![Rs.203 Crores Released to network hospitals in AP](/styles/webp/s3/article_images/2024/05/22/AP_Aarogyasri.jpg.webp?itok=AZRpK_kL)
ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ లక్ష్మషా
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్లు బిల్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) డాక్టర్ లక్ష్మిషా మంగళవారం తెలిపారు.
మిగతా బిల్లుల చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి రోగులకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున సంగతి తెలిసిందే. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ లక్ష్మిషా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment