Starlink
-
స్టార్‌లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందిస్తున్న స్టార్ లింక్ తన సర్వీసులు విస్తరించినట్లు పేర్కొంది. తాజాగా భూటాన్‌లో కంపెనీ సేవలు ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ ఎలాన్‌మస్క్ ధ్రువీకరించారు. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భూటాన్‌లో 2024 డిసెంబర్లో ప్రారంభించినట్లు మస్క్ ఫిబ్రవరి 11, 2025న తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా పేర్కొన్నారు. సంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో నెట్ సేవలందించాలని స్టార్‌లింక్ లక్ష్యంగా పెట్టుకుంది.ధరలు ఇలా..భూటాన్ సమాచార శాఖ స్టార్‌లింక్ ప్రణాళికలకు బేస్ ధరను నిర్ణయించింది. రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు సుమారు రూ.3,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 23 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు డేటా స్పీడ్‌ను అందిస్తుంది. స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్ నెలకు రూ.4,200గా ఉంది. ఇందులో అపరిమిత డేటాను అందిస్తున్నారు. 25 ఎంబీపీఎస్ నుంచి 110 ఎంబీపీఎస్ డేటా స్పీడ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ధరలు స్థానిక టెలికాం ఆపరేటర్లు అందించే రేట్ల కంటే అధికంగా ఉన్నప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్ అందించే కనెక్టివిటీ చాలా కీలకమని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: Infosys ఉద్యోగుల జీతాలు పెంపు.. ఎంతంటే..భారత్‌లో ఇలా..భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఇక్కడ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింక్ అంగీకరించింది. -
భారత్‌లోకి స్టార్‌లింక్.. లైన్ క్లియర్..?
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను ఎలాన్‌మస్క్(Elonmusk) ఆధ్వర్యంలోని స్టార్‌లింక్(StarLink) అధికారికంగా అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.షరతులు సడలించాలని వినతిప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, స్టార్‌లింక్, అమెజాన్‌కు చెందిన కూపర్ వంటి గ్లోబల్ సంస్థలకు ఎలాంటి నిబంధనలను సడలించబోమని ప్రభుత్వం తన వైఖరిని గతంలోనే స్పష్టం చేసింది.చందాదారులను కోల్పోయే ప్రమాదంప్రస్తుతం స్టార్‌లింక్ దరఖాస్తును హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. స్టార్‌లింక్ అధికారికంగా దరఖాస్తు పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం ఎలాంటి వివరణ కోరలేదు. ఒకవేళ దీనికి ప్రభుత్వం ఆమోదం లభిస్తే ఈ ఏడాది చివరి నాటికి స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించడం ద్వారా తమ చందాదారులను కోల్పోయే ప్రమాదం ఉందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్షప్లాన్ల ధరలు ఇలా..స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో సహా గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ల ధర నెలకు 10-500 డాలర్లు(రూ.840-రూ.5,000)గా ఉంటుందని అంచనా. ఈ ధర సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, పరిమిత కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు ఎంతో మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు.. రేపటి నుంచే టెస్టింగ్!
ఇప్పటికి కూడా మారు మూల ప్రాంతాల్లో, ప్రకృతి విపత్తులు జరిగిన సమయాల్లో సెల్ఫోన్లకు సిగ్నల్స్ లభించవు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు ఇలాన్ మస్క్ (Elon Musk) స్టార్‌లింక్ పరిష్కారం చూపెట్టనుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి టెస్టింగ్ కూడా ఈ నెల 27న ప్రారంభించనుంది.శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందే విధంగా.. స్టార్‌లింక్ (Starlink) ఇంటర్నెట్ కనెక్షన్ బీటా టెస్టును ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడా నెట్వర్క్ సమస్య ఉండదని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే, భూమిపైన ఉన్న సెల్ టవర్లతో పనిలేకుండానే.. సెల్ఫోన్లకు శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ లభిస్తాయి.డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్ఇది మొబైల్ ఫోన్లను నేరుగా శాటిలైట్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులను తెస్తుంది. ఇది వరకు సెల్ టవర్లను ఫిక్స్ చేసేవారు. కాబట్టి కొన్ని మారుమూల ప్రాంతాల్లో.. లేదా దట్టమైన అడవుల్లో సిగ్నల్స్ లభించవు. అయితే డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్ ద్వారా మీరు ఎక్కడున్నా.. సిగ్నల్స్ లభిస్తాయి. ఆపత్కాల పరిస్థితుల్లో కూడా ఇది మీ కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి అనుమతిస్తుంది. బీటా పరీక్షలు విజయవంతమైన తరువాత ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.Starlink direct from satellite to cell phone Internet connection starts beta test in 3 days https://t.co/ygAjtTN8SY— Elon Musk (@elonmusk) January 24, 2025ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
మణిపూర్ హింసకు స్టార్‌లింక్ వినియోగం.. మస్క్ ఏమన్నారంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో అగంతకులు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు.మణిపూర్‌లో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడిచేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. Acting on specific intelligence, troops of #IndianArmy and #AssamRifles formations under #SpearCorps carried out joint search operations in the hill and valley regions in the districts of Churachandpur, Chandel, Imphal East and Kagpokpi in #Manipur, in close coordination with… pic.twitter.com/kxy7ec5YAE— SpearCorps.IndianArmy (@Spearcorps) December 16, 2024అయితే, ఈ ఆందోళన అనంతరం,భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. కైరావ్ ఖునౌ అనే ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంటర్నెట్ శాటిలైట్ యాంటెన్నా, ఒక ఇంటర్నెట్ శాటిలైట్ రూటర్, 20 మీటర్ల ఎఫ్టీపీ కేబుల్స్ లభ్యమయ్యాయని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలలో ఒకదానిపై స్టార్‌లింక్ లోగో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంఘ విద్రోహ శక్తులు స్టార్‌లింక్ శాటిలైట్‌ను వినియోగిస్తున్నారు. స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ ఈ దుర్వినియోగాన్ని నియంత్రిస్తారని ఆశిస్తున్నాము’అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘ఇది తప్పు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. -
చర్చల దశలోనే టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అంశాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నందున, ఏమి జరుగుతుందో తనకు వ్యక్తిగతంగా తెలియదని అన్నారు. ‘‘నాకు తెలిసినంత వరకు మేము ఎటువంటి చర్చలు జరపలేదు‘అని టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడుల అవకాశాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ ఈ రెండు విభాగాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహణలో ఉన్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆటోమొబైల్స్‌ను చూస్తుంది. స్టార్‌లింక్ అంశాలను అంతరిక్ష శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి, ఏమి జరుగుతుందో నాకు వ్యక్తిగత పరిజ్ఞానం లేదు’’ అని వాణిజ్యమంత్రి స్పష్టం చేశారు. నేపథ్యం ఇదీ... ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ చివరి క్షణంలో తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘టెస్లాలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన తక్షణ అవసరం ఉందంటూ పర్యటనకు కారణంగా చెప్పారు. నిజానికి ఈ సమావేశంలో ఆయన ప్రధాని నరేంద్రమెదీతో సమావేశం కావాల్సి ఉంది. భారత్‌లో టెస్లా తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ప్రణాళికలు, బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై చర్చలు, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంపై విధాన ప్రకటన వంటి అంశాలు మస్క్ పర్యటనలో భాగమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, ఆయన తన శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం స్టార్‌లింక్ కోసం భారతీయ మార్కెట్‌పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. స్టార్‌లింక్ భారతదేశంలో సేవలకు లైసెన్స్ పొందడానికి అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల ప్రారంభంలో తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ సేవల ప్రారంభానికి తగిన అన్ని అనుమతులనూ పొందే ప్రక్రియలో ఉందని, వారు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లైసెన్స్ పొందుతారని మంత్రి చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో విద్యుత్–వాహన విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీలను అందించాలన్నది ఈ విధానంలో కీలక అంశం. టెస్లా వంటి ప్రధాన ప్రపంచ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/ దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికీ పాలసీ అనుమతించింది. ప్రభుత్వం ఆమోద పత్రం జారీ చేసిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటాయని పాలసీ వివరించింది. ట్రంప్ ’భారత్ స్నేహితుడే’ సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడని, భారత్–అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని గోయల్ అన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమస్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన, వాషింగ్టన్లో కొత్త పరిపాలనలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో వివిధ కార్యక్రమాలు సంస్కరణలపై మీడియాతో మాట్లాడుతూ, టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడి ప్రణాళికలు, ల్యాప్‌టాప్ దిగుమతి విధానం, యూరోపియన్ యూనియన్ ‘ఏకపక్ష‘ గ్రీన్ ఎకానమీ నిబంధనల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారత్‌సహా అన్ని ప్రధాన దేశాలలో విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే, పరస్పర పన్నును ప్రవేశపెడతానని తెలిపారు. కాగా, నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడైన ప్రధాని మోదీ భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గోయల్ ఈ సందర్బంగా అన్నారు. మోదీ నేతృత్వంలో అమెరికాతో భారతదేశ సంబంధాలు ప్రతి సంవత్సరం మెరుగవుతున్నాయని అన్నారు. ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు భారత్ ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు ఎల్రక్టానిక్స్ –ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇంకా చర్చల దశలో ఉన్నాయని వాణిజ్య మంత్రి తెలిపారు. 300 చట్టాలు డీక్రిమినలైజ్.. 300కుపైగా చట్టాలను డీక్రిమనలైజ్ (నేరపూరిత చర్యల జాబితా నుంచి బయటకు) చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. వినియోగించుకోకపోతే.. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ మూత సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించాలని, లేకుంటే ఈ పథకాన్ని మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరో కార్యక్రమంలో పరిశ్రమకు స్పష్టం చేశారు.నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) అనేది వ్యాపార అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు, ఆమోదాలకు పరిశ్రమ వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. 32 కేంద్ర శాఖలు, 29 రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం తగిన అప్లికేషన్ సేవలను అందిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై డీపీఐఐటీ–సీఐఐ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్ఎస్డబ్ల్యూఎస్ అవసరమా? లేదా అనే అంశంపై ఎంపిక ఇప్పుడు మీ (పరిశ్రమ) వద్ద ఉంది. మీకు దానిపై ఆసక్తి లేదని మీరు భావిస్తే... సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను మూసివేయడానికి వెనకాడబోము. కేంద్రం దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది’’ అని అన్నారు. ఎన్ఎస్డబ్ల్యూఎస్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చని, అయితే దానిని మెరుగుపరచడానికి పరిశ్రమ నుండి వచ్చే సూచనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి తెలిపారు. జన్ విశ్వాస్ 2.0 బిల్లు గురించి మాట్లాడుతూ, పరిశ్రమకు రెట్రాస్పెక్టివ్ ప్రయోజనాలను (గతానికి వర్తించే విధంగా) అందించడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి ఎప్పటి కప్పుడు తగిన సూచనలు, సలహాలు చేయడానికి, ఆయా విభాగాల్లో మరింత మెరుగుదలకు సూచనలు, సలహాలు పొందానికి సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)– రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్‌లింక్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటినే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలోనే 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును మన దేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశీయ టెలికామ్ సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ సర్వీస్ దేశంలో ప్రారంభమైన తరువాత.. ఇది చాలా ఖరీదైనదిగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ధరలను కూడా కంపెనీ ప్రకటించలేదు.కంపెనీ మాజీ హెడ్ ప్రకారం.. స్టార్‌లింక్ మన దేశంలో ప్రారంభమైతే, మొదటి సంవత్సరంలో పన్నులతో సహా రూ. 1,58,000 ఖర్చు అవుతుంది. ఇందులో వన్‌టైమ్ ఎక్విప్మెంట్ ధర రూ. 37,400.. నెలవారీ సర్వీస్ ఫీజు రూ. 7,425గా ఉంటుంది. రెండో ఏడాది యూజర్ సుమారు రూ. 1,15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.స్టార్‌లింక్ సర్వీస్ చార్జీలతో పోలిస్తే.. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి సర్వీస్ చార్జీలు చాలా తక్కువ. కాబట్టి స్టార్‌లింక్ మన దేశంలో మంచి ఆదరణ పొందుతుందా? అనేది ప్రశ్నార్థంగా ఉంది.స్టార్‌లింక్ సర్వీస్ ధరలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఈ సేవలకు అవసరమైన లైసెన్స్‌లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ధృవీకరించారు. అయితే స్టార్‌లింక్ సక్సెస్ అనేది మొత్తం దాని చేతుల్లోనే ఉంది.భారతదేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి.. స్టార్‌లింక్ దాని ధరలను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే.. స్టార్‌లింక్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు డిసెంబర్ 15 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. -
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్‌కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్‌కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్‌లింక్, క్విపర్ శాట్‌కామ్ బ్యాండ్‌విడ్త్ అధికమని తెలిపింది.శాట్‌కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్‌లింక్, క్విపర్, ఇతరత్రా శాట్‌కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్‌కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత మార్కెట్లోకి స్టార్‌లింక్!
న్యూఢిల్లీ: పలు దేశాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారతీయ విపణిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధంచేసుకుంటోంది. భారత చట్టాల ప్రకారం సంస్థను నడిపేందుకు స్టార్లింగ్ ముందుకు వచ్చిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభుత్వ సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ తమ భారతీయ యూజర్ల సమాచారాన్ని దేశీయంగానే నిల్వచేయాల్సి ఉంటుంది. ఇందుకు స్టార్‌లింక్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో స్టార్‌లింక్ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.శాటిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల(జీఎంపీసీఎస్) లైసెన్స్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తామని సంస్థ తెలిపింది. స్టార్‌లింక్ సంస్థ ఇంకా తమ సమ్మతి పత్రాలను సమర్పించాల్సి ఉంది. సమర్పణ పూర్తయితే సంస్థ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకుంది. ఈ రంగంలోని భారత నియంత్రణసంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) సంబంధిత అనుమతులను మంజూరుచేయనుంది. ఆలోపు తమ అభ్యంతరాలపై సరైన వివరణ ఇవ్వాలని స్టార్‌లింక్‌ను ఇన్–స్పేస్ కోరింది. స్టార్‌లింక్‌కు పోటీగా మరో ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ సంస్థలో భాగమైన ‘ప్రాజెక్ట్ కూపర్’సంస్థ సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ రెండు సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా చెప్పారు. భద్రతా నియమాలకులోబడి సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం అన్నారు. అగ్రరాజ్యాధినేతగా తన సన్నిహితుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో భారత్‌సహా కీలక శాటిటైల్ ఇంటర్నెట్ సేవల మార్కెట్లలో మెజారిటీ వాటా కైవసంచేసుకోవాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు. స్ప్రెక్టమ్ కేటాయింపులు, తుది ధరలపైనే భారత్‌లో స్టార్‌లింక్ భవితవ్వం ఆధారపడిఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారతి గ్రూప్‌కు చెందిన వన్‌వెబ్, జియా–ఎస్ఈఎస్ సంయుక్త సంస్థ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటికి ఇంకా స్ప్రెక్టమ్ కేటాయింపులు జరగలేదు. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన సిఫార్సులకు ట్రాయ్ డిసెంబర్ 15వ తేదీలోపు తుదిరూపునివ్వనుంది. -
ట్రంప్‌నకు మద్దతు.. మస్క్ కంపెనీలు ఎంత పెరిగాయంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్‌మస్క్ తన విజయానికి ఎంతో కృషి చేసినట్లు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న మార్కెట్లు గడిచిన రెండు సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అనుకున్న విధంగానే ఆయన గెలుపు ఖరారైంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీల స్టాక్ విలువ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు సెషన్‌ల్లో దాదాపు రూ.రెండు లక్షల కోట్లు మేర వీటి విలువ పెరిగినట్లు మార్కెట్ అంచనా వేస్తుంది.ప్రభుత్వ ఏజెన్సీల సడలింపులుమస్క్ కంపెనీల్లోకెల్లా ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌కు ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆయా కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు ఇవే..టెస్లాస్పేస్ఎక్స్న్యూరాలింక్ది బోరింగ్ కంపెనీఎక్స్ కార్పొరేషన్జిప్ 2పేపాల్స్టార్లింక్ఎక్స్ ఏఐ -
అంబానీకి కాల్ చేస్తాను: మస్క్
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్‌మస్క్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్ అంబానీ, ఇలొన్‌మస్క్ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల వైరల్‌గా మారిన ఓ మీమ్‌కు సంబంధించి ఇలొన్‌మస్క్ స్పందించారు.ఎక్స్‌లో డోజీ డిజైనర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన మీమ్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్‌లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్ అంబానీకి ఇలొన్‌మస్క్ అంటే ఎందుకంత భయం? మస్క్ స్టార్‌లింక్ ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ రిప్లై ఇస్తూ ‘భారత్‌లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్‌లింక్ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్ చేసి అడుగుతాను’ అని అన్నారు.Why is Indian billionaire Mukesh Ambani afraid of Elon Musk? Is he worried about Starlink's entry into India disrupting his telecom empire? pic.twitter.com/GJiXztmJDg— DogeDesigner (@cb_doge) October 14, 2024ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుశాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని ముఖేశ్ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్టెల్ అధికారులు కూడా మస్క్ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. -
వేలం ప్రక్రియే మేలు: రిలయన్స్
వ్యక్తిగత లేదా గృహ వినియోగదారుల కోసం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ తెలిపింది. దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిలయన్స్ స్పందించింది. నిర్దిష్ట స్థాయి కలిగిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించడం కంటే వేలం నిర్వహించాలని తెలిపింది.దేశంలో గృహ వినియోగ శాటిలైట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయిస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలొన్మస్క్కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ కూపర్ వంటి వాటికోసం అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో స్పెక్ట్రమ్‌కు సంబంధించి నేరుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులు చేశారు. అయితే ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరణకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో మాత్రం హోమ్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలం ప్రక్రియ నిర్వహించాలని తెలుపుతుంది. ఈమేరకు ట్రాయ్‌కు ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొంది. మస్క్ కోరుకున్న విధంగా గతేడాది స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించేందుకు ట్రాయ్ నిబంధనలు సవరించనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి భారీ పతనానికి కారణాలుటెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ దీనికి సంబంధించిన నిబంధనలపై ప్రస్తుతం పబ్లిక్ కన్సల్టేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత రావడానికంటే ముందే రిలయన్స్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో ఎలాంటి చట్టపరమైన అధ్యయనాలు నిర్వహించకుండానే స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతుందని రిలయన్స్ తన లేఖలో పేర్కొంది. -
కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నింగిలో నివాసం’.. బెంగళూరు కంపెనీ ప్రయత్నం
బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఆకాశలబ్ధి వినూత్న ప్రయత్నం చేస్తోంది. వ్యోమగాములు, పరిశోధకులు, అంతరిక్ష పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి అంతరిక్షంలో నివాసాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోంది.ఆరు నుంచి 16 మందికి వసతి కల్పించేలా అంతరిక్ష నివాస పరిష్కారాన్ని రూపొందిస్తోంది ఆకాశలబ్ధి. దీనికి సంబంధించిన వివరాలను లింక్డ్ఇన్లో వెల్లడించింది. దీన్ని 'తారల మధ్య ఇల్లు'గా పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 'అంతరిక్ష్ హబ్' పేరుతో ఆవాస నమూనాను ఆకాశలబ్ధి సిద్ధం చేసింది. 'అంతరిక్ష్ హబ్' అనేది విస్తరించదగిన షెల్ వంటి నిర్మాణం. ఇది అసాధారణమైన అంతరిక్ష శిధిలాలు, రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతరిక్షంలో నివాసంతో పాటు బహుళ ప్రయోజనాల కోసం వినియోగించేలా దీని డిజైన్‌ను రూపొందిస్తున్నారు. 'అంతరిక్ష్ హబ్'ని మైక్రోగ్రావిటీ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్వహణ, కక్ష్య రవాణా నిల్వ కోసం ఉపయోగించవచ్చు.తాము చేస్తున్న ప్రయత్నం మున్ముందు చంద్రుడిపైనా ఆవాస అన్వేషణకు తోడ్పడుతుందని కంపెనీ తమ వెబ్సైట్లో పేర్కొంది. నిర్మాణం అనుకున్న గమ్యాన్ని చేరుకున్న తర్వాత పూర్తిగా ఏర్పాటు చేయడానికి సుమారు ఏడు రోజులు పడుతుందని ఆకాశలబ్ధి సీఈవో సిద్దార్థ్ జెనా చెప్పారు. కాగా మిషన్ కోసం స్లాట్‌ను బుక్ చేయడానికి ఈ కంపెనీ ఇలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
శ్రీలంకలో స్టార్‌లింక్ సేవలకై చర్చ
టెస్లా అధినేత ఎలొన్‌మస్క్ శ్రీలంకలో స్టార్‌లింక్ సేవలు విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇండోనేషియా-బాలిలో జరిగిన 10వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో మస్క్ సమావేశమయ్యారు.ఎలొన్‌మస్క్ ఇటీవల చైనాతోపాటు ఇండోనేషియాను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించారు. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. శ్రీలంకలోనూ స్టార్‌లింక్ సేవలు అందించాలనే చర్చ జరిగినట్లు తెలిసింది.ప్రెసిడెంట్ మీడియా విభాగం తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు సమాచారాన్ని పంచుకుంది. ‘వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో దేశాధ్యక్షుడు స్టార్‌లింక్ అమలుపై మస్క్‌తో చర్చించారు’ అని తెలిపింది. శ్రీలంక నీటి సరఫరా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మినిస్టర్ జీవన్ తొండమాన్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ..‘బాలిలో జరుగుతున్న ఈవెంట్లో దేశ అధ్యక్షుడు, ఎలొన్మస్క్తో కలిసి సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ, పెట్టుబడికి కొత్త అవకాశాలు వంటి అంశాలపై చర్చించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మస్క్ స్పందిస్తూ..‘రిమోట్ కమ్యూనిటీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీను అందుబాటులోకి తీసుకొస్తే విద్య, ఆర్థిక అవకాశాలు మెరుగుపడుతాయి’ అని పేర్కొన్నారు.Bringing connectivity to remote communities radically improves access to education and economic opportunitiespic.twitter.com/hDVYvpRDKZ— Elon Musk (@elonmusk) May 19, 2024 -
ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్, ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' ఆదివారం స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.ఇలాన్ మస్క్ (Elon Musk), ప్రాంతీయ రాజధాని డెన్‌పసర్‌లోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ప్రైవేట్ జెట్ ద్వారా ఇండోనేషియా రిసార్ట్ ద్వీపం బాలికి చేరుకున్నారు.ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల దేశంలోని సుదూర ప్రాంతాల్లోని లక్షలాది మంది ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడానికి సహాయపడుతుందని మస్క్ పేర్కొన్నారు. తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాలకు కనెక్టివిటీని తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ప్రజలు ఏమైనా నేర్చుకోవచ్చు.ఇండోనేషియా ప్రభుత్వం దేశంలోని గొప్ప నికెల్ వనరులను ఉపయోగించి ఈవీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. కాబట్టి టెస్లా ఆ దేశంలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఇండోనేషియాలో టెస్లా తయారీ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. -
భారత్‌లో ప్రవేశించనున్న ఎలొన్‌మస్క్ మరో కంపెనీ
ప్రపంచ ఎలక్ట్రిక్‌కార్ల దిగ్గజ సంస్థ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఏప్రిల్ 21న భారత్‌కు రానున్నారు. ఈ తరుణంలో భారత్‌లో టెస్లా ప్లాంట్ తయారీకి సంబంధించిన అంశాలు చర్చించనున్నట్లు తెలిసింది. దాంతోపాటు ప్రధానితో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. అయితే కేవలం టెస్లా అంశమే కాకుండా మస్క్ కీలక ప్రాజెక్ట్ అయిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే స్టార్‌లింక్‌ను కూడా ఇండియాలో ప్రవేశపెట్టేలా అధికారులతో చర్చలు జరుపనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్‌కు సంబంధించి లైసెన్స్ ప్రక్రియ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) పరిశీలనలో ఉంది. ఇటీవల శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ), ట్రయల్ స్పెక్ట్రమ్‌పై పని చేసేందుకు డీఓటీ లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. స్టార్‌లింక్ లైసెన్స్ కోసం గతంలోనే ఆ సంస్థ గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం దరఖాస్తు చేసింది. అయితే డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ విషయంలో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో లైసెన్స్ రద్దు అయింది. తాము అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాలనే పాటిస్తామని అప్పట్లో స్టార్ లింక్ పేర్కొంది. దాంతో ప్రభుత్వం తమ దరఖాస్తును తిరస్కరించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్‌కు స్పష్టం చేసింది. తర్వాత కొన్నిరోజులకు తిరిగి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందింది. సెక్యూరిటీ చెక్ తర్వాత శాటిలైట్ సర్వీసులకు సంబంధించిన అనుమతులు మంజూరు అవుతాయని తెలిసింది. దేశీయంగా భారతీ ఎయిర్టెల్ మద్దతున్న వన్ వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టార్ లింక్‌కు కూడా అనుమతులు లభిస్తే మూడో సంస్థ అవుతుంది. అదే జరిగితే ఎయిర్టెల్, జియోకు ఈ విభాగంలో గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనపై డాట్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. -
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త!
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే ఎలాన్ మస్క్ సంస్థ స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతులపై కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ పర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే విషయంలో స్టార్‌లింక్‌తో పాటు భారత్‌కు చెందిన రిలయన్స్ స్టార్‌లింక్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వన్వెబ్లు అనుమతి కోసం కేంద్రానికి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇక తాజాగా స్టార్‌లింక్‌కు డీపీఐఐటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్టార్లింక్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు అభిపప్రాయం వ్యక్తం చేశాయి. అయితే దీనిపై ఎలాన్ మస్క్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఆమోదం కోసం డాట్ ఒక నోట్‌ను సిద్ధం చేస్తుంది.వారి ఆమోదం పొందిన తర్వాత, డిపార్ట్మెంట్లోని శాటిలైట్ కమ్యూనికేషన్స్ వింగ్ (SCW) అధికారికంగా స్టార్లింక్కి అవసరమైన అనుమతులను మంజూరు చేస్తుంది. దీంతో స్టార్‌లింక్ భారత్‌లో తన సేవల్ని వినియోగదారులకు అందించేందుకు దోహదం చేస్తుంది. -
మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా సంస్థలో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, క్లిప్‌లు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా స్పందించింది. స్టార్లింగ్ తమ కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రకటించింది. వాటా కొనుగోలుకు అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. సామాజికమధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మకూడదని చెప్పింది. ఏ సమాచారమైన అధికారిక వెబ్‌సైట్‌ల్లో సరిచేసుకోవాలని తెలిపింది. ఇదీ చదవండి: కొత్త కార్ల పరుగు దేశంలో తొలిసారి టెలికాం రంగంలో ప్రవేశించేందుకు స్టార్‌లింక్ వోడాఫోన్ ఐడియాతో జతకట్టవచ్చనే ప్రచారం వల్ల వీఐ షేర్లు ఇటీవల భారీగా ర్యాలీ అయ్యాయి. స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రభుత్వం వీఐలో తన 33.1 శాతం వాటాను మస్క్‌కు విక్రయించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. మస్క్ వచ్చే వారం వైబ్రెంట్ గుజరాత్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత్ రానున్న నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధ్యాన్యం సంతరించుకుంది. -
ఎట్టకేలకు .. ఎలాన్ మస్క్ నిరీక్షణ ఫలించింది?
శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ వంటి ఇంటర్నెట్ సేవలు భారత్‌లో అందించాలన్న స్టార్ లింక్ అధినేత ఎలాన్ మస్క్ నిరీక్షణ ఫలించింది. డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ వంటి అంశాల్లో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానంతో కేంద్రం సంతృప్తి చెందింది. త్వరలో స్టార్‌లింక్ సేవలందించేలా అనుమతి ఇవ్వనుందని సమాచారం. గతంలో స్టార్‌లింక్ సేవల్ని అందించాలని భావించిన మస్క్ కేంద్ర అనుమతి కోరారు. ఆ సమయంలో తమ సంస్థ డేటా బదిలీ, స్టోరేజీ పరంగా అంతర్జాతీయంగా ఉన్న చట్టాలను అనుసరిస్తామని చెప్పారు. అయితే దీనిని భారత్ వ్యతిరేకించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్‌కు స్పష్టంచేసింది. దీంతో చేసేది స్టార్ లింక్ సేవల కోసం మరోసారి ధరఖాస్తు చేసుకుంది. తాజాగా, స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి వ్యక్తంచేసింది. భద్రతతో పాటు పలు అంశాలను పరిశీలించిన తర్వాతే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (జిఎమ్పీసీఎస్) లైసెన్స్ ఇవ్వనుందని కేంద్ర అధికారులు తెలిపారు. జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్‌కి చెందిన వన్‌వెబ్ ఇప్పటికే దేశంలో జీఎంపీపీసీఎస్ లైసెన్స్‌ను పొందాయి. స్టార్ లింక్ ఆమోదం పొందితే.. ఈ లైసెన్స్‌ని పొందిన మూడవ శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్‌కామ్) కంపెనీగా అవతరించనుంది. స్టార్‌లింక్‌కు జీఎంపీడీఎస్ లైసెన్స్‌పై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం షెడ్యూల్ జరిగినట్లు సమాచారం. త్వరలో అందుబాటులోకి లైసెన్స్ కోసం ప్రభుత్వ అనుమతితో పాటు, శాట్‌కామ్ ప్లేయర్లు స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) నుండి కూడా అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ అనుమతులు లభిస్తే వెంటనే భారత్‌లో స్టార్ లింక్ అందుబాటులోకి వస్తాయి. -
సాధించాం.. పట్టరాని ఆనందంలో ఎలాన్ మస్క్!
ప్రైవేటు రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్(SpaceX)కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్ స్టార్‌లింక్ (Starlink) నగదు ప్రవాహ బ్రేక్ఈవెన్ (సంతృప్త నగదు నిల్వలు)ను సాధించిందని దాని అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు. ఈ మేరకు తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ట్వీట్ చేశారు. ‘స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ బ్రేక్ఈవెన్ నగదు ప్రవాహాన్ని సాధించిందని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను! అద్భుతమైన బృందం సాధించిన విజయం ఇది’ అని ‘ఎక్స్’ పోస్టులో ఎలాన్ మస్క్ రాసుకొచ్చారు. ‘స్టార్‌లింక్ ఇప్పుడు అన్ని యాక్టివ్ శాటిలైట్లలోనూ మెజారిటీగా ఉంది. వచ్చే ఏడాది నాటికి అన్ని ఉపగ్రహాలను భూమిపై నుంచి ప్రయోగించనుంది’ అని కూడా పేర్కొన్నారు. స్టార్‌లింక్ అనేది స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సమూహం. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలకు కవరేజీని అందిస్తోంది. 2019లో స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించిడం ప్రారంభించిన స్పేస్ఎక్స్ 2023 తర్వాత అంతర్జాతీయ మొబైల్ ఫోన్ సేవలను కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యంత విలువైన కంపెనీ ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటైన స్పేస్ఎక్స్ కంపెనీ విలువ సుమారు 150 బిలియన్ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా). స్టార్‌లింక్ గత సంవత్సరం ఆదాయంలో ఆరు రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. 1.4 బిలియన్ డాలర్లు ఆర్జించింది. అయితే మస్క్ నిర్దేశించిన లక్ష్యాల కంటే ఇది తక్కువే అని వాల్ స్ట్రీట్ జర్నల్ గత సెప్టెంబర్‌లో నివేదించింది. స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ వంటి మరిన్ని మూలధన-ఇంటెన్సివ్ ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చడానికి స్టార్‌లింక్ వ్యాపార విభాగాన్ని ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చాలని భావిస్తోంది. స్టార్‌షిప్ అనేది ఒక పెద్ద పునర్వినియోగ రాకెట్, దీన్ని రాబోయే దశాబ్దంలో నాసా కోసం చంద్రునిపైకి పంపించనున్నారు. 2019 నుంచి ఈ కంపెనీ తక్కువ-భూమి కక్ష్యలో తన నెట్‌వర్క్‌ను దాదాపు 5వేల ఉపగ్రహాలకు పెంచింది. యుద్ధ ప్రాంతాలలో స్టార్‌లింక్ పాత్ర గతేడాది యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లో సాయమందించిన స్టార్‌లింక్.. తాజాగా గాజాలోనూ కమ్యూనికేషన్ సేవలు అందించనున్నట్లు ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు. Excited to announce that @SpaceX @Starlink has achieved breakeven cash flow! Excellent work by a great team. Starlink is also now a majority of all active satellites and will have launched a a majority of all satellites cumulatively from Earth by next year. — Elon Musk (@elonmusk) November 2, 2023 -
ఇజ్రాయెల్-గాజా యుద్ధం: కీలక ప్రకటన చేసిన ఎలాన్ మస్క్
ఇజ్రాయెల్ దాడి కారణంగా అన్ని కమ్యూనికేషన్లు ఆగిపోయి యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (elon musk) మద్దతుగా నిలిచారు. గాజాకు ఇంటర్నెట్ సపోర్ట్ అందించనున్నట్లు ప్రకటించారు. హమాస్ నేతృత్వంలో ఉన్న గాజాను ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. అన్ని వైపుల నుంచి దాడులు ముమ్మరం చేశాయి. దీంతో ఆ ప్రాంతంలో కమ్యూకేషన్ పూర్తిగా స్తంభించింది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని యూఎన్, ఇతర అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సహాయ సమూహాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో తన ‘స్టార్‌లింక్’ (starlink) సహాయపడుతుందని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో #StarlinkForGaza అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. స్పేస్ఎక్స్ (SpaceX) నిర్వహిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల సముదాయాన్ని స్టార్‌లింక్ కలిగి ఉంది. ఇది మారుమూల ప్రాంతాలకు సైతం కనెక్టివిటీని అందించగలదు. అక్టోబర్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధకాల కమ్యూనికేషన్లను పెంచే ప్రయత్నంలో స్పేస్ఎక్స్తో చర్చలు కూడా ప్రారంభించింది. ఈ నెట్వర్క్ ఫ్రంట్‌లైన్‌లకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ పట్టణాలకు నిరంతర ఇంటర్నెట్ సేవను కలిగి ఉండటానికి అనుమతిస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రతినిధిని ఉటంకిస్తూ, గాజాలో అన్ని ఇంటర్నెట్, ఫోన్ సేవలను ఇజ్రాయెల్ స్తంభింపజేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గాజాలో ప్రస్తుతం కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించింది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు రోజంతా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ కమ్యూనికేషన్లను తొలగించిదని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. Starlink will support connectivity to internationally recognized aid organizations in Gaza. [ComStar] — Elon Musk (@elonmusk) October 28, 2023 -
‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’
ప్రపంచకుబేరుడు, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌పై ఉక్రెయిన్ మండిపడుతోంది. గత ఏడాది రష్యా యుద్ధనౌకలపై డ్రోన్ దాడిని నిరోధించేందుకు తన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించడానికి అనుమతిని ఎలా నిరాకరించారనే వివరాలు కొత్త జీవిత చరిత్రలో వెల్లడైన నేపథ్యంలో ఉక్రేనియన్ సీనియర్ అధికారి ఎక్స(ట్విటర్)లో స్పందించారు. మస్క్ చాలా పాపానికి పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రేనియన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ మస్క్ జోక్యం తీరని నష్టానికి, అనేకమంది పౌరుల మరణాలకు దారితీసిందని ఆరోపించారు. ఒకోసారి పొరపాటు తీవ్ర తప్పిదంగా మారుతుంది. ఇది అజ్ఞానం, అహం కలయిక ఫలితం. స్టార్‌లింక్ జోక్యం ద్వారా రష్యన్ నౌకాదళంలో కొంత భాగాన్ని నాశనం చేయడానికి ఉక్రేనియన్ డ్రోన్లను అనుమతించి, రష్యా నౌకాదళాన్ని ఉక్రేనియన్ నగరాలపై కాలిబర్ క్షిపణుల దాడికి అనుమతించింది. ఫలితంగా, అనేకమంది పిల్లలు, పౌరులను పొట్టన పెట్టుకుంటోందంటూ ట్వీట్ చేశారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) అసలు కొంతమంది యుద్ధ నేరస్థులను, హత్య చేయాలనే వారి కోరికను ఎందుకు రక్షించాలనుకుంటున్నారు. తద్వారా వారు పాపానికి ఒడిగడుతున్నారని , దాన్ని ప్రోత్సహిస్తున్నారని ఇప్పటికైనా గ్రహించారా? అని ప్రశ్నించారు. టెక్ బిలియనీర్ మస్క్ జీవిత చరిత్రలోని దీనికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మైఖైలో పోడోల్యాక్ ప్రకటన వచ్చింది. కాగా బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ సీఎన్ఎన్ ప్రచురించిన పుస్తకంలో సాయుధ జలాంతర్గామి డ్రోన్లు "కనెక్టివిటీని కోల్పోయినప్పుడు , ప్రమాదకరం లేకుండా ఒడ్డుకు కొట్టుకుపోయినప్పుడు" క్రిమియా తీరానికి సమీపంలో ఉన్న రష్యన్ నౌకాదళాన్ని ఎలా సమీపిస్తున్నాయో వివరించింది.రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రేనియన్ దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలతో ప్రతిస్పందిస్తాడనే ఆందోళన కారణంగా దాడి జరిగిన ప్రాంతంలో సేవలను నిలిపి వేయమని మస్క్ స్టార్‌లింక్ ఇంజనీర్లను ఆదేశించారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. మరోవైపు స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను ఆపివేసినట్లు వచ్చిన ఆరోపణలను మస్క్ ఖండించారు. రష్యా -ఉక్రెయిన్ వార్కి మరింత ఆజ్యం పోయకూడదనే ఉద్దేశంతోనే నో చెప్పా నన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ నుండి క్రిమియన్ నౌకాశ్రయ నగరమైన సెవాస్టోపోల్ వరకు సక్రియం చేయమని చేసిన అభ్యర్థనకు తాను అంగీకరించ లేదని వివరణ ఇచ్చాడు. తన స్పేస్ఎక్స్ కంపెనీ "యుద్ధం-సంఘర్షణ తీవ్రతరం చేసే చర్యలకు సహకరించడం" తనకు ఇష్టం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. అటు రచయిత ఐజాక్సన్ కూడా దీనిపై స్పందించి స్పష్టత ఇచ్చారు. To clarify on the Starlink issue: the Ukrainians THOUGHT coverage was enabled all the way to Crimea, but it was not. They asked Musk to enable it for their drone sub attack on the Russian fleet. Musk did not enable it, because he thought, probably correctly, that would cause a… — Walter Isaacson (@WalterIsaacson) September 9, 2023 Sometimes a mistake is much more than just a mistake. By not allowing Ukrainian drones to destroy part of the Russian military (!) fleet via #Starlink interference, @elonmusk allowed this fleet to fire Kalibr missiles at Ukrainian cities. As a result, civilians, children are… — Михайло Подоляк (@Podolyak_M) September 7, 2023 -
ఎలాన్ మస్క్ ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం?
ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? ‘అవును. మస్క్ ప్రాణాలు ప్రమాదం ఉంద’ని ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ది న్యూ యార్కర్ అనే మీడియా సంస్థ ‘ఎలాన్ మస్క్ షాడో రూల్’ పేరిట పత్రికా కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో స్పేస్, ఉక్రెయిన్, సోషల్ మీడియా, ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో సహా వివిధ రంగాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై ఎలాన్ మస్క్ ప్రభావం వంటి అంశాలను ప్రస్తావించింది. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్! ఉక్రెయిన్ - రష్యా ఘర్షణలో స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్‌లో ఎలా ఉపయోగపడిందో నొక్కి చెప్పింది. అంతేకాదు, ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ అంతర్జాతీయ సంబంధాలపై అధ్యక్షుడు జో బైడెన్ చేసిన కీలక వ్యాఖ్యల్ని గుర్తు చేసింది. జాతీయ భద్రత కోణంలో మస్క్ సంబంధాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆ అంశాలపై అమెరికన్ మీడియా శీర్షికలో హైలెట్ చేసింది. ఆ వార్తలపై ఎర్రోల్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్ షాడో రూల్ కథనాన్ని‘హిట్ జాబ్’ గా అభివర్ణించారు. మస్క్‌ను బలహీనపరిచే ‘షాడో గవర్నమెంట్’ ఇలాంటి కథనాలకు మద్దతు ఇస్తుందని ఆరోపించారు. దాడికి ముందు శత్రువు బలాల్ని నిర్విర్యం చేసేలా ప్రజల్ని ఉసిగొల్పిన చరిత్రను గుర్తు చేశారు. అదే తరహాలో మస్క్‌ను సైతం దెబ్బగొట్టే ప్రయత్నమే జరుగుతుందని పేర్కొన్నారు. ♦‘షాడో ప్రభుత్వం’ ఎలాన్ మస్క్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుందని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించినప్పుడు ‘అవును’ అని బదులిచ్చారు. ♦ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పుడు మస్క్ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మస్క్ తీరు విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం పెంచేలా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ♦రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ గత ఏడాది మేలో ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించడంపై పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సరఫరాకు సంబంధించి పరోక్షంగా బెదిరింపులు చేశారు. ♦అదే సమయంలో 'నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ♦ఎక్స్. కామ్‌లో విధులు నిర్వహిచే సమయంలో ఆయన నిఘూ నీడలో గడుపుతున్నారంటూ సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలో తొలగింపులు, మార్పుల తర్వాత భద్రతను నిర్వహించడం మరింత సవాలుగా మారింది. ఇలా ఎలాన్ మస్క్ విషయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎర్రోల్ మస్క్ ప్రస్తావిస్తూ తన కుమారుడు ఎలాన్ మస్క్‌కు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మరి తండ్రంటే ఆమడ దూరం జరిగే ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యాలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి👉🏻 ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం! -
చంద్రయాన్-3 విజయం, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు?
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తా చాటుతోంది. దీంతో మరో సారి భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై చర్చ ప్రారంభమైంది. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతీయులకు శుభవార్త చెప్పనున్నారు. త్వరలో దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించనున్నారు. ఇందుకోసం భారత్ నుంచి అనుమతులు తీసుకోనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తుంది. అయితే, గతంలో స్టార్‌లింక్ భారత్‌లో శాటిలైట్ సేవల్ని అందించేందుకు సిద్ధమయ్యింది. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా, సెప్టెంబర్ 20న స్టార్‌లింక్ ప్రతినిధులు భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దేశీయ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డాట్) విభాగం అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే అనుమతులు తీసుకోన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టార్‌లింక్ భారత్‌లో గ్లోబుల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాలిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. స్టార్‌లింక్‌తో పాటు ఎయిర్టెల్ ఇక, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే సంస్థల జాబితాలో స్టార్లింక్తోపాటు ఎయిర్టెల్, జియోలు పోటీ పడుతున్నాయి. ఎయిర్ టెల్ వన్ వెబ్, జియో.. జియో స్పేస్ టెక్నాలజీలు ఉపగ్రహ ఇంటర్నెట్పై పనిచేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ తీసుకున్నాయి. చదవండి👉 భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ.. ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్లలో ఎవరి మాట నెగ్గుతుందో? -
ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్‌ల మధ్య పంతం!,ఎవరి మాట నెగ్గుతుందో?
ప్రధాని నరేంద్ర మోదీ గత వారం అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనే ఇప్పుడు ప్రపంచ వ్యాపార దిగ్గజాల మధ్య పంతానికి దారితీసింది? ప్రజలకు సేవలందించే విషయంలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు? తమ మాటే నెగ్గాలని ఒకరంటుంటే? లేదు మాటిచ్చాం..నెరవేర్చుకుంటాం అని మరొకరంటున్నారు? మోదీ అమెరికా పర్యటనతో భారత్‌లో ఇండస్ట్రీలిస్ట్ల మధ్య పంతాలెందుకు వస్తాయి? తమ మాటే ఎందుకు నెగ్గించుకోవాలనుకుంటారు? ఆ కథా కమామిషూ ఏంటో తెలుసుకుందాం పదండి. గత కొన్నేళ్లుగా భారత్‌లో అడుగుపెట్టేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్కు చెందిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం స్టార్‌లింక్‌కు మోదీ అమెరికా పర్యటన ఊతమిచ్చింది. గతంలో లైసెన్స్ లేదన్న కారణంగా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించే స్టార్‌లింక్‌కు కేంద్రం అడ్డు చెప్పింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్‌ను అందించేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. అంత సులభం కాదు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టెస్లా ఎలక్ట్రిక్ కార్యకలాపాలతో పాటు స్టార్‌లింక్ సేవల్ని భారత్‌లో అందించే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ తెలిపారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్తో దేశంలోని మారుమూల ప్రాంతాలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ప్రారంభించడం మస్క్‌కు అంత సులభమయ్యేలా కనిపించడం లేదంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాల సాయంతో ఇంటర్నెట్ సేవలు అందించే విషయంలో ముఖేష్ అంబానీ నుంచి మస్క్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. ఎందుకంటే? శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు మస్క్ కేవలం అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మస్క్‌తో పాటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్,టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా, భారతీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్టెల్ సంస్థ ఛైర్మన్ సునీల్ మిట్టల్ సైతం అదే బాటులో పయనిస్తున్నారు. పట్టుబడుతున్న ముఖేష్ అంబానీ స్పెక్ట్రం అనేది మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీల శ్రేణి. ఇప్పుడీ ఈ స్ప్రెక్టంను వేలం వేయాలని అంటున్నారు ముఖేష్ అంబానీ. శాటిలైట్ సేవలందించే విదేశీ సంస్థలు సైతం స్ప్రెక్టం వేలంలో పాల్గొనాలని పట్టుబడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. లైసెన్స్ ఇస్తే దేశీయ సంస్థలతో - విదేశీ కంపెనీలు పోటీ పడతాయి. అదే ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొంటే పోటీని అరికట్టవచ్చనేది వాదన. కాబట్టే, వాయిస్ ,డేటా సేవలను అందించడానికి విదేశీ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్లు స్పెక్ట్రమ్ వేలంలో తప్పని ఉండాలని అంబానీకి చెందిన రిలయన్స్ చెబుతోంది. అయితే, ఎవరి పోటీ ఎలా ఉన్నా చివరిగా.. భారత ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయం మీద ఆధారపడి ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ స్పెక్ట్రం విభాగంలో కేంద్ర విభాగానికి చెందిన ట్రాయ్ ముఖ్య పాత్ర పోషించనుంది. కేంద్రానిదే తుది నిర్ణయం ఇక, భారత ప్రభుత్వం 2010 నుంచి మొబైల్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తుండగా.. ఫలితంగా కేంద్రానికి 77 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6 లక్షల కోట్లు) వచ్చాయి. టెక్నాలజీ పెరగడం, ప్రస్తుతం ఆయా సంస్థలు శాటిలైట్ సేవల్ని అందించేందుకు పోటీపడుతున్నాయని పెట్టుబడుల సంస్థ సీఎల్ఎస్ఏ చెబుతోంది. ఈ సమస్యపై సెక్టార్ రెగ్యులేటర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పలు సంస్థలతో చర్చలు జరపగా..అమెజాన్ కైపర్, టాటా, ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ వేలానికి వ్యతిరేకంగా ఉండగా, రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా వేలానికి మద్దతు ఇస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తుది నిర్ణయాన్ని కేంద్రం వెల్లడించాల్సి ఉంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
నేను మోదీ అభిమానిని: ఎలన్ మస్క్
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో.. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో-ట్విటర్ యజమాని ఎలన్ మస్క్ భేటీ అయ్యాడు. మూడు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం న్యూయార్క్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మోదీ మోదీ నినాదాల మధ్య ఘన స్వాగతం లభించింది ఆయనకు అక్కడ. ఈ క్రమంలో న్యూయార్క్‌లోనే ప్రధాని మోదీతో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. భారత భవిష్యత్తు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అగ్రదేశాలతో పోలిస్తే భారత్‌కు అభివృద్ధి విషయంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఆయన(ప్రధాని మోదీని ఉద్దేశించి..) భారత్ పట్ల నిజమైన శ్రద్ధ వహిస్తున్నారు. పెట్టుబడుల విషయంలో సరైన సమయంలో ప్రకటన చేస్తాం. ప్రధాని మోదీతో సమావేశం ఎంతో అద్భుతంగా సాగింది. చాలా ఏళ్ల కిందట ఆయన మా ఫ్యాక్టరీని సందర్శించారు. అలా మా పరిచయం మొదలైంది. భారత్‌కు ఆయన సరైందే చేస్తున్నారు. ఆయనకు నేను అభిమానిని. భారత్‌లో సౌర శక్తి పెట్టుబడులకు ఎంతో ఆస్కారం ఉంది. అందుకే స్టార్‌లింక్ ఇంటర్నెట్ను తీసుకెళ్లాలనుకుంటున్నాం. భారత్‌లో పర్యటిస్తా.. వచ్చే ఏడాది అది ఉండొచ్చు. అంతేకాదు.. టెస్లాను కూడా భారత్‌కు తీసుకెళ్తాం అని మస్క్, భారత ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాకు వివరించారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ యుద్ధం.. కుండబద్ధలు కొట్టిన మోదీ -
భారత్‌తో ఎలాన్ మస్క్ చర్చలు.. ప్రధాని మోదీ అందుకు ఒప్పుకుంటారా?
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శాటిలైట్ సంబంధిత ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీస్(జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) వద్ద అప్లయి చేసినట్లు సమాచారం. ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా 32దేశాల్లో అందిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, కెనడా,మెక్సికో, యూరప్, యూరప్, సౌత్-నార్త్ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ బెస్ట్ కంట్రీగా భావించి.. గతేడాది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సేవల కంటే ముందు బుక్సింగ్ సైతం స్టార్‌లింక్ ప్రారంభించింది. అయితే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేశారు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ గత వారం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేలా జీఎంపీసీఎస్ కోసం అప్లయి చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. జీఎంపీసీఎస్ లైసెన్స్‌తో పాటు భారత డిపార్టెమెంట్ ఆఫ్ స్పేస్ అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి లభిస్తే స్పేస్ ఎక్స్ భారత్‌లో శాటిలైట్ గేట్‌వేస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ ఒప్పుకుంటారా? ఎలాన్ మస్క్ చైనా నుంచి టెస్లా కార్లను దిగుమతి చేసి భారత్‌లో అమ్మకాలు జరపాలని అనుకున్నారు. కానీ మస్క్ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. టెస్లా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలనుకుంటే సమస్య ఏదీ లేదని, చైనా నుంచి మాత్రం కార్లను దిగుమతి చేయకూడదని కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆ తర్వాత భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్లను ఎప్పుడు ప్రారంభించనున్నారు అని ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ స్పందించారు. టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను భారత్‌లో నిర్మించే ఆలోచన లేదు. మొదట మా కార్ల విక్రయాలు, సర్వీసులకు అనుమతించని ఏ ప్రాంతంలోనూ టెస్లా ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పబోదని మస్క్ ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో కేంద్రం అనుమతి ఇస్తుందా? లేదా అని తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది. చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత! -
ఎలాన్ మస్క్‌పై టంగ్ స్లిపయ్యాడు.. ఆ వెంటనే ఊహించని షాక్!
ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది. అంతేనా ఆయన ట్వీట్లు కూడా నెట్టింట హల్ చేస్తుంటాయి. తాజాగా మస్క్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ఇటీవల ఆయన చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు మస్క్‌ను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాయబారి ఆండ్రిజ్ మెల్నిక్ కూడా ఈ విషయంలో కాస్త నోటి దురుసును చూపించారు. అయితే ఈ వ్యాఖ్యలు అనంతరం ఆయన దేశానికి ఫ్రీ ఇంటర్నెట్ లేకుండా చేసిందని అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. అనూహ్య పరిణామాల మధ్య ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఉక్రెయిన్‌కు ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తూ అండగా నిలిచిన మస్క్‌పై ఇటీవల దుర్భాషలాడారు ఆండ్రిజ్ మెల్నిక్. దీని తర్వాత పరిణామంలో.. ఇకపై ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడంపై మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీగా కొనసాగాలంటే మీరు ఫండింగ్ ఇవ్వండని ఆమెరికా ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించి మస్క్ పెంటాగాన్కి ఓ ట్వీట్ చేశాడు. అందులో స్టార్‌లింక్ సర్వీస్ కోసం ఇకపై చెల్లింపు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అదే ట్వీట్లో ఇలా కూడా ఉంది. మెల్నిక్ సూచించినదే తాను చేస్తున్నానని చెప్పారు మస్క్. ఖర్చు ఏక్కువైంది.. పేమెంట్ చేయగలరు! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు పనిచేయాలంటే ఇప్పుడు దాదాపు $120 మిలియన్లు చెల్లించాలని స్పేస్ఎక్స్ తాజాగా పెంటగాన్‌ను కోరుతోంది. దీంతో పాటు, వచ్చే ఏడాదికి సంబంధించిన చెల్లింపులను కూడా కంపెనీ ముందుగానే కోరినట్లు సమాచారం. 2023కి పెంటగాన్ $400 మిలియన్లు చెల్లించాల్సి ఉంటుందని తమ అంచనాను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. ఉక్రెయిన్‌కు ఉచిత సేవలందించేందుకు స్టార్‌లింక్ టెర్మినల్స్‌పై స్పేస్ఎక్స్ $80 మిలియన్లు ఖర్చు చేసిందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 100 మిలియన్ డాలర్లకు చేరుతుందని మస్క్ గతంలో ట్విట్టర్లో వెల్లడించారు. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
‘ఎలాన్ మస్క్’కు కేంద్రం భారీ షాక్, దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు!
భారతీయులకు శుభవార్త.త్వరలో మనదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ సంస్థ దేశంలో తొలిసారి హై త్రూపుట్ శాటిలైట్ (హెచ్‌టీఎస్)బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే..దేశంతో పాటు రూరల్ ఏరియాల్లో సైతం హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను వినియోగించుకునే అవకాశం కలగనుంది. శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ హ్యూస్ కమ్యూనికేషన్స్ భారత్‌లో తొలిసారి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇస్రో ద్వారా హై త్రూపుట్ శాటిలైట్ (HTS) బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఈ శాటిలైట్ సేవల్ని అందించేందుకు ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు అవసరమైన అనుమతుల్ని ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు అదే శాటిలైట్ సర్వీసుల్ని అందించేందుకు కేంద్రం హ్యూస్ కమ్యూనికేషన్‌కు అనుమతి ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. మాలక్ష్యం అదే దేశంలో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని అందించడమే హ్యూస్ సంస్థ లక్ష్యం. టెర్రెస్ట్రియల్ (terrestrial) నెట్ వర్క్‌ల తరహాలో వినియోగించే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులతో ఎంటర్ ప్రైజెస్, గవర్న్మెంట్ నెట్‌వర్క్‌లను అనుసంధానం కానున్నాయి. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు డిజిటల్ విభజనను తగ్గించడంలో సహాయపడటానికి ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి పని చేసే మార్గాలను అన్వేషించడానికి, విస్తరించడానికి మేం కట్టుబడి ఉన్నాము" అని స్పేస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ,ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ అన్నారు. -
ఐఫోన్‌కు చిక్కులు.. 14 ప్రో భారత్‌లో లాంఛ్ కాదా?
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ విడుదలపై వినియోగదారులకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ఆసక్తిని రెట్టింపు చేస్తూ యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల తేదీ, ఫోన్లోని ఫీచర్లను లీక్ చేస్తుంది. ఈ తరుణంలో దేశీయ ఐఫోన్ లవర్స్‌ను నిరుత్సాహా పరుస్తూ పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. యాపిల్ ముందస్తు ప్రకటించిన తేదీలలో 'ఐఫోన్ 14 ప్రో' ను భారత్‌లో విడుదల చేసేందుకు అడ్డంకులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను కొత్త ఫీచర్లను జోడిస్తూ అప్ గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌ను మినహాయి ఇచ్చి..ఐఫోన్ 14 ప్రోలో మాత్రమే శాటిలైట్ కాలింగ్, టెక్స్టింగ్ ఫీచర్లను యాడ్ చేయనుంది. అదే జరిగితే ఐఫోన్ 14 ప్రో భారత్‌లో విడుదలలో జాప్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ శాటిలైట్ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే? యాపిల్ నుంచి తొలిసారి మరో వారం రోజుల్లో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను భారీ మార్పులతో మార్కెట్‌కి పరిచయం చేయనుంది. ముఖ్యంగా డిజైన్ల విషయంలో యాపిల్ సంస్థ రాజీపడడం లేదని, యూజర్లను అట్రాక్ట్ చేసేలా వైడ్ నాచ్, పిల్ షేప్డ్ డిజైన్, మొబైల్ స్క్రీన్ స్పేస్ మరింత పెద్దగా ఉండేలా చూస్తోంది. ఆ సంస్థ తొలిసారి ఐఫోన్ 14లో నెట్ వర్క్ లేకపోయినా యూజర్లు అత్యవసర పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేలా ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఐఫోన్ 14 ప్రో శాటిలైట్ కనెక్టివిటీ ఐఫోన్ 14 ప్రోలో వస్తున్న శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ గురించి యాపిల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆ ఫీచర్ ఉంటే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ భారత్‌లో విడుదల కాకపోవచ్చు. పైగా యాపిల్ సంస్థ మరిన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. భారత వైర్ లెస్ చట్టంలోని సెక్షన్ 6, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం దేశంలో తురయా/ఇరిడియం శాటిలైట్ ఫోన్ల వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో అనుమతి లేకుండా భారతదేశంలో శాటిలైట్ ఫోన్లను ఉపయోగించడం ‘అనధికార / చట్టవిరుద్ధం’ అవుతుంది. యూజర్లకు కేంద్రం హెచ్చరికలు దేశ భద్రత దృష్ట్యా కేంద్రం శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటి లైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడి నిబంధనలకు విరుద్ధంగా మస్క్ వ్యవహరిస్తున్నారంటూ కేంద్రం అనుమతులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. స్టార్‌లింక్ ప్రీ బుకింగ్స్ నిలిపివేసింది. భారత్‌లో స్టార్ లింక్ లైసెన్స్ పొందలేదని, ఆ సేవల్ని కొనుగోలు చేయోద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్ 14 ప్రో' ను విడుదల చేయాలంటే యాపిల్ ఐఫోన్ 14 ప్రో విడుదల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అయితే, ప్రస్తుతం మన దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ నిబంధనల్ని కేంద్ర సవరిస్తుందా? సవరించకుండా ప్రభుత్వం ఐఫోన్ కోసం మినహాయింపు ఇస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. శాటిలైట్ కాలింగ్, మెసేజింగ్ ఫీచర్‌ను నిలిపివేస్తే ఐఫోన్ 14 ప్రోను లాంఛ్ చేసుకునే వీలుంటుంది. చదవండి👉 మార్చుకోం : ఐఫోన్14 సిరీస్ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే! -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఎలాన్ మస్క్ బంపరాఫర్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. స్టార్ లింక్ శాటిలైట్ సేవల్ని అందిస్తున్న మస్క్ ఇకపై అమెరికాకు చెందిన మొబైల్ యూజర్లకు శాటిలైట్ సాయంతో నేరుగా హై స్పీడ్ ఇంటర్నెట్ను వాడుకలోకి తేనున్నారు. మస్క్ ప్రపంచవ్యాప్తంగా 2,600కు పైగా స్టార్ లింక్ శాటిలైట్ల సాయంతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందిస్తున్నారు. ఇప్పుడు మొబైల్స్‌లో సైతం శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు.మొబైల్ యూజర్లకు శాటిలైట్ సర్వీస్ అందిస్తామని, ఇందుకోసం 2జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (ఎఫ్‌సీసీ)కి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఎఫ్సీసీకి తమ సంస్థ మొబైల్ శాటిలైట్ సర్వీస్ ను సులభతరం చేయడానికి 2జీహెచ్‌జెడ్ రేడియో బ్యాండ్‌ని ఉపయోగించగల సామర్థ్యం ఉన్న స్టార్‌లింక్ ఉపగ్రహాలకు "మాడ్యులర్ పేలోడ్"ని జోడించేందుకు , ఉపయోగించేందుకు అనుమతిని కోరినట్ల స్పేస్ ఎక్స్ పేర్కొంది. తద్వారా అమెరికన్లు ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు' అని స్పేస్ ఎక్స్ తన ఎఫ్‌సీసీ ఫైలింగ్‌లో నివేదించింది. -
ఎలన్ మస్క్ కొంప ముంచే పనిలో చైనా!
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చైనాతో ఉన్న సత్సంబంధాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన సారథ్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్‌ను నాశనం చేసేందుకు ప్లాన్ గీసుకుంది. ఈ మేరకు చైనా నుంచే అధికారిక సంకేతాలు వెలువడడం గమనార్హం. ఇప్పటికే రష్యా స్పేస్ ఏజెన్సీ.. ఉక్రెయిన్ సాయం విషయంలో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ సేవలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే స్టార్‌లింక్ శాటిలైట్లను కూల్చేయాలని చైనా భావిస్తోంది. ప్రపంచంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో అత్యంత చౌకైన సర్వీస్‌లు అందిస్తోంది ఎలన్ మస్క్ స్టార్‌లింక్. ఒకవేళ తమ జాతీయ భద్రతకు గనుక హాని కలిగించేవిగా పరిణమిస్తే.. స్టార్‌లింక్ శాటిలైట్లను ముందువెనకా ఆలోచించకుండా కూల్చేస్తామని చైనా మిలిటరీ ప్రకటించింది. ఈ మేరకు అధ్యయనంతో కూడిన ఓ ప్రకటన వెలువడింది. అంతేకాదు స్టార్‌లింక్ శాటిలైట్‌పై నిఘా ఉంచాలని, నిరంతరం పర్యవేక్షణ అవసరం ఉందని చైనా సైంటిస్టుల అభిప్రాయాలను సైతం ప్రచురించింది. ఈ అధ్యయనానికి బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రీసెర్చర్ రెన్ యువాన్‌జెన్ నేతృత్వం వహించారు. స్టార్‌లింక్ సేవలు.. అమెరికా డ్రోన్స్, ఫైటర్ జెట్స్ డేటా ట్రాన్స్‌మిషన్‌ను వేగాన్ని(దాదాపు వంద రెట్ల వేగం) పెంచుతోందన్న ప్రచారం నేపథ్యంలో.. చైనా మిలిటరీ రీసెర్చర్లు ఈ అధ్యయనం చేపట్టారు. ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్నాడు. లో-ఎర్త్ ఆర్బిట్‌లో చిన్న చిన్న శాటిలైట్లను ప్రవేశపెట్టడం ద్వారా.. ఈ భూమ్మీద బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది స్టార్‌లింక్. స్టార్‌లింక్ వేలాది చిన్న ఉపగ్రహాలతో కూడి ఉంది. ఒకవేళ ముప్పు పొంచి ఉందని భావిస్తే.. వాటన్నింటినీ నాశనం చేయాలనేది చైనా ప్రణాళిక. క్షిపణులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. కాబట్టి, చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి లేజర్లు, మైక్రోవేవ్ టెక్నాలజీ లేదంటే చిన్న ఉపగ్రహాలను, స్టార్‌లింక్ శాటిలైట్ కట్టడికి కూడా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. దీనిపై మస్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!. చదవండి: మస్క్ నాతో నీచంగా ప్రవర్తించాడు! -
గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రయోగాలతో ముందుకు సాగుతున్నాడు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పరిణామాలు తన కలల్ని చిన్నాభిన్నం చేస్తున్నా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. చిన్న గ్యాప్ ఇచ్చీ మళ్లీ మొదలు పెట్టాడు. తాజాగా శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలన్ మస్క్ 48 స్టార్‌లింక్ శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి పంపించారు. గత కొన్నేళ్లుగా అమెరికన్ బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ తక్కువ కనెక్టివిటీలో సైతం ఇంటర్నెట్ను అందించేందుకు శాటిలైట్ ఇంటర్నెట్పై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా చివరి సారిగా ఫిబ్రవరి 3న 49 స్టార్‌లింక్ శాటిలైట్లను నింగిలోకి పంపారు. అందులో 38రాకెట్లు కూలిపోయాయి. అయినా ప్రయోగాల్ని ఎక్కడా నిలిపేయలేదు.రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో శాటిలైట్ ఇంటర్నెట్ ఏ విధంగా ఉపయోగ పడిదో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు అదే జోరుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యారు. Liftoff! pic.twitter.com/EGxL5a9tbh — SpaceX (@SpaceX) March 9, 2022 ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని స్పేస్ స్టేషన్ నుంచి టూ స్టేజ్ ఫాల్కన్ 9 రాకెట్‌తో 48శాటిలైటన్లు ఆర్బిట్‌లోకి పంపినట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. కాగా, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ఎలన్ మస్క్ 2019 నుంచి ఇప్పటి వరకు 2వేల స్టార్లింగ్ శాటిలైట్లను నింగిలోకి పంపారు. మరో 12వేల శాటిలైట్లపై ప్రయోగించేందుకు అనుమతి పొందగా.. మరో 30వేల రాకెట్లను ప్రయోగించేందుకు అనుమతి కోసం అప్లయ్ చేసినట్లు సమాచారం. చదవండి: జాక్‌పాట్!! అమెరికా ప్రెసిడెంట్‌గా ఎలన్ మస్క్? -
Elon Musk: ఇంటర్నెట్ ఉపయోగించేప్పుడు జాగ్రత్త! లేదంటే ప్రాణాలకే ప్రమాదం
రష్యా దండయాత్రతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్లకు మరిన్ని జాగ్రత్తలు చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్. రష్యా దాడులు మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో కరెంటు, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ ప్రజల కోసం తన స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలన్ మస్క్. చాలా మంది ఈ ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. అయితే స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉపయోగించేప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఎలన్ మస్క్ హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఇప్పుడు ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది కేవలం స్టార్ లింక్ ఒక్కటే. కాబట్టి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థపై రష్యా మిస్సైస్ దాడులు చేసే అవకాశం ఉందని ఎలన్‌మస్క్ అంటున్నారు. Important warning: Starlink is the only non-Russian communications system still working in some parts of Ukraine, so probability of being targeted is high. Please use with caution. — Elon Musk (@elonmusk) March 3, 2022 అత్యవసరం అయినప్పడు మాత్రమే స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ని ఉపయోగించాలని ఉక్రెయిన్ ప్రజలకు ట్విట్టర్ ద్వారా సూచించాడు. ఇంటర్నెట్ కోసం యాంటెన్నాను ఆన్ చేసినప్పుడు.. రష్యన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లకి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కి చెప్పారు ఎలన్‌మస్క్. అంతేకాదు చుట్టూ జనాలు లేకుండా చూసుకుని ఈ యాంటెన్నాలను ఆన్ చేయాలని తెలిపాడు. చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..! -
మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్..!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తిగిన తర్వాత ఆ దేశంలో ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో స్టార్‌లింక్ సేవలను అందించాలని ఆదేశ ఉపాధ్యక్షుడు మస్క్'ను అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి తెస్తానని రెండు రోజుల క్రితం మాటిచ్చిన మస్క్.. తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుద్దరించడం కోసం స్టార్ లింక్ పరికరాలను(టర్మినల్స్)ను పంపిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పరికరాలను స్పేస్ ఎక్స్ సంస్థ ఉక్రెయిన్‌కు చేరవేసింది. స్టార్ లింక్ పరికరాలు ఉక్రెయిన్‌కు చేరిన విషయాన్ని ఆదేశ ఉపాధ్యక్షుడు నేడు ధృవీకరించారు. టర్మినల్స్‌తో ఉన్న ఓ ట్రక్కు ఫొటోను ఆయన ట్విటర్లో షేర్ చేస్తూ ‘‘స్టార్ లింక్ వచ్చేసింది. చాలా ధన్యవాదాలు మస్క్’’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో సునామీ కారణంగా ఇటీవల అతలాకుతలమైన టోంగా ద్వీపంలో మస్క్ శాటిలైట్ అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. Starlink — here. Thanks, @elonmusk pic.twitter.com/dZbaYqWYCf — Mykhailo Fedorov (@FedorovMykhailo) February 28, 2022 ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ కృషి చేస్తోంది. ఇప్పటికే 11కు పైగా దేశాలలో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్‌లింక్ ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్'ను మారుమూల ప్రాంతాలకు అందించాలని స్పేస్ ఎక్స్ చూస్తుంది. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్టు కోసం 18 వందలకు పైగా శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించింది. (చదవండి: పీఎన్బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!) -
ఎలన్‌మస్క్‌కు గట్టిపోటీ..! దూకుడు పెంచిన ఎయిర్టెల్..!
స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను భారత్ ప్రవేశపెట్టాలనే ఎలన్‌మస్క్ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. దీంతో స్టార్‌లింక్ సేవలు పూర్గిగా నిలిచిపోయాయి. ఇక స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు పోటీగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. 34 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..! భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్ ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి ఏరియన్‌స్పేస్ రాకెట్ సహాయంతో 34 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వన్‌వెబ్ శుక్రవారం ధృవీకరించింది. 2022లో కంపెనీ ప్రారంభించిన తొలి ప్రయోగం ఇది. ఇది 13 వ ప్రయోగం. వన్‌వెబ్ ఇప్పటివరకు 428 శాటిలైట్లను ప్రయోగించింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రయోగంలో ఇప్పటివరకు 66 శాతం ఉపగ్రహాలను వన్ వెబ్ విజయవంతంగా పూర్తి చేసింది. మరింత వేగంగా..! వన్ వెబ్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. స్టార్‌లింక్ సేవలకు పోటీగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల ప్రయోగాలను ముమ్మురం చేసింది. కంపెనీకి భారతీ ఎయిర్టెల్ తోడవడంతో మరింత వేగంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తెచ్చేందుకు సిద్దమైంది వన్ వెబ్. ఇటీవల హ్యూస్ నెట్వర్క్ సిస్టమ్స్, మార్లింక్ అండ్ ఫీల్డ్ సొల్యూషన్స్ హోల్డింగ్స్‌తో సహా పలు కంపెనీలతో వన్ వెబ్ గత నెలలో కీలక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసింది. చదవండి: గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్..! -
భారత్‌లో లైసెన్స్ కోసం నిరీక్షణ తప్పదా?
ప్రపంచం మొత్తం తన వ్యాపార రంగాన్ని విస్తరించాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలను భారత్ ముందుకు పోనివ్వడం లేదు. అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇదివరకే టెస్లా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. భారత్‌లో మాత్రం దిగుమతి సుంకం దెబ్బకి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో మరో వ్యాపారానికి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ ఎక్స్ నుంచి శాటిలైట్ సంబంధిత ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరప్, సౌత్-నార్త్ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ బెస్ట్ కంట్రీగా భావించి.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సేవల కంటే ముందు బుక్సింగ్ సైతం ప్రారంభించించింది కూడా. అయితే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేశారు కూడా. ఇదిలా ఉండగా.. తాజాగా అతిపెద్ద దేశాల్లో టాప్ టెన్‌లో ఉన్న బ్రెజిల్.. స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి బ్రెజిల్ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీ (Anatel)తో స్టార్‌లింక్ సంప్రదింపులు జరిపిందే లేదు. అయినప్పటికీ బ్రెజిల్ గవర్నమెంట్ ముందుకొచ్చి.. డీల్ ఓకే చేసుకోవడం గమనార్హం. మరోవైపు భారత్‌లో లైసెన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టిన స్టార్‌లింక్.. కొత్త చీఫ్ కోసం వేట సైతం ప్రారంభించింది. అయితే లైసెన్స్ పరిశీలనలోనూ జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది స్టార్‌లింక్. చదవండి: అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా! -
కష్ట కాలంలో టోంగా దేశానికి అండగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్..!
కొద్ది రోజుల క్రితం టోంగాకు సమీపంలో ఉన్న సముద్రంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్దలవడంతో ఆకాశమంతా ధూళి మేఘాలతో నల్లబారడం, ఆ వెంటనే విరుచుకుపడిన జల ప్రళయం(సునామీ)తో ఈ చిన్న టోంగా దేశం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి విలయం సృష్టించిన నష్టం అంచనాలకు చిక్కడం లేదు. ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్స్ నెట్వర్క్ తెగిపోవడంతో ఆ దేశంతో ఇతర దేశాలు సంప్రదించడానికి కొంచె కష్టం అవుతుంది. ఈ విపత్తుల వల్ల సముద్రగర్భ కేబుల్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దేశానికి ఇంటర్నెట్ సేవలు తిరిగి అందించడానికి కనీసం ఒక నెల పాటు సమయం పడుతుందని రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది. ట్విటర్ వేదికగా పోస్టు చేసిన ఈ నివేదికకు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ట్విట్టర్లో స్పందించారు. ఆ దేశ ప్రజలు కోరితే స్టార్ లింకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్దంగా ఉన్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఉత్తరం న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడు షేన్ రెటి కూడా టోంగా దేశానికి స్టార్ లింక్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని ఎలన్ మస్క్‌కు ట్విటర్ వేదికగా ఒక లేఖ రాశారు. Could people from Tonga let us know if it is important for SpaceX to send over Starlink terminals? — Elon Musk (@elonmusk) January 21, 2022 ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ అనేది ఎటువంటి కేబుల్ అవసరం లేకుండానే ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ అందిస్తుంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వేగం కూడా ఇతర వాటితో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించాలని మస్క్ చూస్తున్నారు. టోంగాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టోంగాకు పశ్చిమంగా పసిఫిక్ సముద్రంలో తలెత్తిన సునామీ టోంగాను ముంచెత్తింది. పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడ్డాయి. సునామీ కూడా ఉపశమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు అగ్ని పర్వతం నుండి విస్ఫోటనాలు కొనసాగుతుండడంతో అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆ ప్రభావంతో చుట్టుపక్కల వాతావరణంలో నెలకొనే ప్రభావాల పట్ల పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న టోంగాకు సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. (చదవండి: సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం) -
స్టార్ లింక్‌కు షాక్.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక అడుగు..!
మన దేశంలో అందరి కంటే ముందుగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని చూసిన స్టార్ లింక్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ లింక్ కంటే ముందే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు వన్ వెబ్ సిద్దం అవుతుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అంధించడానికి ప్రముఖ నెట్వర్క్ సంస్థ భారతి ఎయిర్టెల్, యుకె ప్రభుత్వ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ వన్ వెబ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యూస్ వ్యూహాత్మక ఆరు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం మీద సంతక చేశాయి. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హైదరాబాద్‌కి చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్లో ఎయిర్టెల్ సుమారు 33 శాతం, హ్యూస్ కమ్యూనికేషన్స్ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ భారత్‌లో శాటిలైల్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా ఫైబర్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వన్ వెబ్ నెట్వర్క్ పట్టణాలు, గ్రామాలు, స్థానిక & ప్రాంతీయ మున్సిపాలిటీలలోని కష్టతరమైన ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించగలదు అని కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. 2022 చివరలో ప్రారంభం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్‌గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ వల్ల దేశంలోని లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించవచ్చు అని వన్ వెబ్ సీఈఓ నీల్ మాస్టర్సన్ తెలిపారు. ఈ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల 2022 చివరి నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?) -
ఎలన్ మస్క్‌కు మరో భారీ షాక్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు మరో భారీ షాక్ తగిలింది. త్వరలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అక్టోబర్ 1న స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్‌గా సంజయ్ భార్గవను నియమించారు. అయితే ఇప్పుడు సంజయ్ భార్గవ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్‌లో తన లాస్ట్ వర్కింగ్ డే డిసెంబర్ 31 అని అధికారంగా వెల్లడించారు. ఎలన్ మస్క్ 1999లో ఆన్ లైన్ పేమెంట్ సంస్థ పేపాల్‌ను ఏర్పాటు చేశారు. 2000సంవత్సరంలో మనదేశానికి చెందిన సంజయ్ బార్గవ పేపాల్ సంస్థలో కీరోల్ ప్లే చేశారు. తాజాగా ఆయన పనితీరు మెచ్చిన మస్క్..,సంజయ్ భార్గవను స్టార్ లింక్ ఇండియా డైరక్టర్‌గా నియమించారు. అలా నియమించిన మూడు నెలలకే సంజయ్ బార్గవ స్టార్‌లింక్ నుంచి వైదొలుగుతున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేశారు. స్టార్ లింక్ ఇండియా బోర్డ్ చైర్మన్ పదవితో పాటు కంట్రీ డైరక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంజయ్ భార్గవ లింక్డిన్ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు స్టార్‌లింక్ సంస్థ నుంచి బయటకి రావడంపై తాను ఎలాంటి కామెంట్ల చేయడం లేదని, మీడియా సైతం తాను తీసుకున్న నిర్ణయం పట్ల గౌరవించాలని కోరారు. చదవండి: భారత్ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్ మస్క్ కంపెనీ..! -
భారత్ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్ మస్క్ కంపెనీ..!
స్టార్‌లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టాలని భావించిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌కు గత నెలలో మనదేశంలో గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతదేశంలో స్టార్‌లింక్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ తీసుకోవడం నిలిపివేసిన తర్వాత ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం గతలో యూజర్ల వసూలు చేసిన డబ్బులను తిరగి ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2020లో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ స్టార్‌లింక్ వినియోగదారుల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ప్రీ బుకింగ్ ఆర్డర్లు 99 డాలర్ల ధరకు లభ్యం అయ్యాయి. మన దేశంలో ఈ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల అందించడం కోసం ప్రీ బుకింగ్ పేరుతో రూ.7300లను స్టార్‌లింక్ వసూలు చేసింది. లైసెన్స్ తీసుకోకుండా స్టార్‌లింక్ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరం అని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) సంస్థను హెచ్చరించడంతో స్టార్ లింక్ నవంబర్ 2021లో భారతదేశంలో ప్రీ బుకింగ్ ఆర్డర్లను తీసుకోవడం నిలిపివేసింది. దీంతో భారత్‌లో స్టార్‌లింక్ సేవలను అందించేందుకుగాను వాణిజ్య లైసెన్స్ కోసం ఈ ఏడాది జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోనుందని స్టార్‌లింక్ ఇండియా హెడ్ సంజయ్ భార్గవ్ లింక్డ్ఇన్లో గతంలో పేర్కొన్నారు. అక్టోబర్ 1, 2021 నాటికి భారతదేశంలో ఈ సేవల ఇప్పటికే 5000కు పైగా ప్రీ ఆర్డర్లు అందినట్లు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో లైసెన్స్ పొందే వరకు ప్రీ ఆర్డర్ల రూపంలో తీసుకున్న డబ్బును రీఫండ్ చేయాలని డీఓటీ ఆదేశించినట్లు స్టార్‌లింక్ భారతదేశంలోని కస్టమర్లకు ఈ-మెయిల్ చేసినట్లు సమాచారం. భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు అందించడానికి ముందు పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని కంపెనీ హైలైట్ చేసినట్లు ఒక ప్రముఖ మీడియా నివేదించింది. దేశంలో ఉపగ్రహ ఆధారిత సేవలను అందించడానికి భారత ప్రభుత్వం నుంచి అవసరమైన లైసెన్స్(లు) తీసుకోవాలని డీఓటి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. (చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..!) -
ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..
Chinese Citizens Slam Musk Online After Space Station Near Misses: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌ను చైనా పౌరులు ఆన్లైన్లో దుమ్మెతిపోస్తున్నారు. తీవ్ర పదజాలంతో మస్క్‌పై చైనా దేశస్తులు విరుచుకుపడుతున్నారు. కారణం ఇదే..! ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటెర్నెట్ సేవలను అందించేందుకు స్టార్‌లింక్ ప్రొగ్రాంను ఎలన్ మస్క్ ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థతో సుమారు 42 వేలకుపైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫాల్కన్ రాకెట్ ద్వారా ఇప్పటికే 18 వందలకు పైగా స్టార్‌లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపింది. దశలవారీగా స్టార్‌లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపుతోంది. కాగా ఈ మిషన్‌లో భాగంగా 2021లో జూలై 1 నుంచి అక్టోబర్ 21 సమయంలో స్టార్‌లింక్ శాటిలైట్స్ చైనా స్పేస్ స్టేషన్‌కు ప్రమాదాన్ని గురిచేసే అవకాశం ఏర్పడిందని చైనా అంతరిక్ష సంస్థ సోమవారం డిసెంబర్ 27న యూఎన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అలర్ట్‌గా ఉండడంతో చైనా స్పేస్ స్టేషన్ కక్ష్యను కాస్త జరపడంతో పెద్ద ముప్పు నుంచి తృటిలో తప్పిందని పేర్కొంది. యూఎన్‌కు చైనా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పడే వెలుగులోకి వచ్చింది. దీంతో చైనా పౌరులు స్పేస్ ఎక్స్ అధినేతపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో చైనా స్పేస్ స్టేషన్ టియాన్హేలోని మూడు మాడ్యూళ్లలో అతిపెద్దదైన టియాన్హేను ప్రయోగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించింది. 2022 చివరి నాటికి స్టేషన్ పూర్తవుతుందని చైనా ప్రకటించింది. అమెరికన్ స్పేస్ వార్ఫేర్..! చైనా చేసిన వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ స్పందించలేదు. సోమవారం చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ విబోలో చైనా పౌరులు ఎలన్ మస్క్ ప్రయోగిస్తోన్న స్టార్‌లింక్ ఉపగ్రహాలను అంతరిక్ష వ్యర్థాల కుప్పతో పోల్చుతున్నారు. ఇంకొంతమందైతే..."అమెరికన్ స్పేస్ వార్ఫేర్ ఆయుధాలు" అని అభివర్ణించారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..! -
భారత్ దెబ్బకు..దారికొచ్చిన ఎలన్ మస్క్..!
స్టార్‌లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టాలనే టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌కు భారత్ గట్టిషాకిచ్చింది. స్టార్‌లింక్ సేవలను ఎవరు ప్రీ ఆర్డర్స్ చేయవద్దని కేంద్రం తెలిపింది. దీంతో భారత్‌లో ప్రీ ఆర్డర్స్‌ను నిలిపివేస్తూ స్టార్‌లింక్ నిర్ణయం తీసుకుంది. లైసెన్స్‌కు రెడీ..! లైసెన్స్ లేకుండా స్టార్‌లింక్ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని స్టార్‌లింక్ వెనక్కి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలన్ మస్క్ దారికొచ్చినట్లుగా కన్పిస్తోంది. ఎట్టకేలకు భారత్‌లో స్టార్‌లింక్ సేవలను అందించేందుకుగాను వాణిజ్య లైసెన్స్ కోసం వచ్చే ఏడాది జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోనుందని స్టార్‌లింక్ ఇండియా హెడ్ సంజయ్ భార్గవ లింక్డ్ఇన్లో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి భారత్‌లో సేవలు.. ఏప్రిల్ నాటికి స్టార్‌లింక్ తన సేవలను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎలాంటి అవాంతరాలు లేకుంటే డిసెంబర్ 2022 నాటికి దేశవ్యాప్తంగా 2 లక్షల సబ్స్క్రిప్షన్లను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు భార్గవ తెలిపారు. వీటిలో సుమారు 80 శాతం మేర గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేలా కంపెనీ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే స్టార్‌లింక్ భారత్‌లో 5,000 వరకు ప్రీ ఆర్డర్స్‌ను పొందింది. చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్..! 20 శాతం క్యాష్‌బ్యాక్..! ఎలా పొందాలంటే..! -
వెనక్కి తగ్గిన ఎలన్ మస్క్.. ప్రీ బుకింగ్స్ నిలిపివేత!
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలనుకున్న ఎలన్ మస్క్ చివరకు వెనక్కి తగ్గాడు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం మనకు తెలిసిందే. లైసెన్స్ లేకుండా దేశంలో స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దీంతో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రీ బుకింగ్ సంస్థ నిలిపివేసింది. పోర్టల్‌లో "స్టార్‌లింక్ ఆర్డర్ చేయడం కోసం ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు! స్టార్‌లింక్ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులో లేవు" అని ఉంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో లైసెన్స్ లభించకున్న 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) స్టార్‌లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డీఓటీ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్ఎక్స్కు సూచించింది. అంతేకాదు స్టార్‌లింక్‌ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. కేంద్ర ఈ విధంగా సూచించిన తర్వాత స్టార్‌లింక్ తన ప్రీ బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేసింది. (చదవండి: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..!) -
‘ఎలన్‌మస్క్, స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’
న్యూఢిల్లీ: లైసెన్సు లేకుండానే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామంటూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేసినందుకు గాను అమెరికన్ సంస్థ స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థ టెలికం వాచ్డాగ్ విజ్ఞప్తి చేసింది. నవంబర్ 27న టెలికం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది. ఈ విషయంలో తగు స్థాయిలో సత్వర చర్యలు తీసుకోనందుకు గాను సంబంధిత అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. 2021 ఫిబ్రవరి నుంచే స్టార్‌లింక్ ప్రీ–బుకింగ్ ప్రారంభించినప్పటికీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడంలో టెలికం శాఖ (డాట్) తీవ్ర జాప్యం చేసిందని పేర్కొంది. ఈలోగా అమాయక కస్టమర్ల నుంచి స్టార్‌లింక్ భారీగా దండుకుందని టెలికం వాచ్డాగ్ తెలిపింది. కంపెనీ చెప్పే లెక్కలు బట్టి చూస్తే 11,000 కస్టమర్ల నుంచి దాదాపు 10,89,000 డాలర్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని వివరించింది. అనుమతులు తీసుకోకుండానే కష్టమర్ల నుంచి చందాలు వసూలు చేసిన వ్యవహారంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని, కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును వడ్డీతో సహా, ఎలాంటి కోతలు లేకుండా, స్టార్‌లింక్ పూర్తిగా రిఫండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని టెలికం వాచ్డాగ్ కోరింది. అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్.. భారత్‌లోనూ కార్యకలాపాలు మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. ప్రీ–బుకింగ్ కూడా చేపట్టింది. అయితే, స్టార్‌లింక్‌కు లైసెన్సు ఇవ్వలేదని, కంపెనీ సర్వీసులకు సబ్స్క్రయిబ్ చేయరాదని డాట్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టెలికం వాచ్డాగ్ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. -
భారత్‌లో ఎలన్ మస్క్‌కి ఎదురు దెబ్బ
TRAI Barred Elon Musk's Starlink Broadband Pre Orders in India: అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి భారీ షాకిచ్చింది భారత ప్రభుత్వం. మానసపుత్రిక స్పేఎస్‌ఎక్స్ అందించే బ్రాడ్‌బాండ్ సర్వీస్‌కు భారత్ నుంచి ముందస్తు ఆర్డర్స్ తీసుకోకుండా నిషేధించింది. అంతేకాదు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు ఎవరూ ప్రీ ఆర్డర్లతో సబ్ స్క్రయిబ్ కావొద్దంటూ భారతీయులకు సూచించింది కేంద్ర సమాచార శాఖ. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. తాజాగా లైసెన్స్ లేకుండా స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(Department of Telecommunications (DoT).. స్టార్ లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్ఎక్స్కు సూచించింది. అంతేకాదు స్టార్‌లింక్‌ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు సంజయ్ భార్గవ నిరాకరించారు. ఇదిలా ఉంటే స్టార్‌లింక్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది స్టార్‌లింక్. ఇక భారత్‌లో స్టార్‌లింక్‌కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ బిడ్‌ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్‌బాండ్ అసోసియేషన్‌లోని వన్‌వెబ్(ఇది కూడా స్పేస్ ఆధారిత సేవలు అందించేదే!), అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ తదితర కంపెనీలు ట్రాయ్, ఇస్రోలకు లేఖలు రాశాయి కూడా. చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే Starlink శాటిలైట్ ఇంటర్నెట్..! -
భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు
స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్లు భూమి మీద జరిగే వ్యాపారాల్లోనే కాదు, అంతరిక్షంలో జరిపే ప్రయోగాల్లోనూ నువ్వా నేనా అంటూ ఒకరికొకరు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్ట్‌ను ఛేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ విఫలమయ్యారు. తాజాగా స్పేస్‌లో ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో మస్క్ అందరికంటే ముందంజలో ఉండగా.. జెఫ్‌బెజోస్ సైతం 'ప్రాజెక్ట్ కైపర్' పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు. ఇందుకోసం ఉపగ్రాహాలను స్పేస్‌లోకి పంపేందుకు అమెరికా ప్రభుత్వం నుంచి వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు. జెఫ్‌బెజోస్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే 4,500 కంటే ఎక్కువ ఉపగ్రహాలను (శాటిలైట్స్) స్పేస్‌లోకి పంపేందుకు యూఎస్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందారు. తాజాగా గత వారం మరో 7,774 ఉపగ్రహాలను స్పేస్‌లోకి పంపేందుకు, నవంబర్ 7న (నిన్న ఆదివారం) అమెజాన్ 2022 చివరి నాటికి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎఫ్‌సీసీని అనుమతి కోరారు. ఈ అనుమతులతో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని వినియోగదారులందరికి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించవచ్చని ఎఫ్‌సీసీ అనుమతి కోసం పంపిన నివేదికలో జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. వరల్డ్ వైడ్‌గా ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడినప్పటికీ ప్రపంచ జనాభాలో 51%, అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో 44% మాత్రమే ఇంటర్నెట్ సేవల్ని వినియోగిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ ముందంజ స్పేస్ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్‌లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్లింక్స్తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్‌వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చదవండి:శుభవార్త..! 'జియో'కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..!
భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది.అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్ మస్క్ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు అతితక్కువ ధరకే లభించనున్నాయి. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా.. స్టార్ లింక్ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్ ఇంటర్నెట్ను సబ్సిడీకి అందివ్వనున్నట్లు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మనదేశంలో స్టార్‌లింక్ తన సబ్స్క్రిప్షన్ ప్లాన్లను సబ్సిడీ రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్లు స్టార్లింక్కి ఇండియా హెడ్ సంజయ్ భార్గవ తెలిపారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ లింక్ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయల్ని కల్పించడం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు స్పేస్ఎక్స్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. బుకింగ్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి.అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా, స్టార్‌లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్ స్పీడ్ 100-150ఎంబీపీఎస్ పరిధిలో ఉంటుంది. అయితే, తక్కువ భూ కక్ష్యలో మరిన్ని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్ వేగం జీబీపీఎస్‌కి చేరుకోవచ్చని స్టార్‌లింక్ ప్రతినిధులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలోఉండగా..వచ్చే ఏడాది జూన్ జులై నాటికి కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. 100 స్కూళ్లకు ఉచితం నివేదికలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సెటప్‌ను స్టార్‌లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్‌లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్‌లు ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు స్టార్‌లింక్ ఇండియా బాస్ సంజయ్ భార్గవ స్పష్టం చేశారు. -
Work From Village: పల్లెల్లో వర్క్‌ఫ్రం హోం ? గ్రామీణ ప్రాంతాలపై స్టార్‌లింక్ దృష్టి
న్యూఢిల్లీ: పొలం గట్టున కూర్చునో.. మంచె మీద కంప్యూటర్ పెట్టుకునో.. పెరట్లో చెట్టు నీడన.. ఊరిపట్టున ఉంటూనే వర్క్‌ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేసే అవకాశం అతి త్వరలోనే రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అన్ని కుదిరితే అతి త్వరలో వైర్‌సెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పల్లెలను పలకరించనున్నాయి. నీతి అయోగ్ నిర్ణయంతో అమెరికాకు చెందిన బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థ స్టార్‌లింక్ తన కార్యకలాపాల్లో భాగంగా భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం దేశీ టెలికం కంపెనీలతో జట్టు కట్టాలని భావిస్తోంది. స్టార్‌లింక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఈ విషయాలు తెలిపారు. జిల్లాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్రణాళికకు సంబంధించి నీతి ఆయోగ్ ఫేజ్–1లో గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత తాము బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో చర్చలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. టార్గెట్ రూరల్ గ్రామీణ జిల్లాల్లో 100 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ఇతర సంస్థలతో కూడా తాము కలిసి పని చేయాలనుకుంటున్నట్లు భార్గవ చెప్పారు. దేశీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అవసరమయ్యే టెర్మినల్స్ ను కంపెనీ భారత్‌లో తయారు చేయబోతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్థానికంగా వాటి ని ఉత్పత్తి చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని పేర్కొ న్నారు. స్టార్‌లింక్ మెరికాకు చెందిన బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్కు స్టార్‌లింక్ అనుబంధ సంస్థ. ఇది ఇటీవలే భారత్‌లో కంపెనీ పేరు నమోదు చేసుకుంది. ఉపగ్రహ సాంకేతికత ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో 5,000 పైచిలుకు ప్రీ–ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వైర్లెస్ స్టార్‌లింక్ సంస్థ లో ఎర్త్ ఆర్బిట్ (లియో) మోడ్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పోల్స్, వైర్లు, ఫిక్స్డ్ ఏరియా వంటి చిక్కులు లేకుండా లియో ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పొందవచ్చు. కరోనా తర్వాత వర్క్‌ఫ్రం విధానం పాపులర్‌గా మారింఇ. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎక్కువగా అందుబాటులో లేక చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేశారు. ఇక ఊర్లకు వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు వస్తే అక్కడ కూడా వర్క్‌ఫ్రం హోం కల్చర్ చేసుకునేందుకు వీలవుతుంది. -
రూటు మార్చిన ఎలన్ మస్క్.. ఇండియా మార్కెట్ కోసం సరికొత్త వ్యూహం
న్యూఢిల్లీ: ఇండియాలో తన వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ సరికొత్త వ్యూహం ఎంచుకున్నారు. ఇప్పటి వరకు టెస్లా కార్ల అమ్మకాల ద్వారా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అయితే ఈ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. దీంతో వ్యూహం మార్చి ఇంటర్నెట్ సేవలను తెర మీదకు తెచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ తాజాగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు వేగవంతం చేసింది. స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సీపీఎల్) పేరిట దీన్ని నెలకొల్పినట్లు స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ (ఇండియా) సంజయ్ భార్గవ తెలిపారు. ఇక తాము లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు, బ్యాంక్ ఖాతాలు తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్మిషన్ల పనిలో ప్రభుత్వ అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో డిసెంబర్ 2022 నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి 5,000 ప్రీ–ఆర్డర్లు వచ్చాయని కంపెనీ చెబుతోంది. ఒకో కస్టమర్ నుంచి 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. సెకనుకు 50–150 మెగాబిట్స్ స్పీడ్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తామని చెబుతోంది. దేశీయంగా రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతి గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ పోటీపడాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. -
Starlink: డబ్బులు కట్టి నెలలు అవుతున్నా..ఇంత వరకు పత్తాలేదు..!
ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా..ఇప్పటికే ప్రీ ఆర్డర్లు బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటర్నెట్ను అందించడంలో ఎలన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని నెలలు కావొస్తున్నా ఇంటర్నెట్ సేవలు అందడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్,10 యూరోపియన్ కంట్రీస్ కలిపి మొత్తం 14దేశాల్లో పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కానీ 90శాతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న యూఎస్‌లో..కొందరికి శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే విషయంలో ఎలన్ మస్క్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. జాన్ డ్యూరాన్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో 100 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7,503.50) డిపాజిట్ చెల్లించాడు. డిపాజిట్ చెల్లించిన తరువాత స్టార్ లింక్ కిట్ అందుతుంది. కానీ జాన్ ప్రీ ఆర్డర్ బుక్ చేసుకొని 9నెలలు అవుతున్నా స్టార్‌లింక్ నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. కాంటాక్ట్ చేసినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సెప్టెంబర్‌లో స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు జాన్ తెలిపారు. నేను పిచ్చివాడిని కాదు,స్టార్ లింక్ సర్వీస్ విషయంలో చాలా అసంతృప్తికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం జాన్ ఇంటర్ నెట్ కోసం ఫోన్ నుండి మొబైల్ హాట్‌స్పాట్‌ను ఉపయోగిస్తున్నాడు. ఒక జానే కాదు మరి కొంతమంది వినియోగదారులు సైతం ప్రీ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయడంతో కట్టిన మనీ తిరిగి ఇచ్చేశారని,మరి ఇంటర్నెట్ సేవల్ని ఎప్పుడు అందిస్తారో చెప్పాలని అంటున్నారు.ఇప్పటికే ఎలన్ మస్క్ వరల్డ్ వైడ్‌గా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ను అందించేందుకు 1600 శాటిలైట్లను స్పేస్‌లోకి పంపారు. మొత్తంగా 42వేల శాటిలైట్లను పంపే పనిలో పడ్డారు. త్వరలో వరల్డ్ వైడ్‌గా ఇంటర్నెట్ను అందిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఎలన్ వినియోగదారుల నుంచి వస్తున్న విమర్శలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి: అన్న కుక్కను దువ్వుతుంటే.. తమ్ముడి ఆస్తులు పెరుగుతున్నాయ్ -
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం
ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్టెల్ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు. అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్ కేంద్రంగా 2012లో జార్జివేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే?) ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. -
దేశంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో స్టార్ లింక్ సేవలు
స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలలో ప్రారంభించనున్నట్లు ఒక సంస్థ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. స్టార్ లింక్ ప్రాజెక్టు కింద ఉపగ్రహాల సహాయంతో మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. హాథోర్న్, కాలిఫోర్నియా ఆధారిత సంస్థ స్పేస్ఎక్స్ 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించాలని అంచనా వేసింది. రాబోయే భవిష్యత్తులో ఈ సేవలను కల్పించడానికి భారతదేశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం దేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తుందని ఇండియా స్టార్ లింక్ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఒక పోస్టులో తెలిపారు. శాసనసభ్యులు, మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశం కానున్నట్లు ఆయన సూచి౦చారు. దేశంలో స్టార్ లింక్ వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవను స్పేస్ఎక్స్ నియమించింది. స్టార్ లింకు ప్రాజెక్టు కింద మొదట ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 2018లో స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు!) స్టార్ లింక్ ప్రస్తుతం 1,600కు పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. వీటి ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, పోర్చుగల్, యుకె, యుఎస్ వంటి ఇతర 14 దేశాలలో బీటా టెస్టింగ్ కనెక్టివిటీ ప్రారంభించింది స్పేస్ ఎక్స్. స్టార్ లింక్ డిసెంబర్ 2022 నాటికి భారతదేశంలో 2 లక్షల మందికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది అని భార్గవ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే 5,000 టెర్మినల్స్ కోసం ముందస్తుగా ఆర్డర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ.7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది. -
ఇండియాలో టార్గెట్ ఫిక్స్,స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ ప్రారంభం అప్పుడే
న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారని ఇండియా స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో వీటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ప్రీ–ఆర్డర్ల సంఖ్య 5,000 స్థాయిని దాటేసిందని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంపై తమ సంస్థ ఆసక్తిగా ఉందని భార్గవ వివరించారు. బీటా దశలో 50 నుంచి 150 మెగాబిట్ పర్ సెకన్ స్థాయిలో డేటా స్పీడ్ అందిస్తామని స్టార్‌లింక్ చెబుతోంది. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది. అంతర్జాతీయంగా స్టార్‌లింక్ కనెక్షన్లకు ప్రీ–ఆర్డర్లు 5,00,000 స్థాయిని దాటేసిందని భార్గవ చెప్పారు. దేశీయంగా రాబోయే నెలల్లో ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీకండక్టర్ల కొరత కారణంగా స్టార్‌లింక్ కిట్లను తయారు చేసే వేగం మందగించిందని ఆయన వివరించారు. చదవండి: ‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా ! -
స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌ను నియమించిన ఎలన్ మస్క్..!
Sanjay Bhargava To Join Musk Starlink As India Country Director: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌కు విస్తరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే భారత టెలికాం డిపార్ట్మెంట్ నుంచి స్టార్‌లింక్ అనుమతులను కూడా ప్రయత్నించిన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవను స్పేస్ఎక్స్ నియమించింది. చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! పేపల్ నుంచి... అక్టోబర్ 1 నుంచి స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవ పనిచేయనున్నారు. సంజయ్ భార్గవ తన లింక్డ్ ఇన్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశారు. గతంతో పేపల్ ఫిన్‌టెక్ సంస్థలో సంజయ్ పనిచేశారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ భరోసా క్లబ్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. స్టార్‌లింక్ సేవలు త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సంజయ్ భార్గవ వెల్లడించారు. భారత్‌లో టెలికాం రెగ్యూలేటరీ ట్రాయ్ నుంచి త్వరలోనే ఆమోదం వస్తోందని సంజయ్ అభిప్రాయపడ్డారు. చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..? -
‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా !
Elon Musk Jeff Bezo Rival: పోటీ ప్రపంచంలో పోటాపోటీ విమర్శలూ సహజమే. కానీ, అవి విపరీతానికి చేరితేనే వెగటు పుడుతుంది. బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ జెజోస్‌ల మధ్య మాటల వైరం రోజురోజుకీ శ్రుతి మించుతోంది. వీలు దొరికినప్పుడల్లా బెజోస్పై పరోక్షంగా విరుచుకుపడుతున్న మస్క్.. తాజాగా మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అవతలి నుంచి కూడా కౌంటర్ పడడం విశేషం. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్) న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని స్పేస్ఎక్స్ ప్రయోగాలను నెమ్మదించేలా చేస్తున్నాయని ఆరోపించాడు ఎలన్ మస్క్. 2021 కోడ్ కాన్ఫరెన్స్‌లో బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడాయాన. ‘‘నీ తరపు లాయర్లు ఎంత గొప్పవాళ్లైనా కావొచ్చు. చంద్రుడి చేరాలనే మా ప్రయత్నాన్ని ఎన్ని దావాలేసినా ఆపలేరు. అంతరిక్ష యానం నీ అబ్బసొత్తు కాదు’’ అంటూ ఒకానొక దశలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మస్క్. ఇదిలా ఉంటే స్పేస్ఎక్స్, స్టార్‌లింక్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బ్లూ ఆరిజిన్ వరుసగా దావాలు వేస్తోందన్నది ఎలన్ మస్క్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అమెజాన్ కౌంటర్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే అమెజాన్ నుంచి కౌంటర్ పడింది. ఎలన్ మస్క్ తాను బెజోస్ లాంటోడేనని గుర్తించ లేకపోతున్నాడంటూ సెటైర్ వేసింది. గతంలో స్పేస్ఎక్స్ వేసిన దావాలకు సంబంధించిన చిట్టాను బయటపెట్టింది అమెజాన్. ఈ మేరకు అమెరికన్ టెక్నాలజీ బ్లాగ్ ది వర్జ్‌కు సంబంధిత డాక్యుమెంట్లను పంపించింది. స్పేస్ఎక్స్ ఇప్పటిదాకా వివిధ కోర్టుల్లో వేసిన 13 దావాలు, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన స్టేట్మెంట్ల తాలుకా వివరాలను వెల్లడించింది. 2004 నుంచి అమెరికా ప్రభుత్వం, నాసా, యూఎస్ ఎయిర్ఫోర్స్లకు వ్యతిరేకంగా స్పేస్ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్లు ఇందులో ఉన్నాయి. This is hilarious. Amazon sent us a 13-page PDF to prove Elon Musk is as litigious as Jeff Bezos https://t.co/Kh10AehEgB via @Verge — Eric Berger (@SciGuySpace) September 29, 2021 అమెజాన్ శాటిలైట్ డివిజన్ ప్రతినిధి ప్రాజెక్ట్ కుయిపర్ పేరు మీద ఈ డాక్యుమెంట్లు వర్జ్‌కు వచ్చాయి. ‘‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పని చేసిన స్పేస్ఎక్స్.. గతంలో చేసింది ఇదే కదా. ఏకంగా ప్రభుత్వంపైనే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది’’ అని కుయిపర్ పేరు మీద స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. మొత్తం 39 డాక్యుమెంట్లు ఉండగా, వాటిని 13 పేజీల(పీడీఎఫ్ ఫైల్రూపంలో) కుదించి పంపించారు. SpaceX has sued to be *allowed* to compete, BO is suing to stop competition — Elon Musk (@elonmusk) September 29, 2021 సెటైర్ అయితే తమ దావాల వ్యవహారాన్ని స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ సమర్థించుకున్నాడు. ‘‘మేం పోటీప్రపంచంలోకి అనుమతించాలని స్పేస్ఎక్స్ తరపున దావాలు వేశాం. కానీ, బీవో(బ్లూఆరిజిన్ను ఉద్దేశించి) అసలు పోటీయే ఉండకూడదని దావాలు వేస్తోంది’’ అని వ్యంగ్యం ప్రదర్శించాడు. ఇక న్యాయపరమైన చర్యలతో బ్లూ ఆరిజిన్ కంపెనీ తనకు మోకాలు అడ్డుపెట్టడంపై ఎలన్ మస్క్ ఘాటుగానే స్పందిస్తున్నాడు. బహుశా తమపై కేసులు వేయడానికే బ్లూ ఆరిజిన్ బాస్ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటాడంటూ గతంలో సెటైర్లు సైతం పేల్చాడు. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
కాంతివేగంతో ఇంటర్నెట్ స్పీడ్...! ఎలన్ మస్క్ నుంచి సంచలన ప్రకటన
వాషింగ్టన్: మన నిత్య జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది. ఇంటర్నెట్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. 4జీ రాకతో ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. 4జీ నెట్వర్క్ సుమారు 10 ఎమ్‌బీపీఎస్ స్పీడ్ వరకు ఇంటర్నెట్ను అందిస్తుంది. తాజాగా పలు టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై కూగా దృష్టిసారించాయి. 5జీ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ఇప్పటికే చర్యలను తీసుకుంటున్నాయి. కాగా టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఒక అడుగు ముందుకేసి స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ తన సేవలను కూడా ప్రారంభించింది. తాజాగా ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో సంచలన వ్యాఖ్యలను చేశాడు. భవిష్యత్తులో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఏలాంటి గ్రౌండ్ స్టేషన్లను వాడకుండానే ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు సుమారు కాంతి వేగంతో డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చునని ఇంటర్నెట్ సైంటిస్ట్ స్కాట్ మ్యాన్లీతో ట్విటర్లో వెల్లడించారు. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో డౌన్‌లింక్ స్టేషన్ల అవసరాన్ని హైలైట్ చేసిన మస్క్, వచ్చే 4 నుంచి 6 నెలల్లో స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడంతో ఇంటర్-శాటిలైట్ లేజర్ లింక్‌లను కలిగి ఉంటుందని చెప్పారు. స్థానికంగా ఇంటర్నెట్కు ఎలాంటి డౌన్‌లింక్ అవసరం లేదని పేర్కొన్నారు. శాటిలైట్‌లో లేజర్ లింక్‌లను వాడడంతో గ్రౌండ్ స్టేషన్ అడ్డంకులను పూర్తిగా తగ్గిస్తాయన్నారు. సిడ్నీ నుంచి లండన్‌కు డేటా ట్రాన్స్ఫర్ 40 శాతం సంప్రదాయక ఇంటర్నెట్ కంటే వేగంగా, కాంతి వేగానికి దగ్గరిగా స్పీడ్ ఉంటుందని వెల్లడించారు.ఒక కిలోమీటర్ పర్ సెకనుకు 3,00,000 వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. సంప్రదాయక ఆప్టిక్ ఫైబర్ ద్వారా డేటా వినిమయం 2 లక్షల కిమీ/సెకను వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్టిక్ ఫైబర్ ద్వారా జరిగే డేటా వినిమయ ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడడంతో స్పీడ్ తగ్గిపోతుంది. స్టార్‌లింక్‌లో వాడే ఇంట్రా లేజర్‌తో డేటా వినిమయాన్ని కాంతి వేగానికి సమానంగా లేదా దగ్గరిగా డేటా వినిమయం చేయవచ్చునని తెలిపారు. సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ సదరు నెట్వర్క్ లాటెన్సీపై ఆధారపడి పనిచేస్తోంది. లాటెన్సీ అనేది ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్‌కు డేటాను పంపడానికి పట్టే సమయం. ఉపగ్రహాలు భూమికి దూరంగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్‌లో జాప్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీడియో కాల్లు, ఆన్లైన్ గేమింగ్ వంటి కార్యకలాపాల పనితీరు తక్కువగా ఉంటుంది. ఎలన్ మస్క్ అందించనున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు సాంప్రదాయ ఉపగ్రహాల కంటే భూమికి 60 రెట్లు దగ్గరగా ఉంటాయి. దీంతో లాటెన్సీ అతి తక్కువగా ఉంటుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు సుమారు కాంతి వేగానికి సమానంగా ఉంటుందని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం!
Satellite Broadband Service Could: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌కు విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం Department of Telecommunications అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్విటర్ ఇంటరాక్షన్‌లో భాగంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. స్టార్ లింక్ సేవలు భారత్‌కు విస్తరిస్తామని సమాధానం వచ్చింది మస్క్ నుంచి. అదే జరిగితే భారత్‌లో ఇంటర్ నెట్‌కు వినియోగించే సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం ఇంటిమీద చిన్న యాంటెన్నాతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. చదవండి: థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్! Just figuring out the regulatory approval process — Elon Musk (@elonmusk) August 31, 2021 స్పేస్ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్‌లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్లింక్స్తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్‌వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!
ఇంటర్నెట్ అనగానే మనకు సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు, ఇళ్లలో వైఫైలు గుర్తొస్తాయి. కానీ.. ఇక ముందు అవేమీ ఉండవు. సెల్ సిగ్నల్‌తో పనిలేకుండా నేరుగా ఫోన్లకు, ఇంటిమీద చిన్న యాంటెన్నాతో కంప్యూటర్లకు ఇంటర్నెట్ రానుంది. ఇదంతా శాటిలైట్ ఇంటర్నెట్ మహిమ. ఇప్పటికైతే కేబుల్ ఇంటర్నెట్ బాగానే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లపై చైనా ఆధిపత్య యత్నాలు వంటివి శాటిలైట్ ఇంటర్నెట్కు దారులు తెరుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు రంగంలోకి దిగాయి కూడా. ఈ సంగతులు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రస్తుతానికి కేబుళ్లదే రాజ్యం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇంటర్నెట్కు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే కీలకం. ప్రస్తుతం సముద్రాల అడుగున 13 లక్షల కిలోమీటర్ల పొడవైన 428 ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఉన్నాయి. అన్నిదేశాల మధ్య మొత్తం ఇంటర్నెట్ డేటాలో 98 శాతం సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతోంది. కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అందులోనూ గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వీటి అనుబంధ కంపెనీలకు సంబంధించిన డేటానే భారీగా ఉంటోంది. అందుకే ఈ కంపెనీలు సబ్‌మెరైన్ కేబుల్స్ వేసే పనిలోకి దిగాయి. ఇందుకోసం గత ఐదేళ్లలోనే రూ.12 వేల కోట్ల వరకు ఖర్చుపెట్టాయి. చైనా కంపెనీల వివాదంతో.. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు నిర్మిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా చైనా కంపెనీ హువావే పెద్ద మొత్తంలో కేబుళ్ల నిర్మాణ కాంట్రాక్టులు చేస్తోంది. దీనిపై అమెరికా సహా పలు కీలక దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా తమ దేశానికి చెందిన టెక్ కంపెనీల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం, ఇతర విపత్కర పరిస్థితులు వస్తే.. ఆధిపత్యం కోసం చైనా ఏమైనా చేసేందుకు సిద్ధమన్న ఆందోళనలూ ఉన్నాయి. హువావే కంపెనీ నిర్మించి, నిర్వహిస్తున్న సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడవచ్చని.. దేశాలకు, వ్యక్తులకు సంబంధించి రహస్య సమాచారం, వ్యూహాలను తెలుసుకోవచ్చని.. ఇంటర్నెట్ను స్తంభింపజేయవచ్చని అమెరికా కొద్దిరోజుల కింద హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్ సంస్థ, ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల ప్రభుత్వాలు కేబుళ్ల నిర్మాణం, నిర్వహణలో చైనా కంపెనీల భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి. భవిష్యత్తు శాటిలైట్ ఇంటర్నెట్దే.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల విషయంగా టెక్ యుద్ధం జరుగుతుండటంతో.. ప్రత్యామ్నాయమైన శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి పడింది. ఈ విధానంలో మన ఫోన్ నుంచే నేరుగా శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్నెట్ను పొందడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటర్లు అయితే కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్కు అనుసంధానం కావడానికి వీలుంటుంది. అడవులు, కొండలు, గుట్టలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ అందుకోవచ్చు. ఇప్పటికే నాసా సహా పలు దేశాల అంతరిక్ష సంస్థలు పరిమిత స్థాయిలో శాటిలైట్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో కాలుపెట్టాయి. వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ కూడా వన్‌వెబ్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థను నెలకొల్పారు. త్వరలోనే శాటిలైట్లను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ వంటి పలు కంపెనీలు ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పరిమిత సేవలు అందిస్తున్నాయి. 4,425 శాటిలైట్లతో ‘స్టార్ లింక్’ టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. మొత్తంగా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,600కుపైగా శాటిలైట్లను పంపారు. కేబుల్, శాటిలైట్.. డేటా ప్రయాణం ఇలా.. ఉదాహరణకు మనం అమెరికాలోని వ్యక్తికి ఒక ఈ–మెయిల్ పంపితే.. ఈ–మెయిల్లోని టెక్ట్స్, ఫొటోలు వంటి సమాచారం మన సెల్‌ఫోన్/కంప్యూటర్ నుంచి.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ మీదుగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. అక్కడి నుంచి సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసే ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. తర్వాత సముద్రం అడుగున ఉన్న (సబ్‌మెరైన్) కేబుళ్ల ద్వారా ప్రయాణించి అమెరికా తీరంలోని ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ ద్వారా సదరు వ్యక్తి సెల్‌ఫోన్/కంప్యూటర్‌కు డేటా చేరుకుంటుంది. ఇదే శాటిలైట్ ఇంటర్నెట్ అయితే.. మన సెల్‌ఫోన్/ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరం అమర్చిన కంప్యూటర్ నుంచి డేటా నేరుగా సమీపంలోని శాటిలైట్‌కు చేరుతుంది. దాని నుంచి అమెరికాపైన ఉన్న మరో శాటిలైట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని నుంచి నేరుగా సెల్‌ఫోన్/ రిసీవర్ ఉన్న కంప్యూటర్‌కు చేరుతుంది. శాటిలైట్ ద్వారా డేటా బదిలీ కాస్త సులువుగా కనిపిస్తున్నా.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఫోన్లు, శాటిలైట్లు, రిసీవర్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు ప్రతిసారి ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరమవుతాయి. అదే కేబుల్ ద్వారా అయితే.. ఇరువైపులా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద మాత్రమే ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరం. -
రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌సేవలను అందించడం కోసం ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ప్రోగ్రాంను ముందుకుతెచ్చిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్ ప్రోగ్రాంలో భాగంగా శాటిలైట్లనుపయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇప్పటికే అమెరికాతో సహా 11 దేశాల్లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ సేవలను ప్రారంభించవచ్చునని స్పేస్ ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్ట వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. తాజాగా ఊక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ రికార్డు సృష్టించింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ నివేదిక ప్రకారం 2021 రెండో త్రైమాసికంలో అమెరికాలోని ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న హ్యూస్ నెట్, వియాసట్ బ్రాడ్‌బ్యాండ్‌తో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను పోల్చింది.యునైటెడ్ స్టేట్స్లో మెరుపువేగంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తోన్న బ్రాడ్‌బ్యాండ్‌గా ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ మాత్రమే నిలిచింది. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సరాసరిగా 97.23 Mbps స్పీడ్‌ను అందిస్తోంది. హ్యూస్నెట్ రెండో స్థానంలో 19.73 Mbps వేగంతో, వియాసత్ మూడో స్థానంలో 18.13 Mbps వేగంతో నిలిచాయని ఊక్లా పేర్కొంది. కాగా స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్టంగా 139.39 Mbps డౌన్లోడ్ వేగాన్ని అందించింది. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ అప్లోడింగ్ వేగంలో కూడా రికార్డులను నమోదు చేసింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అప్లోడింగ్ స్పీడ్ ను అధిగమించింది. అప్లోడింగ్ వేగంలో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 15.99 Mbps, రెండో త్రైమాసికంలో 17.18 Mbps నమోదు చేసింది. స్టార్‌లింక్ తరువాత వియాసత్ అప్లోడింగ్ స్పీడ్‌లో రెండో స్థానంలో నిలిచింది. వియాసత్ అప్లోడింగ్ స్పీడ్‌లో 3.38 Mbps, హ్యూస్నెట్ అప్లోడింగ్ స్పీడ్‌లో 2.43 Mbps వద్ద నిలిచింది. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్లోని ఉపగ్రహాలు ‘లో ఎర్త్ ఆర్బిట్’లో కలిగి ఉండడం ద్వారా ఈ స్పీడ్ సాధ్యమైందని ఊక్లా పేర్కొంది. -
SpaceX CEO: ఎలోన్ మస్క్ ఆసక్తికర ట్వీట్!
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ స్టార్ లింక్ 69,420 మంది ఆక్టివ్ యూజర్లను చేరుకున్నట్లు, "వ్యూహాత్మకంగా ముఖ్యమైన పరిమితి"ని దాటినట్లు ఆసక్తికర ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో ధ్రువ ప్రాంతాలు మినహా ఆగస్టు నాటికి ప్రపంచ కవరేజీని ప్రారంభించనున్నట్లు పోస్ట్ చేశారు. స్టార్ లింక్ కంపెనీ అధ్యక్షుడు గ్వైన్ షాట్ వెల్ ఇంటర్నెట్ సర్వీస్ సెప్టెంబర్ నాటికి ప్రపంచ కవరేజీని అందించనున్నట్లు చెప్పిన వారం తర్వాత మస్క్ ఈ ట్వీట్ చేశారు. మొత్తం 72 ఉపగ్రహాలు ఆగస్టులో క్రియాశీలం కానున్నట్లు మరో ట్వీట్ లో తెలిపారు. అయితే, 69,420 సంఖ్యపై చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. @StevenCravis ట్విట్టర్ వినియోగదారుడు 69,420 సంఖ్య వ్యూహాత్మకంగా ఎందుకు ముఖ్యమని అడిగారు. దానికి మస్క్ సమాధానం ఇవ్వలేదు. మరో ట్విట్టర్ యూజర్(@flcnhvy) ఎయిర్ లైన్ వై-ఫై ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అడిగారు. దీనికి మస్క్ ఇలా జవాబిచ్చారు.. "గల్ఫ్ స్ట్రీమ్ లో చాలా మంది ప్రజలకు సేవలందించే బోయింగ్ 737, ఎయిర్ బస్ ఎ320లలో టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌లో ఏలోన్ మస్క్ టెస్లా మోడల్ ఎస్ 69,420 డాలర్లకు లభిస్తున్నట్లు చెప్పినట్లు మరికొందరు ట్వీట్ చేశారు. అయితే, ఎలోన్ మస్క్ ఈ సంఖ్య (69,420) ఎందుకు అంత వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అన్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. Starlink simultaneously active users just exceeded the strategically important threshold of 69,420 last night! — Elon Musk (@elonmusk) June 25, 2021 చదవండి: బగ్ కనిపెట్టి రూ.22 లక్షలు గెలుచుకున్న 20 ఏళ్ల యువతి! -
వచ్చేస్తోంది..స్పేస్ఎక్స్ స్టార్ లింక్...త్వరలోనే..!
ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ప్రోగ్రాం మరికొద్ది రోజుల్లోనే చరిత్ర సృష్టించనుంది. స్టార్‌లింక్ ప్రోగాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ కృషి చేస్తోంది. కాగా ప్రస్తుతం స్టార్ లింక్ సేవలు కేవలం 11 దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. స్టార్‌లింక్ కవరెజీని ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తోందని మంగళవారం జరిగిన మాక్వేరీ గ్రూప్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో స్పేస్ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ స్టార్ లిక్ ప్రోగ్రాం కోసం 18 వందల శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించామని గ్విన్ షాట్వెల్ తెలిపారు. మిగిలిన శాటిలైట్లను సెప్టెంబరు లోపు పంపించి త్వరలోనే గ్లోబల్ కవరెజీ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రతి దేశంలో స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావలంటే ఆయా దేశాల ఆమోదం పొందడానికి సమయం పడుతుందని అభిప్రాయపడింది. స్టార్‌లింక్ ప్రోగ్రాంలో భాగంగా తొలిదశలో సుమారు 12వేల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని స్పేస్ఎక్స్ చూస్తోంది. మొత్తంగా 42 వేల ఉపగ్రహాలను పంపనుంది. ఇప్పటికే 12 వేల ఉపగ్రహలను లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ప్రోగ్రాం కోసం సుమారు పది బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. స్టార్‌లింక్ సేవలను పొందడానికి ఇప్పటికే సుమారు 5 లక్షల వరకు ఫ్రీ ఆర్డర్లు బుక్ అయ్యాయని స్పేస్ఎక్స్ కంపెనీ సీవోవో గ్విన్ షాట్వెల్ పేర్కొన్నారు. చదవండి: స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..! -
SpaceX Starlink: ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..!
వాషింగ్టన్: మమూలుగా మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ బాగా వేడెక్కితే ఏం చేస్తాం. కొద్ది సేపు వాటిని ఆఫ్ చేసి తిరిగి మళ్లీ ఆన్ చేస్తాం. ఆరిజోనాకు చెందిన యువకుడు మాత్రం అసాధారణ పద్దతి ఉపయోగించి తిరిగి ఇంటర్నెట్ వచ్చేలా చేశాడు. వివరాలోకి వెళ్లేే.. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్‌తో అమెరికాలో ఇంటర్నెట్ను ప్రవేశపెట్టింది. భూమిపై ఏర్పాటుచేసిన డిష్ ఆంటెన్నాతో యూజర్లు ఇంటర్నెట్ సేవలను పొందుతారు. కాగా అప్పుడప్పుడు డిష్ ఆంటెన్నాలు ఎక్కువగా వేడెక్కడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని స్టార్‌లింక్ తన వినియోగదారులకు ముందుగానే తెలిపింది. డిష్ ఆంటెన్నాలు తిరిగి కూల్ డౌన్ అయ్యే వరకు ఇంటర్నెట్ సేవలను పొందలేరని పేర్కొంది స్టార్‌లింక్. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఆరిజోనాలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాగా ఈ సమస్య ఆరిజోనాకు చెందిన యువకుడికి రావడంతో స్టార్‌లింక్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించడంతో కంపెనీ ముందుగానే చెప్పిన విషయానే చెప్పింది. దీంతో విసుగు చెందిన యువకుడు ఇంటర్నెట్ డిష్‌పై నీళ్లను స్ప్రే చేశాడు. వాటర్ పోయడంతో డిష్ ఆంటెన్నా త్వరగా కూల్ డౌన్ అయ్యింది. తిరిగి ఇంటర్నెట్ సేవలను అతడు పొందగల్గిగాడు. ప్రస్తుతం ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్నెట్ షట్‌డౌన్ అవ్వకుండా ఉండాలంటే డిష్ ఆంటెన్నాపై ఒక చిన్న ఫౌంటెన్‌ను ఏర్పాటు చేస్తే అసలు అంతరాయం ఉండదని ఓ నెటిజన్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం.. నాసాపై.. -
భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్! రంగంలోకి అమెజాన్...
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీసులను భారత్‌లో అందుబాటులోకి తేవడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, అనుమతులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వంతో భేటీ అయ్యే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ల్యాండింగ్ హక్కులు, శాటిలైట్ బ్యాండ్‌విడ్త్ లీజింగ్ వ్యయాలు తదితర అంశాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్), టెలికం శాఖ (డాట్)లతో సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్విపర్ పేరిట చేపట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులో భాగంగా 3,236 పైచిలుకు ’లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈవో) ఉపగ్రహాలపై అమెజాన్ దాదాపు 10 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. వీటి ద్వారా అంతర్జాతీయంగా ఈ తరహా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అయితే, అధికారికంగా ఇప్పటిదాకా భారత్ ప్రణాళికలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కీలక మార్కెట్‌గా భారత్.. గణాంకాల ప్రకారం దేశీయంగా దాదాపు 75 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులో లేవు. చాలా మటుకు ప్రాంతాలకు సెల్యులార్ లేదా ఫైబర్ కనెక్టివిటీ లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఎల్ఈవో శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థలకు భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని లక్షల మందికి ఈ తరహా సేవలు అందించడం ద్వారా సమీప భవిష్యత్తులో దాదాపు 500 మిలియన్ డాలర్ల మేర ఆదాయాల ఆర్జనకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ను అమెజా న్ పక్కన పెట్టే పరిస్థితి ఉండబోదని తెలిపారు. ఒంటరిగానా లేదా జట్టుగానా.. మిగతా శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీల వైఖరి ఇప్పటికే స్పష్టం కావడంతో అమెజాన్ ఎలా ముందుకెళ్తుందన్న అంశంపై అందరి దృష్టి ఉంది. ఒంటరిగా రంగంలోకి దిగుతుందా లేదా ఇతరత్రా ఏదైనా సంస్థతో జట్టు కడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వన్‌వెబ్‌లో భారతి గ్రూప్ ఇప్పటికే భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇక మిగిలింది రెండు టెలికం సంస్థలు.. ఒకటి జియో కాగా రెండోది.. వొడాఫోన్ ఐడియా. అయితే, ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాల కొనుగోలుపై రిలయన్స్‌తో అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. కాబట్టి దానితో జట్టు కట్టే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. వన్‌వెబ్..స్పేస్ఎక్స్తో పోటీ అంతర్జాతీయంగా ఎల్ఈవో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించడంలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్తోను, దేశీ టెలికం దిగ్గజం భారతి గ్రూప్.. బ్రిటన్ ప్రభుత్వం కలిసి నెలకొల్పిన వన్వెబ్తోనూ అమెజాన్ పోటీపడాల్సి రానుంది. ఈ రెండు సంస్థలూ ఇప్పటికే భారత మార్కెట్‌పై తమ ప్రణాళికలను ప్రకటించేశాయి. వచ్చే ఏడాదే కార్యకలాపాలు ప్రారంభించేం దుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్ కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల రేట్లు కూడా తగ్గగలవని పేర్కొన్నాయి. ప్రస్తుతం 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌తో పోలిస్తే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల చార్జీలు చాలా అధికంగా ఉంటున్నాయి. మొబైల్ డేటా చార్జీ జీబీకి 0.68 డాలర్లుగా ఉంటే.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ చార్జీలు జీబీకీ 15–20 డాలర్ల దాకా ఉంటున్నాయి. వన్‌వెబ్, స్పేస్ఎక్స్, అమెజాన్‌ల రాకతో ఆరోగ్యవంతమైన పోటీ నెలకొనగలదని, సేవ లు మరింత చౌకగా లభించగలవని అంచనా. స్పేస్ఎక్స్ బీటా వెర్షన్.. స్పేస్ఎక్స్ ప్రస్తుతం భారత్‌లో యూజర్లకు తమ స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీసును బీటా వెర్షన్లో అందించేందుకు ప్రీ–ఆర్డర్లు తీసుకుంటోంది. ఇందుకోసం రిఫండబుల్ డిపాజిట్ 99 డాలర్లు (సుమారు రూ. 7,200)గా ఉంది. వన్‌వెబ్ ప్రధానంగా మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులపై దృష్టి పెడుతుండగా.. స్టార్‌లింక్ ఇటు పట్టణ ప్రాంతాలకు కూడా మరింత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని యోచిస్తోంది. తగినన్ని మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్ ఉండని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని పెంచేందుకు శాటిలైట్ సర్వీసులు తోడ్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సరఫరా వ్యవస్థ, కోల్డ్ చెయిన్ల నిర్వహణ మొదలుకుని విద్యుత్ పంపిణీకి సంబంధించిన స్మార్ట్ గ్రిడ్స్ నిర్వహణ, వరదలు..సునామీల సమయంలో అత్యవసర హెచ్చరికల జారీ తదితర అవసరాలకు ఇవి ఉపయోగపడగలవని వివరించారు. -
గూగుల్‌తో జతకట్టిన ఎలోన్ మస్క్
గూగుల్‌తో స్పేస్ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ జతకట్టారు. వీరిద్దరి కలయికతో ఇప్పుడు ఉపగ్రహానికి హై స్పీడ్ ఇంటర్నెట్, సురక్షిత కనెక్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అతని శాటిలైట్-టు-ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్ఎక్స్. దీనిని ‘స్టార్‌లింక్’ అని పిలుస్తారు. స్టార్‌లింక్ ప్రపంచంలోని ఏ మూలనైనా ఇంటర్నెట్ సేవలను అందించడం సులభతరం చేస్తుంది. ప్రస్తుతం గూగుల్ కలయికతో ఇకపై వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా అధిక వేగంతో ఇంటర్నెట్ అందించనుంది. వీరి ఒప్పందం ప్రకారం ఎలోన్ మస్క్ అంతరిక్ష అభివృద్ధి సంస్థ గూగుల్ క్లౌడ్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రారంభించనుంది. అందుకోసం స్టార్‌లింక్ ఉపగ్రహాలకు అనుసంధానించడం కోసం గూగుల్ డేటా సెంటర్లలో స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 2021 రెండవ భాగంలో కస్టమర్లకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని టెక్ దిగ్గజం తెలిపింది. ఇటీవల ఆదాయ నివేదిక ప్రకారం, గూగుల్ క్లౌడ్ వ్యాపారం మొత్తం ఆదాయంలో 7% వాటాను కలిగి ఉంది. ( చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్! ) -
విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రయోగం
వాషింగ్టన్: హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తోన్న ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్ మిషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్‌తో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాల కొత్త బ్యాచ్‌ను నిర్ణీత భూకక్ష్యలోకి ఆదివారం ప్రవేశపెట్టింది. స్పేస్ఎక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 14న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ కాంప్లెక్స్ 39ఎ(ఎల్సి-39ఎ) నుంచి ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. 2019 మే 24న స్పేస్ఎక్స్ 'స్టార్‌లింక్ మిషన్'కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. ప్రస్తుతం మరో 60 శాటిలైట్లను పంపింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. (చదవండి: ఒక్క రోజులోనే మస్క్ సంపద ఎంత పెరిగిందో తెలుసా?) Targeting Sunday, March 14 at 6:01 a.m. EDT for Falcon 9's next launch of 60 Starlink satellites. The first stage booster supporting this mission has completed eight flights to date https://t.co/bJFjLCzWdK pic.twitter.com/aTNacxYAiE — SpaceX (@SpaceX) March 13, 2021 Deployment of 60 Starlink satellites confirmed pic.twitter.com/AMLK4R9dMn — SpaceX (@SpaceX) March 14, 2021 -
భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ సంస్థకు అనుబంధ సంస్థ స్టార్ లింక్... శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను మన దేశంలో అందించేందుకు ప్రీబుకింగ్ ప్రారంభించింది. హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రపంచంలో ఇంటర్నెట్ సదుపాయం లేని మారు మూల ప్రాంతాలకు అందించాలన్న లక్ష్యంతో, అలాగే ఇంటర్నెట్ ఇప్పటికే ఉన్న ప్రాంతాల్లో లో లేటెన్సీ (డేటా తన గమ్యస్థానాన్ని చేరుకునే వ్యవధి) కనెక్టివిటీ అందించాలన్న లక్ష్యంతో స్టార్‌లింక్.. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనుంది. మన ఇంట్లో డీటీహెచ్ యాంటెన్నా కంటే చిన్న సైజులో ఉండే యాంటెన్నా ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నది దీని లక్ష్యం. 2015లోనే ఎలన్ మస్క్ దీనిపై సూత్రప్రాయ ప్రకటన చేశారు. స్పేస్ఎక్స్ కమ్యునికేషన్ శాటిలైట్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు శాటిలైట్ నెట్వర్క్ ద్వారా అందించనున్నట్టు ప్రకటించారు. దీనిని అభివృద్ధి పరిచేందుకు వాషింగ్టన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇంటర్నెట్ సేవలు ఇలా.. భూమి నుంచి పంపే ఇంటర్నెట్ సిగ్నల్‌ను స్టార్‌లింక్ శాటిలైట్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ శాటిలైట్ తన నెట్‌వర్క్‌లోని ఇతర శాటిలైట్లతో లేజర్ లైట్ సాయంతో కమ్యునికేట్ చేస్తుంది. లక్షిత శాటిలైట్ డేటా రిసీవ్ చేసుకోగానే.. కింద భూమిపై ఉన్న వినియోగదారుడి రిసీవర్‌కు రిలే చేస్తుంది. ఒక్కో శాటిలైట్ మొత్తం శాటిలైట్ల కూటమిలోని ఏవైనా నాలుగు శాటిలైట్లకు ఎల్లవేళలా అనుసంధానమై ఉంటుంది. యారే యాంటెన్నాలు శాటిలైట్లు డేటా బదిలీ చేసేందుకు సహకరిస్తాయి. వాటి నుంచి వినియోగదారులకు చిన్నసైజు డిష్ యాంటెన్నా ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే నార్త్ అమెరికా తదితర ప్రాంతాల్లో బీటా(టెస్టింగ్) సేవలు అందిస్తోంది. ఎక్విప్మెంట్ కిట్ కోసం 499 డాలర్లు వసూలు చేస్తోంది. ఇప్పటివరకు 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుతుందని సంస్థ చెబుతోంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్ ప్రీబుకింగ్ ప్రారంభించింది. స్టార్‌లింక్ వెబ్సైట్లోకి వెళ్లి వినియోగదారులు తమ ప్రాంతంలో ఆ సేవల లభ్యతను తెలుసుకోవచ్చు. సేవల లభ్యత ఉంటే 99 డాలర్లు (సుమారు రూ.7 వేలు) చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ప్రీబుకింగ్ చేసుకున్న వారందరికీ సేవలు అందుతాయన్న గ్యారంటీ లేదు. ముందుగా వచ్చిన వారికి ముందుగా సేవలు అన్న ప్రాతిపదికన అందించనుంది. అలాగే ఈ సేవలకు మన దేశ అధీకృత సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అన్నీ సాఫీగా సాగితే 2022 నుంచి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. అంతరిక్షంలోకి 12 వేల శాటిలైట్లు 2019 మే 24న స్పేస్ఎక్స్.. స్టార్‌లింక్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. భూమిపై 550 కి.మీ. ఎత్తులోలో ఎర్త్ ఆర్బిట్‌లో శాటిలైట్లను స్టార్‌లింక్ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఎత్తులో ఈ శాటిలైట్ ఉండడంతో లోలేటెన్సీ రేటు ఉంటుంది. ఒక్కో శాటిలైట్ 260 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉండేలా చాలా కాంపాక్ట్‌గా రూపొందించారు. ఈ శాటిలైట్‌కు నాలుగు యారే యాంటెన్నాలు ఉంటాయి. ఒక సింగిల్ సోలార్ యారే, అయాన్ ప్రొపల్షన్ సిస్టమ్, నావిగేషన్ సెన్సార్లు, డెబ్రిస్ ట్రాకింగ్ సిస్టమ్ ఇందులో ఉంటాయి.