
సాక్షి, విజయవాడ: ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్పు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గా ఉన్న పథకానికి 2007లో దివంగత మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుని సైతం కూటమి ప్రభుత్వం మార్చేసింది. నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్‌గా పేరు మార్పు చేసింది.
కాగా, కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల పేర్లను కూడా మార్పు చేసింది. ఈ–క్రాప్‌ను ఈ–పంట, వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్‌ను అన్నదాత సుఖీభవ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకాన్ని వడ్డీ లేని రుణాలు, డాక్టర్ వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బివై), వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ఫామ్ మెకనైజేషన్ స్కీమ్, డాక్టర్ వైఎస్‌ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు, వైఎస్‌ఆర్ యంత్రసేవ కేంద్రాలను విలేజ్/క్లస్టర్ సీహెచ్‌సీలు, వైఎస్‌ఆర్ యాప్‌ను వీఏఏ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్‌గా పేర్లు మార్పు చేసింది. ఇక నుంచి మార్పు చేసిన పేర్లను మాత్రమే వినియోగించాలని వ్యవసాయ యంత్రాంగాన్ని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment