free heart transplantion
-
ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన 62 ఏళ్ల మున్నీరెడ్డి కృష్ణారెడ్డికి ఈనెల 12న బెంగళూరులోని నారాయణ హార్ట్ సెంటర్లో ఉచితంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రోగి వేగంగా కోలుకుంటున్నారని పేర్కొంది. నాలుగేళ్ల నుంచి గుండె వ్యాధితో బాధపడుతున్న కృష్ణారెడ్డికి ఆపరేషన్ కోసం రూ.11 లక్షలు కేటాయించినట్లు తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడం కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలను 2019 నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆరునెలల్లో బెంగళూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రెండు గుండెమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఉచితంగా సేవలను అందించినందుకు సీఎంకు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, హాస్పిటల్ సిబ్బందికి కృష్ణారెడ్డి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు -
ఆంధ్రా హాస్పిటల్స్‌లో విద్యార్థులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు
విజయవాడ: విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆంధ్రా మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించనున్నట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగం చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌కు చెందిన ఎనిమిది మంది సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన గవర్నర్‌పేటలోని ఆస్పత్రి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 18 ఏళ్లలోపు చిన్నారులు తమను సంప్రదించాలని సూచించారు. తొలుత వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, వారం రోజుల్లో నిర్వహించనున్నటు తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ 94946 06677, 94942 54206ను సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.