Health sector
-
2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్
సాక్షి, అమరావతి: ఆదాయపరంగా దేశంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య రంగం నిలుస్తోంది. ఆస్పత్రులకు వెళ్లాల్సిన పని లేకుండానే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్లోనే వైద్యులతో సంప్రదింపులు, మందులు ఇంటికే పంపడం వంటివాటితో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువ ఖర్చుకే వైద్యం లభిస్తుండటంతో విదేశీయులు చికిత్సల కోసం మనదేశానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 2025 నాటికి దేశ ఆరోగ్య సంరక్షణ రంగం 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించింది. బజాజ్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం.. » 2016లో 110 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆరోగ్య రంగం మార్కెట్ 2023 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేరుకుంది. » 2016–23 మధ్య 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. గత పదేళ్లలో 17.5 శాతం సీఏజీఆర్ చోటు చేసుకుంది. » ప్రధానంగా ఆస్పత్రులు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, ఇతర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. » 2021లో ఫార్మా మార్కెట్ 42 బిలియన్ డాలర్లు ఉండగా 2024లో 65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే డ్రగ్స్, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఆశాజనకమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. నాలుగు రెట్లు పెరిగిన మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె, కిడ్నీ, తదితర ప్రధానశస్త్రచికిత్సలకు వ్యయం 20 శాతంపైగానే తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2020 నుంచి 2024 మధ్య దేశంలో మెడికల్ టూరిజం నాలుగు రెట్లు పెరిగింది. 2024లో 7.69 బిలియన్ డాలర్లుగా ఉన్న మెడికల్ టూరిజం మార్కెట్ 2029 నాటికి 14.31 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2048 నాటికి 12% పడకలు పెరుగుదలటైర్ 2–6 నగరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్‌లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. 2048 నాటికి దేశంలోని ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 12 రెట్లు పెరగనుంది. అయితే జపాన్‌లో ప్రతి వెయ్యి మందికి 13, చైనాలో 4.3, అమెరికాలో 2.9 చొప్పున పడకలు ఉండగా మన దేశంలో 1.3 మాత్రమే ఉన్నాయి. ఇక 2018తో పోలిస్తే 2022 నాటికి దేశంలో వైద్యుల సంఖ్య 1.1 రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2021 నివేదిక ప్రకారం.. ఆరోగ్య రంగంపై దేశ జీడీపీలో అమెరికా 17.4, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) 12.4, కెనడా 12.3 శాతం చొప్పున వెచ్చించాయి. భారత్ 3.3 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది. -
ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్, ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' ఆదివారం స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.ఇలాన్ మస్క్ (Elon Musk), ప్రాంతీయ రాజధాని డెన్‌పసర్‌లోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ప్రైవేట్ జెట్ ద్వారా ఇండోనేషియా రిసార్ట్ ద్వీపం బాలికి చేరుకున్నారు.ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల దేశంలోని సుదూర ప్రాంతాల్లోని లక్షలాది మంది ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడానికి సహాయపడుతుందని మస్క్ పేర్కొన్నారు. తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాలకు కనెక్టివిటీని తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ప్రజలు ఏమైనా నేర్చుకోవచ్చు.ఇండోనేషియా ప్రభుత్వం దేశంలోని గొప్ప నికెల్ వనరులను ఉపయోగించి ఈవీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. కాబట్టి టెస్లా ఆ దేశంలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఇండోనేషియాలో టెస్లా తయారీ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. -
మందులకు భారీగా వ్యయం
సాక్షి,అమరావతి: వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోగులకు సరఫరా చేసే మందుల విషయంలోనూ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మందుల సరఫరాకే ఏకంగా రూ.2,230 కోట్లను ఖర్చుచేసింది. గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలుగల మందులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తీవ్ర కటకట ఉండేది. ఆ పరిస్థితులకు చెక్ పెడుతూ సరఫరా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు, మందుల బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. దీంతో ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. రూ.200 కోట్ల నుంచి రూ.500కోట్లకు పెంపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా కోసం ఏటా సుమారు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసేవారు. ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి సరిపడా మందుల బడ్జెట్ ఉండేది కాదు. కేవలం 229 రకాల మందులను మాత్రమే అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో ఆస్పత్రుల్లో మందులకు తీవ్ర దుర్భర పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. ఆస్పత్రుల్లో మందుల కోసం బడ్జెట్‌ను పెంచింది. ఏటా రూ.500 కోట్ల మేర బడ్జెట్‌ను కేవలం మందుల సరఫరాకే వె చ్చిస్తోంది. అంతేకాక.. మందుల సంఖ్యను 608కు పెంచింది. ఇలా 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం మందుల సరఫరాకే రూ.2,230 కోట్ల మేర ఖర్చుచేశారు. దీన్నిబట్టి పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపునకు పైగా ఈ ప్రభుత్వం మందుల కోసం ఖర్చుచేసినట్లు స్పష్టమవుతోంది. విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 172, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన పెద్ద ఆస్పత్రులకు అక్కడి అవసరాలకు అనుగుణంగా నిరంతరం సరఫరా చేస్తున్నారు. గ్రామ స్థాయిలోనే 105 రకాల మందులు.. ఇక గ్రామస్థాయిలోనే 105 రకాల మందులను విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేకూరుస్తోంది. గత టీడీపీ హయాంలో జ్వరం, దగ్గు, తలనొప్పి వస్తే డోలో, పారాసెటిమాల్ కూడా లభించని దుస్థితి గ్రామాల్లో ఉండేది. ఈ పరిస్థితులకు చెక్‌పెడుతూ ఏకంగా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ రూపంలో మినీసైజ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. వీటిలో 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, ఏకంగా 105 రకాల మందులు ఉంటున్నాయి. దీంతో థైరాయిడ్, యాంటి థైరాయిడ్, రక్తంలో కొలె్రస్టాల్ సాంద్రతను తగ్గించే మెడిసిన్, హృదయనాళ సంబంధిత సమస్యలకు వాడే మందులు, యాంటి టీబీ మెడిసిన్, యాంటి లెప్రసీ మెడిసిన్, యాంటి ఎపిలెప్సీ మెడిసిన్, ఇతర ఔషధాలు గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్యులు వెళ్తున్నారు. మరోవైపు.. టెలీ మెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్లు ఇక్కడే లభిస్తున్నాయి. ఈ వైద్యుల ప్రి్రస్కిప్షన్ మేరకు విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉచితంగా ప్రజలకు మందులు అందిస్తున్నారు. -
టెక్నాలజీ ఎక్కడికి దారితీస్తుందో గానీ, మున్ముందు వైద్యమంతా ఏఐ మయమే!
మనిషి మెదడు, కృత్రిమ మేధ రెండింట్లో ఏది గొప్ప అన్న చర్చ ఇప్పటిది కాదు. ఏఐ చాట్బాట్ల రాకతో ఇది మరింత ఊపందుకుంది. ఏఐ వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావనేది ఒక వాదన. దీనివల ఉద్యోగావకాశాలు తగ్గిపోవడమే గాక తప్పుడు సమాచారం మొదలుకుని ప్రాణహాని దాకా ఎన్నో సమస్యలు తలెత్తవచ్చనే వాదన మరొకటి. వెనకాముందూ చూసుకోని పక్షంలో అంతిమంగా కృత్రిమ మేధ మానవాళిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటుందని భయపడేవాళ్లూ ఉన్నారు. ఈ చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండా ఏఐ ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా చొచ్చుకొస్తోంది. కీలకమైన ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. మున్ముందు దీని పరిణామాలెలా ఉంటాయన్నది ఆసక్తికరం... ఇప్పటికే వినియోగంలో... ఏ కంప్యూటరో, మరోటో తనకిచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకొని, పూర్తిగా విశ్లేషించి అచ్చం మనిషి మాదిరిగా ప్రతిస్పందించగలగడమే కృత్రిమ మేధ అని చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం ఈనాటిది కాదు. గుండె పరీక్షల్లో మొదటిదైన ఈసీజీ మొదలుకుని అల్ట్రా సౌండ్, ఎకో కార్డియోగ్రఫీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరికరాల్లో ఏఐ వాడకం ఏళ్లుగా ఉన్నదే. వీటిల్లో మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి రిపోర్టు జనరేట్ చేసేది ఏఐ సాయంతోనే. కంటిలోని రెటీనా ఫొటోలను చూసి సమస్యను పసిగట్టడంలో ఏఐ ఇప్పటికే కంటి డాక్టర్లతో పోటీపడుతోంది. రొమ్ము క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. యాంజియోగ్రాం తదితర అతి సంక్లిష్టమైన వైద్య వీడియోలను కూడా సమగ్రంగా చక్కని చికిత్స మార్గాలను సూచించే దిశగా దూసుకుపోతోంది ఏఐ! మెదడులోని న్యూరాన్ల ఆధారంగా కనిపెట్టిన డీప్ లెర్నింగ్ కాన్సెప్టు ఏఐలో అత్యంత కీలకం. ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడంతో సరిపెట్టకుండా తన దగ్గర అప్పటికే ఉన్న సమాచారంతో క్రోడీకరించి, విశ్లేషించి, మరింత మెరుగైన, సమగ్రమైన ఫలితాలు వెల్లడించడం దీని ప్రత్యేకత. ఎన్నో ఉపయోగాలు... ► వైద్యులు–రోగి సంభాషణను, పరీక్ష ఫలితాలను బట్టి కచ్చితమైన రోగ నిర్ధారణ చాట్ జీసీటీ ఫోర్ వంటి చాట్బాట్లతో ఇప్పటికే సాధ్యపడుతోంది. ► మెడికల్ రికార్డుల నిర్వహణలో ఏఐ బాగా ఉపయోగపడనుంది. తద్వారా డాక్టర్లకు ఎంతో సమయం ఆదా చేయడమేగాక రోగి సమాచారాన్నంతా లోతుగా విశ్లేషించి సమగ్రమైన డిశ్చార్జ్ సమ్మరీని అలవోకగా అందిస్తుంది. ► డిశ్చార్జ్ సమయంలో ఇచ్చే ట్రీట్మెంట్ చార్ట్‌లోని మందులను గుర్తించి, వాటి సైడ్ ఎఫెక్టులు తదితరాలను రోగికి స్పష్టంగా చెబుతుంది. డ్రగ్స్ తాలూకు నెగెటివ్ ఇంటరాక్షన్‌పై అలర్ట్ చేయగలుగుతుంది. ► ఇన్సూరెన్స్ పేపర్లను సరిగా విశ్లేషించి క్లెయిం సులువుగా, త్వరగా జరిగేలా చూస్తుంది. మెడికల్ డిసీజ్ కోడింగ్‌లోనూ బాగా ఉపయోగపడుతుంది. ► వైద్య విద్యలోనైతే ఏఐ విప్లవాన్నే తేనుంది! సంక్లిష్టమైన అంశాలను బొమ్మలు, టేబుల్స్లా, చార్టుల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పటంలో, మెడికల్ రీసర్చ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ► రోబోటిక్ పరికరాలతో మమేకమై సంక్లిష్టమైన ఆపరేషన్లలో వైద్యులకు సహకరించనుంది. ► కోవిడ్ వంటి మహమ్మారులను ముందుగానే గుర్తించడంలోనూ ఏఐ ఉపయోగపడొచ్చు. ► టెలీ మెడిసిన్‌నూ ఏఐ కొత్త పుంతలు తొక్కించగలదు. రోగి ఆస్పత్రికి వచ్చే పని లేకుండానే సమస్య గుర్తింపు, వైద్యం, పర్యవేక్షణ జరిగిపోతాయి. ► కొత్త మందులను కనిపెట్టడం మొదలుకుని జన్యు అధ్యయనం ద్వారా ప్రతి వ్యక్తికీ పర్సనలైజ్డ్ మెడిసిన్ సూచించగలదు. సమస్యలూ తక్కువేమీ కాదు... ► ఆరోగ్య సమాచారం తాలూకు గోప్యత చాలా కీలకం. ఏఐతో దీనికి చాలా ముప్పుంటుంది. ► ఏఐ సలహాలు అన్నివేళలా కరెక్టుగా కాకపోవచ్చు. కొన్ని రకాల వైద్య సలహాలివ్వడంలో చాట్‌జీపీటీ వంటివి చిత్త భ్రాంతికి గురైనట్టు ఇప్పటికే తేలింది. అలాగని వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి వస్తే వైద్యులకు అదో అదనపు బరువుగా మారొచ్చు. ► డ్యూటీ డాక్టర్ల పనులను ఏఐ ఇప్పటికే చేసేస్తోంది. కనుక మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి హెచ్చు నైపు ణ్యం అక్కర్లేని ఉపాధి అవకాశాలకైతే ఏఐ సమీప భవిష్యత్తులోనే పూర్తిగా గండి కొట్టవచ్చు. ► ప్రజారోగ్యానికి సంబంధించిన విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తే వాటిలో వ్యక్తి స్వేచ్ఛ వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోవచ్చు. చివరగా... ఆరోగ్య రంగంపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రఖ్యాత న్యూ ఇంగ్లండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఓ కొత్త జర్నల్నే ప్రారంభించనుంది. ఇరువైపులా పదునున్న కత్తి వంటి ఏఐని విచక్షణతో వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం అంతిమంగా మనదే. -
ఉపాధి, నైపుణ్యాభివృద్ధి
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి తాలూకు ఫలాలు యువత, ఆదివాసీలతో పాటు సమాజంలో అన్ని వర్గాలకూ చేరేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడం, ఉత్పత్తి రంగ వృద్ధికి ఊతమివ్వడం, స్వాతంత్య్రానంతరం నిర్లక్ష్యానికి గురైన ఇతర రంగాల్లోనూ ఉపాధి సృష్టికి కృషి చేయడం తమ లక్ష్యమన్నారు. గుజరాత్ ప్రభుత్వం సోమవారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘దేశంలో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. ఇవి ఉపాధి కల్పించమే గాక లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి దిశగా స్ఫూర్తినిస్తున్నాయి. స్టార్టప్‌లకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు కూడా అందజేస్తోంది’’ అని వివరించారు. ‘‘గుజరాత్లో గత ఐదేళ్లలో లక్షన్నర మంది యువకులకు ప్రభుత్వోద్యోగాలు లభించాయి. 2023లో మరో పాతిక వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి’’ అన్నారు. ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఆరోగ్య, వైద్య పరిశోధనలపై బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్య రంగానికి సంబంధించిన ఎలాంటి పరికరాలనూ, టెక్నాలజీనీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయంసమృద్ధంగా మార్చాల్సిన బాధ్యత దేశ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలపై ఉందన్నారు. ఈ దిశగా తామిప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లపాటు సమీకృత ధోరణి, దీర్ఘకాలిక విజన్ లేమి దేశ వైద్య రంగ వృద్ధికి ముందరి కాళ్ల బంధంగా ఉండేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని చెప్పారు. ‘‘నేను ఫార్మా మార్కెట్ రూ.4 లక్షల కోట్లకు విస్తరించింది. ప్రైవేట్ రంగం, వైద్య విద్యా రంగం మధ్య సరైన సమన్వయముంటే ఇది రూ.10 లక్షల కోట్లకు విస్తరించగలదు. కరోనా కల్లోలం సంపన్న దేశాలను కూడా అల్లాడించింది. దాని దెబ్బకు ప్రపంచమంతా ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ తరుణంలో భారత్ మాత్రం మరో అడుగు ముందుకేసి వెల్నెస్పై దృష్టి పెట్టింది. మనమిప్పుడు ప్రపంచం ముందుంచిన ‘ఒక భూమి, ఒకే ఆరోగ్యం’ విజన్ అందులో భాగమే. మనుషులకే గాక జంతు, వృక్షజాలాలన్నింటికీ ఒకే తరహాలో సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. అంతేగాక ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం కూడా మా ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటి. అందుకే ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేపట్టిన చర్యల ద్వారా పేద రోగులకు ఇప్పటికే రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి’’ అని చెప్పారు. మార్చి 7ను జన్ ఔషధీ దివస్ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 9,000 జన్ ఔషధీ కేంద్రాల వల్ల పేద, మధ్యతరగతి వారికి రూ.20 వేల కోట్ల దాకా ఆదా అయిందన్నారు. వేసవిలో జాగ్రత్త: మోదీ రానున్న వేసవిలో తీవ్ర ప్రతికూల వా తావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలతో పాటు వైద్య నిపుణులకు, స్థానిక సంస్థలకు సమగ్ర అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. వేసవి సన్నద్ధత దిశగా చేపట్టిన చర్యలను ఆయన సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆహార ధాన్యాల నిల్వలను ఎఫ్‌సీఐ వీలైనంతగా పెంచాలని మోదీ సూచించారు. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను మోదీ దృష్టికి తెచ్చారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
వర్సిటీల్లో విద్యార్థుల హెల్త్‌రికార్డ్
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులకు సూచించారు. గవర్నర్ అధ్యక్షతన గురువారం రాజ్‌భవన్‌లో ‘యూనియన్ బడ్జెట్ 2023–24లో ప్రతిపాదించిన ఆరోగ్యరంగ కార్యక్రమాలు, కేటా యింపులు’అనే అంశంపై వివిధ కేంద్ర వైద్యసంస్థలు, ఇతర సంస్థల అధిపతులు, ప్రతినిధులు, పలువురు డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ కేంద్రబడ్జెట్–2023లో ఆరోగ్యరంగానికి భారీ కేటాయింపులతో సుస్థిర ఆరోగ్య సంరక్షణ రంగాన్ని రూపొందించడానికి మార్గం ఏర్పడిందన్నారు. కేంద్రబడ్జెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.89,155 కోట్లు కేటాయించడంవల్ల ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను అద్భుతంగా మార్చడా నికి వీలు కలుగుతుందన్నారు. వైద్య విద్య, పారా మెడికల్ రంగం, ఆయుష్మాన్ భారత్ కోసం బడ్జెట్లో కేటాయింపులు భారీగా పెరిగాయని, దీనివల్ల ఈ పథకం కింద మరో 40 కోట్ల మందిని ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకు రావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య పరిశోధనలకు కేటాయింపులు పెరగ డం ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు పెరుగుతా యని, నాణ్యమైన పరిశోధనలకు దోహదపడుతుందని గవర్నర్ అన్నారు. నర్సింగ్ విద్యకు అంతర్జాతీయ డిమాండ్ కొత్త మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణకు రూ.6,500 కోట్లు కేటాయించారని గవర్నర్ వివరించారు. కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు రాబోతున్నాయని, మనదేశంలో నర్సింగ్ విద్యకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ రంగం మరింత వృద్ధి చెందిందన్నారు. బడ్జెట్‌సహా వివిధ అంశాలపై సమావేశానికి వచ్చిన ప్రముఖులు వ్యాసాలు రాసి పంపితే వాటిని పుస్తకరూపంలో ప్రచురిస్తామని గవర్నర్ తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఈ దశాబ్దకాలంలో దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 87 శాతం, పీజీ మెడికల్ సీట్లు 105 శాతం, మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యాయన్నారు. సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందుకుమార్, జాతీయ పోషకా హార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. -
Budget 2023: ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెంచండి..!
దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతున్నందున ఆరోగ్యరంగానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయాను ఒక్కసారి పరిశీలిస్తే... న్యూఢిల్లీ కేటాయింపులు 40 శాతం పెరగాలి వరుసగా, 2021–22 – 2022–23 ఆర్థిక సంవత్సరాలను చూస్తే, ఆరోగ్య రంగం కోసం బడ్జెట్ కేటాయింపులు సుమారు 16.5 శాతం పెరిగాయి. రానున్న బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధులు 30–40 శాతం పెరగాలి. ఆరోగ్యం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిండానికి ప్రయత్నం జరగాలి. పాఠశాల పాఠ్యాంశాల్లో ఆరోగ్యవంతమైన జీవన ప్రాముఖ్యతను తప్పనిసరిగా చేర్చాలి. మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులపై స్థానిక సంస్థలు, చాంబర్లు, సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం తప్పనిసరిగా పంచాయతీ స్థాయిలో ప్రాథమిక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలి. అవి సక్రమంగా పనిచేసేలా కూడా చూసుకోవాలి. టెలిమెడిసిన్‌ను సులభతరం చేయడానికి వీలుగా ఆయా క్లినిక్‌లను డిజిటలీకరించాలి. – సాకేత్ దాల్మియా, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రోగనిర్ధారణ వేగంగా జరగాలి ప్రస్తుత పరిస్థితుల్లో త్వరిత, ఖచ్చిత, వేగవంతమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్. సమర్థవంతమైన ఆరోగ్య నిర్వహణ, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రణ, రోగికి వేగవంతంగా కోలుకోవడం వంటి కీలక సానుకూలతకు దోహదపడే అంశం ఇది. ఈ దిశలో దేశంలో బహుళ–వ్యాధుల నిర్ధారణ ప్లాట్‌ఫారమ్‌లు అలాగే తక్కువ ధరలో సేవలు లభించే డయాగ్నోస్టిక్స్, వెల్నెస్ ప్రమోషన్ సెంటర్లు అవసరం. ఈ అంశాలపై రానున్న బడ్జెట్ దృష్టి సారించాలి. వెల్నెస్ పరీక్షలు, ఆయుష్ చికిత్సలను ఆరోగ్య బీమాలో కవర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. పరిశోధనలకు ప్రోత్సాహం, ఇందుకు తగిన నిధుల కల్పన అవసరం. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి దాదాపు రూ. 1,000 వరకూ తగ్గుతాయి. – అజయ్ పొద్దార్, సైనర్జీ ఎన్విరానిక్స్ చైర్మన్, ఎండీ ఆరోగ్య బీమాపై దృష్టి అవసరం భారత్‌లో హెల్త్‌కేర్‌పై తలసరి బీమా వ్యయం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. దేశంలో 75 శాతం మందికిపైగా ప్రజలకు ఆరోగ్య బీమానే లేదు. ఈ సమస్యను ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ దృష్టి పెట్టాలి. – సిద్ధార్థ ఘోష్, ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ గత రెండేళ్లలో ఇలా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు వార్షిక బడ్జెట్ కేటాయింపులు రూ.73,932 కోట్లు. 2022–23లో ఈ కేటాయింపులు దాదాపు 16.5 శాతం పెరిగి రూ.86,200 కోట్లకు చేరాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) ఆరోగ్య రంగానికి కేటాయింపులు దాదాపు ఒక శాతంగా ఉండడం గమనార్హం. -
2022 REWIND: ఉద్యోగాల జాతర.. ఆరోగ్యానికి ఆసరా..
రాష్ట్రంలో 2022 ఏడాది ఎన్నో కీలక పరిణామాలకు సాక్షిగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, వైద్యారోగ్య రంగంలో కీలక పథకాలు, మార్పులతో సానుకూలతలు కనిపించగా.. పోడు భూముల వివాదం, ఉపాధ్యాయుల సమస్యలు వంటివి నిరసనలు, ఆందోళనలకు తెరలేపాయి. ఒక్క ఏడాదిలోనే ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు రావడం రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను ఏర్పాటు చేసే అంశంలో ఈ ఏడాది ముందడుగు పడింది. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో పలు రంగాల్లో 2022 తెచ్చిన ప్రత్యేకతలేమిటో చూద్దాం.. – సాక్షి, హైదరాబాద్ అడవి పెరిగింది.. ‘పోడు’గొడవ పెరిగింది! రాష్ట్రంలో పోడు భూముల సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సమస్యపై ప్రభుత్వపరంగా పరిశీలన జరుగుతున్నపుడే గొత్తికోయల చేతుల్లో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు గురికావడం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కచ్చితమైన విధానాన్ని రూపొందించాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణకు హరితహారం ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడింది. ఈ ఏడాది హరితహారం లక్ష్యం 19.54 కోట్ల మొక్కలుకాగా 20.25 కోట్ల మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల రహదారుల వెంట సుమారు లక్ష కిలోమీటర్ల మేర రహదారి వనాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ఆసిఫాబాద్‌లో ఒకరు పులి దాడిలో మృతి చెందారు. వైద్య విద్యలో రికార్డు.. ఆరోగ్యానికి తోడ్పాటు రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం 2022లో కీలక ముందడుగు వేసింది. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ రంగంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను స్థాపించడం, తద్వారా రాష్ట్రంలో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం, తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించే పథకాన్ని ప్రారంభించడం ప్రశంసలు పొందాయి. మిగతా జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, సమాంతరంగా నర్సింగ్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వైద్యారోగ్య మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఆయన ఆధ్వర్యంలో అన్ని విభాగాలపై నెలవారీ సమీక్షలు జరుగుతున్నాయి. సంస్కరణలకూ తెరలేచింది. దారిన పడిన ఆర్టీసీ దివాలా అంచుకు చేరిన ఆర్టీసీని ఈ ఏడాది చిన్న ఆలోచన మళ్లీ నిలిపింది. డీజిల్ సెస్ పేరుతో చార్జీల సవరణ చేపట్టి ఆదాయాన్ని పెంచుకుని.. నష్టాల ఊబి నుంచి కొంతమేర బయటపడింది. సెస్‌ల రూపంలో టికెట్ చార్జీలను పెంచి ధైర్యం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా పలు చర్యలు చేపట్టడం కలసివచ్చింది. ఇదే సమయంలో డిపో స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం దాకా సిబ్బంది పనితీరును సమీక్షించి మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఓరియంటేషన్లు, ప్రత్యేక శిక్షణలు, స్టడీ టూర్లు, వ్యక్తిగత పనితీరు మెరుగుపడటం, 100 డేస్ చాలెంజ్, శ్రావణమాసం చాలెంజ్, దసరా పండుగ చాలెంజ్, హెల్త్ చాలెంజ్, ఫిట్నెస్ చాలెంజ్ వంటి కార్యక్రమాలతో సిబ్బంది పనితీరు సమూలంగా మారింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనట్టుగా 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. కొత్త కొలువుల జాతర.. రాష్ట్రంలో 2022 ఏడాది కొలువుల జాతరను తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80వేల మేర ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్–4 కేటగిరీలో 9 వేల కొలువులు, ఇంజనీరింగ్ విభాగాలు, ఇతర శాఖల పరిధిలో మరో 5వేల కొలువులకు ప్రకటనలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు ద్వారా దాదాపు 17 వేల ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వైద్య విభాగాల్లోనూ ఖాళీల భర్తీ చేపట్టారు. గురుకుల విద్యా సంస్థల్లోనూ 12 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. ‘రోడ్ల’కు మంచి రోజులు తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రహదారులకు పూర్తిస్థాయి నిర్వహణ పనులకు ఈ ఏడాదే గ్రీన్‌సిగ్నల్ పడింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసింది. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రోడ్లు భవనాల శాఖలో ఈ ఏడాది భారీ మార్పులు జరిగాయి. కొత్తగా 472 అదనపు పోస్టులు మంజూరు చేయడంతోపాటు 3 సీఈ, 10 సర్కిల్, 13 డివిజన్, 79 సబ్‌డివిజన్ కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలగిన సవాళ్లు.. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో 2022లో విద్యా సంస్థల్లో పునరుత్తేజం కనిపించింది. అదే సమయంలో ఎన్నో సవాళ్లూ ఎదురయ్యాయి. కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతామంటూ ‘మన ఊరు–మనబడి’పథకాన్ని ప్రారంభించినా ఆచరణలో నిరాశే ఎదురైంది. తొలి విడతగా 9 వేలకుపైగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకోగా 1,200 స్కూళ్లలోనే పూర్తయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, ప్రమోషన్లు, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యలపై ఉపాధ్యాయులు ఆందోళనలు చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అడుగు ముందుకు పడలేదు. మరోవైపు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఫీజుల పెంపు వంటివి విద్యార్థులపై భారం వేశాయి. ఇక ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం, పలు మైనారిటీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయడం పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. కేంద్రంతో తప్పని ‘పంచాయితీ’! 2022 ఏడాది మొదట్లోనే కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై మొదలైన ‘పంచాయితీ’చివరికి మరింత ముదిరింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు తగ్గాయని, శాఖల వారీగా వచ్చే నిధుల జాడేలేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తెలంగాణ చేపట్టిన పలు పథకాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం మొండిచేయి చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ఆరోపించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా రైతు కల్లాలు నిర్మించారంటూ కేంద్రం పేర్కొనడం, అందుకు సంబంధించిన రూ.150 కోట్లను తిరిగివ్వాలని పట్టుపట్టడం అగ్నికి ఆజ్యం పోసింది. కేంద్రం తీరు సరిగా లేదని, రాష్ట్రానికి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనలు నిర్వహించింది. ఇక వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపు ఈ ఏడాదే అమల్లోకి వచ్చింది. డయాలసిస్ బాధితులకు పింఛన్ల మంజూరు కూడా మొదలైంది. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రం సత్తా చాటింది. -
దేశ ఆరోగ్య వ్యయంలో సగం భారం ప్రజలదే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగంలో ఎన్ని పథకాలు తీసుకువస్తున్నా.. వైద్య సదుపాయాలు పెంచుతున్నట్టు చెప్తున్నా.. ప్రజలపై భారం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఆరోగ్యంపై జరుగుతున్న మొత్తం వ్యయంలో సగం ఖర్చును ప్రజలే సొంతంగా భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇది పేద, మధ్య తరగతి వర్గాలపై మోయలేని భారంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఖర్చు గణనీయంగా పెరిగినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు అవసరమైన మేర పెరగడం లేదని, ప్రజలపైనే భారం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలోనే.. దేశంలో రాష్ట్రాల వారీగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు, ప్రజలు చేస్తున్న ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2018–19 నాటి అంచనాల ప్రకారం తయారు చేసిన ఈ నివేదికపై ఇటీవల పార్లమెంటులోనూ చర్చ జరిగింది. దాని ప్రకారం దేశంలో ఆరోగ్యంపై మొత్తంగా రూ.5,96,440 కోట్లు వ్యయం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తున్నది రూ.2,42,219 కోట్లే. అంటే సుమారు 41 శాతం మాత్రమే. అదే ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (సుమారు 48శాతం) కావడం గమనార్హం. ఇక ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం), మిగతా సొమ్ము వివిధ స్వచ్చంద సంస్థలు, ఇతర మార్గాల ద్వారా ఆరోగ్య ఖర్చుల కోసం అందుతోంది. ప్రభుత్వాల వ్యయం పెరుగుతున్నా.. ఆరోగ్యం కోసం ప్రజలు చేస్తున్న సొంత ఖర్చు తగ్గుతోందని.. ప్రభుత్వాల వ్యయం పెరుగుతోందని కేంద్ర నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015–16లో ప్రభుత్వాల ఖర్చు సుమారు 30 శాతం వరకే ఉండగా ఇప్పుడు 41 శాతానికి చేరింది. ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 62 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది. ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాల వాటా గణనీయంగా పెరగడం మంచి పరిణామమే అయినా.. సగం కూడా లేకపోవడం, మిగతా భారం ప్రజలపై పడటం సరికాదని నిపుణులు చెప్తున్నారు. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల ఖర్చు 10 శాతం వరకే ఉండాలని, ప్రభుత్వాలే వ్యయం పెంచాలని స్పష్టం చేస్తున్నారు. యూపీలో ఎక్కువ ఖర్చు దేశంలో ఆరోగ్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.78,297 కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్రలో రూ.66,703 కోట్లు, పశ్చిమబెంగాల్లో రూ.45,277 కోట్లు, కేరళ రూ.34,548 కోట్లు, తమిళనాడులో రూ.32,767 కోట్లు, కర్ణాటకలో రూ.32,198 కోట్లు, రాజస్థాన్‌లో రూ.29,905 కోట్లు, గుజరాత్లో రూ.26,812 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25,828 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.20,725 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వాలే భరించే ఖర్చు ప్రకారం చూస్తే.. ఉత్తరాఖండ్ 61 శాతంతో టాప్‌లో నిలిచింది. నివేదికలో ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2018–19 సంవత్సరానికి మొత్తం ఆరోగ్య వ్యయం రూ.5,96,440 కోట్లు (ఇది జీడీపీలో 3.16 శాతం.. తలసరి ఖర్చు రూ.4,470). ► మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు రూ.2,42,219 కోట్లు (తలసరి రూ.1,815)కాగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 34.3 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65.7 శాతంగా ఉంది. ►కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్‌పై చేస్తున్న వ్యయం రూ.30,578 కోట్లు, డిఫెన్స్ మెడికల్ సర్వీసెస్ కింద రూ.12,852 కోట్లు, రైల్వే హెల్త్ సర్వీసెస్ రూ.4,606 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) రూ.4,060 కోట్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌కు రూ.3,226 కోట్లు, అన్ని ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్య బీమా పథకాల ద్వారా ఖర్చులు కలిపి రూ.12,680 కోట్లు. ► ఆరోగ్యంపై ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (మొత్తం ఆరోగ్య వ్యయంలో 48.21 శాతం.. తలసరిన చూస్తే రూ.2,155), ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం). ►మొత్తంగా ఆరోగ్యానికి అయ్యే ఖర్చులో రూ.93,689 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,55,013 కోట్లు (28.69%). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, కుటుంబ నియంత్రణ కేంద్రాలకు కలిపి చేసే ఖర్చు రూ.41,875 కోట్లు, ఇతర ప్రైవేట్ ప్రొవైడర్లకు (ప్రైవేట్ క్లినిక్‌లతో సహా) రూ.23,610 కోట్లు, పేషెంట్ ట్రాన్స్పోర్ట్, ఎమర్జెన్సీ రెస్క్యూ ప్రొవైడర్లకు రూ.18,909 కోట్లు, మెడికల్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలకు రూ.21,162 కోట్లు, ఫార్మసీలకు రూ.1,22,077 కోట్లు, ఇతర రిటైలర్లకు రూ.643 కోట్లు, ప్రివెంటివ్ కేర్ ప్రొవైడర్లకు రూ.28,841 కోట్లు, హెల్త్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్సింగ్ ప్రొవైడర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణలకు దాదాపు రూ. 21,612 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరిన్ని నిధులు ఇతర అవసరాలకు ఖర్చవుతున్నాయి. ► తెలంగాణలో జీఎస్డీపీలో మొత్తం ఆరోగ్య ఖర్చు 1.8 శాతంగా ఉంది. ఇందులో ప్రభుత్వ ఖర్చు 0.7 శాతం, ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 0.9 శాతం, ఆరోగ్య బీమా, ఇతర వ్యవస్థల ద్వారా 0.2శాతం ఖర్చు జరుగుతోంది. దేశంలో ఆరోగ్యంపై వ్యయం తీరు ఇలా.. (రూ.కోట్లలో) అంశం 2015–16 2016–17 2017–18 2018–19 ప్రభుత్వ ఖర్చు 1,61,863 1,88,010 2,31,104 2,42,219 ప్రజల సొంత ఖర్చు 3,20,211 3,40,196 2,76,532 2,87,573 ప్రైవేట్ బీమా కంపెనీలు 22,013 27,339 33,048 39,201 క్యూబాలో జనం సొంత ఖర్చు 8 శాతమే.. ప్రపంచంలో ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చులో ప్రజలు సొంతంగా చేస్తున్నది 36 శాతమే. మన దేశంలో అది 48 శాతంగా ఉంది. అదే క్యూబా వంటి దేశంలో కేవలం 8 శాతమే. మన దేశంలో ప్రజల ఖర్చు తగ్గుతూ వస్తున్నట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నా.. ప్రభుత్వాలు భరించే మొత్తం గణనీయంగా పెరగాల్సి ఉంది. బడ్జెట్లో ఆరోగ్యానికి కేటాయింపులు పెంచడం వల్ల ప్రజల జేబు ఖర్చు తగ్గుతుంది. ప్రైవేట్ బీమా కంపెనీలు ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం కావడం, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, ఇతర ఆరోగ్య పథకాలతో ప్రయోజనం ఉంటోంది. డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ జేబు ఖర్చు 10శాతం లోపే ఉండాలి ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వ లెక్కలు సరిగా లేవని అనిపిస్తోంది. మాకున్న అంచనా ప్రకారం 80శాతం ఆరోగ్య ఖర్చును ప్రజలే భరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నా.. అది ప్రజలపై పెను భారమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యంపై ప్రజలు చేస్తున్న ఖర్చు కేవలం 10 శాతమే. డెన్మార్క్, చెకోస్లావేకియా, చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటిచోట్ల ఎక్కువగా ప్రభుత్వాలే ఖర్చు చేస్తున్నాయి. అమెరికా వంటి చోట్ల బీమా పథకాలు ఉన్నాయి. కానీ బీమా కంపెనీలు ఎక్కువ ధరలతో కూడిన మందులు ఇవ్వడానికి, ఖర్చుకు ముందుకు రావు. అమెరికాలో వస్తున్న సమస్య ఇదే. అందువల్ల దేశంలో ప్రభుత్వమే ఖర్చు పెంచాలి. – డాక్టర్ యలమంచి రవీంద్రనాథ్, ప్రముఖ వైద్యుడు, ఖమ్మం -
YSRCP Plenary: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. టీడీపీ హయాంలో హెల్త్ డిపార్ట్మెంట్ (వైద్య, ఆరోగ్య శాఖ) అప్పటి సీఎం చంద్రబాబు వెల్త్ (ఆదాయం) కోసం పనిచేస్తే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల వెల్నెస్ (ఆరోగ్యం) కోసం పనిచేస్తోందని చెప్పారు. బాబు వైద్య శాఖలో అవినీతిని విస్తరించారని, సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని వివరించారు. చదవండి: చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీలో శుక్రవారం వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద తీర్మానంపై మంత్రులు రజని, సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చర్చించారు. మంత్రి రజని మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వైద్య రంగంలో మార్పు తేలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో అద్భుత మార్పు తెచ్చారని చెప్పారు. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన రంజక పాలన అందిస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో చేపడుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధితో 2024లోనూ ఇదే విధమైన చారిత్రక విజయాన్ని అందుకుంటారని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్.. ♦రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు. తద్వారా రాష్ట్రంలోని 85 % (1.40 కోట్ల) కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్యం. ♦టీడీపీ హయాంలో ఈ పథకం కింద కేవలం 1059 చికిత్సలు అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,446 చికిత్సలు అందుతున్నాయి. చికిత్సల సంఖ్యను ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦వెఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య పెంపు. పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం ♦గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి రూ.5,171 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.5,100 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో రోజుకు సగటున 1500 మందికి వైద్యం అందించగా.. ఇప్పుడు రోజుకు సగటున 3 వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందుతున్నారు. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం 104, 108 సేవలకు జీవం పోసింది. మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 11 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను బలోపేతం చేస్తోంది. ♦రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చుతో రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చంద్రబాబుకు శ్రీరామచంద్రుడితో పోలికా! పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును లోకేష్ శ్రీరామచంద్రుడితో పోల్చడం హాస్యాస్పదం. లోకేశ్ తనను తాను రాక్షసుడితో పోల్చుకుంటున్నాడు. అతను రాక్షసుడు కాదు.. కమెడియన్. మా నాయకుడు జగన్ కోసం ఏమైనా చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 50 శాతానికి పైగా పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్. 2024లో 175కు 175 సీట్లు గెలుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ నాడు ఆరోగ్యశ్రీ ఉండి ఉంటే నా చెల్లి బతికి ఉండేది.. పుట్టుకతో ఉండే గుండె జబ్బు కారణంగా నా సోదరి 1999లో మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా చెల్లికి మెరుగైన వైద్యం అందించలేకపోయాం. అప్పట్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండి ఉంటే నా చెల్లి ప్రాణాలతో ఉండేది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ తనయుడిగా పథకాన్ని ఊహించని రీతిలో వైఎస్ జగన్ బలోపేతం చేశారు. రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు హయాంలో నిర్మించినవి కావు. టీడీపీ ప్రభుత్వ ఆస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. – మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు -
విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం
సిరిసిల్ల/మెట్పల్లి(కోరుట్ల): విద్య, వైద్యరంగాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మూడేళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో చల్మెడ జానకీదేవి పేరుతో రూ.2కోట్లతో నిర్మించిన స్కూల్ భవనాన్ని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు.. మన బడి’లో రూ.7,300 కోట్లతో 2,600 స్కూళ్లలో 12 రకాల వసతులు కల్పించి ఇంగ్లిష్ మీడియంగా మార్చుతున్నామని వివరించారు. ఇటీ వల అమెరికా వెళ్లినప్పుడు అనేక మంది ప్రవా సులు సొంతూళ్లలో తమ పూర్వీకుల పేరిట స్కూల్ భవనాలు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ ఆర్)లో భాగంగా అనేక కార్పొరేట్ సంస్థలు పేద లకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్ల డించారు. కాగా, వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు డెక్కన్ అగ్రి రిసోర్సెస్ కంపెనీతో ఎంవోయూ పూర్తిచేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయం రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో కలసి పాల్గొన్నా రు. కాంగ్రెస్‌కు కుల, బీజేపీకి మత రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధిపై వాటికి చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ చిల్లర మాటలతో గల్ఫ్ దేశాల్లోని లక్షలాది మంది భారతీయుల జీవి తాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, మెట్లచి ట్టాపూర్లో రూ.160 కోట్ల పెట్టుబడితో ధాత్రి, రూ.1,060 కోట్ల పెట్టుబడితో భువి బయో సంస్థలు ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోరుట్ల లో వీఫై ఐటీ సంస్థ ఏర్పాటు చేసే కాల్‌సెంటర్ ఒప్పందపత్రాలను యజమానులకు అందజేశారు. -
Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ
సాక్షి,మణికొండ(హైదరాబాద్): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఏటా రూ.11 వేల కోట్లు ప్రజల ఆరోగ్యానికి ఖర్చుచేస్తున్నామని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. ప్రజలకు సమీపంలోనే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వారి సుస్తీని తొలగిస్తున్నామన్నారు. వైద్యరంగంలో ఖాళీగా ఉన్న 13 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. బుధవారం ఆయన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి నార్సింగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో టీ–డయాగ్నొస్టిక్స్ మినీ హబ్, టీ–డయాగ్నొస్టిక్మొబైల్యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానా, ఆరోగ్య పరీక్షా కేంద్రాలను కనుక్కునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను తొలగించేందుకే మొబైల్‌యాప్‌ను రూపొందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరును మెరుగుపర్చేందుకూ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రికార్డులను భద్రపరిచే వ్యవస్థను ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు. నిమ్స్‌లో మరో 2వేల బెడ్లతో.. రాష్ట్రంలో బ్రిటిష్‌వారు కట్టిన గాంధీ ఆసుపత్రి, నిజాం నవాబులు కట్టిన ఉస్మానియా ఆసుపత్రులు మాత్రమే గతంలో ఉండేవని ప్రస్తుతం హైదరాబాద్ నలువైపులా 4 సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. వాటిల్లో 4వేల బెడ్లతోపాటు నిమ్స్‌లో మరో 2వేల బెడ్లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. 7లక్షల చదరపు అడుగులతో కొత్త భవనం నిర్మించి గచ్చిబౌలిలోని టిమ్స్‌ను 2వేల పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు. ప్రస్తుతం టీ–డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని, త్వరలో వాటిని 134కు పెంచుతామని ప్రకటించారు. విద్య, వైద్యానికి పెద్దపీట: మంత్రి సబితారెడ్డి పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వారు జబ్బు చేస్తే చూపించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తోందని మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోనూ త్వర లో బస్తీ దవాఖానాలుఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష -
ఆరోగ్యానికి రూ.64 వేల కోట్లు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాశిలో ప్రారంభించారు. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చారు. నాలుగేళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వైద్య కళాశాలలను కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధ నగర్, వారణాశిలలోలు పర్యటించిన ప్రధాని మోదీ ఆరోగ్య రంగంపై కేంద్రం తీసుకోబోతున్న చర్యలు వివరించారు. ‘‘ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడం అనేది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సింది’’ అని వారణాశిలో మోదీ వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ఆరోగ్య రంగంలో ఉన్న అంతరాలను తగ్గిస్తుందని అన్నారు. ‘‘మా కన్నా ముందు అధికారంలో ఉన్న వారు ఆరోగ్య సేవలను డబ్బు సంపాదనకు, కుంభకోణాలకు ఓ సాధనంగా వినియోగించుకున్నారు. గతంలో ప్రజల సొమ్ము కుంభకోణాల్లోకి వెళ్లేది... ఇప్పుడా సొమ్ము పెద్ద ప్రాజెక్టులకు వినియోగపడుతోంది. ఎన్డీయే ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సదుపాయాలపై దూకుడు విధానం అవలంభిస్తాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వంలో ఉండి కూడా వారు వైద్య రంగం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడలేదని మోదీ విమర్శించారు. గ్రామాల్లో సరిపడా ఆసుపత్రులు లేవు, ఒక వేళ ఆసుపత్రులు ఉంటే వాటిలో వైద్యులు ఉండేవారు కాదన్నారు. ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల సదుపాయాలు లేవని... ఆయా సమస్యలన్నింటినీ ఈ మిషన్ పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ఈ మిషన్ దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, మహమ్మారులను ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని, ఆరోగ్య రంగానికి మరింత ఆత్మవిశ్వాసం అందిస్తుందన్నారు. ఆరోగ్య రంగం బలోపేతం వల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవతాయన్నారు. సదుపాయాలన్నీ ఉన్న ఓ ఆసుపత్రి ఏర్పాటు వల్ల సమీప పట్టణంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వారణాశిలో రూ.5,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా పది కీలక రాష్ట్రాల్లోని 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు. దీంతోపాటు 11,024 అర్బన్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్‌లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించనుంది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యలకు నడుం బిగించామని డిజిటల్ మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. డిజిటల్ మిషన్‌లో భాగంగా పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీచేయనున్నారు. గతంలో పోల్చితే సాంకేతికతను ఆరోగ్యరంగానికి మరింతగా జోడించడంతో సత్వర వైద్యసేవలు పెరిగాయని మోదీ అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై) మూడో వార్షికోత్సవం రోజునే ఈ కార్యక్రమం మొదలవడం విశేషం. పీఎంజేఏవై కింద పేదలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పీఎంజేఏవై కింద 2 కోట్ల మంది ఇప్పటికే ఉచితంగా పలు వ్యాధులకు చికిత్స తీసుకున్నారని మోదీ చెప్పారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుతో ప్రయోజనాలు.. వ్యక్తి ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫికేషన్(ఐడీ) నంబర్ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్ కార్డు తీసుకెళ్తే హెల్త్ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరం. ఖాతా వివరాలను ఒక మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఏ) తరహాలో యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్(యూహెచ్ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి. దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్ వంటి సదుపాయాలు ఈ హెల్త్ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది. -
గిరిజన ప్రాంతాల్లో ఏం వసతులు కల్పించారు?
సాక్షి, హైదరాబాద్: గిరిజన సలహా మండలి తీర్మానాలను 2013 నుంచి ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గిరిజన ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కనీసవసతులు కూడా కల్పించడం లేదంటూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ దాఖ లు చేసిన ప్రజాహిత వ్యాజ్యా న్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు కనీసం వైద్యం అందడం లేదు. ప్రాథమిక వైద్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌లు లేవు. విద్యుత్, రవాణా వంటి కనీస సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జీవనోపాధి కోసం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ, పోలీస్ అధికారులు వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గిరిజన సలహా మండలి 2013 నుంచి అనేక సిఫార్సులు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు’ అని పిటిషనర్ తరఫున న్యాయ వాది పీవీ రమణ వాదనలు వినిపించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టామని, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 10కి వాయిదా వేసింది. -
కొరతలతో రోగుల కలత
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న ఊరట లేకుండా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లు పంజా విసరటం మొదలైంది. కరోనా వైరస్ కేసులతో పోలిస్తే ఇవి తక్కువైనా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి జాడ కనబడటం ఆందోళన కలిగించే అంశం. ఇంతవరకూ 12,000కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇవింకా పెరిగే అవకాశం కూడా వుందని నిపుణులు చెబుతున్న మాటలు దడ పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక రోగికి ఎండోస్కోపీ చేసినప్పుడు అతనిలో ఈ మూడు రకాల ఫంగస్‌లూ వున్నట్టు తేలింది. చివరకు ఆయన మరణించాడు. నిపుణులంటున్నట్టు ఈ ఫంగస్‌లు అంటువ్యాధులు కావచ్చు...కాకపోవచ్చు. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ వీటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మహమ్మారిగా గుర్తించారు. కరోనా అరికట్టడానికి రోగులపై మోతాదుకు మించి వాడిన స్టెరాయిడ్లవల్ల ఈ ఫంగస్‌లు పుట్టుకొస్తు న్నట్టు గుర్తించారు. ఫంగస్ల నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై ఇప్పటికే వైద్యులకు అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఇది ఎక్కువున్నట్టు తెలుసు కున్నారు. కానీ విషాదమేమంటే చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో వుండటం లేదు. ఈ నెల 19నాడే ఢిల్లీ హైకోర్టు ఈ పరిస్థితిని గుర్తించి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయో గాలించి, ఆ మందులు తక్షణం అందుబాటులో వుండేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే వాటిని ఉత్పత్తి చేసే సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్రపంచ మార్కెట్లో కూడా కేంద్రం కొనుగోలు చేయడానికి సిద్ధంగా వున్నదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వారణాసిలోని ఆరోగ్య సిబ్బందినుద్దేశించి జరిపిన ఆన్లైన్ సమావేశంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఏం ప్రయోజనం? పది రోజలు గడుస్తున్నా ఢిల్లీలో ఈ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా మందులు దొరకటం లేదు. అక్కడే కాదు...మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వుంది. వ్యాపారులు డబ్బు చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నా పట్టించుకునేవారు కరువ య్యారు. ఈ విషయంలో కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మొదలుకొని విపక్షా లన్నీ కోరాయి. కానీ ఫలితం లేదని, పది రోజుల తర్వాత కూడా పరిస్థితి యధాతథంగా వున్న దని ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనిస్తే అర్థమవు తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నట్టు వెనువెంటనే ప్రకటిం చింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా వెనకబడే వున్నాయి. కరోనా అయినా, దాని పర్యవసానంగా వస్తున్న ఫంగస్ వ్యాధులైనా ఎలా వ్యాపించాయి.. కారకులెవరు అనే ప్రశ్నలు ఇంకా తేలవలసివుంది. కనీసం మందుల లభ్యత విషయంలోనైనా కేంద్రం అప్రమత్తంగా లేకపోవటం...న్యాయస్థానాలు ఆదేశించినా ఫలితం లేకపోవటం దిగ్భ్రాంతికరం. మొన్నటి వరకూ ఆక్సిజన్ కొరతతో సతమతమైన రోగులు ఇప్పుడు ఈ ఫంగస్ నివారణకు మందులు దొరక్క అల్లాడుతున్నారు. ఢిల్లీలో ఒక ప్రభుత్వాసుపత్రికి రోజుకు 3,000 ఇంజక్షన్లు కావాల్సివుండగా కేవలం 350 మాత్రమే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వున్నదో గ్రహించవచ్చు. ఢిల్లీ ఆసుపత్రులకు వారానికి 30,000 అవసరమైతే 3,850 మాత్రమే వస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీనగర్ వంటిచోట్ల ఈ ఫంగస్లకు సరైన చికిత్స అందించేవారు లేకపోవటంతో అక్కడివారు ఎంత దూరమైనా లక్ష్యపెట్టక మహా రాష్ట్ర, గుజరాత్ వంటిచోట్లకు రావాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా దేశ పౌరులు ఇలాంటి దుస్థితిలో వుండటం మనకు అప్రదిష్ట తెస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేకుండాపోతోంది. పంటి నొప్పితో మొదలై సైనస్‌గా మారి, ఆ తర్వాత నోటికి, కనుబొమలకు వ్యాపించి, చివరకు కళ్లనూ, మెదడునూ కూడా దెబ్బతీసి ప్రాణాలు హరిస్తున్న ఈ ఫంగస్లకు చెందిన మందులు అందుబాటులో వుంచాలని గుర్తించకపోవటం విచారకరం. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా వెల్లడవుతున్న ప్రతి ఒక్క కేసుకూ, బయటపడని 23 కేసులుండొచ్చని నీతి ఆయోగ్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ఫెక్షన్లు వున్నా పరీక్షల్లో బయటపడని స్థితి. ఒకపక్క కరోనా వైరస్ జనం ప్రాణాలతో ఆటలాడుతుంటే... వ్యాక్సిన్ల కొరత, మందుల కొరత జనంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఫంగస్లకు ఇస్తున్న ఇంజెక్షన్లు కూడా మోతాదు మించితే ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మొదలుకొని రాష్ట్రాల్లో ఆ శాఖను చూసేవారి వరకూ అందరూ చురుగ్గా స్పందించాలి. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా చూడాలి. తగినంతమంది నిపుణుల్ని అందుబాటులో వుండేలా చూసుకోవాలి. అదే సమయంలో ఇంజెక్షన్ల వాడకం హేతుబద్ధంగా వుండేట్టు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి నిర్దిష్టమైన ప్రోటోకాల్ కొరవడటం వల్లే ఈ ప్రమాదకర మైన ఫంగస్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వీటి విషయంలో కూడా నిర్లక్ష్యంగా వుంటే మరేం జరుగుతుందో అనూహ్యం. అందుకే మందులు అందుబాటులో వుండేలా చూడటంతోపాటు రోగులకు ఉచిత చికిత్స అందేందుకు ప్రభుత్వాలన్నీ తగిన చర్యలు తీసుకోవాలి. -
AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు
సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలకు నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు రూ.1,535 కోట్లు కేటాయించింది. వైద్యవిధాన పరిషత్‌కు గతేడాది కంటే రూ.77.32 కోట్లు ఎక్కువగా ఇచ్చింది. తొలిసారిగా బడ్జెట్లో కోవిడ్ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. పేద రోగులకు భరోసా పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానిది. అంతేకాకుండా రెండ్రోజుల క్రితమే ఖరీదైన బ్లాక్ ఫంగస్ చికిత్సనూ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకానికి ఈ ఏడాది రూ.2,258.94 కోట్లు కేటాయించింది. రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,088 కొత్త అంబులెన్సు (108, 104)లను కొనుగోలు చేసిన ఘనత ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉన్నాయి. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో 108 అంబులెన్సులు అద్భుతమైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి మందులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు కలిపి బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు. చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కోవిడ్ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహమ్మారిపై పోరు కోసం బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి మొత్తం 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయించింది. -
ఆరోగ్య రంగం.. హైదరాబాద్‌కు 5వ స్థానం
న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో దేశంలోని ఎనిమిది అతిపెద్ద పట్టణాల్లో పుణె ముందుంది. ప్రధాన పట్టణాల్లో ఆరోగ్య సదుపాయాలను విశ్లేషిస్తూ హౌసింగ్ డాట్ కామ్ పోర్టల్ ‘భారత్‌లో ఆరోగ్యరంగ స్థితి’ పేరుతో ఒక నివేదికను బుధవారం విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె పట్టణాల్లోని ఆరోగ్య సదుపాయాలను ఈ నివేదికలో విశ్లేషించి ర్యాంకులను కేటాయించింది. ప్రతీ 1,000 మంది ప్రజలకు ఎన్ని ఆస్పత్రుల పడకలు అందుబాటులో ఉన్నాయి, గాలి, నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, నివాసయోగ్యతా సూచీ తదితర అంశాల ఆధారంగా పట్టణాలకు ర్యాంకులను కేటాయించింది. 40 శాతం స్కోర్‌ను ఒక్క ఆస్పత్రుల్లోని పడకల ఆధారంగానే నిర్ణయించింది. అహ్మదాబాద్, బెంగళూరు రెండు, మూడో స్థానాల్లో నిలవగా.. ముంబై ఎంఎంఆర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ ఎన్సీఆర్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ వెయ్యి మందికి 3.5 పడకలు ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో పుణె దేశంలోనే మెరుగ్గా ఉంది. ‘‘పుణెలో ప్రతీ వెయ్యి మంది ప్రజలకు 3.5 పడకలు అందుబాటులో ఉన్నాయి. భారత జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో అధికం. జాతీయ స్థాయిలో కేవలం ప్రభుత్వరంగంలోని ఆరోగ్య సంరక్షణ సదుపాయాలనే పరిగ ణనలోకి తీసుకుంటే ప్రతీ వెయ్యి మందికి సగటున ఒక్క పడక కూడా లేదు. అర పడకే అందుబాటులో ఉంది. అదే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కలిపి చూస్తే 1.4 పడకలు ఉన్నాయి. అదే ప్రపంచ సగటు 3.2 పడకలుగా ఉంది’’ అని హౌసింగ్ డాట్ కామ్ తెలిపింది. నివాస అనుకూలత, నీటి నాణ్యత, స్థానిక ప్రభుత్వాలు చేపట్టిన చర్యల పరంగా చూస్తే పుణె ఎక్కువ స్కోరు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌లో 1,000 మంది ప్రజలకు 3.2 ఆస్పత్రి పడకల లభ్యత ఉంది. బెంగళూరులో భిన్నం బెంగళూరు నగరం కొన్ని అంశాల్లో మెరుగ్గాను.. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో దారుణంగాను ఉంది. ఆస్పత్రి పడకల లభ్యత, నివాస సౌలభ్యం విషయంలో మెరుగ్గా ఉంటే.. వాయు నాణ్యత, నీటి నాణ్యత, నీటి లభ్యత, మున్సిపల్ పనితీరు అంశాల వల్ల మూడో ర్యాంకుకు పరిమి తం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడం తెలిసిందే. దీనికితోడు నీటి నాణ్యత, పారిశుద్ధ్యం పనితీరు దారుణంగా ఉండడం వల్ల జాబితాలో అట్టడుగు స్థానా నికి పరిమితం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీతోపాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ఉన్నాయి. ఆరోగ్యానికి కేటాయింపులు భారీగా పెంచాలి ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆరోగ్యసంరక్షణపై వ్యయాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగు భాగ్యనగరంలో ఆస్పత్రి పడకలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాయు నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాల్లో మెరుగైన స్కోరు సంపాదించింది. నగరంలోనూ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఎక్కువగా పశ్చిమ, సెంట్రల్ సబర్బన్ ప్రాంతాల్లోనే కేంద్రీకృమైనట్టు నివేదిక పేర్కొంది. ‘‘భారీగా పెరిగిపోతున్న నగర జనాభా కారణంగా నీటి సరఫరాపై ఒత్తిడి పెరిగుతోంది. సరఫరా మించి డిమాండ్ ఉండడంతో నీటికి కొరత ఏర్పడు తోంది’’ అని తెలియజేసింది. నివాస సౌలభ్యం విషయంలో హైదరాబాద్‌కు తక్కువ స్కోరును, ఆస్పత్రి పడకలు, మున్సిపల్ పనితీరు అంశాల్లో మధ్యస్థ స్కోరును కేటాయించింది. -
2021లో భారత్ వృద్ధి 12.5 శాతం!
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ తిరిగి సాధించగలుగుతుంది. కాగా 2022లో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లలోనూ 2020లో వృద్ధి సాధించిన పెద్ద ఎకానమీగా చైనా నిలబడిన సంగతి తెలిసిందే. 2020లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం క్షీణించగా, చైనా 2.3 శాతం వృద్ధి సాధించింది. 2021లో ఆ దేశం 8.6%, 2022లో 5.6 శాతం పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్‌తో కలిసి త్వరలో వార్షిక ‘స్పింగ్’ సమావేశాలు నిర్వహించనున్న బహుళజాతి బ్యాకింగ్ దిగ్గజం– ఐఎంఎఫ్ తాజాగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గత అంచనాలను ఐఎంఎఫ్ మెరుగుపరచింది. 2020లో 3.3 శాతం క్షీణించిన గ్లోబల్ ఎకానమీ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుందని అంచనావేసింది. 2020 అక్టోబర్ నివేదికతో పోల్చితే 2020కి సంబందించి క్షీణత అవుట్‌లుక్ 1.1 శాతం మెరుగుపరచింది. 2020 చివరి ఆరు నెలల్లో పలు దేశాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు సడలించడం దీనికి కారణమని తాజా అవుట్‌లుక్ వివరించింది. లాక్డౌన్ ఆంక్షలు తగ్గడం వల్ల ఆర్థికరంగం క్రియాశీలత అంచనాలకు మించి మెరుగుపడిందని తెలిపింది. దీనికి అనుగుణంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను 2021, 2022ల్లో వరుసగా గతంకన్నా 0.8 శాతం, 0.2 శాతం మెరుగుపడినట్లు వివరించింది. చదవండి: (అదానీ గ్రూప్ సరికొత్త రికార్డ్) ఆరోగ్యరంగంపై భారీ వ్యయాలు అవుట్‌లుక్‌లోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పర్యాటక రంగమూ మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆరోగ్య రంగంపై అధిక వ్యయాలు చేయాలి. హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి. కోవిడ్–19 ప్రభావానికి గురైన కుటుంబాలు అలాగే సంస్థలకు ద్రవ్యపరమైన మద్దతు అవసరం. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న దేశాల్లో సరళతర ద్రవ్య విధానాలను కొనసాగించాలి. ప్రతి దేశం ఫైనాన్షియల్ స్థిరత్వానికి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. సంక్షోభం ఒక్కసారి ముగిసిన వెంటనే, రికవరీ వేగవంతం, ఉత్పత్తి పెంపుసహా ఆర్థిక వ్యవస్థల పటిష్ట పునర్నిర్మాణానికి తగిన ముందస్తు చర్యలను, వ్యూహాలను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. పర్యావరణ అనుకూలమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ మార్పుల ప్రతికూలతలను తద్వారా నివారించుకోవచ్చు. ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను పెంచాలి. అసమానతలను తగ్గించడానికి సామాజిక సహాయ సహకారాలను పటిష్టం చేసుకోవాలి. సవాళ్లు పొంచి ఉన్నాయ్.. అటు అంతర్జాతీయంగా, ఇటు వివిధ దేశాల్లో అంతర్గతంగా రికవరీ వేగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో ఈ అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. ఇంకా మనం వైరస్‌ను ఓడించలేదన్న విషయాన్ని గమనించాలి. పైగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లే ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తాజా అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. – గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ నెల లాక్‌డౌన్‌తో జీడీపీ నష్టం 2 శాతం: బీఓఎఫ్ఏ భారత్ ఎకానమీ రికవరీ ఇంకా విస్తృత ప్రాతిపదికన పటిష్టంగా లేదని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ మంగళవారం హెచ్చరించింది. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీ 1 నుంచి 2 శాతం వరకూ పతనం అవుతుందని అంచనావేసింది. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను తిరిగి ప్రకటించనప్పటికీ, రాత్రి పూట కర్ఫ్యూలు, స్థానిక లాక్డౌన్ విధింపు ద్వారా కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది కూడా ఎకానమీపై ప్రతికూలత చూపే అంశమేనని తెలిపింది. 2021–22లో భారత్ ఎకానమీ 9% వృద్ధి రేటును నమోదుచేసుకోవచ్చని అంచనావేసిన సంస్థ, దీనికి ప్రధాన కారణాల్లో బేస్ ఎఫెక్ట్ (2020–21లో అతి తక్కువ ఎకానమీ గణాంకాలు) ఒకటని తెలిపింది. సెకండ్‌వేవ్‌తో జీడీపీ నష్టం 0.3 శాతమే: యూబీఎస్ కోవిడ్–19 కేసులు ఫిబ్రవరి నుంచీ తిరిగి పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధింపు మరోసారి ఉండబోదన్న అభిప్రాయాన్ని స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్ సెకండ్‌వేవ్ సమస్య ఉన్నప్పటికీ, దీని ప్రతికూల ప్రభావం ఎకానమీపై 20 నుంచి 30 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర మాత్రమే ఉంటుందని యూబీఎస్ విశ్లేషించింది. 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం పురోగమిస్తుందన్న తమ సంస్థ అభిప్రాయంలో మార్పులేదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధానం దాదాపు యథాతథంగా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే రివర్స్ రెపో రేటు 25–40 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తన్వీ అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య రంగంలో అపార అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులున్నాయని, ఇందులో ఏపీలోని మెడ్‌టెక్ జోన్ కూడా ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. ఆసుపత్రులు, వైద్య పరికరాలు, వైద్య బీమా, టెలీమెడిసిన్ తదితర అంశాల్లో పెట్టుబడుల అవకాశాలపై రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, సీఈవో అమితాబ్‌కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్లు మంగళవారం విడుదల చేశారు. మెడ్‌టెక్ జోన్‌ను వైద్య పరికరాల తయారీ కేంద్రంగా నీతి ఆయోగ్ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి చెలరేగిన సమయంలో 15,000 వెంటిలేటర్లు, 10 మిలియన్ల డయాగ్నస్టిక్ కిట్లు, ఐదు లక్షల ఎన్–95 మాస్కులు, 2 లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తైనట్లు తెలిపింది. ‘క్రిటికల్ కాంపొనెంట్లు తయారీ చేసే సంస్థలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఈ రంగంలో పెట్టుబడులకు మెడ్‌టెక్ జోన్ అనుకూలం’’ అని నివేదికలో పేర్కొంది. కోవిడ్ సంక్షోభం విసిరిన సవాలు అనేక అవకాశాలకు దారితీయటం వల్ల ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. నివేదికలో ఇతర అంశాలివీ.. ఆరోగ్యంతోపాటు ఉపాధి.. భారత్‌లో ఆరోగ్య రక్షణ రంగం 2016 నుంచి ఏటా 22% చొప్పున పెరుగుతూ వస్తోంది. ఇది 2022లో 372 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2015లో ఆరోగ్య రంగం ప్రత్యక్షంగా 4.7 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగా 2022 నాటికి 7.5 మిలియన్లకు పెరుగుతుందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) అంచనా వేసింది. ఆరోగ్య రంగం ఆదాయపరంగా, ఉద్యోగాలపరంగా అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారింది. జీవనశైలి వ్యాధుల పెరుగుదల, ప్రభుత్వ –ప్రైవేటు భాగస్వామ్యం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం వైద్య రంగం ఎదుగుదలకు కారణం. చికిత్స కోసం విదేశీయుల రాక.. మెడికల్ వీసాతో 2017లో విదేశాల నుంచి 4,95,056 మంది వస్తే 2019లో 6,97,000 మంది భారత్‌కు వచ్చారు. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, ఒమన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నైజీరియా, కెన్యా, ఇరాక్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. గుండె, ఆర్థోపెడిక్, అవయవాల మార్పిడి, న్యూరో, ఆంకాలజీ, బేరియాట్రిక్స్ తదితర చికిత్సల కోసం ఎక్కువ మంది విదేశీయులు వస్తున్నారు. అధునాతన వైద్య విధానాలతోపాటు ఆయుర్వేదం, యోగా ఇతర సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. -
ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా బెటర్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసినప్పటికీ, అంతకుమించి మంచి ఫలితాన్ని అందించే బాటలో పయనిస్తోందని ఆర్థికశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాక్సినేషన్ విస్తృతితో ఆర్థిక పురోగతి మరింత ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో దేశం ఆరోగ్య రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరోనా వైరెస్ సెకండ్ వేవ్‌ను భారత్ పటిష్టంగా అరికట్టగలిగిందని ఆర్థికశాఖ పేర్కొంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగినప్పటికీ, మ్తొతంగా పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. మహమ్మారి సమస్య కొనసాగుతున్నప్పటికీ, మూడవ త్రైమాసికంలో 0.4 శాతం జీడీపీ వృద్ధి నమోదుకావడం సానుకూల అంశమని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ అవుట్‌లుక్ సర్వే ఆశావాద దృక్పదాన్ని వెలువరించిన అంశాన్ని నివేదిక ప్రస్తావించింది. ఉత్పిత్తి, ఆర్డర్ బుక్, ఉపాధి అవకాశాలు మూడవ త్రైమాసికంలో పెరిగిన అంశాన్ని సర్వే స్పష్టం చేసిందని వివరించింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో 24.4 శాతం క్షీణించగా, రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు 7.3 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. -
కోవిడ్ పట్ల అప్రమత్తం
వ్యాక్సిన్లు, అవి పని చేస్తున్న తీరుపై, బ్రిటన్ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఈ దిశగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన కల్పించాలి. టీకా విషయమై శిక్షణ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వ చేసే విషయం, ఇందుకు అవసరమయ్యే మౌలిక వసతుల గురించి ఆలోచించాలి. సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని కోరారు. బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ సేవలపై దృష్టి పెట్లాలని ఆదేశించారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై చర్చించారు. సెకండ్ వేవ్ వచ్చినా, తగిన చికిత్స అందించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. సగటున రోజుకు 65 వేల టెస్టులు చేస్తున్నామని.. టీచర్లకు, పిల్లలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాల గురించి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల గురించి వివరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం ఉందని, తగిన సిబ్బంది కూడా ఉన్నారని చెప్పారు. ఇందుకోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్జున, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్
వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్లు వెంట వెళతారు. డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ వేదికగా ఉంటుంది. అవసరమైతే హోం విజిట్స్ కూడా చేయాలి. పల్లెల్లో సగటున 1,500 – 2,000 కుటుంబాలకు ఒక డాక్టర్ ఉంటాడు కనుక కొంత కాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. ఇందుకోసం అవసరమైతే 104 సర్వీసులు పెంచుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పల్లెల్లోకి డాక్టర్లను పంపించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాల స్థితిగతులు, వనరుల సమీకరణ, పనులు జరుగుతున్న తీరు, ఆరోగ్య శ్రీ అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్‌సీలు ఉండాలని, ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని, తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు తదుపరి సమావేశం నాటికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థ కోసం ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. తద్వారా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని, మెరుగైన వైద్యం కోసం వారు సరైన ఆస్పత్రికి రిఫరెల్ చేయగలుగుతారన్నారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్, అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నిధుల లోటు రాకూడదు ► ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలకు ఏకంగా రూ.16,270 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున నిధులు కూడా ఆ మేరకు ఇచ్చేలా చూడాలి. నాడు–నేడు కింద కొత్తగా చేపట్టే మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలి. ► మార్చి 31 నాటికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల పనులు జనవరి నెలాఖరు కల్లా ప్రారంభం కావాలి. నిర్మాణాలు పూర్తయ్యాక జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలి. ► వీటి నిర్వహణలో నిరంతరం ఆ ప్రమాణాలు పాటించేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. మొదట్లో బాగున్నా.. సరైన శ్రద్ధ, దృష్టి లేకపోతే మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదు. అద్భుతంగా కట్టడమే కాకుండా, ఆస్పత్రులను సరైన ప్రమాణాలతో నడపడం అత్యంత కీలకం. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సత్వరమే చర్యలు ► ‘పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు మొదలు పెట్టాం. 2023 జూన్ నాటికి ఆ పనులు పూర్తి చేస్తాం. ఐటీడీఏల పరిధిలోని ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్ టెండరింగ్ నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. పాడేరు, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి నెలాఖరులోగా టెండర్లు ఆహ్వానిస్తాం’ అని అధికారులు వివరించారు. ► మిగిలిన 12 చోట్ల మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా సత్వరమే చర్యలు తీసుకుని, యుద్ధ ప్రాతిపదికన కదలాలని సీఎం అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల్లో నాడు –నేడు పనులను 2021 సెప్టెంబర్ నాటికి.. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. హెల్ప్ డెస్క్ కీలకం ► ఆరోగ్యశ్రీ అమలు తీరును, కార్డుల పంపిణీ, ఆరోగ్య ఆవసరాలపై సీఎం సమీక్షించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగులో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే 2,436 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ► ఆరోగ్య ఆసరా కింద ఇప్పటి వరకు 836 ప్రొసీజర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నామని, అదనంగా 638 ప్రొసీజర్లకు కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించగా, దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ► ప్రైవేట్ ఆస్పత్రుల నుంచే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని సీఎం సూచించారు. అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ► ‘ఒక పేషెంట్‌గా మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సమాచారం, సహకారం ఆశిస్తామో.. అలాంటి సహకారాన్ని, సమాచారాన్ని ఆరోగ్యమిత్రలు అందించాలి. ఆరోగ్యశ్రీ, హెల్ప్‌డెస్క్‌ల సర్వీసు ప్రతి రోజూ మెరుగు పడాలి. పేషెంట్లకు పూర్తి స్థాయిలో సంపూర్ణ సేవలు అందేలా చూడాలి. రిఫర్ చేయడం.. అంబులెన్స్‌లను రప్పించుకోవడం తదితర అంశాలపై ప్రొటోకాల్, ప్రొసీజర్లపై గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలి. పేషెంట్ల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి’ అని సీఎం తెలిపారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు రోగికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రులు ఏవన్నది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. 104 నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న దానిపై పేషెంట్‌కు అవగాహన కల్పించాలి. పేషెంట్ తన గ్రామం, మండలం పేరు చెప్పగానే.. అందుబాటులో ఉన్న రిఫరల్ ఆస్పత్రులు ఏవేవి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలు చెప్పాలి. వెంటనే ఆరోగ్య సిబ్బంది ద్వారా వారికి సరైన సహాయం, సహకారం అందించేలా చూడాలి. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు ► ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్న కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఆధారాలు సేకరించి ఆయా ఆస్పత్రులపై జరిమానాలు కూడా విధించామని చెప్పారు. అలాంటి ఆస్పత్రులను ప్యానెల్ నుంచి తొలగించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ► అంబులెన్స్‌ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేందుకు నిరంతరం పరిశీలన చేయించాలని సీఎం ఆదేశించారు. అవి ఎప్పుడూ మంచి కండిషన్లో ఉండాలన్నారు. అవసరం అనుకుంటే.. మండలాల జంక్షన్లలో అదనంగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు.