిధులు విడుదల చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. రైతుబంధుకు ఇప్పటివరకు రూ.3,700 కోట్లు అందజేసింది. పలు విడతలుగా సొమ్మును రైతుబంధు కింద రైతులకు పంపిణీ చేస్తుంది. దీంతో ఆరోగ్యశ్రీ సహా వేటికీ ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అయితే ప్రభుత్వ ప్రాధాన్యం ఎలా ఉన్నా నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులను పిలిపించి వారితో చర్చించి ఎలాగైనా ఒప్పించడంలో వైద్యాధికారులు విఫలమయ్యారు. ‘సర్కారు డబ్బులు ఇవ్వట్లేదు. అందువల్ల మేం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించట్లేదు. మేమేం చేయగలం’అంటూ వైద్యాధికారులు చేతులెత్తేస్తున్నారు. -
ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలు నిలిపివేత..
రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వి.రామిరెడ్డి వనస్థలిపురంలో ఉంటున్నారు. ఆయనకు మంగళవారం ఉద యం చాతి నొప్పి వచ్చింది. అది గుండెపోటా? సాధారణ నొప్పా? అర్థంకాలేదు. దీంతో సమీపంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లారు. తన వద్ద ఉన్న ఈజేహెచ్ఎస్ కార్డును చూపించారు. ఈ పథకం కింద సేవలను నిలిపివేశామని, డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు రూ. 20 వేలు చెల్లించి ఆసుపత్రిలో చేరారు. వరంగల్ పట్టణానికి చెందిన ఆర్.వెంకటమ్మ మంగళవారం ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని నెట్వర్క్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాక్షి, హైదరాబాద్ : ఇలా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకం సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నుంచి ఓపీ, డయాగ్నోస్టిక్, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇన్‌పేషెంట్ సేవల్ని నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. రూ. 1,200 కోట్ల మేరకు బకాయిలు తీర్చడంలోనూ, చర్చలు జరపడంలోనూ సర్కారు విఫలం కావడంతో మంగళవారం ఉదయం నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు అనేక ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు. దీంతో కొందరు పేదలు, ఉద్యోగులు డబ్బులు చెల్లించి వైద్యం పొందగా, మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు కిటకిటలాడాయి. 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత... రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు అందించేందుకు 236 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులూ ఉన్నాయి. దీనికితోడు మరో 67 డెంటల్ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్ఎస్ రోగులకు మాత్రమే డెంటల్ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్‌తో కలిపి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు 303 ఉన్నాయి. అందులో మంగళవారం 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినట్లు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అందులో హైదరాబాద్‌లో 66, వరంగల్ జిల్లాలో 34, రంగారెడ్డిలో 32, మేడ్చల్‌లో 27, నిజామాబాద్‌లో 14, కరీంనగర్ జిల్లాలో 13, ఖమ్మంలో 10, మహబూబ్‌నగర్‌లో 8, నల్లగొండలో 6, సంగారెడ్డిలో 5, సిద్దిపేట, జగిత్యాలలో 4, నిర్మల్‌లో 2, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకటి చొప్పున నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారితో పాటు 5.6 లక్షల మంది ఉద్యోగులు, 25 వేల మంది జర్నలిస్టులకు ఈ 303 ఆసుపత్రులు సేవలు అందిస్తాయి. ప్రతి రోజు 10 వేల మంది ఔట్పేషెంట్లు, 3 వేల మంది ఇన్ పేషెంట్ల ఆరోగ్యశ్రీ రోగులు వస్తుంటారు. ఇప్పుడు ఔట్ పేషెంట్ల సేవలనే నిలిపివేశారు. అలాగే వైద్య పరీక్షలకు కూడా బ్రేక్ పడింది. ఇక ఉద్యోగులు వెల్నెస్ సెంటర్లకు వెళ్లగా, అక్కడ చికిత్సకాని వారికి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ‘ప్రైవేటు’కు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. నిర్లక్ష్యంగా అధికారుల తీరు... వైద్య ఆరోగ్యశాఖ తీరు తీవ్ర నిర్లక్ష్యంగా ఉంది. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు పాక్షికంగా నిలిచిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. బకాయిలు పేరుకుపోయి రెండు మూడేళ్లలో 12 ఆసుపత్రులు మూతపడినా అధికారులు పట్టించుకోవడం లేదని నెట్వర్క్ ఆసుపత్రులు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. లక్ష్మారెడ్డి ఆపద్ధర్మ మంత్రి కావడంతో అధికారులే అంతా చూసుకోవాల్సి ఉన్నా మనకు పోయేదెముంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాగా, డబ్బులిచ్చి వైద్యం చేయించుకున్నా రీయింబర్స్మెంట్ బిల్లులు పాస్ కావడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా రాష్టవ్యాప్తంగా రూ. 50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. -
ఆరోగ్యశ్రీకి అస్వస్థత!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు–జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) పథకం కింద వైద్యం చేయించుకునే వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేట్, ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు నగదు రహిత వైద్య సేవలకు బ్రేక్ వేశాయి. దీంతో అనారోగ్యం పాలైన ఈ పథకాల లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇటు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలను పూర్తిగా నిలిపివేస్తామని ఆస్పత్రులు హెచ్చరిస్తున్నా ఇటు వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో చలనం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలకంగా ఉండాల్సిన ఆ శాఖ అధికారులు నగదు రహిత వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి చెప్పుకుందామంటే ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధికారులు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సొంతంగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పేదలైతే దేవుడిపైనే భారం వేశారు. అందుబాటులో లేని వైద్యాధికారులు... రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్న ఆరోపణలున్నాయి. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థంగాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నిమగ్నమవ్వడంతో తమని అడిగేవారు ఎవరూ లేరన్న ధీమా, నిర్లక్ష్యం కొందరు అధికారుల్లో కనిపిస్తోంది. మరోవైపు ఆరోగ్యశ్రీకి, ఈజేహెచ్‌ఎస్‌కు ప్రభుత్వం రూ.1,200 కోట్ల బకాయి పడిందని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోతే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి ఓపీ డయాగ్నోస్టిక్, డిసెంబర్ 1 నుంచి ఇన్‌పేషెంట్ సేవల్ని కూడా నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే ఆ సేవలు కొన్ని ఆస్పత్రుల్లో నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకాల లబ్ధిదారులకు డబ్బులకు వైద్యం చేయమన్నా ముందుకు రావడం లేదు. నగదు రహిత వైద్యం చేయలేదంటూ ఎక్కడ బాధితులు ఫిర్యాదు చేస్తారన్న భయంతో ఆస్పత్రి వర్గాలు పడకలు లేవంటూ వెనక్కు పంపిస్తున్నాయి. చర్చలు జరిపే వారేరి.. వైద్య సేవల నిలిపివేతపై ఆస్పత్రులు హెచ్చరికలు జారీచేసినా, కొన్ని వైద్య సేవలను నిలిపేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం ఆయా ఆస్పత్రుల వారిని పిలిపించి చర్చించే వారు లేకుండా పోయారన్న ఆరోపణలున్నాయి. బకాయిల్లో ఇప్పుడు ఎంత తీర్చుతారో కూడా చెప్పడం లేదని ఆస్పత్రుల వర్గాలు అంటున్నాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం రూ.1,200 కోట్ల బకాయిలు ఏమీలేవనీ, ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఆస్పత్రులు, ఇటు అధికారుల తీరుతో మధ్యన ప్రజలు, ఉద్యోగులు, జర్నలిస్టులు నలిగిపోతున్నారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు సైతం ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
ఆరోగ్యశ్రీకి అనారోగ్యం
సాక్షి,హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర సర్కారు జాప్యం చేస్తుండటంతో ఆ పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ ప్రైవేట్ ఆస్పత్రులకు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు మొత్తం రూ.1200 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఓపీ డయాగ్నోస్టిక్, డిసెంబర్ 1 నుంచి ఇన్‌పేషెంట్ సేవల్ని కూడా నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు సోమవారం తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 240 ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో రాష్ట్రవ్యాప్తంగా 240 ప్రైవేటు ఆస్పత్రులు చేరాయి. వీటిలో ఒక్క గ్రేటర్ పరిధిలోనే వందకుపైగా ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగం గా అందిస్తున్న వైద్యసేవల్లో 70% పైగా చికిత్సలు ఈ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ఒప్పందం మేర కు రోగికి చికిత్స చేసిన సదరు ఆస్పత్రికి 40 రోజుల్లో వైద్య ఖర్చులు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యంతో పాటు చెల్లిస్తున్న మొత్తంలో టీడీఎస్‌ను కూడా కట్ చేస్తే ఆస్పత్రులకు ఒక్కో సర్జరీపై రూ2 వేల నుంచి రూ. 3 వేలే మిగులుతున్నాయి. ఇలా 2015లో ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.600 కోట్లు బకాయి పడింది. అప్పట్లో ఆస్పత్రి యాజమాన్యాలన్నీ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి, తాత్కాలికంగా కొంత మొత్తాన్ని చెల్లించింది. ఆ తర్వాత పట్టించుకోకపోగా, ఏడాది నుంచి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఆ బకాయిలు మొత్తం రూ.1200 కోట్లకు పేరుకుపోయింది. దీంతో నిర్వహణ ఖర్చులు రెట్టింపవ్వడంతో ఇప్పటికే 30 ప్రైవేటు ఆస్పత్రులు మూతపడ్డాయి. భవిష్యత్తులో మరిన్ని ఆస్పత్రులు మూతపడే అవకాశం ఉంది. పెండింగ్ బకాయిల అంశంపై ఇప్పటికే అనేక సార్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈఓలకు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. లేదంటే డిసెంబర్ నుంచి సేవలను పూర్తిగా నిలిపివేయడానికి కూడా వెనుకాడబోం’అని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వి.రాకేశ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేశ్, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ కిరణ్‌లు హెచ్చరించారు. -
ఆరోగ్యశ్రీ రోగుల నుంచి డబ్బు వసూలు
సాక్షి, హైదరాబాద్: అతని పేరు సీహెచ్ సంజు... హైదరాబాద్‌కు చెందిన అతని చేతులు, కాళ్లు, నాలుక పక్షవాతానికి గురయ్యాయి. దీంతో అతన్ని గతేడాది జూలై 12న లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతనికి బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. ఆరోగ్యశ్రీ కిందే కేసును రిజిస్టర్ చేశారు. కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయడం సాధ్యంకాదని అతని నుంచి ఏకంగా రూ.6.30 లక్షలు ఒత్తిడి చేసి మరీ వసూలు చేశారు. ఆమె పేరు జంగమ్మ... భువనగిరి జిల్లాకు చెందిన ఆమె కిడ్నీలో రాళ్ల సమస్యతో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద రోగిని చేర్చుకున్నారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసినట్లు వైద్యులు ప్రకటించినా, ఎక్కడా ఆపరేషన్ చేసిన గుర్తులు లేవు. దీనిపై నిలదీయగా అప్పటికప్పుడు ఆమెను పిలిపించి బ్లేడ్‌తో పక్కటెముక వద్ద కోసి వెంటనే కుట్లు వేశారు. ఎలాంటి మత్తుమందు కూడా ఇవ్వలేదు. ఫొటోలు తీసుకొని బయటకు పంపించారు. దీనిపై విచారణ చేయగా ఆస్పత్రిదే తప్పని తేలింది. చికిత్స చేయకుండానే వారు ఆరోగ్యశ్రీ కింద సొమ్ము చేసుకున్నారు. ఇలా రాష్ట్రంలో అనేక ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ రోగులను మోసం చేస్తూ నుంచి డబ్బులు గుంజుతున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇలా 200 మంది మోస పోయినట్లు విజిలెన్స్ నిర్ధారించినట్లు సమాచారం. ఆస్పత్రులకు అండగా అధికారులు.. 200 మంది ఆరోగ్యశ్రీ రోగులను మోసం చేయడం, వారి నుంచి డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే అవకాశమున్నా రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం నేరం. అలాచేస్తే రోగి నుంచి వసూలు చేసిన సొమ్ములో ఐదు రెట్ల వరకు ఆస్పత్రికి జరిమానా విధించాలి. కానీ అనేక కేసుల్లో అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమయ్యారు. కొన్ని కేసుల్లో బాధితులకు వారు చెల్లించిన సొమ్మును ఇప్పించి ఊరుకున్నారు. ఉదాహరణకు బాధితుని నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తే ఆస్పత్రిపై రూ.30 లక్షల జరిమానా విధించాలి. కానీ బా« దితులకు రూ.6 లక్షలు ఇప్పించి, కొందరు అధికారులు 4, 5 లక్షలు పుచ్చుకొని కేసును మూసేశారన్న ఆ రోపణలూ ఉన్నాయి. తాము అడిగినంత ఇవ్వని ఆ స్పత్రు లపై కఠిన చర్యలు తీసుకుని, ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తూ ఆరోగ్యశ్రీ రోగులను వేధించిన వారిపై మాత్రం చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులపై శీతకన్ను... ఇదిలావుంటే నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులను చులకనగా చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి కేటాయించే వార్డులు, అందించే వైద్యం విషయంలో నాణ్యతా లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విమర్శలున్నాయి. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. రోగులనుంచి తీసుకుంటే ఊరుకోవడంలేదు. కాబట్టి అంతకంటే ఎక్కువ సౌకర్యాలు ఏం కల్పించగలం అన్న భావన ఆస్పత్రి వర్గాల్లో నెలకొంది. ఇవన్నీ తెలిసినా ఆరోగ్యశ్రీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ నెట్వర్క్ ఆస్పత్రుల సొమ్ము చేసుకునే కేంద్రాలుగా భావిస్తూ లక్షలు గడిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
3 లక్షల మందికి ‘కంటి వెలుగు’
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ఇంటింటా కొత్త వెలుగును తీసుకొస్తోంది.. ఈ కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు కలుగుతోంది.. కంటి వైద్యశిబిరాలకు జనం భారీగా తరలివస్తున్నారు.. మూడురోజుల్లోనే మూడు లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఆరోగ్యశ్రీ’ని ప్రారంభించినప్పటి మాదిరిగా ‘కంటి వెలుగు’కు భారీ స్పందన కనిపిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మూడు రోజుల్లో మూడు లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. పరీక్షల వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు. ఈ నెల 15న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. శని, ఆదివారాలు సెలవుల అనంతరం సోమవారం నుంచి పరీక్షలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలు 8 గంటలకే వచ్చి సాయంత్రం ఐదు దాటినా బారులు తీరుతున్నారని అంటున్నారు. ఒక్కోసారి రాత్రి ఏడు గంటల వరకు శిబిరాలు నడుపుతున్నామని అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. బలహీన వర్గాలే అధికం... కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బడుగు, బలహీన వర్గాలు, పేదలే అధికం. వారిలో వయసు మీరినవారే ఎక్కువ. మూడు లక్షల మందిలో దాదాపు 50 వేల మంది ఎస్సీలు, 18 వేల మంది ఎస్టీలు, లక్షన్నర మంది బీసీలు, మైనారిటీలు దాదాపు 19 వేల మంది ఉన్నారు. దాదాపు 45 వేల మందికి రీడింగ్ గ్లాసులు ఇవ్వగా, మరో 48 వేల మందికి కంటి అద్దాల కోసం చీటీ రాసిచ్చారు. 41 వేల మందికి క్యాటరాక్ట్ లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరో 2 వేల మందికి సంక్లిష్టమైన క్యాటరాక్ట్ ఉన్నట్లు నిర్ధారించారు. దాదాపు 80 వేల మందికి తదుపరి వైద్య సేవలు అవసరమని గుర్తించారు. అధికారుల్లో ఆందోళన... కంటి వెలుగు కార్యక్రమం కింద 40 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు, మూడు లక్షల మందికి కంటి శస్త్రచికిత్సల అవసరం పడుతుందని అధికారులు భావించారు. శస్త్రచికిత్సలు చేసే క్రమంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భయపడుతున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ శిబిరంలో 68 ఏళ్ల వృద్ధురాలు చనిపోవడంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని కిందిస్థాయి అధికారులకు సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. -
‘వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ’ జిందాబాద్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టినందుకో, మరెందుకోగానీ కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలోని ‘వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ’ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పేదల పెన్నిదిగా ఈ పథకం సవ్యంగా అమలు జరుగుతోంది. 2010లో అప్పటి బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇది వేలాదిమంది పేద ప్రజలకు ప్రాణభిక్ష పెట్టింది. కర్ణాటక పేద ప్రజలను ఎక్కువగా పీడిస్తున్న క్యాన్సర్, గుండె జబ్బుల వైద్యం కోసం ఇల్లూ వాకిలి అమ్ముకునే పరిస్థితి నుంచి వారిని కాపాడుతూ వస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) పేద ప్రజలందరికి ఈ స్కీమ్ కింద ఉచితంగా వైద్య సేవలు బేషుగ్గా అందుతున్నాయి. అంటే బీపీఎల్ కార్డులున్న వారందరికి ఈ ఆరోగ్య శ్రీ కార్డులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆరోగ్య ట్రస్టు పరిధిలో నడుస్తున్న ఈ పథకాన్ని ప్రశంసిస్తూ ‘బీఎంజే గ్లోబల్ హెల్త్’ గతేడాదే ఓ నివేదికను విడుదల చేసింది. ఈ స్కీమ్ లేనివారితో పోలిస్తే ఈ స్కీమ్ కలిగిన వారు 40 శాతానికిపైగా ఆస్పత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. ఈ స్కీమ్ లేకుండా తీవ్రమైన జబ్బులకు గురైన వారి సంఖ్యతో పోలిస్తే వారిలో ఈ స్కీమ్ లబ్ధిదారులు 35 శాతానికన్నా తక్కువగా ఉన్నారు. అంటే, స్కీమ్ లబ్ధిదారులు ప్రాథమిక దశలోనే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం వల్ల వారిలో ఎక్కువ మంది తీవ్రమైన జబ్బుల బారిన పడలేదు. స్కీమ్ పరిధిలోకి రానివారిలో క్యాన్సర్, గుండె జబ్బుల కారణంగా 0.90 శాతం మరణిస్తే ఈ స్కీమ్ లబ్ధిదారుల్లో 0.30 శాతం మంది మాత్రమే మరణించారు. స్కీమ్ పరిధిలోకి రానివారు ఆస్పత్రుల్లో చేరాక ఇన్ఫెక్షన్లు వచ్చిన వారిలో ఈ స్కీమ్ లబ్ధిదారులు 88 శాతం మంది తక్కువగా ఉన్నారు. అంటే, స్కీమ్ పరిధిలో లేని వారికి నూటికి నూరు శాతం ఇన్ఫెక్షన్లు వచ్చాయనుకుంటే స్కీమ్ లబ్ధిదారుల్లో 12 శాతం మందికే ఇన్ఫెక్షన్లు వచ్చాయన్నమాట. వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ పథకం కేసుల్లో 86.7 శాతం కేసులు సముచితమైనవి కాగా, 3.7 శాతం కేసులు మాత్రమే అనుమానాస్పదమైనవని బీఎంజే గ్లోబల్ హెల్త్ తన నివేదికలో వెల్లడించింది. ఈ స్కీమ్ కింద సాధారణంగా ఏడాదికి లక్షన్నర రూపాయలను, కొన్ని అసాధరణ కేసుల్లో రెండు లక్షల రూపాయలను బీమాగా ఖర్చు పెడుతున్నారు. రోగులు తమ ఇంటి నుంచి, తమ ఊరు నుంచి ఆస్పత్రికి వచ్చేందుకు అయ్యే ఖర్చులను కూడా ట్రస్టు భరిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలం స్థాయిలోనే కాకుండా ట్రస్టు సూచించిన పట్టణం లేదా గ్రామంలో ప్రతివారం నెట్వర్క్ ఆస్పత్రులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆరోగ్యాలను సమీక్షిస్తున్నాయి. ఈ స్కీమ్ ఇంతగా విజయం సాధించడానికి కారణం ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించకుండా ప్రభుత్వ ట్రస్టు ఆధ్వర్యంలో నడవడమేనని పలు పరిశోధనా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమలు చేయనున్న ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా పథకం అమలును ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించాలా? లేదా స్వచ్ఛంద సంస్థల ట్రస్టులకు అప్పగించాలా? అని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. వాజ్‌పేయి ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్న ప్రభుత్వ ట్రస్టును ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందేమో! -
వైద్యం.. ‘ప్రైవేట్’కు నైవేద్యం!
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారం ‘ప్రైవేట్’కు దాసోహం అన్నట్లుగా ఉంటోంది. గత నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయల విలువ చేసే సేవలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేశారు. సర్కారు తీరుతో కార్పొరేట్ కంపెనీలకు ‘కోట్ల’ వర్షం కురుస్తుంటే పేదల రోగుల పరిస్థితి మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోంది. ఫలితంగా.. ప్రమాదకర జబ్బు దాపురిస్తే ఆరోగ్యశ్రీలో వైద్యమందుతుందో లేదో తెలియని పరిస్థితి. ఆపదలో 108కు ఫోన్‌చేస్తే వచ్చే వరకూ నమ్మకంలేదు.. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ నెలవారీ మందులు తీసుకుందామని ఎదురుచూసే వృద్ధులకు 104 వాహనం దైవాధీనం. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మంత్రం జపిస్తుండడంతో ఆస్పత్రుల్లో వేలాది ఖాళీలున్నా పట్టించుకునే దిక్కులేదు. మెడికల్, పారా మెడికల్, నర్సింగ్, ఏఎన్ఎం కోర్సులు పూర్తిచేసిన లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధిలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ డాక్టరు ఉంటాడో లేదోననే అపనమ్మకంలో రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేద రోగికి భరోసా ఇచ్చిన పథకాలన్నీ వ్యయ భారం పేరుతో మిణుకు మిణుకుమంటున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రైవేటు కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని అధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. –సాక్షి, అమరావతి ఆరోగ్య శాఖపై మాయని మచ్చ ఇప్పటివరకూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఒక పెద్దాసుపత్రిలో అది కూడా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న శిశువు.. ఎలుకలు కొరికిన కారణంగా మృత్యువాత పడిన ఘటన చవిచూడలేదు. గుంటూరు పెద్దాసుపత్రిలో ఈ విషాదం జరిగింది. రాష్ట్రంలో ఆస్పత్రుల దుస్థితి ఎలా ఉందో యావత్ దేశానికి ఈ దుర్ఘటన చాటిచెప్పింది. సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి.. సర్కారు నిర్లక్ష్యం ఇందుకు కారణాలు. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు అంపశయ్యపై మూలుగుతోంది. జాబితాలో మొత్తం 934 జబ్బులకు గాను టీడీపీ హయాంలో 133 జబ్బులను తొలగించారు. హైదరాబాద్‌లో వైద్యాన్నీ నిరాకరిస్తున్నారు. దీంతో కిడ్నీ, తలసేమియా బాధితుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యశ్రీ పథకం ఖర్చుతో కూడుకున్నదన్న భావనతో దానిని రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారు. 108, 104ల రాక దేవుడికెరుక అలాగే, రాష్ట్రంలో 2014 తర్వాత 108, 104 వాహనాల సేవలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. నిధులు కేటాయించకపోవడంతో 108లు అవసాన దశకు చేరాయి. మరమ్మతులకు, డీజిల్‌కూ డబ్బుల్లేవని ఆగిపోయిన సందర్భాలు అనేకం. వేతనాలు సకాలంలో ఇవ్వడంలేదని ఉద్యోగులు రోడ్డెక్కారు కూడా. ఇక పల్లెలకు వెళ్లాల్సిన 104 వాహనాలు ఎప్పుడెళ్తాయో, మందులెప్పుడిస్తాయో దేవుడికే ఎరుక. ఇదిలా ఉంటే.. ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న 1604 మంది ఆరోగ్యమిత్రలను తొలగించారు. చివరకు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి కొనసాగుతున్నారు. అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా 450 హోమియో డిస్పెన్సరీలను మూసేయగా, అందులో 950 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. తాజాగా 102 కాల్సెంటర్లలో పనిచేస్తున్న 28 మంది మహిళా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒక్క ఉద్యోగ నియామకమూ లేదు రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లో వైద్యులు లేక రోగులు విలవిల్లాడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ హోదాల్లో 25వేలకు పైగా ఖాళీలున్నట్టు అంచనా. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నియామకాన్ని కూడా చేపట్టలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో వైద్యుల్లేక పల్లెల్లోని ప్రజానీకం నానాయాతన పడుతున్నారు. మరోవైపు.. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు ఇలా పలు విభాగాల్లో వేలాది ఖాళీలు ఉన్నా పట్టించుకోవడంలేదు. కార్పొరేట్ సేవలో.. రాష్ట్రంలో ఇప్పటివరకూ సుమారు 26 రకాల సేవలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పారు. ఆయా సంస్థలకు కోట్లాది రూపాయలు ధారాదత్తం చేశారు. రక్తపరీక్షల నుంచి ఎక్స్‌రేల వరకూ అన్నీ ప్రైవేటు సంస్థలకే. ఇక 104, 102 వంటివన్నీ కార్పొరేట్ సంస్థలకే ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిని కూడా ప్రైవేటుకు అప్పజెప్పారు. విశాఖలోని విమ్స్‌ను ప్రైవేటుపరం చేసేందుకు కసరత్తు దాదాపు పూర్తయింది. అలాగే, గడిచిన నాలుగేళ్లలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన పనులన్నీ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చారు. ఈ బాగోతంలో కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డయాలసిస్, హెచ్ఐవీ బాధితులకు మొండిచేయి డయాలసిస్ చేయించుకునే బాధితులకు నెలకు రూ.2,500లు చొప్పున పెన్షన్ ఇస్తామని సర్కారు హామీ ఇచ్చింది. హెచ్ఐవీ బాధితులకు కూడా నెలకు రూ.వెయ్యి పెన్షన్ ఇస్తామన్నారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20వేల మంది డయాలసిస్ బాధితులుంటే 2వేల మందికే ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఇవ్వడంలేదు. అంతేకాక, సుమారు 70వేల మంది హెచ్ఐవీ బాధితులు నాలుగేళ్లుగా పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నారు. -
గాడితప్పుతున్న ఆరోగ్యశ్రీ!
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ గాడితప్పుతోంది. పథకంపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేకపోవడం, ఇతర సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తుండటంతో సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులతో కలసి పలువురు అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి పరిశీలనలోనూ ఇవే అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో వైద్య శాఖ పనితీరు, కేంద్ర పథకాల అమలును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్.. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించి వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇన్చార్జి సీఈవో కె.మనోహర్ ఇచ్చిన నివేదికపై ప్రీతి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. రోగులకు అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని, నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రస్టు సీఈవో చెప్పగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో లోపాలు సరిదిద్దాలని సూచించారు. -
నిమ్స్‌లో తప్పని నిరీక్షణ
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన మల్లారెడ్డి మెదడులో కణితి ఏర్పడింది. చికిత్స కోసం ఇటీవల ఆయన నిమ్స్ వైద్యులను ఆశ్రయించాడు. ఇప్పటికే చాలామంది వెయిటింగ్లో ఉన్నారని, చికిత్స చేయాలంటే కనీసం నెల రోజులు ఆగాలని వైద్యులు సూచించారు. రాజేంద్రనగర్‌కు చెందిన వరాల నారాయణ వెన్నునొప్పితో వైద్యులను ఆశ్రయించగా, ఆపరేషన్ థియేటర్లు ఖాళీగా లేవని, రెండు నెలల తర్వాత రావాలని చెప్పారు. ఇలాగే మెదడులో కణతులు, వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న పలువురు రోగులు నిమ్స్‌లో చికిత్స కోసం నిరీక్షిస్తున్నారు. ఆ ఆస్పత్రులు నిరాకరించడం వల్లే.. రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మెదడులో రక్తం గడ్డకట్టిన ఆరోగ్యశ్రీ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో తల గాయాల చికిత్సకు కేవలం రూ.70 వేల వరకే ఇస్తుండటంతో అవి తలగాయాల బాధితు లను చేర్చుకోవడం లేదు. దీంతో వారంతా నిమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే కేసుల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. రోజూ వచ్చిపడుతున్న అత్యవసర కేసులకు తోడు మెదడులో కణతులు, వెన్ను, మెడ నొప్పి బాధితులు కూడా వచ్చి చేరుతున్నారు. వీరందరికీ చికిత్స చేసే సదుపాయాలు ఆస్పత్రిలో లేకపోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు. కాలంచెల్లిన వాటితోనే... నిమ్స్‌లో 1991లో డాక్టర్ రాజారెడ్డి హయాం లో సమకూర్చిన వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లే నేటికీ దిక్కవుతున్నాయి. మరోవైపు న్యూరో సర్జరీ వైద్యులు ఎక్కువ శాతం సదస్సులు, సమావేశాల పేరుతో విదేశాల్లోనే గడుపుతున్నారు. ఆ విభాగాధిపతే తరచూ విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ టేబుల్స్, అనస్థిషియన్ల్ కొరత సాకుతో ఇక్కడి కేసులను వాయిదా వేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లోని సర్జరీలకు హాజరవుతున్నారు. -
అపరసంజీవని.. ఆరోగ్యశ్రీ
► 1.91 లక్షల నిరుపేదల పాలిట వరంగా మారిన వైఎస్ మానసపుత్రిక ► పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకం ► రూ.496.36 కోట్ల విలువైన వైద్య సేవలు ► దివంగత నేత వైఎస్సార్ ఈ పథకం ప్రవేశపెట్టి నేటితో పదేళ్లు ► వైఎస్సార్ మేలు మరువలేమంటున్న లబ్ధిదారులు నల్లగొండటౌన్/చిలుకూరు/మునగాల/భువనగిరి : పేదలు చేతిలో చిల్లగవ్వలేకున్నా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్య సదుపాయం పొందే పథకం రాజీవ్ ఆరోగ్య శ్రీ. ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 మార్చి 31న ప్రవేశపెట్టారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు అనే భేదం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హైదరాదాద్, విజయవాడ, గుంటూరు, ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ సూర్యాపేట ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వివిధ రకాల జబ్బులకు చికిత్సలు చేయించుకున్నారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవలను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షా 91 వేల 896 మంది వివిధ రకాల శస్త్ర చికిత్సలను ఉచితంగా పొందారు. సుమారు రూ. 496,36,592 విలువ గల వైద్య సేవలను ఈ పథకం ద్వారా నిరుపేదలు ఉచితంగా పొంది ప్రాణాలను దక్కించుకున్నారు. ముఖ్యంగా ఖరీదైన గుండె, మూత్రపిండాలు, ఊపిరి తిత్తుల, కీళ్లు, మెదడు, కేన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, మూత్రకోశ వంటి వ్యాధులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందారు. అదే విధంగా నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రస్తుతం క్రిటికల్ కేర్, ఈఎన్టీ సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గర్భకోశ వ్యాధులు, ఆర్ధోపెడిక్ సర్జరీలు, పీడియాట్రిక్ , ప్లాస్టిక్ సర్జరీ, పాలిట్రామా, శ్వాసకోశ వ్యా«ధులకు సంబంధించిన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలను ఈ పథకం ద్వారా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకుంటే తాము ఏమైపోయే వారమో అని, ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి వైఎస్‌రాజశేఖరరెడ్డి తమకు ప్రాణభిక్ష పెట్టారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఆరు ఆస్పత్రుల్లో సేవలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో ఆరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం కింద సేవలు అందుతున్నాయి. సూర్యాపేట, హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రులు, విజయకృష్ణ మల్టీస్పెషల్ ఆసుపత్రి(సూర్యాపేట), శోభా డెంటల్, శ్రీలక్ష్మి డెంటల్ ఆస్పత్రులు(సూర్యాపేట), నిత్యశ్రీ డెంటల్ అస్పత్రి(కోదాడ)లో ఈ సేవలు అందుతున్నాయి. ఈ పథకమే నన్ను కాపాడింది 2013లో నాకు గుండెజబ్బు రాగా చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తారని చెప్పారు. వెంటనే నన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి డాక్టర్లు నన్ను బతి కించారు. ఈ ఆపరేషన్‌కు నాకు రూ.70వేలు ఖర్చు కాగా ప్రభుత్వమే భరించింది. ఆరోగ్యశ్రీ పథకం మేలు ఎప్పటికి మరచిపోలేను.-గుంటకండ్ల పిచ్చిరెడ్డి, విజయ్‌నగర్ కాలనీ, నాగారం ఎళ్లవేళలా రుణపడి ఉంటాం.. నేను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని, నాకు గుండె కవాటాలు మొత్తం మూసుకుపోయాయి. దీంతో వైద్యులు ఓపెన్ సర్జరీ చేయాలని, ఇందుకోసం రూ.ఐదులక్షలు ఖర్చువుతుందని తెలిపారు. వైద్యం చేయించుకోలేని స్థోమత లేని నాకు ఆరోగ్యమిత్ర ఇచ్చిన సలహాతో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారు. ఈ పథకం ప్రవేశపెట్టిన మహానుభావుడు వైఎస్సార్‌కు మాకుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటాం.– తంగెళ్ల సత్యనారాయణ, మునగాల, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు