రష్యా దండయాత్రతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్లకు మరిన్ని జాగ్రత్తలు చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్. రష్యా దాడులు మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో కరెంటు, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ ప్రజల కోసం తన స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలన్ మస్క్. చాలా మంది ఈ ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు.
అయితే స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉపయోగించేప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఎలన్ మస్క్ హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఇప్పుడు ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది కేవలం స్టార్ లింక్ ఒక్కటే. కాబట్టి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థపై రష్యా మిస్సైస్ దాడులు చేసే అవకాశం ఉందని ఎలన్‌మస్క్ అంటున్నారు.
Important warning: Starlink is the only non-Russian communications system still working in some parts of Ukraine, so probability of being targeted is high. Please use with caution.
— Elon Musk (@elonmusk) March 3, 2022
అత్యవసరం అయినప్పడు మాత్రమే స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ని ఉపయోగించాలని ఉక్రెయిన్ ప్రజలకు ట్విట్టర్ ద్వారా సూచించాడు. ఇంటర్నెట్ కోసం యాంటెన్నాను ఆన్ చేసినప్పుడు.. రష్యన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లకి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కి చెప్పారు ఎలన్‌మస్క్. అంతేకాదు చుట్టూ జనాలు లేకుండా చూసుకుని ఈ యాంటెన్నాలను ఆన్ చేయాలని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment