1,672 ప్యాకేజీలలో 1,375 రేట్లను సవరించాలని సర్కారు నిర్ణయం
2013 తర్వాత మొదటిసారి రేట్లను సవరించిన ప్రభుత్వం
సగటున 20–25 శాతం వరకు ధరలను పెంచామన్న మంత్రి దామోదర
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్ వర్క్ ఆసుపత్రులలో రోగు లకు అందించే చికిత్సల రేట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. 2013 తర్వాత కొత్త ధరలను ప్రకటించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చోంగ్తు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రేట్ల సవరణపై అధ్యయనం కోసం ప్రభుత్వం వేసిన కమిటీ.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ప్రైవేట్ ఆసుపత్రుల లోని మెడికల్, సర్జికల్ విభాగాల నిపుణు లతో చర్చించి మొత్తం 1,672 ప్యాకేజీలలో 1,375 ప్యాకేజీ రేట్లను సవరించాలని నిర్ణయించింది. మిగి లిన ప్యాకేజీ ధరలు మారవని తెలిపింది. 2013 నుంచి 2024 వరకు ధరల సవరణపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున 20–25 శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 163 కొత్త చికిత్సలు: ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తు తం ఉన్న వ్యాధులకు అదనంగా 163 కొత్త ప్రొసీ జర్లను చేర్చారు. ఈ మేరకు మరో ఉత్తర్వు విడుదల చేశారు. దీంతో మొ త్తం ప్రొసీజర్ల సంఖ్య 1,835కి పెరిగింది. కొత్త ప్రొసీజర్స్‌తో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకో బోతున్నామని మంత్రి దామోదర తెలిపా రు. 79 లక్షల కుటుంబాలను ఆరోగ్యపరంగా ప్రభుత్వం అదుకుంటుందని చెప్పారు.
2007లో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఆ సందర్భంగా 120 ఆసుపత్రుల్లో 533 వ్యాధు లకు చికిత్సలను అందుబాటు లోకి తెచ్చా రని దామోదర గుర్తుచేశారు. 2022లో 830 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయన్నారు. 90.10 లక్షల మంది ఆరోగ్యశ్రీకి అర్హులుగా ఉన్నారన్నా రు. 1,356 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధి లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఆరోగ్య శ్రీలో కొత్తగా 163 ప్రొసీజర్లను ప్రవేశపెట్టి న నేపథ్యంలో వాటి వివరాలను ప్రభుత్వం జీవోలో పొందుపరిచింది. అందులో ప్రధా నంగా టైప్–1 డయాబెటీస్‌కు ఇన్సులిన్ పంప్స్ ప్యాకేజీ కింద ఏడాదికి ఒక రోగికి రూ. 2 లక్షల వరకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment