విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్, ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' ఆదివారం స్పేస్‌ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.
ఇలాన్ మస్క్ (Elon Musk), ప్రాంతీయ రాజధాని డెన్‌పసర్‌లోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ప్రైవేట్ జెట్ ద్వారా ఇండోనేషియా రిసార్ట్ ద్వీపం బాలికి చేరుకున్నారు.
ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల దేశంలోని సుదూర ప్రాంతాల్లోని లక్షలాది మంది ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడానికి సహాయపడుతుందని మస్క్ పేర్కొన్నారు. తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాలకు కనెక్టివిటీని తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ప్రజలు ఏమైనా నేర్చుకోవచ్చు.
ఇండోనేషియా ప్రభుత్వం దేశంలోని గొప్ప నికెల్ వనరులను ఉపయోగించి ఈవీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. కాబట్టి టెస్లా ఆ దేశంలో తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఇండోనేషియాలో టెస్లా తయారీ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment