
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్‌లో రూ.11,399 కోట్లు కేటాయించారు. దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్‌వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అన్నారు. 108 అంబులెన్స్‌లకు రూ.143 కోట్లు కేటాయించారు.
వైద్యరంగానికి చేయూత..
- ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.1500 కోట్లు
- ఆశావర్కర్లకు పెంచిన రూ.10 వేల వేతనానికి రూ.455 కోట్లు
- మెడికల్ భవనాలకు రూ.68 కోట్లు
- వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాలకు రూ.66 కోట్లు
- ప్రభుత్వ మెడికల్ కళాశాల-గురజాలకు రూ.66 కోట్లు
- ప్రభుత్వ మెడికల్ కళాశాల-విజయనగరంకు రూ.66 కోట్లు
- పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ. 50 కోట్లు
- రాష్ట్ర కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు రూ.43 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment