సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన 62 ఏళ్ల మున్నీరెడ్డి కృష్ణారెడ్డికి ఈనెల 12న బెంగళూరులోని నారాయణ హార్ట్ సెంటర్‌లో ఉచితంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రోగి వేగంగా కోలుకుంటున్నారని పేర్కొంది. నాలుగేళ్ల నుంచి గుండె వ్యాధితో బాధపడుతున్న కృష్ణారెడ్డికి ఆపరేషన్ కోసం రూ.11 లక్షలు కేటాయించినట్లు తెలిపింది.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడం కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలను 2019 నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆరునెలల్లో బెంగళూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రెండు గుండెమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఉచితంగా సేవలను అందించినందుకు సీఎంకు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, హాస్పిటల్ సిబ్బందికి కృష్ణారెడ్డి బంధువులు ధన్యవాదాలు తెలిపారు.
చదవండి:
‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ
టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు
Comments
Please login to add a commentAdd a comment