
సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్యానికి సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అద్భుత పథకమని, దీనిని తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేస్తుందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని ఆయన నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనూ ఆరోగ్యశ్రీ కేసులను చేర్చుకోవడంలేదని, సర్కారు నిధులు ఇవ్వనందున డబ్బులు కట్టి చేరాలని పేదల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment