వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం వై ఎస్ జగన్‌ | CM Jagan Launched YSR Arogyasri Pilot Project in West Godavari - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం జగన్‌

Published Fri, Jan 3 2020 11:54 AM | Last Updated on Fri, Jan 3 2020 1:26 PM

CM YS Jagan Launches YSR Aarogyasri Polite project In West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు: ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాగా ఆరోగ్య శ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా.. అదనంగా మరో 1000 చేర్చి మొత్తం 2,059 వ్యాధులకు సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అం‍తకు ముందు ముఖ్యమంత్రి.. ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, రఘురామకృష్ణమ రాజు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద‍్యం
కాగా ఈ ప్రాజెక్టు అమల్లో అనుభవాలు, ఇబ్బందుల్ని బేరీజు వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. 

నాడు వైఎస్సార్‌.... నేడు వైఎస్‌ జగన్‌
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్‌ 1న ఏలూరు వేదికగా  ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభించడం విశేషం.  

చదవండిఆరోగ్య ధీమా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement