
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనాకు సంబంధించి 15 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజి నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కనీస మొత్తం గా 16 వేల నుంచి గరిష్టంగా 2.16 లక్షల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment